తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌ | TVK Vijay Tamil Nadu Govenment Formation Live Updates | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌

May 8 2026 9:43 AM | Updated on May 8 2026 9:22 PM

TVK Vijay Tamil Nadu Govenment Formation Live Updates

టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్‌, వీసీకే మద్దతుతో విజయ్‌కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్‌ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం  తెలిపింది. ఈ  నేపథ్యంలో గవర్నర్‌ను విజయ్‌ మరోసారి కలిశారు. తమకు పూర్తి   సంఖ్యాబలం ఉందన్న విజయ్‌.. అందుకు సంబంధించిన మద్దతు  పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్‌ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 

విజయ్‌ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధం

  • లోక్‌భవన్‌ కొత్త మెలిక
  • విజయ్‌కు 116  మంది  ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్‌భవన్‌
  • వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్‌భవన్‌
  • తద్వారా విజయ్‌ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్‌ వాతావారణం

రేపే విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం 

  • రేపు ఉదయం 11గంటలకు విజయ్‌ ప్రమాణ స్వీకారం
  • రేపే తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం 
  • నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి

  • తమిళనాడు గవర్నర్‌తో ముగిసిన టీవీకే చీఫ్‌ భేటీ 
  • ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్‌ అనుమతి 
  • తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్‌ సర్కార్‌

గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్‌ భేటీ 

  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్‌ 

  • మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేత 

లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్‌ 

  • లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్‌ 
  • ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్‌ 
  • సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలం
  • లోక్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్‌
  • గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్‌ 
  • ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత  

విజయ్‌ కోసం కాన్వాయ్‌ సిద్ధం

  • లోక్‌భవన్‌కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్‌
  • మొన్న విజయ్‌కు కాన్వాయ్‌ ఇవ్వడంపై గవర్నర్‌ ఆగ్రహం
  • మద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్‌లో వెళ్లనున్న విజయ్‌

టీవీకేకు కాంగ్రెస్‌ కండీషన్‌

  • మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్‌ షరతు
  • తిరుచ్చి ఈస్ట్‌ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్‌
  • టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయం
  • కేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయం

టీవీకేకు వామపక్షాల మద్దతు

  • మద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలు
  • వీసీకే, వామపక్షాలకు కేబినెట్‌ బెర్త్‌లు
  • వీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్‌
  • కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం

టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడి

  • మెజార్టీ మార్క్‌ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలు
  • చెన్నైలోని లెఫ్ట్‌ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్‌ కుమార్‌
  • మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్‌కుమార్‌
     

టీవీకే ప్రభుత్వ  ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

  • టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకే

  • ఫలితంగా  ప్రభుత్వ ఏర్పాటుకు  మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోనున్న టీవీకే

  • కాంగ్రెస్‌-5, వామపక్షాలు-4, వీసీకే-2

  • దాంతో  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న  టీవీకే సంఖ్యాబలం

  • కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్‌

 

 

మరోసారి గవర్నర్‌ను కలవనున్న విజయ్‌

  • మరికాసేపట్లో లోక్‌భవన్‌కు వెళ్లనున్న విజయ్‌
  • గవర్నర్‌తో భేటీకానున్న విజయ్‌ 
  • ఇదివరకే రెండుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్ 
  • ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్‌

ఇళంగోవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్‌ నేత ఇళంగోవన్‌
  • డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులు
  • ఈ రెండు కలవడం అసాధ్యం
  • ఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదు

లోక్‌భవన్‌.. మళ్లీ అదే ప్రకటన

  • మ్యాజిక్‌ ఫిగర్‌తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్‌భవన్‌ వర్గాల స్పష్టీకరణ

  • ఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ సమ్మతిస్తారని వెల్లడి

  • టీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్‌?

  • గవర్నర్‌ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్‌

  • అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్న

  • లోక్‌భవన్‌ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్‌

  • మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే 

  • ఆఖరి అస్త్రంగా.. గవర్నర్‌ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన 

  • న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్‌

మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకే

  • విదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటన

  • తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీ

  • ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకే

  • విజయ్‌ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్‌ కంటిన్యూ

  • వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌తో భేటీ అయిన టీవీకే నేత అధవ్‌ అర్జున

  • ఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్‌ సమావేశం

  • మీటింగ్‌లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్‌

ఇటు విజయ్‌.. అటు పళని

  • తమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులు

  • పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్‌

  • అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్‌ నేతల మీటింగ్‌

  • వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులు

  • ఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్‌ ప్రభుత్వం ఏర్పడినట్లే

  • మద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్‌

  • విజయ్‌కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠ

  • అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడా

  • డీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలు

  • సాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్‌కు తెర పడే చాన్స్‌

శత్రువులు మిత్రులవుతున్నారు

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాణిక్యం ఠాగూర్‌ సంచలన వ్యాఖ్యలు

  • డీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్య

  • శత్రువులు మిత్రులవుతున్నారు

  • విజయ్‌ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారు

  • డీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలు

తమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!

  • తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్
  • డీఎంకే సపోర్ట్‌తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?
  • అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?
  • రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్
  • రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనా
  • ఎడపాటి పళనిస్వామిని స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం
  • మొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..
  • నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలు‌
  • నేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలు

టీవీకే కీలక భేటీ

  • టీవీకే అధినేత విజయ్‌ నేతృత్వంలో కీలక సమావేశం
  • సమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
  • ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చ
  • దేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపు

అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుంది

  • అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలు

  • తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు: తంబిదురై

  • మేం అధికారంలోకి వస్తాం: తంబిదురై

చెన్నైలో ఉద్రిక్తత!

  • తమిళనాడు గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ తీరుపై టీవీకే అసహనం

  • ప్రజలు విజయ్‌కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణ

  • లోక్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలు

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • లోక్‌భవన్‌తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం

పళని ఏం చేస్తారో?

  • తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

  • నేడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీ

  • నిన్ననే అపాయింట్‌మెంట్‌ కోరిన అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ

  • ఇవాళ్టి మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ

  • విజయ్‌ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలిక

  • బీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్‌కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గం

  • వద్దని వారిస్తున్న పళనిస్వామి

  • అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామి

  • ఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకే

  • తమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశం

  • విజయ్‌కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠ

తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టత

  • మ్యాజిక్‌ ఫిగర్‌ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్‌ 5)

  • కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయం

  • తలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలు

  • స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్‌ సూచన

  • ప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్‌ వ్యాఖ్య

  • ఇవాళ మూడు పార్టీల హైలెవల్‌ మీటింగ్‌లు

  • మీటింగ్‌ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టత

  • ఇప్పటికే కమ్యూనిస్ట్‌ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన విజయ్‌

  • సానుకూలంగా స్పందించిన సీపీఐ!

  • సాయంత్రం కల్లా రానున్న స్పష్టత

  • 118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ స్పష్టీకరణ

ఏం చేద్దాం?

  • తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే

  • 108 స్థానాలతో లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన టీవీకే

  • ప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరం

  • కాంగ్రెస్‌ మద్దతుతో కాస్త పెరిగిన బలం

  • అయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్‌

  • 113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణ

  • రెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానం

  • న్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్‌కు గవర్నర్‌ సమాధానం

  • నెంబర్‌ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్య

  • రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్‌

  • మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలు

  • మద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టత

సంబంధిత వార్త: విజయ్‌కి షాక్‌.. గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

నేడు లోక్‌భవన్‌ ముట్టడి

  • టీవీకే విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ నో
  • గవర్నర్‌ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
  • విజయ్‌కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌
  • గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తి
  • గవర్నర్‌ తీరుకు నిరసనగా నేడు లోక్‌భవన్‌ ముట్టడికి పిలుపు
  • చెన్నైలోని లోక్‌భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఆ మూడు ముందుకు వస్తేనే.. 

  • లెఫ్ట్‌ పార్టీల మద్దతు కోసం విజయ్‌ తీవ్ర ప్రయత్నం
  • విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)
  • ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టత
  • మరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)
  • నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలు
  • వీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠ
  • నేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్‌
  • ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్‌ సర్కార్‌కు లైన్‌ క్లియర్‌

ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించను

  • తమిళ రాజకీయాలపై నటుడు విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌
  • ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్‌లో పోస్ట్‌
  • డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారం
  • ప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకే
  • విజయ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్‌

 

తమిళనాడు సస్పెన్స్‌ కంటిన్యూస్‌

  • తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం
  • 108 స్థానాల్లో విజయ్‌ పార్టీ విజయం
  • మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 స్థానాలు తక్కువ
  • వామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్‌
  • మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలు
  • టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ససేమీరా
  • తొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు ప్రచారం
  • కాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారం
  • డీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు
  • తమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ

Advertisement
 
Advertisement
Advertisement