కేరళం ముఖ్యమంత్రిపై వీడనున్న సస్పెన్స్ | Congress is set to announce its CM candidate for Kerala | Sakshi
Sakshi News home page

కేరళం ముఖ్యమంత్రిపై వీడనున్న సస్పెన్స్

May 14 2026 11:06 AM | Updated on May 14 2026 12:13 PM

 Congress is set to announce its CM candidate for Kerala

తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి అభర్థిపై మరికోద్దిసేపట్లో ఉత్కంఠ వీడనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి అభర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏవరనే అంశం ఈ రోజు తేలనుంది. అయితే సీఎం రేసులో రాహుల్ గాంధీ విధేయులు కేసీ వేణుగోపాల్ ముందజంలో ఉన్నట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చి పదిరోజులు దాటింది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్‌ అధికారం సాధించిన ఒక్క కేరళలో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే అంశమే స్పష్టత రాలేదు. దీంతో ఈ విషయమై ఎవరు సీఎం కానున్నారనే అంశం మరికొద్దిసేపట్లో తేలనుంది.

నిన్న (బుధవారం) పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని  వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్‌లు బరిలో ఉన్నారు.

కాగా వీడీ సతీశన్‌ది లోక్‌సభ ఎన్నికలతో పాటు యూడీఎఫ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు. అంతే కాకుండా ఈ విషయమై వీరిద్దరు ఇదివరకే చర్చలు జరిగినట్లు సమాచారం.

అయితే  సీఎం ఈ విషయంలో వీడీ సతీశన్‌, కేసీ వేణుగోపాల్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్ఠానం వీరిద్దరివైపూ కాకుండా రమేష్ చెన్నితల వైపు మెుగ్గు చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించనుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement