బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్‌తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.
అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్‌లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.
Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in Karnataka
Anand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026


