breaking news
life impriosnment
-
ఆ ఒక్క మాటే తీర్పును తిరగరాసింది!
భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య నోరు జారింది. భర్త తట్టుకోలేకపోయాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా రాయి తీసుకుని దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో చేసిన నేరానికి వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ, సమాజం ఊరుకోలేదు!. కోర్టు జీవితఖైదు విధించి తన పని తాను చేసింది. అయితే ఒక్క మాటతో ఆ తీర్పును ఇప్పుడు తిరగరాయాల్సి వచ్చింది.ఐదేళ్ల కిందట.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన గర్భిణీ హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మాటామాటా పెరిగి కిరణ్ అనే మహిళను ఆమె భర్త శివ రాళ్లతో దాడి చేసి చంపాడు. ఆపై విషయాన్ని ఇరు వైపులా కుటుంబాలకు తెలియజేశాడు. అయితే.. ఆమె కడుపుతో ఉండడం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు విధించింది. అయితే..ఈ శిక్ష పునఃపరిశీలన కోసం తాజాగా ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. నిందితుడి జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా మార్చేసింది. కేసు విచారణలో కీలకంగా మారిన అంశం.. గొడవ సమయంలో భార్య చేసిన ఒక వ్యాఖ్య. కిరణ్ తన భర్తను ఉద్దేశించి “నువ్వు కాకపోతే.. నీలాంటి వందల మంది నాకు మొగుళ్లుగా దొరుకుతారు” అని అన్నదట. ఈ మాట తనలో తీవ్ర ఆవేశాన్ని రేపిందని, అదే ఆవేశంలో రాయితో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని శివ కోర్టుకు తెలిపాడు. ఆధారాలను, వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవినీంద్ర కుమార్ సింగ్.. Grave and sudden provocationను పరిగణనలోకి తీసుకున్నారు.ఇది క్షణికావేశంలో జరిగిన నేరంగా భావించిన ధర్మాసనం.. దాడి జరిగిన వెంటనే నిందితుడు స్వయంగా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. “అది ప్రణాళికాబద్ధ(ప్లాన్ప్రకారం చేసిన) హత్య కాదు. కోపంలో జరిగింది అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 1 వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల హత్యగా కాకుండా ‘కల్పబుల్ హోమిసైడ్’ (Section 304 Part II) కింద కేసును పరిగణించింది. జీవితఖైదును కాస్త.. ఏడేళ్ల శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.Grave and sudden provocation (IPC సెక్షన్ 300 Exception 1).. దీని ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అవమానం లేదంటే తీవ్ర ఆవేశాన్ని రేపే మాట/పరిస్థితిని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు.. నియంత్రణ కోల్పోయి నేరం చేయడం.. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మాటల ప్రభావం, గృహహింస కేసుల్లో భావోద్వేగ ప్రేరణ పాత్ర వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయపరమైన సడలింపు సరైన దేనా? అనే ప్రశ్నలు వస్తుండగా, మరోవైపు భావోద్వేగ ఆవేశంలో జరిగే నేరాలపై చట్టం ఎలా స్పందించాలన్నదానిపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్‌గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్‌లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ను ధార్వాడ్‌లోని ఆయన జిమ్‌లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
అంకితా భండారీ హత్య కేసులో దోషులకు జీవితఖైదు
-
చంద్రబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష ?
-
‘వాల్‌మార్ట్’ కాల్పుల దోషికి 90 జీవిత ఖైదులు
ఎల్ పాసో: అమెరికాలోని ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో 2019లో కాల్పులు జరిపి 23 మంది మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 90 వరుస జీవిత ఖైదులను విధించింది. దోషి పాట్రిక్ క్రుసియస్(24)పై సుమారు 50 ఫెడరల్ విద్వేష నేరాభియోగాలున్నాయి. దీనిపై జిల్లా కోర్టు విచారణ జరిపి, శిక్షలు ప్రకటించింది. రాష్ట్ర కోర్టులో విచారణకొస్తే మరణ శిక్ష సహా మరిన్ని శిక్షలపై పట్టుబడతామని న్యాయవాదులు అంటున్నారు. ఈ నేరానికి పాల్పడేందుకు పథకం ప్రకారం క్రుసియస్ డల్లాస్‌లోని సొంతింటి నుంచి ఏకే రైఫిల్‌తో తన వాహనంలో 700 మైళ్ల దూరంలోని ఎల్ పాసోకు వచి్చనట్లు పోలీసులు తెలిపారు. హిస్పానిక్ ప్రజలే లక్ష్యంగా అతడు వాల్ మార్ట్ స్టోర్ లోపల, వెలుపల యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. 2006 తర్వాత అమెరికాలో జరిగిన జాత్యహంకార కాల్పుల ఘటనల్లో అత్యంత తీవ్రమైందిగా ఎల్ పాసో ఘటనను పరిగణిస్తున్నారు. -
న్యూజిలాండ్‌లో చరిత్రలోనే అరుదైన తీర్పు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మసీదులో హింసాకాండకు పాల్పడిన ముష్కరుడు బ్రెంటన్ టారెంట్కు పెరోల్ లేని జీవితఖైదును విధిస్తూ గురువారం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న 51మంది అమాయకపు ప్రాణాలను బలితీసుకొని ఆ దుర్మార్గాన్ని ఫేస్బుక్లో చిత్రీకరించిన ట్రెంటన్ను అమానవీయ వ్యక్తిగా కోర్టు పేర్కొంది. ఘటన సమయంలో 3 ఏళ్ల శిశువు తన తండ్రి కాలికి చుట్టుకొని ఉంటే ఉద్దేశపూర్వకంగా ఈ పసిప్రాణాన్ని కూడా చంపేసిన బ్రెంటన్ అత్యంత దుర్మార్గుడిగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తికి పెరోల్ లేని జైవిత ఖైదు విధిస్తున్నాం అని న్యాయమూర్తి కామెరాన్ మాండర్ తీర్పు చెప్పారు. అయితే న్యూజిలాండ్ చరిత్రలో ఇప్పటివరకు పెరోల్ లేని జీవితఖైదును ఎవరికి విధించలేదు. (చైనా తీరుపై యూకే, యూఎస్, జర్మనీ విమర్శలు) గతేడాది మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మరియు లిన్‌వుడ్ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై ముష్కరుడు బ్రెంటన్ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేసి రక్షసానందం పొందాడు. నిందితుడు బ్రెంటన్పై ఇదివరకే 51 హత్యారోపణలు, 40 హత్యాయత్నాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. మొదట తనకు ఏం తెలియదని బుకాయించినా విచారణలో తను చేసిన నేరాలను అంగీకరించాడు. న్యూజిలాండ్ చరిత్రలో గతేడాది జరిగిన హింసాకాండ అత్యంత బాధాకరమైన ఘటన అని ప్రాసిక్యూటర్ మార్క్ జరీఫె అన్నారు. ఇక ఈ ఘటనలో తమవాళ్లను పొట్టనపెట్టేకొని తీరని శోకాన్ని మిగిల్చిన బ్రెంటన్కు అత్యంత కఠినమైన శిక్ష వేయాలని బాధితులు కోర్టు ఎదుట తమ గోడును వెళ్లగక్కారు. (యూఎస్‌లో దారుణం: ‘మీ అమ్మ, బామ్మను చంపేశా’ ) -
హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష
చల్లపల్లి(కృష్ణా జిల్లా): అవనిగడ్డ మండలంలోని పులిగడ్డలో జరిగిన ఓ హత్య కేసులో ఐదుగురికి మచిలీపట్నం జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2009లో పులిగడ్డ గ్రామానికి చెందిన దిడ్ల ధనుంజయ్ అనే మావోయిస్టు హత్యకేసులో మిట్టా రమేశ్, దాసరి వెంకయ్య, దోవారి వెంకటరమణ, అరిగ లంకయ్య, మాతంగి పూర్ణచంద్రరావు అనే ఐదుగురికి శిక్ష పడింది.


