ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల | RTC driver attempts to end his life at warangal Narsampet depot | Sakshi
Sakshi News home page

‘వెంటిలేటర్‌పై చికిత్స’.. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Apr 23 2026 4:09 PM | Updated on Apr 24 2026 1:30 PM

RTC driver attempts to end his life at warangal Narsampet depot

సాక్షి, వరంగల్‌: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్‌ ఎంజీఎం వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్‌ఎం డాక్టర్‌ అశ్విన్‌ తెలిపారు.  

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్‌ శంకర్‌కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు.  ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.   

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement