కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు | Revanth Reddy comments on on Kavitha New Party | Sakshi
Sakshi News home page

కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Apr 27 2026 3:09 PM | Updated on Apr 27 2026 6:20 PM

Revanth Reddy comments on on Kavitha New Party

సాక్షి,హైదరాబాద్‌ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 

రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ చిట్‌చాట్‌లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌), బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు.  

ప్రతి పనికి పర్సస్‌ ఉంటుంది.. పర్పస్‌ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్‌ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్‌ఎస్‌ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది.. భవిష్యత్‌ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.

అహంకారం పెరగడంతో 2023లో బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. 

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

కేసీఆర్‌ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాను. కేసీఆర్‌ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement