కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి జీవితఖైదు | Congress MLA Vinay Gets Life Imprisonment | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి జీవితఖైదు

Apr 17 2026 5:02 PM | Updated on Apr 17 2026 5:56 PM

Congress MLA Vinay Gets Life Imprisonment

బెంగళూరు:  కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్‌గౌడ్‌ హత్య కేసులో వినయ్‌ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 

2016లో యోగేష్‌ గౌడ్‌ హత్యకు  గురయ్యారు.  ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. 

 ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్‌ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు.  ఈ కేసుకు సంబంధించి వినయ్‌ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.

ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్‌లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్‌ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన  ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది  కోర్టు.

యోగేష్‌ గౌడ్‌ హత్య ఇలా..
2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్  జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ను ధార్వాడ్‌లోని ఆయన జిమ్‌లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ  ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కులకర్ణి

 అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి.  అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement