తమిళ రాజకీయం.. కాంగ్రెస్‌ హైడ్రామా | Political Twist Over Tamil Nadu Congress MLAs | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయం.. కాంగ్రెస్‌ హైడ్రామా

May 9 2026 8:25 AM | Updated on May 9 2026 10:14 AM

Political Twist Over Tamil Nadu Congress MLAs

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. తమిళనాడు పొలిటికల్‌ ట్విస్టులు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.  రిసార్టు రాజకీయాల్లో భాగంగా వారు ఇక్కడికి చేరుకున్నారు.

తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. మొదట కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం, హైకమాండ్‌ ఆదేశాలకు మేరకు శుక్రవారం రాత్రి శంషాబాద్ చేరుకుని ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఎమ్మెల్యేలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తాజాగా నవోటెల్‌లో బస చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పరిస్థితులు చక్కబడే వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఐదుగురు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అవకాశంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అయితే, వీరంతా రోడ్డు మార్గంలో చెన్నై చేరుకునేలా ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కదలికలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement