ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..! | Congress Leaders Assure Protection to Party Workers in Uppal | Sakshi
Sakshi News home page

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..!

Apr 28 2026 9:39 AM | Updated on Apr 28 2026 11:12 AM

Congress Leaders Assure Protection to Party Workers in Uppal

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న సైన్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.కాప్రా సర్కిల్ కు చెందిన సీనియర్ బాబురావును ఆయన నివాసం కందిగూడలో పరమేశ్వర్ రెడ్డి గారు పరామర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతోనే ఉప్పల్ నియోజకవర్గానికి కావాల్సిన నిధులను తెస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు తెచ్చినా, అభివృద్ధి పనులను చేపట్టినా ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. కొందరు అభివృద్ధి పనుల విషయంలో వారి ఉనికి కోసం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ,కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగి రెడ్డి ధన్పాల్ రెడ్డి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,రాజేందర్ గారు,డివిజన్ అధ్యక్షులు నాగ శేషు గారు,జిల్లా కార్యదర్శి దండళ్ల మురళి గారు,పవన్ గారు,అజీజ్,తన్నీరు శ్రీహరి,మల్ల రెడ్డి,నాగరాజు,తోటకూర శ్రీకాంత్,శ్రీకాంత్ గౌడ్,సత్యనారాయణ,పూర్ణ యాదవ్,రాజు,లింగం,టిల్లు యాదవ్,రాజన్,గుణశేఖర్ గారు,రోకేష్ యాదవ్,శివ,రమాకాంత్ రెడ్డి, ముర్తుజా,షేక్ చోటు బై,షాబుద్దీన్,ఆరిఫ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement