Congress Party
-
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్‌పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రధాన్‌ను బర్తరఫ్ చేయండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, లేదా ఈ వైఫల్యానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ప్రదాని మోదీని శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని, ఫలితంగా 22 లక్షల మంది నీట్ అభ్యర్థుల ఆకాంక్షలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్‌కు రెండు రోజుల ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీకైన విషయం దేశం యావత్తూ తెలిసిపోయింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీల కట్టడికి పార్లమెంట్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ కమిటీలో ఉండటమే ఇందుకు కారణం’అని రాహుల్ ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ‘దేశం మూలాలపైనే మీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. కేవలం డబ్బు సంపాదన కోసమే విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, ప్రొఫెసర్ల పదవుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబం«దీకులను కూర్చోబెట్టారు. ఇదో పెద్ద అక్రమ కూటమి’అని రాహుల్ ఆరోపించారు. ఈ కూటమి దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు. ‘ఓ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అవ్వాలంటే కావాల్సింది పరిజ్ఞానం అనుభవం కాదు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే చాలు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని వారు వైస్ చాన్స్‌లర్ అయ్యే అవకాశమేలేదన్నారు. అందుకే, ఇప్పటి వరకు కనీసం 80సార్లు పరీక్ష పేర్లు లీకై, 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. -
2 రోజుల్లో సీఎంగా సతీశన్ ప్రమాణం.. వేణు గోపాల్ ఏమన్నారంటే?
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ను కలిశారు. వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన సతీశన్ కాసేపు మాట్లాడారు.ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.కాగా, వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాట్లలో భాగంగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వీడీ సతీశన్ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్మెంట్ హౌస్‌లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.కాగా, కేరళలో యూడీఎఫ్ గెలిచాక కేసీ వేణుగోపాల్ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్‌కు హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल से केरल के मनोनीत मुख्यमंत्री वीडी सतीशन ने आज मुलाकात की pic.twitter.com/yBHDCsjulZ— News Capsule (@newscapsule_) May 16, 2026 -
ACలు బంద్.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు
-
చెల్లి మాటే నెగ్గింది.. కేరళలో చక్రం తిప్పిన ప్రియాంక
-
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు.. ఇంతలోనే పాముకాటుతో కాంగ్రెస్ నేత మృతి
డాక్టర్ కేతన్ భాటికర్ మృతి గోవా రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. గోవా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కేతన్ భాటికర్ పాముకాటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాల్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. 38 ఏళ్ల కేతన్ భాటికర్ కర్ణాటకలోని దాండేలి గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు దిగిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను గోవాలోని ధర్బందోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా..గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ కేతన్ భాటికర్.. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైకోర్టు తీర్పుతో ఆ ఉపఎన్నిక రద్దు కావడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాద ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేతన్ భాటికర్ మరణం వైద్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేత యూరి అలెమావో కూడా సంతాపం తెలిపారు. ప్రజాసేవ పట్ల కేతన్ భాటికర్కు ఉన్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.ఉప ఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే..పోండా అసెంబ్లీ ఉపఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అవసరమైంది. దీంతో ఎన్నికల సంఘం 2026 ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున డాక్టర్ కేతన్ పోటీ చేశారు. అయితే, పోలింగ్‌కు కేవలం 16 గంటల ముందు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ ఉపఎన్నికను రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను డాక్టర్ కేతన్.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉందని.. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.సుప్రీంకోర్టుకు డాక్టర్ కేతన్..దీనిపై డాక్టర్ కేతన్ భాటికర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యాక రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రచారం పూర్తైంది.. పోస్టల్ బ్యాలెట్లు కూడా పడిపోయాయి. ప్రజలకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు దూరమైంది. చట్టం ఎన్నికలు నిర్వహించకూడదని కాదు.. తప్పనిసరి కాదని మాత్రమే చెబుతోంది. పోండా ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల చట్టంలోని Section 151A వ్యాఖ్యానం కీలకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం సమాధానం కోరింది. ఈ క్రమంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఆయన చనిపోయారు. డాక్టర్ కేతన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగా.. ఇంతలోనే పాముకాటుతో ఆయన మరణించడం రాజకీయంగా, న్యాయపరంగా కూడా చర్చనీయాంశమైంది.సుప్రీంకోర్టు నిర్ణయంపై..అయితే, డాక్టర్ కేతన్ మరణంతో ఆయన దాఖలు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగత హక్కులు లేదా ఎన్నికల అర్హతలకు సంబంధించిన కేసుల్లో పిటిషనర్ మరణిస్తే, ఆ పిటిషన్ “అబేట్” (చెల్లుబాటు కోల్పోవడం) అయ్యే అవకాశముంటుంది. అయితే ఇది పూర్తిగా కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పోండా ఉపఎన్నిక రద్దు అంశం ప్రజాప్రయోజనం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదిగా కోర్టు భావిస్తే, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ తరఫున మరో వ్యక్తి కేసును కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
పొదుపా పాడా.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు చెప్పడంతో సామాన్యుడిపై పిడుగు గ్యారెంటీ అనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లే.. మొన్న కమర్షియల్ గ్యాస్.. నిన్న పాలు, కూరగాయలు.. రేట్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇంధన ధరలు పెరగడంతో విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికలు కావడంతో ప్రధాని మోదీ వసూళ్లు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీని ద్రవ్యోల్బణం మనిషి(Mehngai Man Modi)గా అభివర్ణిస్తూ.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడింది. ఇంధన పొదుపు పేరిట కొత్త డ్రామాలకు తెర తీశారని.. విదేశీ ప్రయాణాలు వద్దంటూనే ఇప్పుడు ఆయనే విదేశాలకు వెళ్లాడని ఆ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పెరుగుదలను దయనీయమైన పరిస్థితిగా పేర్కొంది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందా? అని ప్రశ్నించింది. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. పెట్రోల్ రేట్లు పెరగడం.. సైకిల్(సమాజ్‌వాదీ గుర్తు)నే భవిష్యత్తు అంటూ కార్టూన్ షేర్ చేశారు.దేశవ్యాప్తంగా పెట్రో రేట్లు తప్పవనే ఊహాగానాలు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలయ్యాక అది ఉండొచ్చని అంతా భావించారు. ఈ మధ్యలో పెంపు వార్తలను కొట్టేసిన కేంద్రం.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ఇంధన పొదుపు వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ సైతం పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోల్, డీజిల్‌పైన రూ.3 చొప్పున పెంపును ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. -
YSRCPలోకి కాంగ్రెస్ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన YS జగన్
-
కేరళ కిరీటం సతీశన్‌కు...
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్ సతీశన్‌కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్ మరో నాయకుడు వీడీ సతీశన్‌కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్‌కు పనికొచ్చినట్టుంది. రమేష్ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్‌లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్‌కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. -
కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?
పది రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తమకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను పక్కనపెట్టి మరీ లాయర్ నుంచి లీడర్‌గా ఎదిగిన సతీశన్‌కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, కేఐఐఎఫ్బీ ఫండింగ్ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్ లీడర్’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్‌కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్‌ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’ కేసీ వేణుగోపాల్‌కు పెద్ద మైనస్ అయ్యింది. ఇది వీడీ సతీశన్‌కు మిత్రపక్షాల్లో, కేడర్‌లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సమర్థుడనే ట్యాగ్ లైన్.. 2001 నుంచి పరవూర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్ విక్టరీలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్‌లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్‌గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. వీడీ సతీశన్‌కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి. -
కేరళ కొత్త సీఎం VD. సతీశన్
-
కేరళం ముఖ్యమంత్రిపై వీడనున్న సస్పెన్స్
తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి అభర్థిపై మరికోద్దిసేపట్లో ఉత్కంఠ వీడనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి అభర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏవరనే అంశం ఈ రోజు తేలనుంది. అయితే సీఎం రేసులో రాహుల్ గాంధీ విధేయులు కేసీ వేణుగోపాల్ ముందజంలో ఉన్నట్లు సమాచారం.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చి పదిరోజులు దాటింది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్ అధికారం సాధించిన ఒక్క కేరళలో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే అంశమే స్పష్టత రాలేదు. దీంతో ఈ విషయమై ఎవరు సీఎం కానున్నారనే అంశం మరికొద్దిసేపట్లో తేలనుంది.నిన్న (బుధవారం) పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు బరిలో ఉన్నారు.కాగా వీడీ సతీశన్‌ది లోక్‌సభ ఎన్నికలతో పాటు యూడీఎఫ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు. అంతే కాకుండా ఈ విషయమై వీరిద్దరు ఇదివరకే చర్చలు జరిగినట్లు సమాచారం.అయితే సీఎం ఈ విషయంలో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్ఠానం వీరిద్దరివైపూ కాకుండా రమేష్ చెన్నితల వైపు మెుగ్గు చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించనుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్‌ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్‌తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
కేరళ సీఎం ఎంపిక నేడే
న్యూఢిల్లీ: ఫలితాలొచ్చి పది రోజులైనా కేరళ ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులనే అంశాన్ని తేల్చుకోలేక తీవ్రంగా సతమతమవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎట్టకేలకు గురువారం సీఎం పేరును ప్రకటించనుంది. రోజుల తరబడి సస్పెన్స్, సంప్రదింపులు, లాబీయింగ్, మంతనాల మారథాన్‌కు ముగింపు పలుకుతూ గురువారం ముఖ్యమంత్రి పేరును ప్రకటించబోతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి కేరళ శాసనసభ స్థానాల్లో భారీ మెజార్టీతో గెల్చిన విషయం విదితమే. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తొలి నుంచీ ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) కేసీ వేణుగోపాల్‌లు బరిలో ఉన్నారు. -
నీట్ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్.. కలకలం..
నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్‌ను ఆయన పోస్ట్ చేశారు.So, it seems that the NEET paper leak accused is closely associated to the BJP! They are playing with the lives of millions of innocent students for dirty money! pic.twitter.com/PPYhbPWmFb— Prashant Bhushan (@pbhushan1) May 13, 2026దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్ బిన్వాల్తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్‌లో ఇండియా టుడే తెలిపింది.ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.మంగీలాల్, దినేష్ ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. Photos of NEET Exam paper leak accused Dinesh Binwal with Rajasthan Education Minister Madan Dilawar, BJP MLA Mahendra and several BJP leaders have now surfaced publicly.This clearly shows how deeply the BJP is involved in the paper leak racket, not as a silent spectator, but… pic.twitter.com/cP9LTwGTxF— Congress (@INCIndia) May 13, 2026 -
కర్ణాటకలో మరోసారి సీఎం వార్..? శివకుమార్ ఏమన్నారంటే
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అందులో డీకే శివకుమారా్ ముఖ్యమంత్రి కావాలని ఉండడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.2023 మే 13న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలిచి అధికారం సాధించింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం జరిగిందని ఫుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పెద్దఎత్తున కోల్డ్ వార్ నడిచింది. అధిష్టానం ఎంట్రీ ఇచ్చి ఇరునేతల మధ్య సయోధ్య కుదర్చడంతో ఎట్టకేలకు పరిస్థితులు సద్దుమణిగాయి.అయితే తాజాగా మరోసారి ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మే 15న డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి రచ్చలేపుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు జరగనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే అధికార మార్పు అంశమై గత నెలలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సీఎం మార్పు అంశం జరుగుతుందన్న నిర్ణయం పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ విషయమై ఇప్పుడు చర్చలేవి లేవని హైకమాండ్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
ఆస్పత్రికి సోనియా.. ఆందోళనలో పార్టీ కేడర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ కీలక నేత సోనియా గాంధీ అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం కొన్ని వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆమె ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు అక్కడే అడ్మిట్ అయ్యారు. ఈ వార్త వెలువడగానే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత కోసం అటు పార్టీ శ్రేణులు, ఇటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మెదాంతలో వైద్య చికిత్ససోనియా గాంధీ బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లోని ప్రముఖ మెదాంత ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కొన్ని వైద్య సంబంధిత ప్రక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో వైద్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 79 ఏళ్ల వయస్సులో ఉన్న ఆమె, గత కొంతకాలంగా వయస్సు సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.గతంలో ఇన్ఫెక్షన్ సమస్యలుఈ ఏడాది మార్చి నెలలో కూడా సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమెకు ‘సిస్టమిక్ ఇన్ఫెక్షన్’ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తీవ్రమైన జ్వరంతో మార్చి 24న ఆసుపత్రిలో చేరిన ఆమె, దాదాపు ఏడు రోజుల పాటు అక్కడే ఉండి చికిత్స పొందాల్సి వచ్చింది. అప్పట్లో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ నేతృత్వంలోని బృందం ఆమెకు యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స అందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?వైద్య పరిభాషలో చెప్పాలంటే, బ్యాక్టీరియా వంటి రోగకారక క్రిములు రక్తప్రవాహంలో చేరి ,శరీరం అంతటా వ్యాపించడాన్ని ‘సిస్టమిక్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఇది శరీరంలోని ఏదో ఒక భాగానికి పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మెదాంతలో జరుగుతున్న పరీక్షలు కూడా గతంలో వచ్చిన సమస్యకు సంబంధించినవేనా లేదా మరేదైనా కొత్త కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ వెలువడే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్‌కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్‌కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్‌ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్‌ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్‌ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్‌సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్‌కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్‌గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్‌చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్‌కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్‌విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్‌లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్‌కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్‌కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్
-
అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో దీనిపై స్పందించారు.‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.2029లో జమిలి ఎన్నికలు కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదు. మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరాం. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు. రాజకీయ అంశాలకు తావు లేదు. నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధిని మాత్రమే. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. -
బంగారం కొనొద్దు..ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే..
-
మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్‌కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్ఎస్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. -
మోదీవి సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు
వనరులను ఆదా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనకూడదని, మెట్రోలో ప్రయాణించాలని, ఇంటి నుంచే పని చేయాలని ప్రజలకు మోదీ చేసిన పిలుపు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.మోదీ జవాబుదారీతనం కోల్పోయారని పేర్కొంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు #CompromisedPM. 12 ఏళ్లు దేశాన్ని పాలించాక.. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే స్థితికి వచ్చారా?. ఆయన చేసినవి ఉప దేశాలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు. రాజీన పడిన ప్రధాని దేశాన్ని నడపడం కష్టం’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026ఆర్థిక సంక్షోభ భారం ప్రజలపై మోపి.. ప్రధాని మోదీ బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు మోదీ సలహాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇరాన్–అమెరికా యుద్ధం మూడు నెలలు గడిచినా.. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారు. ప్రజలపై భారాన్ని మోపడం అనైతికం. ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే ప్రధాని ప్రాధాన్యం అవుతున్నాయని.. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ.. మోదీ చేసినవి అప్పీల్‌గా లేవని.. తీవ్రమైన ఆదేశాలుగా ఉన్నాయని.. వాటి వెనక కారణాలు చెప్పేందుకు పార్లెమంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్‌ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్‌స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్‌కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్‌పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
అబ్‌కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్‌గవర్నెన్స్ మోడల్‌పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్‌ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్‌రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్‌కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు. కేరళలో అధికారం తథ్యం బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు. సమాజం క్రియాశీలం అయినప్పుడే.. దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi says, "I have arrived in Bengaluru today at a time when discussions regarding election results are underway across the country. The formation of an NDA government in Puducherry for the second consecutive time, the formation of an… pic.twitter.com/lFNbQ429aS— ANI (@ANI) May 10, 2026 -
కేరళ సీఎం ఆయనేనా? ఢిల్లీలో భేటీ.. తీవ్ర ఉత్కంఠ
ఢిల్లీ: కేరళ సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరన్న విషయం గురించి ప్రతిసారి ఇటువంటివే రిపీట్ అవుతుంటాయి. ఈ సారి కూడా అదే జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కేరళ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. కేరళ సీఎం రేసులో వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.ఇటీవల కేరళలో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. కేరళలో కీలకమైన ముగ్గురు నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. ఆ తర్వాత కేరళ సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కేసీ వేణుగోపాల్‌కు అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. బలమైన నాయకత్వం, అందర్నీ కలుపుకొని పాలన చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడికి కేరళ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటున్నారు.కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల ముగ్గురూ నాయర్ సమాజానికి చెందినవారే. నాయర్లు కేరళ జనాభాలో సుమారు 12 శాతం మాత్రమే. వేణుగోపాల్ (63 ), సతీశన్ (62), చెన్నితల (70) ఈ ముగ్గురిలో చెన్నితల సీనియర్.. అనుభవం ఎక్కువ. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సన్నిహితుడు. ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకులకు సర్దిచెప్పి, పార్టీని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారుఅయితే, గత ఏడేళ్లుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించి, రాష్ట్ర-కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేరళకు తిరిగి వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. -
కేరళం సీఎంపై ఉత్కంఠ.. రంగంలోకి రాహుల్
-
హైదరాబాద్ కు.. తమిళ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
తమిళ రాజకీయం.. కాంగ్రెస్ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. తమిళనాడు పొలిటికల్ ట్విస్టులు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. రిసార్టు రాజకీయాల్లో భాగంగా వారు ఇక్కడికి చేరుకున్నారు.తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మొదట కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం, హైకమాండ్ ఆదేశాలకు మేరకు శుక్రవారం రాత్రి శంషాబాద్ చేరుకుని ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తాజాగా నవోటెల్‌లో బస చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పరిస్థితులు చక్కబడే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అవకాశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అయితే, వీరంతా రోడ్డు మార్గంలో చెన్నై చేరుకునేలా ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కదలికలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కేరళ సీఎంగా ఆయనే?
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు. -
మరో ట్విస్ట్.. టీవీకే పార్టీకి కాంగ్రెస్ కండీషన్
చెన్నై: టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు విధించింది. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండీషన్ పెట్టింది. మరోవైపు, కేవలం సపోర్ట్ మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయించగా.. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది. మరోవైపు, పెరంబదూర్ నుంచి ఎమ్మెల్యే కొనసాగాలని విజయ్ భావిస్తుండగా.. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే షరతు పెట్టింది.తిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్ విధించింది. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావళన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు కేటాయించాలని టీవీకేకు షరతు పెట్టింది. ఇదిలా ఉండగా, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సోమవారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది.విజయ్‌కు సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ప్రకటించాయి. లెప్ట్, వీసీకే మద్దతుతో విజయ్‌కే పూర్తి మెజార్టీ దక్కింది. టీవీకే-107, కాంగ్రెస్-5, సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2 మద్దతుతో 118కి సంఖ్యాబలం చేరింది. షరతులు లేకుండా టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖను టీవీకేకు వామపక్షాలు అందచేశాయి. -
విజయ్ సిద్ధం.. రేపే ప్రమాణ స్వీకారం?
-
కాంగ్రెస్ తో కటీఫ్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
-
ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్
సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్‌ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్‌కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీవీకేతో కాంగ్రెస్ దోస్తీ.. అఖిలేష్ చురకలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో మద్దుతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్నేహహస్తం అందించడం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను కూడా మార్చేసింది.సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా.. డీఎంకేతో జట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సంబంధాలు తెంచుకుని విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చింది. దీనిని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. స్టాలిన్ మూలంగానే ఆ పార్టీ ఐదు స్థానాల్లో నెగ్గిందని డీఎంకే.. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా స్టాలిన్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ తరుణంలో ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. అయితే..ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు మేం” అని కామెంట్ ఉంచారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకే ఆయన అంటించిన చురకలనే చర్చ నడుస్తోంది.हम वो नहीं जो मुश्किलों में साथ छोड़ दें। pic.twitter.com/p1EosEJtvV— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2026ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఈ తరహా చేష్టలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో తన దిష్టిబొమ్మను తగలబెట్టబోయి గాయపడిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుపమను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి యూపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెర తీశారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి.ఇక.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతుదారు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అయితే.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి బలం 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే తాను సంతృప్తి చెందుతానని.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసుకోమని విజయ్‌కు చెబుతున్నారు. దీంతో మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో టీవీకే తలమునకలైంది. -
లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. డీఎంకే మద్దతు!
-
షాకింగ్ ట్వీట్.. దురంధర్‌పై కాంగ్రెస్ లీడర్ ప్రశంసలు.!
రణ్‌వీర్‌సింగ్ దురంధర్ చిత్రంపై ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ ప్రశంసలు కురిపించారు. దురంధర్ పార్ట్-1 నిన్ననే చేశానని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ దర్శకత్వం అంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్ అద్బుతంగా నటించారని రాసుకొచ్చారు. ఈ మూవీని తెరకెక్కించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఎలాంటి ప్రాపగండ లేదని ఆమె స్పష్టం చేశారు.ఈ మూవీలో ఏ వర్గం వారిని చెడుగా చూపించలేదని షామా ట్విటర్లో తెలిపారు. కేవలం పాకిస్తాన్‌లోని పరిస్థితులను.. అక్కడున్న స్థానికుల గురించి మాత్రమే ఈ చిత్రంలో చూపించారని ఆమె అన్నారు. అక్కడి వాటిని మన ఇండియాలో ఉన్నవారితో పోల్చి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షామా మహమ్మద్‌పై ఒక్కసారిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇచ్చిపడేసింది. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానమిచ్చింది.ఎవరైనా ఈ మూవీలో ప్రాపగండ ఉందనుకుంటే అలాంటి వాళ్లు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని షామా మహమ్మద్ సలహా ఇచ్చింది. వెంటనే ఆ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఎక్కడా కూడా ముస్లిం వర్గాన్ని చెడుగా చూపించలేదని.. పాకిస్తానీలను మాత్రమే చూపించిందని తెలిపింది. ఇక్కడివాళ్లంతా కలిసి ఇండియన్ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. ఓ కాంగ్రెస్ లీడర్ దురంధర్ సినిమాను ప్రశంసించడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ గతేడాది డిసెంబర్లో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను షేర్ చేస్తూ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2 మార్చిలో రిలీజైంది. ఈ సినిమా ఏకంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కలిసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇందులో రణ్వీర్ సింగ్.. హంజా అలీ మజారీ అనే అండర్‌కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. It did not show Muslims in bad light but Pakistanis in bad light ! Shame on you for confusing the two. People like you spoil the name of Muslims in India. You are most welcome to leave India & take the citizenship of Pakistan https://t.co/dpNypFQ9VM— Dr. Shama Mohamed (@drshamamohd) May 7, 2026 -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్‌కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్‌తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేత లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్‌కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్‌లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్‌కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్‌ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్‌భవన్‌కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్‌తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్‌భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్‌మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్‌కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్‌తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్‌కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్‌కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్‌కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్‌కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్‌భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్‌భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్‌భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్‌కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్‌లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్‌కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...
-
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
విజయ్ కు సీబీఐ నోటీసు? కాంగ్రెస్ దయాకర్ సంచలన కామెంట్స్
-
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్‌కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్‌కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్‌తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్‌గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్‌లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
అధికారం దక్కలేదనే కేటీఆర్ ఆక్రోశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్ తీవ్ర నిరాశ, అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. వరంగల్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై చింత కాదు..పూర్తిగా రాజకీయ నిరాశ, ఆక్రోశానికి ప్రతిబింబమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై, వారిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతూం అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం..బీఆర్ఎస్ అసలు రాజకీయ స్వరూపాన్ని బయటపెడుతోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వరంగల్‌లో నిర్వహించిన సభ రైతు సంగ్రామ సదస్సుగా చెప్పడం పూర్తిగా అసత్యమని, అది బీఆర్ఎస్ ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఆ సమావేశానికి రైతులు రాలేదని కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని విమర్శించారు. రైతుల ప్రాణాలతో ఆటలాడినవారే ఇప్పుడు రైతు మిత్రులమంటూ మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పంటల బీమా ఎత్తివేసి, వరదలు–వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి అప్పుల బారినుంచి బయటపడే అవకాశం లేకుండా చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. అందుకే రైతులే వారిని అధికారానికి దూరం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తోందన్నారు. పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి, రైతు భరోసా, రుణమాఫీ, బీమా వంటి పథకాలతో రైతులకు నిజమైన అండగా నిలిచామని పేర్కొన్నారు. రైతు పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని, తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. -
టీవీకేతో కాంగ్రెస్ పొత్తు.. డీఎంకే షాకింగ్ రియాక్షన్
చెన్నై: భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది. -
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్‌ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
టీవీకే విజయ్‌కు సరిపోని సంఖ్యాబలం వేళ.. కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ నెలకొంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. ఈ భేటీలో తన వద్ద 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. అయితే, ఆ సంఖ్యపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని సూచించారు.సంఖ్యాబలం నిరూపించుకునేందుకు గవర్నర్ నేటి అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఫలితంగా, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న టీవీకే శ్రేణుల ఆశలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీకే–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, సంఖ్యాబలం సరిపోలేదు. దీంతో టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)తో భేటీ అయ్యి, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరిపారు. అయితే, ఈపీఎస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.అన్నాడీఎంకేలో కొంతమంది (సుమారు 30కిపైగా) ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ఈపీఎస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. టీవీకేతో కలిస్తే పార్టీకి మళ్లీ శక్తి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడం, అంతర్గత చర్చలు కొనసాగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీవీకేకి సంఖ్యాబలం సరిపోలలేదు. నేటి అర్ధరాత్రితో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అదే సమయంలో తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో, టీవీకే అధినేత విజయ్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం తక్కువగా ఉండటం, గవర్నర్ సూచించిన మెజారిటీ నిరూపణ చేయాల్సిన అవసరం ఆసక్తికరంగా మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. -
TVKకు కాంగ్రెస్ మద్దతు.. DMK ఫైర్
-
DMK తో 55 ఏళ్ల బంధాన్ని వదిలి TVK కు కాంగ్రెస్ మద్దతు
-
విజయ్ అలా చేస్తే మద్దతు ఉపసంహరిస్తాం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాను ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని టీవీకే అధినేత సినీస్టార్ విజయ్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందించారు. అయితే మెజార్టీ మార్కుకు కేవలం పదిసీట్ల దూరంలో ఆగిపోయిన టీవీకేకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టీవీకేకు సపోర్టు చేసే ముందు కాంగ్రెస్ విజయ్‌తో ఒక విషయంలో కీలక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహుర్తం సైతం సిద్ధమైంది. రేపు లేదా ఎల్లుండో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే విజయ్ సీఎం కావడానికి అక్కడి కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకేతో కీలక ఒప్పందం చేసుకొని అనంతరం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ ఇంఛార్జ్ గిరీశ్ చౌడాంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రస్తుతం మేము టీవికేకు మద్దతిస్తున్నాం. రాజ్యాంగాన్ని నమ్మని మతతత్వ రాజకీయ పార్టీలకు టీవీకే పార్టీ దూరంగా ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ వారు మతతత్వ శక్తులతో కలిస్తే మా మద్దతు ఉపసంహరిస్తాం. అని అన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది.కాగా మెజార్టీ మార్కు రావాలంటే కాంగ్రెస్ ఐదు స్థానాలతో కలిపి టీవీకేకు మరో ఐదు స్థానాల మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో మెజార్టీమార్కుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్..
-
TVK విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
-
డీఎంకేతో కటీఫ్.. విజయ్‌కు మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పినట్లైంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్తో ఓ హోటల్లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో రాహుల్ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్‌కుమార్ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్‌తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. ఇండియా కూటమికి బీటలుతమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్ గుడ్‌బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. -
కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే..! స్పందించిన KC వేణుగోపాల్
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
ఈ వెన్నుపోటు రాజకీయమేంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.తమిళనాడు సీనియర్ నేత, విజయ్‌కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించింది. ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. The Backstabbers.— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026No. DMK does not endorse the support of INC to TVK. It was their unilateral decision. The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్‌కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది. అయితే దివంగత విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది. -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్‌భవన్‌లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్‌భవన్‌కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్‌కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్‌కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్‌భవన్‌కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్‌ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్‌తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్‌తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్‌తో గవర్నర్‌ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్‌తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్‌భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్‌కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్‌ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్‌లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్‌కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్‌కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్‌కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్‌భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్‌భవన్‌కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్‌భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్‌కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్‌తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్‌కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్‌లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్‌కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
విజయ్ పొత్తు ఎవరితో?
సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోన్‌చేసి ప్రత్యేకంగా విజయ్ను అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీవీకే పార్టీకి గవర్నర్ రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది.అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్‌కు గవర్నర్ సమన్లు జారీచేయొచ్చు లేదా భాగస్వామ్య పార్టీల తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్లకంటే అధిక మెజారీటి తనకుందని విజయ్ నిరూపించునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్ను గవర్నర్ ఆహ్వానించే ఆస్కారముంది. ‘‘బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిరావొచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చిన్న పార్టీలు కలిసొస్తాయా? విజయ్ రెండు చోట్ల పోటీచేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామాచేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగమం అయితే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్ అవుతారు. అప్పుడు ఆయన బలనిరూపణ వేళ ఓటు వేయడం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బలనిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే), దేశీయ మూర్పొక్కు ద్రవిడ కళగం, బీజేపీ తలో స్థానంలో గెలిచాయి. సీపీఐ(ఎం), విదుథలై చిరుతైగల్ కట్చి, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు తలో రెండు చోట్ల గెలిచాయి. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) నాలుగు చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల గెలిచింది.ఈ తొమ్మిది పార్టీల్లో కొన్నింటితో కచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్ సాధించాల్సిందే. నేడు గవర్నర్ అర్లేకర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు పనయూర్లోని విజయ్ ఇంటి వద్ద తమిళపోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్‌లలో విజయ్ పోటీచేసి రెండుచోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్స్థానంలో విజయ్ రాజీనామా సమర్పించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబర్ నుంచే విజయ్ ఎమ్మెల్యే కొనసాగే ఛాన్సుంది. టీవీకే శాసన సభాపక్ష నేతగా విజయ్ విజయ్ మంగళవారం కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా విజయ్ను టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత పార్టీ సైద్ధాంతిక నేతలకు విజయ్ నివాళులర్పించారు. పెరియార్ ఈవీ రామస్వామి, బీఆర్ అంబేడ్కర్, కె.కామరాజ్, వేళు నచియార్, అంజలాయ్ అమ్మళ్లకు విజయ్ నివాళులర్పించారు. ‘‘234 మంది సభ్యులుండే అసెంబ్లీలో 118 మంది మద్దతుతో మేం బలనిరూపణలో విజయం సాధించబోతున్నాం’’అని సమావేశం తర్వాత టీవీకే నేత నంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. జీవితాంతం రుణపడి ఉంటా: విజయ్ సాక్షి, చెన్నై: ఎన్నికల్లో విజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ మంగళవారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్నవారు, యువకులు, పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆయన ఎక్స్‌లో మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను హేళన చేసిన వారు, చులకనగా చూసిన వారికి ప్రజలే గట్టిగా ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెప్పారన్నారు. విమర్శలు, ఒడిదొడుకులు ఎన్నో ఎదురైనా, ముసుగేసుకుని కొందరు విమర్శలు చేసినా, ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండి పోతుందని, అందుకే వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విజయ్ మా మద్దతు కోరారు: కాంగ్రెస్న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ సాధారణ మెజార్టీ కాస్తంత దూరంలో ఆగిపోయిన టీవీకే పార్టీ భావసారూప్య పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ తమను సంప్రదించారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మాట్లాడారు. ‘‘తమిళనాడులో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్ మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఇవ్వబోం.విజయ్ అభ్యర్థన మేరకు, తమిళ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి మేం దిశానిర్దేశం చేశాం. తమిళ ఓటర్ల సెంటిమెంట్‌కు విలువ ఇస్తూ స్వీయనిర్ణయం తీసుకోవాలని టీఎన్పీసీసీకి సలహాలు, సూచనలు ఇచ్చాం’’అని మీడియాతో కేసీ వేణుగోపాల్ చెప్పారు. 234 సీట్లున్న తమిళనాడులో విజయ్ పార్టీ 108 చోట్ల గెలిచింది. టీవీకేకు కనీసం 12 మంది ఎమ్మెల్యేల అదనపు మద్దతు అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు చోట్ల గెల్చింది. పట్టాలి మక్కల్ కట్చి మరో నాలుగోచోట్ల, సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల గెలిచాయి.ఈ నాలుగు పార్టీల మద్దతుతో అంటే ఈ పార్టీల 13 మంది ఎమ్మెల్యేల మద్దతులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వార్తలొచ్చాయి. -
టీవీకేకు మద్దతుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
తమిళనాడులో టీవీకే మద్దతు అంశంలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశమై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తొలిసారిగా స్పందించారు. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై అగ్రనాయకులు విశ్లేషణ జరిపారు.అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్‌ను ఇదివరకే పలుమార్లు విజయ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖసైతం రాశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్ధతివ్వడం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది . ఈ అంశమై ఇది వరకే హస్తం నేతలు టీవీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా టీవీకే 108 స్థానాల్లో నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ అక్కడ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో హస్తం మద్దతు కీలకం కానుంది. -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్‌తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్‌ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్‌ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్‌పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్‌లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్‌మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్‌కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలురాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఓట్ల చీలికతో.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలంటీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామంరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్‌లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టుపశ్చిమ బెంగాల్లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గంమమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్‌కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్‌లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం! -
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే విజయ్
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విజయ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు ఇచ్చారు. ట్రెండ్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో టీవీకే ఆగిపోనుంది.సోమవారం రాత్రి 8 గంటల నాటికి 70 స్థానాల్లో గెలిచి మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ మార్క్ రాకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై విజయ్ చర్చలు జరుపుతున్నారు. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే అవతరిస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అలాగే టీవీకే పార్టీతో అధికారాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని విజయ్ తండ్రి చంద్రశేఖర్ సూచించారు. ఎన్నికల ముందు దశలో టీవీకే.. ఎఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే రెండింటితోనూ కూటములను పూర్తిగా తిరస్కరించింది.అయితే, మెజారిటీ మార్కు దాటేందుకు టీవీకేకు చిన్న ద్రావిడ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. తమిళనాడుకు ఎంజీఆర్ వంటి సినీ తారలను నాయకులుగా ఎన్నుకున్న దీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్ కూడా చేరారు. -
కేరళ సీఎం ఎవరు?.. శశి థరూర్ షాకింగ్ ఆన్సర్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ‘ఎన్డీటీవీ’తో సంచలన విషయాలు పంచుకున్నారు. కేరళ ఓటర్లు స్పష్టమైన మార్పు కోరుకున్నారని, ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అస్తవ్యస్త పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉత్కంఠ రేపుతున్న సీఎం రేసుతదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారన్న ప్రశ్నకు థరూర్ చాలా ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే ఆ విషయంపై నాకు ఎలాంటి క్లూ లేదు. మా పార్టీలో సీఎం ఎంపికకు ఒక పద్ధతి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు పంపే పరిశీలకులు.. ముందుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఆ తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. మా వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉండటం పార్టీకి శుభపరిణామం’ అని థరూర్ అన్నారు.అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకతపాలక పక్షంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని థరూర్ పేర్కొన్నారు. ‘కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా జనాదరణ కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారు. మళ్లీ వారికి ఓటేస్తే పాత తప్పుడు పాలనే కొనసాగుతుందని ప్రజలు గ్రహించారు. ఇది ఓటర్ల పరిపక్వతకు నిదర్శనం. ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.99 సీట్లతో కాంగ్రెస్ చారిత్రక రికార్డ్కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ దిశగా దూసుకుపోతోందని థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 99 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోందని, చాలా కాలం తర్వాత కేరళలో ఈ స్థాయి భారీ విజయం దక్కడం ఒక ‘అద్భుతమైన ఫలితం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని థరూర్ పేర్కొన్నారు. -
అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?
డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ వల నుంచి అభ్యర్థులను కాపాడేందుకు ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా సీనియర్ నేతలను హుటాహుటిన రంగంలోకి దించింది.కాంగ్రెస్ క్యాంపులోకి బీజేపీ వల?ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. శనివారం గౌహతిలో జరిగిన ఆరు పార్టీల ప్రతిపక్ష కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని, తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీకి గెలుపుపై నమ్మకం ఉంటే తమ నేతలను ఎందుకు సంప్రదిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఎగ్జిట్ పోల్స్ అబద్ధం.. 75 సీట్లు మావే!ఎన్డీఏ కూటమికి 88 నుంచి 100 స్థానాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ కేవలం అధికారులపై, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకేనని విమర్శించారు. ప్రతిపక్ష కూటమి కచ్చితంగా 70 నుంచి 75 స్థానాలు (మొత్తం 126 సీట్లలో) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఢిల్లీ, గౌహతిలలో ప్రత్యేక లీగల్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ తెలిపారు.సీఎం రేసులో గౌరవ్ గొగోయ్?అస్సాం ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తేల్చి చెప్పారు. మరోవైపు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ.. కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయని, గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతోందని అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లూరిన్జ్యోతి గొగోయ్ సైతం వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం కల్ల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణాలు, అరాచకాలు మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసే అవకాశం లేదు. ఆ పార్టీ మరో 20 ఏళ్ల వరకు అధికారంలోకి రావడం కల్ల’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తుంది. మంత్రులే స్వయంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణతోపాటు మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసింది’అని దుయ్యబట్టారు. శనివారం నందినగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు: ‘ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి పెంచింది. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మరోసారి ఈ ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రజలను జాగృతం చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్, బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ప్రతీ ఒక్క యువతీ, యువకుడికి ఓటు హక్కు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
జనంపై ‘ఎన్నికల బిల్లు’
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుపట్ల కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అధికార పార్టీకి ఎన్నికల సమయంలో మాత్రమే సామాన్య ప్రజలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి మానాన వారిని వదిలేస్తారని మండిపడింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు ఒక ‘ఎన్నికల బిల్లు’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తరువాతి బాదుడు పెట్రోల్, డీజిల్‌పై ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి తగులుతుందని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.993 పెరిగింది. అతిపెద్ద పెంపు ఇదే. ఇది ఒక ఎన్నికల బిల్లు. కేవలం మూడు నెలల్లో రూ.1,380 పెరిగింది, ఇది 81% పెరుగుదల. టీ స్టాళ్లు, ధాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు ప్రతి వంటగదిపై భారం పెరిగింది. ఇది అనివార్యంగా సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుంది’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధరలు పెంచబోమని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయారని ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్లపై దాదాపు రూ.1000 భారీ పెంపు, జీవనాధారం కోసం చిన్న భోజనశాలలపై ఆధారపడే కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని, కోట్లాది మంది ఈ పెంపు భారాన్ని మోయవలసి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఏప్రిల్ 29న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుందని, ధరలు పెరుగుతున్నందున ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల ఉపశమనం ముగిసింది. ద్రవ్యోల్బణం వేడి రాబోతోంది! ఏప్రిల్ 29 తర్వాత జాగ్రత్త – పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుంది. ముడిచమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుంది. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని మీపై మోపుతుంది’అని రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్‌లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్‌గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్‌తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్‌గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
రామంతాపూర్‌లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మేడ్చల్ జిల్లా: రామంతాపూర్‌లో శ్రీ శ్రీ శ్రీ మహాంకాళమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారుకార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు భీష్మ గౌడ్ గారు,సంజీవ్ రెడ్డి గారు,నాగేందర్ గారు,తాఫిక్,రఫీక్,వాళ్ళపు శ్రీకాంత్ యాదవ్,,గణేష్ నాయక్,అరుణ్ పటేల్,సందీప్,భాస్కర్ షాగా శ్రీధర్,ముత్యాల బాబు,ఎస్ జంగయ్య,కృష్ణ,ఎం జంగయ్య,ముత్యాల బాబు,సత్తి అన్న,సచిన్,నయీం,యోగి విశాల్,పాల్గొన్నారు -
ఈ ఎన్నికలతో బీజేపీ పతనం మొదలైంది
-
అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారం
డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలుఏజీపీ 1-2 స్థానాలుసీపీఐ(ఎం) 0-1 స్థానాలుఐఎన్డీ0-2 స్థానాలుఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది. -
వివాహేతర సంబంధం.. పోక్సో కేసుతో చిక్కుల్లో ఆనంద్ నాయుడు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్‌తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in KarnatakaAnand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026 -
ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్ హెచ్చరించారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్‌గా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. -
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న సైన్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.కాప్రా సర్కిల్ కు చెందిన సీనియర్ బాబురావును ఆయన నివాసం కందిగూడలో పరమేశ్వర్ రెడ్డి గారు పరామర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతోనే ఉప్పల్ నియోజకవర్గానికి కావాల్సిన నిధులను తెస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు తెచ్చినా, అభివృద్ధి పనులను చేపట్టినా ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. కొందరు అభివృద్ధి పనుల విషయంలో వారి ఉనికి కోసం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ,కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగి రెడ్డి ధన్పాల్ రెడ్డి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,రాజేందర్ గారు,డివిజన్ అధ్యక్షులు నాగ శేషు గారు,జిల్లా కార్యదర్శి దండళ్ల మురళి గారు,పవన్ గారు,అజీజ్,తన్నీరు శ్రీహరి,మల్ల రెడ్డి,నాగరాజు,తోటకూర శ్రీకాంత్,శ్రీకాంత్ గౌడ్,సత్యనారాయణ,పూర్ణ యాదవ్,రాజు,లింగం,టిల్లు యాదవ్,రాజన్,గుణశేఖర్ గారు,రోకేష్ యాదవ్,శివ,రమాకాంత్ రెడ్డి, ముర్తుజా,షేక్ చోటు బై,షాబుద్దీన్,ఆరిఫ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్‌సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ చిట్‌చాట్‌లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్), బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రతి పనికి పర్సస్ ఉంటుంది.. పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.అహంకారం పెరగడంతో 2023లో బీఆర్ఎస్ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాను. కేసీఆర్ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. -
ఏం జరగాలో అది జరుగుతోంది
బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం. హైకమాండ్ మాట పాటిస్తాం ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్‌కు సూచించానని తెలిపారు. అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు. -
ప్రజా‘వాణి’ వినాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలి. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించాలి. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి’అని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయికి, తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు 2023 డిసెంబర్ 8న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. నాటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే ప్రజల అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నా రు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. పైఅధికారికి ఫిర్యాదు ఆటో ఎస్కలేషన్.. ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. -
‘రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్‌నగర్‌లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్‌ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి 25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది.సీఎం రేవంత్‌రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది.. అందుకే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్ నేత కమల్‌హాసన్‌ను మించి యాక్టింగ్ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. -
‘దీదీ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ’.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండారాజ్ నడుస్తోందని ఆరోపించారు.దారుణ హత్య.. ఆవేదనలో రాహుల్అసన్సోల్లో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న దేబ్దీప్ ఛటర్జీ అనే కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఉదంతంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఇదొక అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఛటర్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, అధికార టీఎంసీ పార్టీకి చెందిన గూండాలే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. कांग्रेस के कार्यकर्ता देबदीप चटर्जी की चुनाव बाद TMC से जुड़े गुंडों द्वारा की गई हत्या बेहद निंदनीय है। शोकाकुल परिवार के प्रति मेरी गहरी संवेदनाएँ।पश्चिम बंगाल में आज लोकतंत्र नहीं, TMC का गुंडा राज चल रहा है। वोट के बाद विरोधी आवाज़ों को डराना, मारना, मिटाना - यही TMC का… https://t.co/kQn4T9deL0— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2026ప్రజాస్వామ్యం కాదు.. గుండారాజ్బెంగాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడమే టీఎంసీ నైజంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని, తాము రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇదే తమ వారసత్వం, సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.కఠిన శిక్ష పడాల్సిందేఈ హత్యాకాండకు పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి, అత్యంత కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అసన్సోల్ నార్త్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుటండికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న దేబ్దీప్పై టీఎంసీ అనుబంధ దుండగులే ఈ దారుణ దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశ అహింసా సిద్ధాంతానికి మచ్చ తెస్తున్న ఇటువంటి నీచ రాజకీయాలకు తాము తలొగ్గేది లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్ -
‘హెచ్–1బీ’ కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో స్థిరపడాలనే భారతీయ టెక్నాలజీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా అగ్రరాజ్యం కీలక అడుగులు వేస్తోంది. వీసా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో నూతన హెచ్–1బీ వీసాల జారీపై మూడేళ్ల పాటు నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన ‘హెచ్1బీ అబ్యూజ్ యాక్ట్–2026’ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పార్టీ సభ్యులే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ‘హెచ్–1బీ వీసా అబ్యూజ్ యాక్ట్–2026’బిల్లును అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మరో ఏడుగురు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు బ్రియన్ బాబిన్, బ్రాండన్ గిల్, వెస్లీ హంట్, కీత్ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పాల్ గోసర్, టామ్ మెక్‌క్లింటాక్ మద్దతుగా నిలిచారు. సహ ప్రాయోజకులుగా(కో–స్పాన్సర్లుగా) సంతకాలు చేశారు. అసలు ఉద్దేశం ఏమిటి? హెచ్–1బీ వీసా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రతిపాదకులు చెబుతున్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పని చేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు హెచ్–1బీ వీసా వ్యవస్థను దురి్వనియోగం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటే, వారినే నియమించుకోవాలి’అని డిమాండ్ చేస్తున్నారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని అరికట్టేందుకు మూడేళ్ల పాటు హెచ్–1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసి, ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనల ద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత దక్కేలా చేయడమే బిల్లు లక్ష్యమని చట్టసభ సభ్యుడు ఎలీ క్రేన్ స్పష్టం చేశారు. హెచ్–1బీకి కొత్త నిబంధనలు ⇒ ప్రతిఏటా జారీ చేసే 65,000 హెచ్–1బీ వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించడం. ⇒ వీసా దక్కించుకునే విదేశీ నిపుణుల కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా ఉండాలి. ⇒ ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా(వేజ్–బేస్డ్) ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. ⇒ హెచ్–1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలి. ⇒ విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబా టు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానాన్ని రద్దు చేయాలి. ⇒ హెచ్–1బీ వీసాపై వచి్చన వారిని గ్రీన్ కార్డు (శాశ్వత నివాసిత హోదా) పొందేందుకు అనర్హులుగా మార్చాలి. ఈ వీసాలను కేవలం తాత్కాలిక అవసరాల కోసమే పరిమితం చేయాలి. ⇒ థర్డ్–పార్టీ స్టాంఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడాన్ని నిరోధించాలి. భారతీయులపైనే అధిక ప్రభావంఅమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే హెచ్–1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా భారతీయులకే దక్కుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే, ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొత్తగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో చేరాలనుకునే నిపుణులకు కొన్నేళ్ల పాటు అవకాశాలు ఉండవు. అక్కడే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలకు ఆటంకం ఏర్పడుతుంది.కంపెనీల నిర్వహణ వ్యయం పెరుగుదలహెచ్–1బీ వీసాల జారీ నిలిచిపోతే అమెరికాలోని టెక్ కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులనే అధిక వేతనాలకు నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్ లాంటి దేశాల్లో మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అధికారంపై కవిత ధీమా, సీఎం కర్కోటకుడు అంటూ విమర్శలు
-
రైతు భరోసా సగమే… మిగిలిన డబ్బులు ఎప్పుడో?
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడిచిన యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు
-
శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ మేలో పూర్తికానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. పార్టీ కేడర్‌కు గుర్తింపు.. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మహేశ్‌గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాందీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను మేలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్‌గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ఓబీసీ భేటీ హైదరాబాద్‌లో జరపాలి.. బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని రాహుల్ గాంధీని కోరినట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని కూడా జోడించాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌లా ఒక్కరోజు సర్వే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలను మహేశ్‌గౌడ్ ఖండించారు. సర్వే ప్రక్రియలో ఎక్కడా లోపం జరగలేదని.. అత్యంత శాస్త్రీయంగా వివరాల నమోదు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదని.. ఎన్యూమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారని వివరించారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని మహేశ్‌గౌడ్ ఉద్ఘాటించారు. -
బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించారు. పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాం«దీ, రేవంత్ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రేవంత్... మహిళాద్రోహి : బండి సంజయ్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్‌ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్‌రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతనర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్‌కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు. -
సంస్థాగతం.. ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ముమ్మరమైంది. పార్టీ మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీల నియామకం కోసం రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు ముగియనుంది. ఈ కమిటీల కూర్పులో డీసీసీ అధ్యక్షులకు సహకరించేందుకు గాను రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలను కూడా నియమించారు. ఏఐసీసీ నిబంధనలు, పీసీసీ సూచనల మేరకు శనివారం నాటికి ఈ కమిటీల నియామకాలు పూర్తి కానున్నాయి. బూత్ స్థాయి నుంచి.. సంస్థాగత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కమిటీలను నియమిస్తోంది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఏజెంట్ల నియామకంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ కమిటీల్లో అధ్యక్షుడితో పాటు కనీసం 11–21 మంది కార్యవర్గంలో ఉండేలా నియామకాలు జరుగుతున్నాయి. ప్రతి కమిటీలో కనీసం 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకివ్వాలని పీసీసీ ఆదేశించింది. దీంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్ అధ్యక్ష పదవుల కోసం కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పనిచేయాలన్న నిబంధన కూడా విధించింది. ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్న డీసీసీ అధ్యక్షులు గడువులోపు కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అయితే, ఈ కమిటీల కూర్పులోనూ సమస్యలు వస్తున్నాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట్ల పాత, కొత్త.. అనే సమస్యలు వస్తున్నాయి. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో పలు హోదాల్లో పనిచేసి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని, పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేలు కోరుతుంటే, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాలని స్థానిక నాయకత్వం కోరుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమస్యల్లేని కమిటీలన్నింటినీ ఫైనల్ చేయాలని, సమస్యలు వచ్చిన చోట పీసీసీ పరిష్కరిస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీలను పూర్తి చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పంపుతాం.. మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, బూత్ స్థాయి ఏజెంట్లను కూడా నియమించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ముఖ్య నేతల తో మాట్లాడి కమిటీలకు రూపకల్పన చేస్తున్నాం. అన్ని కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలపై పీసీసీ అధ్య క్షుడు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఫైనల్ చే స్తాం. ఈ కమిటీల నియామకం విషయంలో సమస్యలున్న నియోజకవర్గాలకు సంబంధించిన తుది నిర్ణయం పీసీసీనే తీసుకుంటుంది. – పున్నాౖకైలాశ్ నేత,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు -
హైకోర్టు తీర్పు సర్కార్‌కు చెంపపెట్టు
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు? అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలుదొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కేసీఆర్ కుటుంబంపై కానీ, గత ప్రభుత్వ అక్రమాలపై కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘నేను గిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’అన్న చందంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద హామీలిచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదని కిషన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్ ఇచ్చిందే’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.‘‘అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్‌అండ్‌టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్ఎల్బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎల్బీసీ పనులు చేపట్టారు...ఎస్బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్లో చెక్‌డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్‌పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్ హితవు పలికారు. -
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో?
బెంగళూరు: కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి కేఎన్.రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో మాట్లాడిన కేఎన్.రాజణ్ణ.. సీఎం ఇంత అసహాయకుడిగా ఉండటం చూస్తే అతడిపై ఎవరైనా చేతబడి చేశారా అనిపిస్తుందని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం సైలెంట్‌గా ఉన్నారని ఎవరైనా చెబితే అది నిజమే అనిపిస్తుందన్నారు. చేతబడి ఎవరు చేశారు అనే దానిపై విచారిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు పాత ఇంటి చుట్టూ పసుపు నీరు చల్లి చేతబడి చేశారని గుర్తు చేశారు. అయినా దానిని పట్టించుకోలేదని.. ఎన్నికల్లో గెలుపొందినట్లు పేర్కొన్నారు. మే నెలలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు. సీఎం చేతగాని వ్యక్తి కాదని.. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మోదీ ఓ ఉగ్రవాది!
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్‌లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు, రాహుల్‌గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు. మండిపడిన బీజేపీమోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్‌గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు. -
కేసీఆర్ స్టేట్స్‌మన్.. రేవంత్ స్ట్రీట్‌మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాజనీతిజు్ఞడి (స్టేట్స్‌మన్)లా ప్రసంగిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాటారం బహిరంగ సభలో చిల్లర మనిషి (స్ట్రీట్‌మన్)లా మాట్లాడారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం హరీశ్‌రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ ప్రసంగించే సమయానికే మైకు పట్టుకొని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 36 లక్షల మంది వీక్షిస్తే రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మందే చూడటం బీఆర్ఎస్ అధినేతకు ఉన్న ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండా హుందాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేస్తూ బీఆర్ఎస్పై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ సూచనలు స్వీకరించి తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కుతాయన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి ‘కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, మే 6న హైకోర్టులో జరిగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోసం సీనియర్ లాయర్లను సంప్రదించాం. అందులో దాపరికం లేకున్నా రేవంత్ మీడియాలో లీకులిస్తూ డ్రామాలు ఆడాడు. రేవంత్‌రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. హోంమంత్రిగానూ ఉన్న రేవంత్ ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు. నాలుగున్నర ఏళ్లుగా రేవంత్ స్టేను అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్నారు. స్టే వెకేట్ అయితే సీఎం సీటు ఊడటంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం’అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ గర్జిస్తారనే భయంతో రైతు భరోసా ‘రెండు వ్యవసాయ సీజన్లలో రైతు భరోసా ఎగవేసిన రేవంత్.. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారనే భయంతో ఒక ఎకరం కిస్తీ రైతుల ఖాతాల్లో వేశాడు. రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్లు రావాలి. వచ్చే ఏడాది కరువు వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు మేడిగడ్డ మరమ్మతు గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై నా పేరు ఉందనే విషయం తెలియక వారే కట్టినట్లు రేవంత్ చెబుతున్నాడు. మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలి. ఎన్ని డ్రామాలాడినా రేవంత్‌కు రాజకీయంగా నూకలు చెల్లాయి’అని హరీశ్‌రావు అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్ స్టార్ట్
-
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్‌హౌస్‌లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్‌లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్‌లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్‌కుమార్‌గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్‌ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్‌ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం అనుకుంటున్నావో’ : కేసీఆర్
సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్ ఎస్టేట్ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’
సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం జీవన్ రెడ్డి గుండె ధైర్యమున్నోడు40ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి,నేను స్నేహితులం భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాంతెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేశారుజగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారుఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారుతన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి ఏదైనా చేస్తారుజీవన్ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శంపదవులు జీవన్‌రెడ్డికి కొత్తకాదుబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి నియామకంసభలో ప్రకటించిన కేసీఆర్ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి చెప్పామేం అధికారంలోకి రాగానే జీవన్‌రెడ్డికి మంచి పదవి కల్పిస్తాకరీంనగర్ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డి పని చేయాలితెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేదిఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్ ఛార్జీలు పెంచారుఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారుపక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడిందితెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ముందుకు సాగాంఐదేళ్లలో మిషన్ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాంపదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసుమా హాయంలో మిషన్ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదునూటి నూరుశాతం మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందిజీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారుజీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందివినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రుచంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశాతెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించాబషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించానురోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడుఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరాచిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారువచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయంబిహార్లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్‌ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాంమిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాంమిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. 40 మంది అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు జీవన్‌రెడ్డి. ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి జీవన్‌రెడ్డి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌పై అసంతృప్తిలో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు జీవన్‌రెడ్డి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్లో చేరికతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. -
కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్‌ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్‌తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నికల వేళ డీఎంకే, కాంగ్రెస్‌లకు షాక్
తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి. -
హిట్టా.. వికెట్టా?
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ భవితవ్యం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ, ఇటు మండలిలో సభ్యుడు కాని ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఈనెలాఖరుతో ఆరు నెలలు పూర్తి కానుంది. చట్టసభల నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన రెండు సభల్లో ఏదో ఒక సభ సభ్యునిగా నియామకం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 30తో ఆరు నెలల గడువు ముగుస్తున్నప్పటికీ ఆయనను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ఈ నెలాఖరులోగా గవర్నర్ నిర్ణయం రాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ చరిత్రలో ఈ పరిణామం నిలిచిపోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. గవర్నర్‌పై గంపెడాశలు వాస్తవానికి, రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణ (జూలై, 2023లో)ను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపింది. కానీ, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. ఈలోపు ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొ.కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌లను ప్రతిపాదిస్తూ మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని దాసోజు శ్రవణ్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఈ ఇద్దరి ప్రతిపాదనలను కోర్టు కొట్టివేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ, తుది తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అయితే, ఈ కేసులో 2025, ఆగస్టు 13న తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కోదండరాం, ఆమేర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. అనంతరం ఆగస్టు 30న మళ్లీ మంత్రివర్గం సమావేశమై కోదండరాంతోపాటు ఆమేర్ అలీ ఖాన్ స్థానంలో ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత అక్టోబర్ 31న (జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు) అజహరుద్దీన్ రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, ఆయన మండలి సభ్యత్వానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 2026 మే 1వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా నియామకం కాకుంటే మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీసుకునే సానుకూల నిర్ణయంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్నాయి. నిర్ణయం తీసుకోండి... ఈ అంశంలో గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గత ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాత జిష్ణుదేవ్‌వర్మ బదిలీ కావడంతో మార్చిలో శివప్రతాప్ శుక్లా గవర్నర్‌గా వచ్చారు. ఇప్పుడు ఈ పది రోజుల్లోపు శుక్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం అనూహ్యంగా గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ శనివారం ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయాన్నే లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వీరి భేటీలో అనేక అంశాలతోపాటు అజహరుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమించే అంశం చర్చకు వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ శుక్లాను రేవంత్ కోరారని, క్షుణ్ణంగా పరిశీలించి వీలున్నంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పరిపాలన, న్యాయ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా అజహరుద్దీన్ ఫైలు గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. వెంటనే సీఎం రేవంత్ కూడా గవర్నర్‌ను కలిసి కోరడంతో అజహరుద్దీన్ విషయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే అజహరుద్దీన్ యథాతథంగా మంత్రిగా కొనసాగనుండగా, ఏ నిర్ణయం తీసుకోకపోయినా, ప్రతికూల నిర్ణయం తీసుకున్నా ఆయన మంత్రి పదవిని కోల్పోనున్నారు. ఒకవేళ అదే జరిగితే మంత్రిగా అజహరుద్దీన్ మరోమారు ప్రమాణం చేయాల్సి ఉంటుందని, మళ్లీ ఆయన పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి ఏం జరుగుతుందో... అజహరుద్దీన్ భవితవ్యం ఏమవుతుందో వేచి చూడాల్సిందే! -
రామంతాపూర్ పాఠశాలల అభివృద్ధికి పరమేశ్వర్ రెడ్డి హామీ
రామంతాపూర్: నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విద్యా శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో తాగునీటి సమస్య మధ్యాహ్నం భోజనం, వంట గదితో పాటు ఇతర మౌలిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్కూల్ ఆవరణలో బోరు పంపు ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్లో నెలకొన్న పలు సమస్యలపై హెచ్ఎం లత ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహ్మద్ రఫీక్, శ్రీకాంత్ యాదవ్, ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అజారుద్దీన్‌కు కష్ట కాలం. మంత్రి పదవి ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన మంత్రి పదవికి సంకట పరిస్థితి వచ్చింది. మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ఈనెల 30తో అజారుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కానుంది. దీంతో ఈనెల 30 లోపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే.. మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఫైల్‌పై గవర్నర్‌ను సంతకం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్, సీఎం భేటీపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల లోపు అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. కాగా, అంతకుముందు అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఎందుకు ఈ పరిస్థితి.. కాగా, రేవంత్ ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఫలించని నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
మహిళలు క్షమించరు.. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు..
-
జగిత్యాల.. ‘జంగ్’ సైరన్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీని వీడటం, అందుకు దారి తీసిన పరిస్థితులు అధికార కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. జగిత్యాల వేది కగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఎటు తిరిగి ఎటు వెళుతుందోనన్న ఉత్కంఠ ఆ పార్టీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామానికి పెట్టింది పేరయిన పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఎలాంటి బాంబు పేలుస్తారో.. ఎన్నికలు సమీపించే కొద్దీ జగిత్యాల అలజడి ఎలాంటి అసమ్మతి సుడిగుండాలను సృష్టిస్తుందోనన్న గుబులు అంతర్గతంగా వ్యక్తమవుతోంది. జిల్లాకు ఒకరిద్దరు..!: కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అసమ్మతులు సహజం. అయితే రాష్ట్రం పార్టీ అధికారంలో ఉండడం, భవిష్యత్తుపై ఆశలు ఉండడంతో చాలామంది నేతల్లో వివిధ కారణాలతో అసమ్మతి ఉన్నా పంటి బిగువున నెట్టుకొస్తున్నారనే వాదన ఉంది. తమ భవిష్యత్తు ప్రస్తుతానికి గందరగోళంగా ఉన్నా కొంత కాలం తర్వాత అంతా సర్దుకుంటుందనే ఆశతో పార్టీలో ఉండలేక, వెళ్లలేక, సతమతమవుతున్నారు. ఇలాంటి నేతలు జిల్లాకు కనీసం ఒకరిద్దరున్నారని గాం«దీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చామని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోని నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. సింగాపురం ఇందిర, పి.విజయారెడ్డి, పొదెం వీరయ్య, భిక్షపతి గౌడ్, భీంభరత్, సరితాయాదవ్, కాట శ్రీనివాస్‌గౌడ్, కస్తూరి రాజేందర్ లాంటి నాయకులంతా గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారు. వీరితో కనీసం మాట్లాడే వారు, సర్దిచెప్పేవారు కూడా లేరని అంటున్నారు. పదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నామని, ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలతో కూడిన అభిప్రాయాలను బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు. తమ విషయంలో పార్టీ, నాయకత్వ వ్యవహారశైలిపై నిట్టూరుస్తూనే ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న చిన్నారెడ్డి సీనియర్ నేత చిన్నారెడ్డిది కూడా జీవన్‌రెడ్డి లాంటి పరిస్థితే. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందనే స్థాయిలో ఆయన తన అసంతృప్తిని వెలిబుచ్చినా పార్టీ నాయకత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలోదనే విమర్శలున్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఆశించి భంగపడినవారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలు... ఇలా అనేకమందిలో అసమ్మతి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరిని సముదాయించేందుకు డీసీసీ అధ్యక్షులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినా లోలోన అసమ్మతి సెగలు మాత్రం అలాగే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సమన్వయ లేమి కారణంగానే నాగం జనార్ధన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలను దూరం చేసుకున్నామంటూ నెమరువేసుకుంటున్నారు. జీవన్‌రెడ్డితో అధిష్టానం చర్చించి ఉంటే బాగుండేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం, ఎంపీ మల్లు రవి కూడా ఆయన వెళ్లిపోవడం బాధాకరమే అన్న రీతిలో మాట్లాడటం గమనార్హమని చెబుతున్నారు. టేకిటీజీగా తీసుకున్నారా? వాస్తవానికి జీవన్‌రెడ్డి చాలా రోజులుగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. 42 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తనను కాదని, కనీసం తనకు చెప్పకుండా, తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకున్నప్పుడే ఆయన భగ్గుమన్నారు. అప్పటి నుంచీ సందర్భమెప్పుడొచ్చినా ఆయన అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల పంచాయతీ నడుస్తూనే ఉంది. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాం«దీభవన్‌కు వచ్చి పార్టీ సమావేశంలో పాల్గొనడం, మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, ఫలితాల అనంతరం పార్టీ తీసుకున్న నిర్ణయం లాంటివి జీవన్‌రెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీపై ప్రశ్నలు లేవనెత్తేలా చేశాయనే భావన వ్యక్తమైంది. అయితే జీవన్‌రెడ్డి గురించి పార్టీలో అంతర్గతంగా చాలా చర్చ జరిగింది. ముఖ్య నేతలు కలిసినప్పుడు, కరీంనగర్ రాజకీయాలు మాట్లాడినప్పుడు, పీఏసీ సమావేశాల్లోనూ ఆయన గురించి ప్రస్తావనలు వచ్చాయి. కానీ ఆయనే సర్దుకుంటారులే అన్న ధీమాతో పాటు ఇప్పుడు బయటకెళ్లి ఏం చేస్తారులే అనే అభిప్రాయమే చివరివరకు కొనసాగింది. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ టేకిటీజీ ధోరణిలోనే వెళ్లారనే భావన కొందరు వ్యక్తం చేయడం గమనార్హం. ఏతావాతా జీవన్‌రెడ్డికి సరైన భరోసా లభించలేదు. జగ్గారెడ్డి, మల్లు రవి మాదిరిగానే చివరి నిమిషంలో మంత్రి శ్రీధర్‌బాబు కూడా జీవన్‌రెడ్డిని వెళ్లనివ్వకుండా ఆపాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలామంది నేతలు జీవన్‌రెడ్డిని పార్టీ విడిచిపెట్టదనే అనుకున్నారు. కానీ జీవన్‌రెడ్డి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకున్నారు. ఇది బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. -
బాధాకరమే.. పరాజయం కాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్‌సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. -
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్‌రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్‌రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక అన్నారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్‌కుమార్‌నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్‌రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. -
ఎన్డీయేతో పొత్తు.. కాంగ్రెస్‌తో గమ్మత్తు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్‌తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో రహస్య స్నేహం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్‌కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం. చంద్రబాబు కూడా రేవంత్‌కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్‌రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్‌తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. 2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్‌తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్‌తో స్నేహం..ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్‌కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్‌తో రహస్యం బంధాన్ని కొనసాగించారు. 2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు...ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది. రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు తప్పు చేస్తున్నావ్ శిక్ష అనుభవిస్తావ్ జాగ్రత్త
-
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో విపక్షంపై బురద జల్లే కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి దెబ్బ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది.. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK— ANI (@ANI) April 18, 2026భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్‌లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్‌సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్‌పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్‌సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్‌లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్‌సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్‌సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్‌సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్‌సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్‌ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్‌తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్‌ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్‌ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో చేపట్టిన కీలక ఓటింగ్‌లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్‌సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్‌కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్‌గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్‌లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ను ధార్వాడ్‌లోని ఆయన జిమ్‌లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మూడేళ్ల ముందే ఇబ్రహీంపట్నంలో ఎన్నికల వేడి ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం తీవ్రస్థాయికిచేరాయి. ఇవాళ చర్చకు రావాలని మల్రెడ్డి రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు ఏర్పాటు చేసింది. సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించడంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు.. వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఫార్మా భూముల విషయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం సాగుతోంది. ‘‘అన్నీ నా హయాంలో జరిగిన పనులే.. కొత్తగా తెచ్చింది ఏముంది?" అంటూ మల్రెడ్డి లెక్కలను మంచిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అక్రమ కబ్జాలు తేలాలంటే ఇబ్రహీంపట్నం బస్ డిపో వెనుక ఉన్న 45 ఎకరాల దగ్గరకు రావాలని మల్రెడ్డి డిమాండ్ చేశారు.ఫార్మా భూముల్లో భారీ స్కామ్ జరిగిందన్న ఎమ్మెల్యే ఆరోపణలతో ఇరుపార్టీల నేతలు.. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సవాళ్లు విసురుకోవడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పొలీసులు భారీగా మోహరించారు. సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్యకు ఎదురుగాలి!
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలామాలో పడిపోయారు. రాజణ్ణ నుంచి షురూ సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్ రాజణ్ణ.. రాహుల్ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ సస్పెండ్, మైనారిటీ నేత అబ్దుల్ జబ్బార్‌ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్ పోరును తీవ్రం చేశారు. భవిష్యత్ కష్టమే.. భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది. -
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ.. -
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్‌గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంపై లోక్‌సభలో చెలరేగిన దుమారంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను కానీ పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తేజస్వీ సూర్యకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని సభకు సవివరంగా తెలియజేశారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు: కంగనా రనౌత్ ఏమన్నారంటే?
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించే బిల్లును ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురువారం బాలీవుడ్ సినిమాలోని ఒక డైలాగ్ ఉపయోగించారు. మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయకుండా వదిలేసిందని ఆమె ప్రశ్నించారు.మహిళా కోటాకు సంబంధించిన మూడు బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన నటి-రాజకీయవేత్త బాలీవుడ్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లే జాయేంగేలోని 'జా సిమ్రాన్, జీ లే అప్నీ జిందగీ' డైలాగ్ ప్రస్తావించారు . దేశంలోని మహిళలు స్వేచ్ఛగా తమ జీవితాలను గడపాలని ప్రధానమంత్రి పరోక్షంగా చెబుతున్నారని ఆమె అన్నారు.రానౌత్, అంతకుముందు ముందు రోజు ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక మహిళా ఇంటర్వ్యూయర్‌తో జరిగిన సంభాషణను కూడా గుర్తుచేసుకున్నారు. "నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను. 'మీ గుండెపై చేయి పెట్టుకుని చెప్పండి, మహిళలకు ఎప్పుడైనా ఈ ప్రత్యేక హక్కు లభించిందా? మహిళలకు ఇంతటి స్వర్ణయుగం ఎప్పుడైనా ఉందా?' అని అడిగాను," అని ఆమె లోక్‌సభలో అన్నారు.బిల్లును తీసుకురావడానికి బీజేపీ వాళ్లు ఎందుకంత తొందరపడుతున్నారు అని సోనియా గాంధీ మాటలకు.. మేము కూడా మీలాగే దాన్ని 30 ఏళ్ళ పాటు అలా వదిలేయాలా?" అని రనౌత్ ప్రశ్నించారు.మహిళలకు న్యాయం అందించడానికి ప్రధాని మోదీ వేగంగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 60 ఏళ్లలో జరగనిది ఆయన 10 ఏళ్లలో సాధించారు. అది పక్కా ఇళ్లైనా, గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయినా, లేదా రక్షణ దళాల్లోకి మహిళలను చేర్చుకోవడమైనా. మహిళలకు న్యాయం చేయడానికి ఆయన తొందరపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. -
డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా కౌంటర్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా నేతల పేర్లను వడబోసిన ముగ్గురు నేతలు.. పలు కీలక పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కుల సమాఖ్యలకు చైర్మన్లు, పాలకవర్గం నియామకాల విషయంలో ఏకాభిప్రాయానికి రావడంతో రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర, వాల్మీకిబోయ, కృష్ణ బలిజ (పూసల), భట్రాజ, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదరి, గీత, గొర్రెలు, మేకల తదితర పారిశ్రామిక ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గాలను నియమిస్తూ రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, జిల్లా స్థాయి నేతలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవుల గురించి కూడా చర్చించిన నేతలు ఆయా పోస్టులను ఎవరికి కేటాయించాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలా ప్రాతినిధ్యం ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని పదవులు ఇవ్వాలనే దానిపై కూడా ఓ అంగీకారానికి వచ్చారని, అయితే ఆ పోస్టులను జూన్ నెలలో ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు కేటాయించే విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని తెలిసింది. నాలుగు వర్కింగ్, ప్రచార కమిటీపై కూడా పార్టీ పదవులపై కూడా రేవంత్, మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరన్న దానిపై చర్చ ఓ కొలిక్కి వచ్చిందని, ఈసారి పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఓ ఏఐసీసీ కార్యదర్శి, అదే జిల్లాకు చెందిన మహిళా నేత ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ పేరుపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ కోశాధికారిగా ఉమ్మడి హైదరాబాద్ పరిధిలోని సీఎం సన్నిహితుడిని నియమించే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొత్త అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, పెండింగ్‌లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా«ల అధ్యక్షులు, పలు జిల్లా కమిటీలపై కూడా చర్చ జరిగిందని, అన్ని పదవుల విషయంలో ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పదవుల జాబితాకు అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. మంత్రులపై ఆరోపణల గురించి చర్చ? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌తో పాటు ఇటీవలి కాలంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వస్తున్న ఆవినీతి ఆరోపణల గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ పక్షాన ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు గురించి అవసరమైతే క్షేత్రస్థాయి ఆందోళనకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పీఏసీలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరో కొత్త కమిటీ చేరనుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తరహాలోనే జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ పీఏసీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులను సభ్యులుగా నియమించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగే ముఖ్య రాజకీయ పరిణామాలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయాల్లో పీఏసీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. అయితే,ఆయా జిల్లాల పీఏసీల్లో తమకు స్థానం కల్పించకపోవడంపై పలువురు రాష్ట్ర కమిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. -
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్‌సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నేత మృతి
సాక్షి, ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ సీనియర్ నేత జావిద్ మృతి చెందారు. ఖమ్మం- హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు.. రూరల్ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.భట్టి విక్రమార్క దిగ్బ్రాంతిజావిద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేవన్నారు. జావిద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గత పది సంవత్సరాల పాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని గుర్తు చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన సానుభూతి తెలిపారు. -
కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీనియర్ నేత జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్‌కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్‌రెడ్డి చెప్పారు. -
ప్రొరాటా వద్దు.. హైబ్రిడే కావాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రొరాటా (దామాషా) పద్ధతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచితే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఇప్పటికే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. దేశ ఆర్థిక వికాసానికి గణనీయంగా సహకారం అందించే దక్షిణాదికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలు లాభపడతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రొరాటాకు బదులు హైబ్రిడ్ మోడల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి..‘లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ దశాబ్దాలుగా జనాభా నియంత్రణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయి. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ప్రొరాటా పద్ధతిలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోయి రాజకీయంగా బలహీనపడతాయి. ప్రొరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా రాజకీయ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రొరాటా మోడల్‌ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుంది. అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరం. ఈ విషయంలో హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతౌల్యం చేస్తుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరాటా పద్ధతిలో... మిగతా సగం సీట్లను రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్డీపీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలిమహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని.. అందుకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌పై ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతోపాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. దేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని.. ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఐక్యతను చాటేలా ఉండాలని సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ లేఖలోక్సభ సీట్లను ప్రొరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిలకు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. లోక్‌సభ సీట్లను 850కి ప్రొరాటా పద్ధతిలో పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని.. ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని రేవంత్ కోరారు. -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. లోక్‌సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్‌ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్‌వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్‌కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
హైబ్రిడ్‌గా సీట్లు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని.. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరనే విషయాన్ని మరుగున పెట్టి, రెండింటినీ జనాభా లెక్కల తర్వాత ఆమోదింప చేసుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. ప్రపంచంలోనే భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక నిర్మాణం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలని డిమాండ్ చేశారు. అందుకోసం ‘హైబ్రిడ్ మోడల్’ అవసరమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెంచబోయే 272 లోక్‌సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన మరో 136 సీట్లను జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలతో కలిసి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...హైబ్రిడ్ విధానంతో సమన్యాయానికి అవకాశం‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించడం తగదు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే దానికి మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నాం. లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. పెరిగే 272 సీట్లలో 136 దామాషా (ప్రొరాటా) ప్రకారం పెంచుకొని మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్న సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2027 మార్చి 31లోగా జనగణన, 2028 మార్చిలోగా పునర్విభజన పూర్తి చేసి 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లవచ్చు’అని రేవంత్ సూచించారు.మహిళా బిల్లు, పునర్విభజన బిల్లును కలపడం రాజకీయ కుట్ర‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తోంది. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. వేర్వేరుగా చర్చించి అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్ బిల్లు విషయంలో ఆలస్యం చేయడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు–2013లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బీజేపీ సహకరించకపోవడంతో లోక్‌సభలో నిలిచిపోయింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్‌సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాత అంటే మహిళల హక్కులను వాయిదా వేయడమే. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’అని సీఎం సూచించారు.జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో దక్షిణానికి అన్యాయం‘దేశంలో 1970 ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేకపోవడంతో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితేం మంచి పనిచేసిన రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుంది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్‌సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు. 2001లో వాజ్‌పేయి పునర్విభజన బిల్లుపై చట్ట సవరణ చేశారు. చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయి. దాంతో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50 శాతం పెంచితే 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి. 50 శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లున్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్య అంతరం 412 సీట్ల నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఒక్క తెలంగాణకే కాదు... దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోపాటు గోవా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయమే జరుగుతుంది. తద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. ఇది దేశ సమతౌల్యానికి ప్రమాదకరం’అని సీఎం రేవంత్ హెచ్చరించారు.బండి సంజయ్, కిషన్‌రెడ్డి మోదీ ఇంటి ముందు బంట్రోత్తులుగానే..‘50 శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచే ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మోదీ గుజరాత్ వదిలి యూపీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే హైబ్రిడ్ విధానంలో దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం కేటాయించాలి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. 50 శాతం మెరిట్, 50 శాతం రిజర్వేషన్ అని. దానినే కేంద్రం ఉపయోగించాలి’అని సీఎం సూచించారు.మహిళలకు బీజేపీ అన్యాయం చేసింది‘బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పాటైంది. ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియమించలేదు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టే బీజేపీకి మహిళలపై గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమవుతుంది. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం. మా ఎంపీలు తెలంగాణను సాధించారు. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం. అన్ని దక్షణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపై లేఖ రాస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. -
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
జగిత్యాల కాంగ్రెస్‌లో ట్విస్ట్.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లిపోయినప్పటికీ హస్తం పార్టీలో వర్గ విభేదాలు ఆగలేదు. మంత్రి అడ్లూరి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నట్టు మంత్రి అనుచరులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.వివరాల మేరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ మూడు పదవులనూ ఎమ్మెల్యే వర్గీయులకే అప్పగించడంతో మంత్రి అడ్లూరి వర్గం ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ అడ్లూరి వర్గం మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తే మీరేం చేస్తున్నారంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పదవుల మాటేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.జీవన్ రెడ్డిని కాదని మంత్రితో ఉంటే ఎమ్మెల్యే అనుచరులు, మాజీ బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి అడ్లూరి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సీనియర్లతో చర్చించడానికి సిద్దమైనట్టు తెలిసింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో మంత్రి అడ్లూరికి కొత్త తిప్పలు మొదలైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైచేయి సాధించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా సంజయ్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మాజీ కౌన్సిలర్ జంబర్తి లక్ష్మికి అవకాశం కల్పించడంతో విభేదాలు బయటకు వచ్చాయి. -
కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి ఆ ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌తో బంధం తెంచుకుని బీఆర్ఎస్లో చేరబోతుండడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అయితే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. ఆయన బహిరంగంగా చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై గరం గరంగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా? అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామంపై పోచారం రిజర్వాయర్ వద్ద బైఠాయించి మరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బిల్లులు రాకపోతే ఎలా పని చేయాలని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయినా వాళ్లను బతిమాలి పనులు చేయిస్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏనాడూ చూడలేదు. నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రిని 20 సార్లు అడిగా. ఇప్పుడు మంత్రులు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ల కాళ్లు మొక్కలా ఏంది?. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?’’ అని ప్రశ్నించారాయన. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పోచారం.. టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అటుపై మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. అయితే.. 2024లో కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే.. ఆయన పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ మాత్రం ఆ పిటిషన్ కొట్టేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
కాంగ్రెస్ పార్టీ జీవన్‌రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది: మహేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ–ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని చెప్పడం సరికాదని, ఆయన్ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు గతంలో బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, భవిష్యత్‌లో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, ఆధారాలు ఉంటే గాంధీభవన్‌కు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని, నిరాధార ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. నాదర్గుల్ భూముల వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ చేసిన దోపిడీపై ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, సమీప కాలంలో విస్తరణ ఉండదనే అనుకుంటున్నట్టు తెలిపారు. తనతోపాటు పలువురు నాయకులు ఎన్ఎస్యూఐ నుంచే ఎదిగినవారేనని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, శంకర్‌నాయక్ తదితరులు కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినవారేనని చెప్పారు.


