విజయ్ ‍అలా చేస్తే మద్దతు ఉపసంహరిస్తాం | congress to support Vijay no communal forces in alliance | Sakshi
Sakshi News home page

విజయ్ ‍అలా చేస్తే మద్దతు ఉపసంహరిస్తాం

May 6 2026 5:15 PM | Updated on May 6 2026 6:02 PM

 congress to support Vijay no communal forces in alliance

చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాను ‍ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని టీవీకే అధినేత సినీస్టార్‌ విజయ్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందించారు. అయితే మెజార్టీ మార్కుకు కేవలం పదిసీట్ల దూరంలో ఆగిపోయిన టీవీకేకు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టీవీకేకు సపోర్టు చేసే ముందు కాంగ్రెస్‌ విజయ్‌తో ఒక విషయంలో కీలక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహుర్తం సైతం సిద్ధమైంది. రేపు లేదా ఎల్లుండో  ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే  విజయ్‌ సీఎం కావడానికి అక్కడి కాంగ్రెస్‌ మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకేతో కీలక ఒప్పందం చేసుకొని అనంతరం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ గిరీశ్ చౌడాంకర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రస్తుతం మేము టీవికేకు మద్దతిస్తున్నాం. రాజ్యాంగాన్ని నమ్మని మతతత్వ రాజకీయ పార్టీలకు టీవీకే పార్టీ దూరంగా ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ వారు మతతత్వ శక్తులతో కలిస్తే మా మద్దతు ఉపసంహరిస్తాం. అని అన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ ‍విజయ్‌ పార్టీకి మద్దతు ‍ప్రకటించింది.

కాగా మెజార్టీ మార్కు రావాలంటే కాంగ్రెస్‌ ఐదు స్థానాలతో కలిపి టీవీకేకు మరో ఐదు స్థానాల మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో మెజార్టీమార్కుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement