తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
- తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
- అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు
- అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు
- ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం
- 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు
- ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు
- ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు
విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణ
- మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు
- కూటమిలోనే ఉంటామని ప్రకటన
- ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్
టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్
- రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమే
- ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్ అనుమతి
- మెజార్టీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయిన విజయ్
- విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు
- 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్
ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే
లోక్‌భవన్‌లో జరిగిన పరిణామాలు
రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ
రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్
తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్
రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు
ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే
ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?
లోక్‌భవన్‌కు చేరుకున్న విజయ్
ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్
ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?
గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ
నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
విజయ్‌కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్‌తో పాటు విజయ్‌కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం
గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్
కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ
పార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరిన విజయ్
గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్
అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ
భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు
విజయ్ మరో సంచలనం?
సాయంత్రం లోక్‌భవన్‌కు విజయ్
ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందించనున్న విజయ్
గవర్నర్‌తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టత
రేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?
విజయ్ మరో సంచలన నిర్ణయం
ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయం
ఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీ
నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
సాయంత్రంకల్లా రానున్న క్లారిటీ
ప్రొటెం స్పీకర్ ఎవరంటే..
టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్
9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్
అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్
గతేడాది విజయ్ టీవీకేలో చేరిక
విజయ్‌కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్
ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్
ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు
పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ
ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్
మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస చేసిన ఎమ్మెల్యేలు
ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేత
మ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108
రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107
కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)
సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే)
ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)
వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)
పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)
అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్
తమిళనాడు రాజకీయాల్లో మరో సర్‌ప్రైజ్?
బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకే
ఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలం
సపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గం
అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునా
ఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశం
అదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలం
విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం
సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న విజయ్
మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందజేయనున్న విజయ్
టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)
మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే
వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం
టీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీ
టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్
తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్
ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్
టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలు
పరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలు
ఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్‌తో దోస్తీ
విజయ్‌కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్
విజయ్‌కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్
ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్
- ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్
- తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్
టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరం
పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరం
సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరం
విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరం
- ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్‌కుమార్
- కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్‌తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్‌కుమార్
- తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్‌కుమార్
- ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్‌కుమార్
తమిళనాట మరో ట్విస్ట్
అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?
అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత
పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునా
టీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరు
ఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలు
మద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గం
విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గం
అన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు
ఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశం
ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖ
సాయంత్రం మద్దతుదారుల లిస్ట్‌తో గవర్నర్‌ను కలవనున్న విజయ్?
తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలు
తమిళనాడు కాంగ్రెస్‌తో పాటు చిన్న పార్టీల మద్దతు
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్
మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)
మద్దతు కోసం విజయ్ వెయింటింగ్
ఈలోపే.. లోక్‌భవన్ నుంచి టీవీకేకు కబురు
సాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపనున్న టీవీకే
స్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్
రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్
బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్
గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు
మధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
సాయంత్రం టీవీకే అధినేత విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఖారారు చేసిన లోక్‌భవన్
రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్
గవర్నర్‌తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకే
అన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణం
విజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశం
బలనిరూపణకు.. గవర్నర్‌ను రెండు వారాల గడువు కోరిన విజయ్
విజయ్‌కు శ్రీలంక నేతల శుభాకాంక్షలు
తమిళనాట టీవీకే ప్రభంజనం
తొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్
పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీ
అభినందిస్తున్న శ్రీలంక నేతలు
విజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్‌లో తమిళ యువత సంబురాలు
విజయ్‌కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్స
గతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎల్‌టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్
శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్య
ఖర్గేకు విజయ్ లేఖ
ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖ
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్
సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్
నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్‌కే వదిలేసిన హైకమాండ్
విజయ్‌ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్
తన కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్‌కు!
వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్
ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశం
పళనిస్వామికి చుక్కలు
టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలు
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలు
ఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలు
విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్
తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమా
పళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశం
ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే
కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ
సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
అన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్
గతంలో జయలలిత టైంలో విజయ్‌కు పలు చేదు అనుభవాలు!
అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం
ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి
47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే
గవర్నర్.. చెన్నైకి వస్తారా?
లోక్‌భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులు
కేరళ, తమిళనాడుకు గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్‌భవన్‌కు సమాచారం అందించిన టీవీకే వర్గాలు
ఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్
మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచన
పూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్‌భవన్ వర్గాలు
గవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్
ఐదు కోసం..
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలు
మేజిక్ ఫిగర్ 118
టీవీకే తరఫున నెగ్గింది 108
తిరుచ్చి ఈస్ట్‌కి రాజీనామా చేసే యోచనలో విజయ్
అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలం
కాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్‌తో 113కి పెరగనున్న టీవీకే బలం
మరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలు
కాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకే
టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
కాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటు
కాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకే
సీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్
కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?
డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?
డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?
అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!
టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం
తమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకే
మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు బస
డీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలు
కాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారు
విజయ్ కేబినెట్‌లో కాంగ్రెస్‌కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచన
ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌కు టీవీకే గాలం
మన్నార్‌గుడి నుంచి నెగ్గిన కామరాజ్
రేపే విజయ్ ప్రమాణం?
తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణం
ప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్
రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం
ముహూర్తం పెట్టిన రాధన్ పండిట్
నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్
తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులు
ప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్
విజయ్‌కు మరో షాక్
ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్
తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీ
డీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్య
ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణ
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!
కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్
విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
తీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకే
సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్
వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకే
ఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశం
స్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్ డుమ్మా
విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్
నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్
సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?
టచ్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?
- టీవీకేకు టచ్‌లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
- TVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలు
- అప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానం
- నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
- చెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశం
- అన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలు
- గెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశం
- అవసరమైతే రిసార్ట్‌కు తరలించే యత్నం
ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు
- తమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)
- అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)
- ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకే
- మహాబలిపురం రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలు
- చెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
- ఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశం
నేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్?
- నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్న టీవీకే అధినేత విజయ్
- ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్
- నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్
- సాయంత్రంలోపు అపాయింట్‌మెంట్ కోరిన విజయ్
- ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశం
- ఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖ
- రేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?
ఒకటి తక్కువైంది!
- ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్
- తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళం
- మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరం
- విజయ్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
- విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలు
- రెండు కలిపినా.. 9 స్థానాలే
- ప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ



