కర్ణాటకాలో మరోసారి సీఎం వార్‌..? శివకుమార్ ఏమన్నారంటే | chief minister dks poster emerges karnataka support dk shivakumar | Sakshi
Sakshi News home page

కర్ణాటకాలో మరోసారి సీఎం వార్‌..? శివకుమార్ ఏమన్నారంటే

May 13 2026 7:23 PM | Updated on May 13 2026 7:23 PM

 chief minister dks poster emerges karnataka support dk shivakumar

బెంగళూరు: కర్ణాటకాలో మరోసారి ముఖ్యమంత్రి వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అందులో డీకే శివకుమారా్ ముఖ్యమంత్రి కావాలని ఉండడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

2023 మే 13న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ  135 స్థానాలు గెలిచి అధికారం సాధించింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం జరిగిందని ఫుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పెద్దఎత్తున కోల్డ్‌ వార్‌ నడిచింది. అధిష్టానం ఎంట్రీ ఇచ్చి ఇరునేతల మధ్య సయోధ్య కుదర్చడంతో ఎట్టకేలకు పరిస్థితులు సద్దుమణిగాయి.

అయితే తాజాగా మరోసారి ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మే 15న డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి రచ్చలేపుతోంది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు జరగనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే అధికార మార్పు అంశమై గత నెలలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సీఎం మార్పు అంశం జరుగుతుందన్న నిర్ణయం పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ విషయమై ఇప్పుడు చర్చలేవి లేవని హైకమాండ్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement