ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్‌లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్‌కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!
ఉన్నావ్ కేసు.. సెంగర్‌కు షాక్ తప్పదా?
ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం.. దీనిని నిరసిస్తూనే ప్రాణభయంతో బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం.. అందుకు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేయడం.. యోగి ప్రభుత్వ నుంచి కనీస స్పందన లేకపోవడం.. బాధితుల సోనియా-రాహుల్ గాంధీలను కలవడంతో రాజకీయ రగడ నెలకొంది. ఈ తరుణంలో.. న్యూఢిల్లీ: ఉన్నావ్ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంగర్ బెయిల్‌ను సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టును సమీక్షించిన తర్వాత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం వద్ద బలవన్మరణం కోసం ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. ఈలోపు.. ఆమె తండ్రి హత్యకు గురికాగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది కూడా. ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు జీవితఖైదు విధించింది. అయితే.. తాజాగా(డిసెంబర్ 23, 2025) మంగళవారం ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. అధికారం ఉన్న వ్యక్తి లైంగిక దాడి చేస్తే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెంగార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారి కిందకు రారని.. కాబట్టి ఆయపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్-5 వర్తించదని ఢిల్లీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఆ చట్టంలోని సెక్షన్ 4 మాత్రమే ఆయనకు వర్తిస్తుందని పేర్కొంది.ఈ తీర్పును బాధితురాలి కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది. సెంగార్ బయటకు రావడం అంటే.. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. అయితే ఇప్పుడు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. ‘‘ దారుణోదంతానికి ఒడిగట్టి దోషిగా తేలిన వ్యక్తికి హైకోర్టు మళ్లీ బెయిల్ మంజూరుచేయడమేంటి? ఇది నా కుటుంబానికి మరణశాసనం రాయడమే. బెయిల్ రద్దు డిమాండ్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా’’ అని ఆమె అన్నారు. బెయిల్‌ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితోపాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియాగేట్ సమీప మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికీ గాయాలయ్యాయని యోగిత చెప్పారు. ‘‘దోషికి ఇలాగే బెయిల్ ఇస్తూ పోతే దేశంలోని ఆడబిడ్డలకు రక్షణ అనేదిఉంటుందా? మా విషయంలో మాత్రం ఈ తీర్పు మరణశాసనమే. న్యాయం పొందటంలో ధనికులు లాభపడతారు. మాలాంటి పేదలు ఓడిపోతారు. తీర్పు తర్వాత మమ్మల్ని లాయర్లతోనూ కలవనివ్వట్లేరు. వాళ్లను కలిసేందుకు వెళ్తుంటే సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుని తిరిగి ఇంటికి పంపేస్తున్నారు. నా కుటుంబసభ్యులు, లాయర్లు, సాక్షులకు గతంలో ఇచి్చన పోలీస్భద్రతనూ ఉపసంహరించారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కువైంది. మా గతేంటి? దోషిని బెయిల్‌పై విడుదలచేస్తే మమ్మల్ని అయినా జైలుకు పంపండి. అతడి మిగతా జైలుశిక్షను నేను అనుభవిస్తా. అక్కడయినా క్షేమంగా ఉంటాం. సరైన ఉపాధి లేదు. అక్కడయినా తినడానికి తిండి దొరుకుతుందేమో’’ :::ఉన్నావ్ బాధితురాలి ఆవేదనసోనియా, రాహుల్‌లతో భేటీ ధర్నా తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి 10, జన్‌పథ్‌లోని సోనియాగాంధీ అధికారిక నివాసంలో సోనియా, రాహుల్‌గాంధీలను కలిశారు. నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో నేరాన్ని నిరూపించి దోషిని బోనులో నిలబెట్టేలా అత్యంత ప్రతిభావంతులైన లాయర్ల బృందాన్ని ఇవ్వాలని ఆమె ఇరునేతలను కోరారు. పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఇరునేతలు బాధిత కుటంబానికి హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ‘‘ న్యాయం కోసం పోరాడుతున్నా. ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకున్నా. న్యాయపోరాటం చేస్తున్నందుకు రాహుల్ అభినందించారు’’ అని బాధితురాలు తర్వాత మీడియాతో చెప్పారు. ‘‘ అమలవుతున్న యావజ్జీవ కారాగారశిక్షను హఠాత్తుగా నిలుపుదలచేసి బెయిల్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. రేపిస్ట్లు అందరూ ఇలాగే విడుదలవుతారనే భయం ఇప్పుడు బాధితులందరి మనసుల్ని పురుగులా తొలిచేస్తోంది. ఇదే ప్రభుత్వం? ఇదేం పాలన?’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిగ్గుచేటుఉన్నావ్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో దోషి కుల్దీప్ సెంగర్ జైలు నుంచి విడుదల కావడం దేశానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయం?. న్యాయం కోసం గొంతు వినిపించడానికి ధైర్యం చేయడమే ఆమె చేసి తప్పా?. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ ప్రాణభయంతో జీవిస్తుంటే దోషికి బెయిల్ మంజూరు చేయడం అత్యంత దారుణం. బెయిల్ రావడం చాలా నిరాశపరిచింది. ఇది సిగ్గుచేటు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థుల్లా చూడడం ఇదేం న్యాయం?. కేవలం ఒక మృత ఆర్థిక వ్యవస్థే కాదు ఇలాంటి అమానవీయ సంఘటనలతో మనం ఒక నిర్జీవ సమాజంగా విపరిణామం చెందుతున్నాం. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గళం వినిపించడం హక్కు. దానిని అణచివేయడం నేరం. బాధితురాలు గౌరవం, భద్రత, న్యాయం పొందాలి. కానీ నిస్సహాయత, భయం, అన్యాయం కాదు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
తారిక్ రెహమాన్ రాక.. కుతకుతలాడుతున్న బంగ్లాదేశ్!
రాడికల్ లీడర్ షరీఫ్ ఒస్మాన్ హదీ హత్య.. తదనంతర చోటుచేసుకున్న పరిణామాలతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం రాజధాని ఢాకాలో జరిగిన పెట్రోల్ బాంబ్ దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నడుమే.. తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిక్ రెహమాన్ (60) గురువారం స్వదేశంలో అడుగుపెట్టబోతున్నాడు. దాదాపు 17 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. సుమారు 50 లక్షల మంది ఈ గ్రాండ్ వెల్కమ్లో పాల్గొంటారని అంచనా వేస్తోంది ఆ పార్టీ. మరోవైపు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.అంతకుముందు.. లండన్ హీథ్రో ఎయిర్పోర్ట్ నుంచి తారిక్ బయల్దేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తారిక్ భార్య జుబైదా రెహమాన్, కూతురు జైమా రెహమాన్ ఉన్నారు. నా మాతృభూమికి వెళ్తున్నా అంటూ జైమా తీసిన సెల్ఫీ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోగా సైతం వైరల్ అవుతోంది.বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV— Masud Rana (@MasudRana137969) December 24, 2025బంగ్లాదేశ్ రాజకీయాలలో 'క్రౌన్ ప్రిన్స్'గా పేరున్న తారిక్ పునరాగమనం బీఎన్పీ కేడర్‌లోకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సమయంలో.. ఓటర్లకు మంచి సందేశాన్ని కూడా పంపుతుందని ఆ పార్టీ భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మరికొద్ది నిమిషాల్లో ఆయన ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్పీ అధినాయకురాలు ఖలీదా జియా కుమారుడే తారిక్ రెహమాన్. ఖాలిదా ప్రస్తుతం పలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ ఢాకాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనపై గతంలో కేసులు నమోదయ్యాయి. అందుకే ఇన్నేళ్లుగా ఆయన స్వదేశానికి తిరిగి రాలేదు. డిసెంబర్ 16న లండన్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ.. 2026లో జరగనున్న జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.పసిప్రాయంలో జైలుకు!తారిక్ రెహమాన్.. మాజీ అధ్యక్షుడు జియా-ఉర్-రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దోడు. 1965 నవంబర్ 20న జన్మించాడు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో.. తారిక్ రెహమాన్‌ను ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆయన వయసు ఆరేళ్లు!. కాలం గడిచేకొద్దీ, తారిక్ రెహమాన్ తన తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బీఎన్పీ జనరల్ సభ్యుడయ్యారు.ఆ సమయంలో ఆయన కింది స్థాయి కార్మికులను, మద్దతుదారులను సమీకరించి, హెచ్.ఎం. ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు. బీఎన్పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్-చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు.1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు, తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్‌ను 1993లో వివాహం చేసుకున్నాడు. 2004 ఆగస్ట్‌లో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఖలీదానే ప్రధానిగా ఉన్నారు. 2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్టు అయ్యారు. 2008లో ఆయనకి బెయిల్ వచ్చింది, చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి రెహమాన్ లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.రెహమాన్ రాక భారత్‌కు మంచిదే!బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 12న జరగనున్నాయి. దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి బీఎన్పీ బలమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో రెహమాన్ తిరిగి వస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో.. భారత్‌తోనూ బంగ్లా సంబంధాలు మెరుగుపడొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బీఎన్పీ పట్ల సానుకూల ధోరణితో లేదు. పైగా తారిక్ రాకను శాంతి భద్రతల విఘాతంగా అభివర్ణిస్తోంది. అదే సమయంలో.. మైనారిటీలపై వరస దాడులను కట్టడి చేయడంలో విఫలమవుతూ ఇటు భారత్‌తోనూ సంబంధాల్ని యూనస్ దిగజారుస్తున్నారు. ఈ తరుణంలో ఖలీదా జియా ఆరోగ్యం మెరుగుపడాలంటూ భారత ప్రధాని మోదీ ఆకాక్షించడం.. తదితర పరిణామాలు చర్చకు వచ్చాయి.ఆ ఒక్కటే మైనస్.. బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన రెహమాన్ ముందర కొన్ని సవాళ్లు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నా కూడా, బీఎన్పీ నాయకత్వం, పార్టీ మద్దతుదారులు ఆయనను ఉత్సాహంగా స్వాగతించారు. కానీ ఇన్నేళ్లు దేశానికి దూరంగా ఉన్న ఆయనకు ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండకపోవచ్చని ఆ పార్టీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాళ్లందరినీ ఒప్పించాల్సిన బాధ్యత ఆయన ముందు ఉంది. పైగా రెహమాన్ లండన్‌లో ఉన్నప్పుడు షేక్ హసీనా ప్రభుత్వ చర్యల వల్ల బీఎన్పీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఈ అసంతృప్తిని కూడా ఆయన చల్లార్చాల్సి ఉంటుంది. అయితే.. సెప్టెంబర్‌లో ఢాకా యూనివర్శిటీ క్యాంపస్ ఎన్నికల్లో బీఎన్పీ విద్యార్థి విభాగం విజయం సాధించింది. దీంతో.. ఈ ఎన్నికను బంగ్లాదేశ్‌లో రాజకీయ దిశను సూచించే ముఖ్యమైన సంకేతంగా అక్కడి విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇది రెహమాన్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో మాత్రం ఆయన చేతులు కలపొద్దని బీఎన్పీ శ్రేణులు బలంగా డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్‌లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్‌లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. లీప్ ఇయర్‌ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్‌నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్‌ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్‌ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్‌ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?)
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
చెక్ పవర్ తగ్గిందా?
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
Miyapur: భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త
సన్న బియ్యం అక్రమాలపై విజిలెన్స్ మూడోకన్ను
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
ఆకాశంలో ఇక ‘కొత్త విమానాలు’
GHMC: డీ లిమిటేషన్‌కు బ్రేక్
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
శంషాబాద్‌లో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
సాక్షి కార్టూన్ 23-12-2025
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
చెక్ పవర్ తగ్గిందా?
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
Miyapur: భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త
సన్న బియ్యం అక్రమాలపై విజిలెన్స్ మూడోకన్ను
టీడీపీకి తొత్తులుగా ఏపీ పోలీసులు: వరుదు కళ్యాణి
ఆకాశంలో ఇక ‘కొత్త విమానాలు’
GHMC: డీ లిమిటేషన్‌కు బ్రేక్
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
శంషాబాద్‌లో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
సాక్షి కార్టూన్ 23-12-2025
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
ఫొటోలు
కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)
శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
హైదరాబాద్‌లో ఘనంగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం (ఫొటోలు)
హైదరాబాద్ లో క్రిస్మస్ పండగ సందడి (ఫొటోలు)
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
సినిమా
ఈషా ప్రేక్షకులను వెంటాడుతుంది
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు నేడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన శ్రీవిష్ణు బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా ‘ఈషా’ టిక్కెట్ ధరలు అందరికీ అందు బాటులో (రూ. 99) ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు అంగీకార పత్రంపై సైన్ చేశాకే ‘ఈషా’ చూడాల్సి ఉంటుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘హారర్ సినిమా లవర్స్ మా ‘ఈషా’ని ఎంజాయ్ చేస్తారు’’ అని బన్నీ వాసు చెప్పారు. ‘‘ఈషా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శ్రీనివాస్ మన్నె, అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, నిర్మాత వెంకట్ పేర్కొన్నారు.
దేవిలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి
‘‘శంబాల’ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్ వస్తుంది. అన్ని రకాల భావోద్వేగాలను టచ్ చేస్తూ తీసిన ‘శంబాల’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ అర్చనా అయ్యర్ చెప్పారు. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అర్చనా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లా. అయితే ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులోనే జరిగింది. ‘శంబాల’లో నాది కేవలం స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. నా కెరీర్ ఆరంభంలోనే ‘శంబాల’ లాంటి చిత్రం, ఈ చిత్రంలో దేవిలాంటి పాత్ర చేయడం నా లక్‌గా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రలు కెరీర్లో మళ్లీ మళ్లీ రావు. ఒక్కసారే వస్తాయి. ‘శంబాల’ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది దర్శకులు ఫోన్ చేసి, నన్ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ మూవీ చేస్తున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లు చేస్తాను. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అని చెప్పారు.
యాక్షన్... థ్రిల్ షురూ
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘డార్క్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘రేజర్’. పాత్ర ఇంటెన్సిటీకి తగ్గట్టుగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో అలరించబోతున్నారు రవిబాబు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘రేజర్’ మూవీ రవిబాబు కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రయత్నంగా నిలుస్తుంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. 2026 వేసవిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
ధీరే... ధీరే
ధీరే... ధీరే అంటూ పాట అందుకున్నారు విశ్వక్ సేన్, కయాదు లోహర్. ఈ ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోని పాట ఇది. సినిమాలో వచ్చే ఈ తొలి పాటను బుధవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘ఫంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ పాటలో విశ్వక్–కయాదుల జోడీ, పాటలోని కొత్తదనం యువతకు చేరువయ్యేలా ఉంటుంది’’ అని తాజాగా విడుదల చేసిన ‘ధీరే... ధీరే’ పాట గురించి యూనిట్ పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం అలరించే హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుందని, ‘ఫంకీ’ అనేది ప్రేక్షకులకు ఓ మంచి వినోదాల విందు అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
క్రీడలు
వివాహబంధంలో వీనస్
ఫ్లోరిడా: అమెరికా సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ వరల్డ్ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ 45వ ఏట పెళ్లి చేసుకుంది. ఇటలీకి చెందిన నటుడు, మోడల్ ఆండ్రియా ప్రెటీని ఆమె వివాహమాడింది. దాదాపు ఏడాదిన్నరగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలైలో ఇద్దరి మధ్య నిశ్చితార్ధం జరిగింది. నిజానికి సెపె్టంబర్‌లోనే వీనస్, ప్రెటీ ఇటలీలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీనస్ విదేశీయురాలు కావడం ఈ పెళ్లికి ప్రభుత్వం తరఫున అధికారిక ముద్ర పొందేందుకు కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. దాంతో తన స్వస్థలం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో వీనస్ మళ్లీ పెళ్లి తంతువును నిర్వహించింది. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. సోదరి సెరెనా విలియమ్సన్ కానుకగా ఇచ్చిన ‘యాట్’పైనే ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగడం విశేషం. మహిళల సింగిల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న వీనస్ విలియమ్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి మరో 16 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. ఇటీవలే వాషింగ్టన్ డీసీ ఓపెన్‌ను గెలుచుకున్న వీనస్ టూర్ టైటిల్ సాధించిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా నిలిచింది.
క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్ బోర్డు
మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే 0–3తో కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్‌కు వెళ్లిన ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ప్రకటించారు. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా ఎక్కువగా తాగేసిన అతను దారి తప్పినట్లుగా ఇందులో కనిపిస్తోంది. తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఒక మహిళ ప్రశ్నించగా ‘తెలీదు’ అంటూ డకెట్ జవాబిచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్ బెెతెల్ క్లబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండో టెస్టులో పరాజయం తర్వాత మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాలుగు రోజుల పాటు ఈ రిసార్ట్ ప్రణాళికను రూపొందించాడు. ఈ సెలవు తర్వాత జట్టుపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ మూడో టెస్టులో ఓడి యాషెస్ కోల్పోవడంతో వారి షికారుపై చర్చ మొదలైంది. రిసార్ట్‌లో అంతా బాగా ప్రవర్తించారు అంటూ మొదట్లో ప్రకటించిన రాబ్ కీ...కారణాలు ఏమైనా అంతర్జాతీయ క్రికెటర్లు పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పాడు. యాషెస్ ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్ మొత్తం 97 పరుగులే చేశాడు. 2017లో ఆ్రస్టేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా సీనియర్ ప్లేయర్ జిమ్మీ అండర్సన్‌పై మద్యం ఒలకబోయడంతో డకెట్‌ను సస్పెండ్ చేసిన ఈసీబీ వెంటనే స్వదేశానికి పంపించేసింది. ఆర్చర్ అవుట్... యాషెస్ కోల్పోయి మిగతా మ్యాచ్‌లలో పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుపై మరో దెబ్బ పడింది. టీమ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల గాయంతో సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్కు చోటు దక్కింది. ప్రధాన బ్యాటర్ ఒలీ పోప్‌పై కూడా ఈ మ్యాచ్‌లో వేటు పడింది. తాజా యాషెస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 125 పరుగులే చేసిన పోప్ గత 16 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. పోప్ స్థానంలో జాకబ్ బెతెల్‌ను టీమ్‌లోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తరఫున బెతెల్ ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడాడు.
సూర్య చరిష్మా ముందంజ
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సూర్య చరిష్మా 21–11, 21–14తో శ్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలిచింది. తెలంగాణకు చెందిన వెన్నెల తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... మేఘన రెడ్డి ముందంజ వేసింది. వెన్నెల 17–21, 14–21తో ఆదర్శిని శ్రీ (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. మేఘన రెడ్డి 19–21, 21–17, 21–18తో పూర్వా భర్వే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తనిష్‌్క, సాయి ఉత్తేజిత రావు, నవ్య కందేరి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. తని‹Ù్క 15–21, 5–21తో ఇషారాణి బారువా (అస్సాం) చేతిలో, సాయి ఉత్తేజిత 15–21, 12–21తో దీప్షిక సింగ్ చేతిలో, నవ్య 13–21, 21–18, 14–21తో డియాంక వాల్దియా చేతిలో ఓడిపోయారు.
బుమ్రా, పంత్ క్షమాపణ చెప్పారు
జొహన్నెస్‌బర్గ్: భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో తన ఎత్తు విషయంలో ఎదుర్కొన్న వ్యాఖ్య గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్ బుమ్రా, కీపర్ రిషభ్ పంత్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ విషయంలో చర్చించుకుంటూ బవుమా గురించి ‘మరుగుజ్జు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత వివాదం రేగింది. అయితే ఆ తర్వాత వారిద్దరు తనకు క్షమాపణలు చెప్పారని బవుమా స్పష్టం చేశాడు. నిజానికి ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో కూడా తనకు తెలీదని అతను వెల్లడించాడు. ‘నిజానికి బుమ్రా, పంత్ నన్ను క్షమాపణలు కోరినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాలేదు. మా మీడియా మేనేజర్‌ను అడిగి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. వారి భాషలో నా గురించి ఏదోలా మాట్లాడుకున్నారని అర్థమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత నా వద్దకు వచ్చి వారు సారీ చెప్పారు. మైదానంలో జరిగిన విషయాలు అక్కడే ముగిసిపోతాయి. కానీ ఏం అన్నారో మర్చిపోలేం కదా. అవి మరింత బాగా ఆడేందుకు ప్రేరణ అందిస్తాయి. అయితే నాకు ఎలాంటి విద్వేషభావం లేదు’ అని బవుమా వివరించాడు. మరోవైపు గువాహటిలో జరిగిన రెండో టెస్టు సమయంలో భారత ఆటగాళ్లను ‘మోకాళ్లపై కూర్చోబెడతాను’ అంటూ దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ అనడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంలో షుక్రిని తప్పుబట్టిన బవుమా... అతను మరింత మెరుగైన భాషను వాడాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత గడ్డపై కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించానని...వాటిని అధిగమించి 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం చాలా గొప్పగా అనిపించిందని బవుమా తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
బిజినెస్
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్‌కు ప్రేరణనివ్వడం ద్వారా వచ్చే బడ్జెట్ (2026–27) వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని ఈవై ఎకానమీ వాచ్ తన అంచనా వ్యక్తం చేసింది. వృద్ధికి అనుకూలమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని సానుకూలంగా పేర్కొంది. ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్టీ సంస్కరణలతో కొంత ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నప్పటికీ.. పన్నేతర ఆదాయం కింద బడ్జెట్లో పేర్కొనని అదనపు ఆదాయం, బడ్జెట్లో ప్రకటించిన కొన్ని రకాల వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు, మూలధన వ్యయాల లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేసింది.ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఇటీవలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, జాతీయ భద్రతా, ప్రజారోగ్యం సెస్సులను ప్రస్తావించింది. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై సెస్సును అమలు చేసే రెండు చట్టాలకు పార్లమెంట్ ఇటీవలే ఆమోదించడం తెలిసిందే. ‘‘ఇక ముందూ భారత్ వృద్ధికి మద్దతుగా దేశీ డిమాండ్‌పైనే ఆధారపడడం కొనసాగొచ్చు. దీనికితోడు ఆర్బీఐ వృద్ధి ఆధారిత విధానంతో 2026–27 బడ్జెట్ వృద్ధికి మద్దతుగా ఉంటుందని అంచనా వేయొచ్చు’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు.అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వాస్తవ జీడీపీ వృద్ధికి ఎగుమతుల రూపంలో సమకూరేది ప్రతికూలంగా ఉండొచ్చని ఈవై ఎకా నమీ వాచ్ పేర్కొంది. రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధి (సెప్టెంబర్ క్వార్టర్)లో ఎగుమతుల వాటా మైనస్ 2.1 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. జూన్ త్రైమాసికంలో ఇది మైనస్ 1.4 శాతంగా ఉందని, అక్క డి నుంచి పెరిగినట్టు తెలిపింది. వాణిజ్య అనిశి్చతులు సమసిపోయే వర కు ఇదే పరిస్థితి కొనసొ గొచ్చని అంచనా వేసింది. భారత్ మధ్య కాలానికి 6.5% వృద్ధిని కొనసాగించొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు డీలా..!
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోలి్చతే 16 శాతం తక్కువ అని తెలిపింది. 2021 జూలై–సెపె్టంబర్ త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ విక్రయాలు మళ్లీ ఇదేనని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న విక్రయ గణాంకాల ఆధారంగా డిసెంబర్ త్రైమాసికంపై తన అంచనాలతో ఒక నివేదికను విడుదల చేసింది. నవీ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ మినహా మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గినట్టు తెలిపింది. ఆయా నగరాల్లోని ప్రధాన నివాస ప్రాంతాలకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రాప్ ఈక్విటీ ఈ అంచనాలు రూపొందించింది. ‘‘సంప్రదాయంగా అక్టోబర్–డిసెంబర్లో అమ్మకాలు బలంగా ఉంటుంటాయి. పండుగల సీజన్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కనిపిస్తుంటాయి. ఇటీవలి అమ్మకాల క్షీణత అన్నది మార్కెట్లో ప్రీమియమైజేషన్‌ను సూచిస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గినప్పటికీ విలువలో వృద్ధి కనిపిస్తోంది’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీ అంచనాలు.. → హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చు. → చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చు. → బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఒక శాతం తక్కువ. → కోల్‌కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయి. → పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయి. → థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయి. → నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయి. → ఇక ఈ నగరాల్లో కొత్త ఇళ్ల యూనిట్ల సరఫరా సైతం 10 శాతం తగ్గి 88,427 యూనిట్లుగా ఉంటాయన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా.
లిస్టింగ్‌పై 3 కంపెనీల కన్ను
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆటుపోట్లను చవిచూస్తుంటే మరోవైపు ఈ కేలండర్ ఏడాది(2025) అధిక ఇష్యూలు, అత్యధిక నిధుల సమీకరణతో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు తెరతీశాయి. ఈ బాటలో ప్రైమరీ మార్కెట్లు ఏడాది చివరిలోనూ సందడి చేస్తున్నాయి. తాజాగా 3 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ తాజాగా లిస్ట్‌కాగా.. ఈ వారం గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీసహా.. 4 ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు ప్రైమరీ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ జాబితాలో ధారివాల్ బిల్డ్‌టెక్, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, బీఎల్ఎస్ పాలిమర్స్ చేరాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఈ సంస్థలన్నీ ఐపీవో ద్వారా కొత్తగా ఈక్విటీ జారీతో నిధుల సమీకరణను చేపట్టనున్నాయి. ఐపీవో తదుపరి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ధారివాల్ బిల్డ్‌టెక్ రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 203 కోట్లు నిర్మాణ రంగ పరికరాల కొనుగోలుకి, రూ. 174 కోట్లు ముందస్తు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, పీఎంజీఎస్‌వై రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు నిర్మించే కంపెనీ రైల్వే, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. క్లౌడ్ ఇన్ఫ్రా సేవలు క్లౌడ్, మేనేజ్డ్ సర్వీసుల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుతోపాటు డేటా సెంటర్ల మౌలికసదుపాయాల ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్ ఆధారిత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సర్వీసులు, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందిస్తోంది. కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అవసరాలకుతగిన(కస్టమ్) పాలిమర్ కాంపౌండ్స్ రూపొందించే బీఎల్ఎస్ పాలిమర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీక రించిన నిధుల్లో రూ. 70 కోట్లు కొన్ని ప్రొడక్టుల తయారీ సౌకర్యాల విస్తరణకు, రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ టెలికం, విద్యుత్, రైల్వే, చమురు–గ్యాస్ తదితర రంగాలకు కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అందిస్తోంది. సెబీకి టన్బో ఇంజినీరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు గ్లోబల్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ ప్రధాన కంపెనీ(ఓఈఎం) టన్బో ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1,80,85,246 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. అయితే కొత్తగా ఈక్విటీ జారీ చేయబోదు. 2003లో ఏర్పాటైన కంపెనీ తొలిదశలో యూఎస్ రక్షణ శాఖ, సర్నాఫ్ కార్పొరేషన్‌తో కలసి పనిచేసింది. ఆపై 2012లో ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధానంగా సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్ సిస్టమ్స్‌ను రూపొందిస్తోంది. విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మల్టీసెన్సార్ ఇమేజింగ్ టెక్నాలజీలతోకూడిన టాక్టికల్, ప్లాట్‌ఫామ్ సిస్టమ్స్ తయారు చేస్తోంది. ప్రపంచస్థాయిలో రక్షణ రంగ దళాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. 2025 సెపె్టంబర్30కల్లా దాదాపు రూ. 267 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గత రెండు నెలల్లోనూ రూ. 72 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది.
హయర్ ఇండియాలో భారతీకి వాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం దేశీ యూనిట్ హయర్ ఇండియాలో డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యూహాత్మక పెట్టుబడులకు తెరతీస్తోంది. యూఎస్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌తో కలసి 49 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించçప్పటికీ 2 బిలియన్ డాలర్లు(రూ. 17,956 కోట్లు) వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. చైనీస్ హయర్ గ్రూప్ అనుబంధ సంస్థ హయర్ ఇండియాలో వార్‌బర్గ్‌తో కలసి వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా ఏసీలు, టీవీల తయారీ దిగ్గజంలో సంయుక్తంగా 49 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. హయర్ గ్రూప్ యాజమాన్యం 49 శాతం వాటాను అట్టిపెట్టుకుంటుందని.. మిగిలిన 2% వాటా సంస్థ మేనేజ్మెంట్ టీమ్ చేతిలో ఉంటుందని వివరించింది. హయర్ ఇండియా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్‌సహా పలు కిచెన్ అప్లయెన్సెస్ తయారు చేసే సంగతి తెలిసిందే. కంపెనీలో వాటా కొనుగోలుకి సజ్జన్ జిందాల్ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ, ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపడినట్లు తెలుస్తోంది. హయర్ ఇండియా విజన్.. మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియాకు తాజా భాగస్వామ్యం దన్నునిస్తుందని భారతీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. స్థానిక ప్రాధాన్యత, తయారీ సామర్థ్య విస్తరణ, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. తద్వారా మార్కెట్లో మరింత లోతుగా విస్తరించనున్నట్లు అభిప్రాయపడింది.
ఫ్యామిలీ
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్‌లో "ఇవాళ ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్‌తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్‌గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్‌గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్‌గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..)
60లో కూడా సల్మాన్‌లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్‌కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్‌గా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్‌వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..
క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..
చాలామంది విద్యార్థులు మంచి యూనివర్సిటీ డిగ్రీ, పీజీలు చేశాక ఉద్యోగ వేటలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అప్పుడే తెలుస్తుంది ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదని. అచ్చం అలాంటి పరిస్థితిని ఎదర్కోని ఎన్నో చిన్న చితకా ఉద్యోగాలతో విసిగివేసారి.. చివరికి లక్షల కోట్లు విలువ చేసే కంపెనీకి సీఈవో రేంజ్‌కి ఎదిగాడు గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లా సీఈవో డేవిడ్ బస్జుకి. పైగా విద్యార్థులకు తనలా చేయొద్దంటూ తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు కూడా. మరి అతడు ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో సవివరంగా చూద్దామా..!స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన 62 ఏళ్ల డేవిడ్ బస్జు అక్కడ విద్యార్థులతో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా గందరగోళానికి గురయ్యానని, పలు ఉద్యోగాల ఇంటర్వ్యూలో రిజెక్షన్లు, దాంతో తన అర్హతకు సరిపడని ఏవేవో ఉద్యోగాలు చేసి చాలా నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యానంటూ వివరించాడు. చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారని అన్నారడు. ఎందుకంటే సరిగ్గా మనం వచ్చేటప్పటికే ఉద్యోగ మార్కెట్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టాసాధ్యమైన విషయంగా మారిపోతుందన్నారు. అలాగే ఆ సమయంలో మనకు సలహాలిచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోతారు, పైగా అవి వినబుద్ధి కూడా కాదని అన్నారు. ఆ కష్టకాలంలో తాను తన అంతరదృష్టిపై ఫోకస్ పెట్టి అస్సలు తానేం చేయాలనుకుంటున్నాడు, ఏదైతే తన కెరీర్ బాగుంటుంది అనే వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించేవాడని చెప్పారు. తన అంతరంగా చెబుతున్నదాన్ని, ఇష్టపడుతున్నదాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేశానని, అలాగే తాను అంతకుముందు చేసిన చెత్త ఉద్యోగాలతో పొందిన అనుభవం కూడా దీనికి హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్టాన్ఫోర్డ్ విద్యార్థిని అన్న పేరు..మంచి కెరీర్‌ని సంపాదించుకోవడానికి హెల్ప్ అవ్వలేదని అంటాడు ఈ టెక్ దిగ్గజం డేవిడ్. ఎందుకంటే కాలేజ్ చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా స్థంభించిపోయినట్లు అయిపోయిందంటూ నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన డ్రీమ్ జాబ్ సంపాదించలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావని వాపోయాడు. చివరికి ఆ కష్ట సమయంలో సమ్మర్ టైంలో తన సోదరులతో కలిసి కిటికీలు శుభ్రంచేసే పనికి సైతం వెళ్లినట్లు తెలిపాడు. ఈ చిన్ని చిన్ని ఉద్యగాలుచేయలేక సతమతమవుతున్న తరుణంలోను తన అంతరంగం చెబుతున్న దానివైపు మళ్లాడానికి చాలా ధైర్యం కావలి కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో తిరస్కరణలు చూశాక..అస్సలు మనపై మనకు నమ్మకం ఉండదు. కానీ సక్సెస్ కావాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయకుడదు, అలాగే నీ సామర్థ్యంపై నమ్మకం సడలకూడదు. అప్పుడే విజయం ఒడిలోకి వచ్చివాలుతుందని అంటాడు డేవిడ్. అంతేగాదు తన మనసు ఏకంగా తొమ్మిది రకాల కెరీర్ ఆప్షన్లు ఇచ్చిందని, అయితే వాటిలో ఏది బెటర్, ఏది మంచిది కాదు అని అంచనా వేసుకుంటూ..కెరీర్‌ని నిర్మించుకున్నానని చెప్పాడు. అలా సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువచేసే గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లాక్స్కి నాయకత్వం వహించే రేంజ్‌కి వచ్చానంటూ తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు డేవిడ్ ఏకంగా రూ. 4 వేల కోట్ల నికర విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్న కుభేరుడు కూడా.(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..)
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారు(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..)
అంతర్జాతీయం
రష్యా పెను సంచలనం
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాము చేపడుతోన్న లూనార్ ప్రొగ్రామ్‌తో పాటు రష్యా-చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రామ్‌కు విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని పేర్కొంది. అయితే, అది అణువిద్యుత్ కేంద్రమేనని వార్తలు వస్తున్నప్పటికీ.. రష్యా సంస్థ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.అంతరిక్ష పరిశోధనల్లో ముందున్న రష్యా.. తమ వ్యోమగామి యూరి గగారిన్‌ను 1961లోనే అంతరిక్షంలోకి పంపించింది. కానీ, కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాల కంటే కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల (2023 ఆగస్టులో) రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 జాబిల్లిపై అడుగుపెట్టడానికి ముందే కూలిపోయింది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ కూడా తీవ్ర పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే.
పెట్రోల్ బాంబ్ విసిరి.. ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు
క్రిస్మస్ పండుగ వేళ.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ హింస చెలరేగింది. బుధవారం స్థానిక మొఘ్‌బజార్ ఇంటర్సెక్షన్ వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సంగ్సాద్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన క్రూడ్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢాకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం 7:10 గంటల ప్రాంతంలో మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ నుండి బాంబును విసిరారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ఇంతకాలం ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకుడు తారిక్ రెహమాన్.. తాజాగా ఢాకాలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆయన రాక నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈలోపే ఆయన పర్యటనకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. మయమన్సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు మతవిద్వేష వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో మూకహత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు ఆందోళనలకు దారి తీయడంతో పాటు భారత్‌తో యూనస్ ప్రభుత్వానికి సంబంధాలను మరింత దెబ్బ తీసే విధంగా మార్చాయి. ఈలోపు డిసెంబర్ 22వ తేదీన మొతలేబ్ షిక్దర్ అనే మరో యువ నేతపై కాల్పులు జరిగాయి. తాజా పరిస్థితుల(ఢాకా బాంబ్ ఎటాక్) నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనా మరో దుశ్చర్య: ట్రావెల్ వ్లాగర్‌కి 15 గంటల నరకం, ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్‌ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ యూట్యూబ్‌లో బాధితుడు ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం తన బాధను పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇది ఎవరి ఒత్తిడిమీద పోస్ట్ చేసినవీడియో కాదనీ స్పష్టం చేశాడు. దీంతో ఇది వైరల్‌గామారింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక మహిళను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో దాదాపు 18 గంటలు నిర్బంధించిన ఘటన, తీవ్ర నిరసనలువ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.ఆన్లైన్లో ఆన్ రోడ్ ఇండియన్‌గా ప్రసిద్ధి చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిట్టల్ చైనాలో తనకెదురైన భయానక అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. చైనాలో గతంలో నిర్బంధించబడిన అరుణాచల్ ప్రదేశ్ పౌరుడికి సంఘీభావం తెలిపే వీడియోను పోస్ట్ చేయడంతోనే తనను చైనా అధికారులు దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించాడు. ఈ వీడియోపై యూట్యూబర్ క్షమాపణలు కూడా చెప్పాడు.నవంబర్ 16న మిట్టల్ చైనాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఎపుడు మామూలుగా ప్రశ్నలిడిగి, క్లియర్ చేసే అధికారులు ఈ సారి ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపివేసినట్లు మిట్టల్ చెప్పారు. పాస్‌పోర్ట్‌పై వార్నింగ్ స్టిక్కర్ అంటించి, ఆ తరువాత పలువురు విదేశీ పౌరులను ఉంచిన నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లారని తన సుదీర్ఘ వీడియోలో ఆరోపించాడు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌తో తనకున్న భావోద్వేగ సంబంధం మూడేళ్లు అక్కడ చదువుకోవడంతో ఏర్పడిందనీ , చైనాలో ఒక అరుణాచల్ పౌరుడిని నిర్బంధించారని విన్న తర్వాత తాను తీవ్రంగా ప్రభావితమై దాని గురించి మాట్లాడిన వీడియో తన నిర్బంధానికి కారణమైందన్నాడు.దాదాపు రెండు గంటల పాటు ఏ అధికారి కూడా అతనితో మాట్లాడలేదు. తరువాత, అతన్ని మరొక గదిలోకి తీసుకెళ్లారు, అక్కడ ఏవీ రికార్డ్ చేయకుండా ఉండటానికి ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్న అధికారులు తన ఐప్యాడ్‌ను పట్టించుకోలేదని తెలిపాడు. తన నిర్బంధంపై పదే పదే అడిగినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించమే కాదు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే కొద్దిగా నీళ్లిచ్చారు. అలా 12-13 గంటలయ్యేసరికి తనలో భయం మొదలైంది. దాదాపు 15 గంటల తర్వాత, ఒక చైనా అధికారి తిరిగి వచ్చి ప్రక్రియ పూర్తయిందని ,వెంటనే దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని హెచ్చరించారు. ఇక దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అతను చెప్పాడు. ఎట్టకేలకు తాను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by On Road Indian (@onroadindian) తానొక సాధారణ ట్రావెల్ వ్లాగర్ అని, తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, చైనాలో తన స్టార్టప్ రోజుల నుండి స్నేహితులు ఉన్నారని కూడా అన్నారు. "నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నేను అందర్నీ ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను. నాకు ఏ రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. తనకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేవని, అధికారులను రెచ్చగొట్టాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని మిట్టల్ వాపోయాడు. ఇది రాస్తున్నంతసేపు కూడా తాను ఏడుస్తూనే ఉన్నాని కూడా రాసుకొచ్చాడు.భారత - చైనా రాయబార కార్యాలయాలు తాను అనుభవించిన భయాన్ని అర్థం చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని మిట్టల్ అన్నారు. ఇదీ చదవండి: చిన్నారిపై పిట్‌బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియోకాగా గతంలో చైనాలో మహిళను నిర్బంధించిన ఘటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. భారతీయ వ్యక్తిని ఏకపక్షంగా నిర్బంధించడం తగదని హితవు చెప్పింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ "భారతదేశంలో అంతర్భాగం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చైనా ఎంత తిరస్కరించినా ఈ సత్యాన్ని మార్చలేమని కూడా స్పష్టం చేసింది. తాజా సంఘటనపై భారత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
చిన్నారిపై పిట్‌బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియో
పెట్ యానిమల్స్‌ని పెంచుకోవడమే కాదు.వాటిని సరియైన పద్ధతిల్లో నియంత్రించడం కూడా తెలిసి ఉండాలి యజమానులకు. మరీ ముఖ్యంగా పిట్ బుల్ లాంటి పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రమాదంలో పడతారు. ఫలితంగా యజమానులకు కూడా చట్టపరమైన తిప్పలు తప్పవు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు.న్యూయార్క్ వీధుల్లో ఒక పిట్ బుల్ ఒక పసిపిల్లవాడిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క క్షణం ఆ పసివాడి తల్లి గుండ్లో రైళ్లు పరుగెట్టిందింది. కానీ అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వారు స్పందించడంతో ఆ పసివాడికి ప్రాణా పాయం తప్పింది.A pit bull attacked a toddler on the streets of New York, but luckily a bystander was quick enough to choke the dog before it could do further harm the child.😳 pic.twitter.com/Yh6btEwVVm— Rain Drops Media (@Raindropsmedia1) December 23, 2025ట్విటర్లో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో ప్రకారం పిట్ బుల్ డాగ్ పిల్లవాడి కాలును గట్టిగా దొరకబుచ్చుకుంది. నలుగురు వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా, ఎంతకీ వదలకుండా పట్టుపట్టింది. దీంతో వారిలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ కుక్కను గొంతు పట్టుకుని గాలి ఆడకుండా చేయడంతో అది నోటి తెరిచి పట్టువీడింది. దీంతో మరింత గాయం కాకుండా పిల్లవాడి కాలును తప్పించుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కుక్క కరచినపుడు ఎలా ప్రవర్తించాలో, కచ్చితంగా అదే చేశాడు. హీరో అంటూ అతని చర్యను కొనియాడటం విశేషం. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
జాతీయం
సెలెబ్రిటీలను మించిపోయిన క్రియేటర్లు!
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని టెండూల్కర్ చెప్పాల్సిన పని లేదు.. అందమైన చీరలు షూటింగ్ షర్టింగులు అంటూ విజయశాంతి ఊయలూగుతూ చెప్పే అవసరం లేదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కాజల్ అగర్వాల్ గోడలు అద్దాలు బద్దలుకొట్టుకుని రావాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇప్పుడు పట్టణాలు.. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు కటవుట్లు .. ఫ్లెక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. కాలం మారింది.. మారుతోంది.. ఇంకా మారనున్నది.. వివిధ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీలు.. సినిమా నటులు.. క్రీడాకారులు మాత్రమే యాడ్ ఫిలిమ్స్ లో నటించాలని రూలేం లేదు.. వాళ్లకు లక్షలు.. కాదు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది.. మున్ముందు ఇంకా మారుతుంది.సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలు వచ్చాక కమర్షియల్స్ .. అంటే యాడ్ ఫిలిమ్స్ రూపకల్పన తీరు మారిపోతోంది. దీనికోసం సెలబ్రిటీలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతిక లక్షలమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.. వీరు సినిమా సెలబ్రిటీలు.. స్పోర్ట్స్ పర్సన్స్ కాదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేస్తారు.ఐదారేళ్ళ క్రితం వరకుఒకప్పుడు భారతదేశంలో మార్కెటింగ్ అంటే హోర్డింగులు, సెలబ్రిటీ ఎండా ర్సుమెంట్లు, మెరుపువెలుగుజిలుగులు.. తళుక్కుమనే టీవీ ప్రకటనలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు.. నేరుగా కష్టమర్లతో మాట్లాడే వారే వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. వారు ఏం కొనాలి.. ఎందుకు కొనాలన్నది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వివరించి చెబుతున్నారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే ఒక ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత కంటెంట్ క్రియేటర్ ఎకానమీ కీలక మలుపు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు యాక్టివ్‌గా ఉన్నారు. వీరంతా సొంత రీల్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూనే వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆదాయం కూడా పొందుతున్నారు.వీరి ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో 30 శాతానికి పైగా మార్పు వస్తుండగా, వార్షికంగా రూ. 350–400 బిలియన్ డాలర్ల (సుమారు లక్షల కోట్ల రూపాయల) వ్యయం ఈ క్రియేటర్ల ప్రభావంలో జరుగుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశముందని అంచనా.ఈ వీరి ప్రభావం మరింత విస్తృతం అవుతుందని బీసీజీ అంచనా వేస్తోంది. ఇది ఇకపై వైరల్ డ్యాన్స్ వీడియోలు లేదా మేకప్ ట్యుటోరియల్స్కే పరిమితం కాదు. ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ, రోజువారీ అవసరాలు వంటి అన్ని విభాగాల్లోనూ ఈ క్రియేటర్లు దూసుకుపోతున్నారు.BCG అధ్యయనం ప్రకారం:60 శాతం మంది వినియోగదారులు క్రమం తప్పకుండా క్రియేటర్ కంటెంట్‌ను చూస్తున్నారు.30 శాతం కంటే ఎక్కువ మంది తమ కొనుగోలు నిర్ణయాలకు క్రియేటర్లే కారణమని చెబుతున్నారు. ఎవరెవరో సినిమా నటులు, క్రికెటర్లు చెప్పే ప్రకటనలకన్నా కమ్యూనిటీ ఆధారిత నమ్మకమే ఇప్పుడు ప్రధానంగా మారింది. మనకు తెలిసినవాళ్ళు చెప్పే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది.ఇకముందు ఈ 'కంటెంట్ క్రియేటర్లను తాత్కాలిక ప్రచార సాధనంగా కాకుండా, దీర్ఘకాల భాగస్వాములుగా చూసే బ్రాండ్లే విజేతలుగా నిలుస్తాయి. వాళ్ళ ఉత్పత్తులే ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తాయి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే క్రియేటర్లను కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసమే కాకుండా అమ్మకాలు పెంచుకోవడం, ఇంకా ధరను కూడా వారిద్వారానే నిర్ణయించేలా వ్యూహాలు రూపొందించి సక్సెస్ అవుతున్నారు. వీరితో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తమ వ్యాపారాలు పెంచుకుంటున్నాయి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంతపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వారిని గుర్తిస్తూ తమ వ్యాపారంలో భాగస్వాములను చేస్తున్నారు.--సిమ్మాదిరప్పన్న
కొత్త జట్టు కోసం బీజేపీ జల్లెడ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా యువనేత నితిన్ నబిన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునరి్నర్మాణంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులోభాగంగా నబిన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. జనవరిలోకొత్త అధ్యక్షుడిని అధికారికంగా నియమించిన తర్వాత ఉపా ధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రతినిధులతో కూడిన కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా యు వ నేతలను జల్లెడ పడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాతినిధ్యం కలి్పంచే లక్ష్యంతో జట్టు కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో మొదలైన ‘తరాల’మార్పు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తన నాయకత్వ మార్పు ముద్రను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గ కూర్పులో యువకులకు పెద్ద పీట వేస్తోంది. 56 ఏళ్లున్న సామ్రాట్ చౌదరి, 57 ఏళ్లున్న విజయ్ సిన్హాలను బిహార్‌లో ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయగా, ఛత్తీస్‌గఢ్‌లో 57 ఏళ్లున్న అరుణ్ సావో, 52 విజయ్ శర్మలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపికచేశారు. 50 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఇటీవలే గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 19 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. దీంతో మంత్రివర్గం సగటు వయస్సు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గింది. 40 ఏళ్ల హర్‡్ష సంఘ్వీని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ యువనాయకత్వాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతలకు అద్దంపడుతున్నాయి. 50 ఏళ్లుకూడా లేని నబిన్‌ను ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబిన్ ఎన్నిక అనేది పార్టీ యువనాయకత్వం వైపు అడుగులేస్తోందనడానికి ప్రబల తార్కాణం. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఇది నిర్ణయాత్మక మార్పే. బీజేపీ రాబోయే పాతికేళ్లకు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే యువనాయకత్వాన్ని సంసిద్ధం చేసుకుంటోంది’’అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. రెండు దశాబ్ధాలను నడిపించే నేతలకై వెతుకులాట.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత, అంతగా తెలియని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. 52 ఏళ్ల గడ్కరీ అప్పట్లో తన జట్టుని పునరి్నరి్మంచినప్పుడు, ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకోబోయే దిశను సూచించాయి. ముఖ్యంగా ఆయన తన జట్టులోని ప్రధాన కార్యదర్శులలో అనంత్ కుమార్, వసుంధరా రాజే, అర్జున్ ముండా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వంటి నేతలున్నారు. వారంతా గడిచిన పదహారేళ్లుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు మోస్తున్నారు. మరో పదేళ్ల పాటు సేవలందించే స్థాయిలో ఉన్నారు. అదే మాదిరి ప్రస్తుతం నబిన్ నేతృత్వంలోని జట్టులోనూ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రతిబింబించే నేతలకు అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. రాబోయే రెండు, మూడు దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వం వహించే కొత్త నాయకులను తయారు చేయాలనే రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సూచనలకు అనుగుణంగా నవతరం ఆఫీస్ బేరర్లను ఎంపిక చేసే అవకాశాలున్నాయని∙తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమ తమ రాష్ట్రాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల వివరాలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా తెప్పించి పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీళ్లలో అత్యధికులు 35 నుంచి 50 ఏళ్ల వయస్సు వారేకావడం గమనార్హం. ఇప్పటికే కొందరి నేతలకు భవిష్యత్‌లో పోషించే పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిని సైతం పార్టీ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా జాతీయ కార్యవర్గంలో సగటు వయస్సు 53 ఏళ్లకు మించకుండా ఉండేలా నాయకుల ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య
యశ్వంతపుర : అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్‌కు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీశ్ స్వయంగా రూపొందించి అందజేశారు. పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో విగ్రహాన్ని తీర్చిదిద్ది... విలువైన మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులతో అలంకరించారు. తంజావూరు చిత్రకళ శైలిలో, బాలరాముని మూలవిరాట్టు పోలికలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీరాముని విగ్రహంలోనే హనుమాన్, గరుడ, దశావతార చిత్రాలున్నాయి. పెద్ద విల్లు, బాణాలు పట్టుకుని ఉన్న రామయ్య విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలోనే ప్రతిష్టించాలని రామజన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించారు. జయశ్రీ ఫణీశ్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు విగ్రహ ఖర్చును భరించినట్లు తెలిసింది. విగ్రహాన్ని నాణ్యమైన ఎర్రచందనం చెక్క పెట్టెలో ఆలయానికి మంగళవారం తీసుకెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ రామయ్యకు ఆలయంలో విశేష పూజలు చేశారు.
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్‌లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ
ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి
శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!)
ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు)
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.
క్రైమ్
ప్రేమించలేదని యువతిపై దాడి
బెంగళూరు: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్‌కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్‌స్టా ద్వారా నవీన్‌కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్‌కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్‌కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025
పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
విశాఖ సిటీ: తన భార్య, కుమార్తె, ఆమె స్నేహితుడు తనపై పెప్పర్ స్ప్రే కొట్టి, దాడికి పాల్పడ్డారని దీపాటి జార్జ్ మార్టిన్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. మారి్టన్(56) భార్య హన్నా మార్టిన్, ఇద్దరు పిల్లలతో పాండురంగాపురం ప్రాంతంలో నివాసముంటున్నారు. భార్య పేరు మీద ఒక ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించి, కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి భార్య హన్నా మార్టిన్ ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు సదరు కంపెనీ అకౌంట్లోనే పడడంతో వాటిని తీసుకునే అవకాశం మారి్టన్కు లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మారి్టన్ తన తల్లి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మంగళవారం పని మీద ఇంటికి వెళ్లడంతో అక్కడ భార్య, కుమార్తె, అమె స్నేహితుడు మార్టిన్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేశారు. అతడి కాలు, చేతికి గాయాలవడంతో కేజీహెచ్‌లో చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్రూట్లో వచ్చిన కంటెయినర్ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్‌తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, హెల్పర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్‌కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించాడు.ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. ప్రమాదం జరిగిందిలా..చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్ డ్రైవర్‌తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు. Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999— Naik Kartik (@mekartiknaik) December 24, 2025 యువకుడి సాహసంతో.. ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సకాలంలో స్పందించినా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.తప్పిన ఘోరం!అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.
వీడియోలు
అమ్మతో జగన్.. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
మిరాకిల్ సెంటర్ లో క్రిస్మస్ వేడుకలు
పులివెందుల క్రిస్మస్ ప్రార్థనల్లో వైఎస్ జగన్
కుటుంబ సమేతంగా క్రిస్మస్ సంబరాల్లో YS జగన్
వైఎస్ జగన్ పై అద్భుతమైన పాట పాడిన వీరాభిమాని
St. Mary's చర్చిలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
ఒక్కమాటలో శివాజీకి ఇచ్చిపడేసిన హెబ్బా
లోకేష్ జాగ్రత్త.. ఎక్కువ చించుకోకు..!
ప్రైవేట్ కే మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని నిర్ణయం
క్రైస్తవ సోదరులకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

