తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి.


