డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి.
బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్‌డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్‌కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.
కాంగ్రెస్ కూటమి
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.
కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలు
ఏజీపీ 1-2 స్థానాలు
సీపీఐ(ఎం) 0-1 స్థానాలు
ఐఎన్‌డీ0-2 స్థానాలు
ఎన్‌డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.
కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్‌డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది.


