రామంతాపూర్: నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విద్యా శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ..


ఈ పాఠశాలలో తాగునీటి సమస్య మధ్యాహ్నం భోజనం, వంట గదితో పాటు ఇతర మౌలిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్కూల్ ఆవరణలో బోరు పంపు ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్‌లో నెలకొన్న పలు సమస్యలపై హెచ్‌ఎం లత ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహ్మద్ రఫీక్, శ్రీకాంత్ యాదవ్, ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



