తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం | Union Minister Kishan Reddy fires in Lok Sabha | Sakshi
Sakshi News home page

తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం

Apr 17 2026 4:32 AM | Updated on Apr 17 2026 4:32 AM

Union Minister Kishan Reddy fires in Lok Sabha

లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌.. 

ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై వివరణ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంపై లోక్‌సభలో చెలరేగిన దుమారంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీయే కారణమని విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. 

తెలంగాణ ప్రజలను కానీ పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తేజస్వీ సూర్యకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని సభకు సవివరంగా తెలియజేశారు. కాంగ్రెస్‌ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement