‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ | KCR Jagtial Public Meeting LIVE Updates | Sakshi
Sakshi News home page

‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’

Apr 20 2026 5:09 PM | Updated on Apr 20 2026 8:34 PM

KCR Jagtial Public Meeting LIVE Updates

సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగం 

  •  జీవన్‌ రెడ్డి గుండె ధైర్యమున్నోడు

  • 40ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి,నేను స్నేహితులం  

  • భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాం

  • తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ కోసం బీఆర్‌ఎస్‌లో చేశారు

  • జగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు

  • ఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారు

  • తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌ రెడ్డి ఏదైనా చేస్తారు

  • జీవన్‌ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శం

  • పదవులు జీవన్‌రెడ్డికి కొత్తకాదు

  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి నియామకం

  • సభలో ప్రకటించిన కేసీఆర్‌

  • ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి చెప్పా

  • మేం అధికారంలోకి రాగానే జీవన్‌రెడ్డికి మంచి పదవి కల్పిస్తా

  • కరీంనగర్‌ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డి పని చేయాలి

  • తెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేది

  • ఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్‌ ఛార్జీలు పెంచారు

  • ఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారు

  • పక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడింది

  • తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో అని ముందుకు సాగాం

  • ఐదేళ్లలో మిషన్‌ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాం

  • పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు

  • మా హాయంలో మిషన్‌ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదు

  • నూటి నూరుశాతం మళ్లీ బీఆర్‌ఎస్సే వస్తుంది

  • జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు

  • జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్

  • ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

  • వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రు

  • చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా

  • తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా

  • బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను

  • రోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడు

  • ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా

  • చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు

  • వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం

  • బిహార్‌లో  పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్‌ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం

  • మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం

  • మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్‌. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్‌.  40 మంది అనుచరులతో పాటు బీఆర్‌ఎస్‌లో చేరారు జీవన్‌రెడ్డి. 

ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రస్థానానికి జీవన్‌రెడ్డి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్‌పై అసంతృప్తిలో బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారు జీవన్‌రెడ్డి.  జీవన్‌ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్‌ఎస్‌లో చేరికతో అధికార కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. కేసీఆర్‌ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్‌ కాలేజ్‌ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement