బ్యాలెన్స్ లేకుంటే పడతారు..!
కేలండర్ మారుతోంది. కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? 2025 ధోరణే కొనసాగిద్దామా? లేక కొంతయినా మారుద్దామా? అందరిదీ ఇదే సందేహం. స్టాక్ మార్కెట్ల వైపు చూస్తే... ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాలకు దగ్గర్లో ఉన్నాయి. అంతకుముందు రెండేళ్లు అసాధారణంగా ర్యాలీ చేసిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. ఏడాదిలో సెన్సెక్స్ 10 శాతం పెరిగినా.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 7 శాతం తగ్గింది మరి. పోనీ రిసు్క లేకుండా ఓ మోస్తరు రాబడులిస్తాయనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాస్తా తగ్గి కూర్చున్నాయి. పెట్టుబడి పెట్టేలోపే బంగారం, వెండి అనూహ్యంగా పరుగులు పెడుతున్నాయి. మరి ఈ పరుగులెంతకాలం? ఎల్లకాలమూ ర్యాలీ చేస్తూనే ఉండవు కదా? ఇక రియల్ ఎస్టేట్ మొదట్లో కూలబడి... ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇలాచూస్తే ఇపుడు సరైన ఇన్వెస్ట్మెంట్ ఇదీ... అని చెప్పలేని పరిస్థితి. మరేం చేద్దాం? మన పోర్టుఫోలియో ఎలా ఉండాలి? ద్రవ్యోల్బణాన్ని మించి 4– 6 శాతం మేర వాస్తవిక రాబడులను ఎలా దక్కించుకోవాలి? ఎందులో.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... ఇపుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ పోర్టు ఫోలియో తప్పనిసరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఈక్విటీల్లో 30–45 శాతం, డెట్– ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాలకు 25–35 శాతం, రియల్ ఎస్టేట్‌కి 20– 30 శాతం, పసిడి, వెండికి 10–15 శాతం మేర కేటాయించవచ్చు. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే కొన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. మిగిలినవి రాణించే చాన్సుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులొస్తాయి. ఒక్కో సాధనాన్నీ విడివిడిగా చూద్దాం...2026 కొంత కొత్తగా... తేదీ మారినంత మాత్రాన జీవితమేమీ మారిపోదు. సంవత్సరం మారినంతమాత్రాన సంపదేమీ వచ్చి ఒళ్లో వాలదు. భారతీయ మధ్య తరగతి ఇప్పుడు ఆర్థిక కూడలిలో అయోమయంగానే నిలుచుంది. ఎందుకంటే జీతాలు బాగా పెరుగుతున్నాయి. కానీ చదువు, ఆరోగ్యం, ఇల్లు, డిజిటల్ లైఫ్కయ్యే ఖర్చు అంతకు మించి పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణకు పాత సూత్రాలు పనికిరావిప్పుడు. కొత్తగా చెయ్యాలి. కొంతయినా!!. నెల జీతం... ఫిక్స్డ్ డిపాజిట్లు.. బంగారం. దశాబ్దాలుగా భారతీయుల పొదుపు సూత్రమిదే. మరిప్పుడో..? ఉద్యోగాలకు రక్షణ లేదు. మారిన జీవనశైలి పొదుపును మింగేస్తోంది. ఆసుపత్రికెళితే బిల్లును అంచనా వెయ్యలేం. ఎల్కేజీ నుంచే ఫీజులకు జీతాలు సరిపోవట్లేదు. మరేం చెయ్యాలి? ధనంతో అనుబంధాన్ని... అంటే ధనబంధాన్ని మార్చుకోవాలి. తక్షణ లాభాలు, సోషల్ మీడియా టిప్‌లకు దూరంగా ఉందాం. లగ్జరీ వస్తువులు కొనేముందు... అత్యవసర నిధికి ప్రాధాన్యమిద్దాం. మొహమాటం కోసం కొనే పాలసీలకన్నా... నిజంగా రక్షణనిచ్చే బీమా కావాలి. ఆద్భుతాలు చేసే పథకాలకన్నా... స్థిరంగా పెరిగే పెట్టుబడులు చూడాలి. సంపద రాత్రికిరాత్రే రాదు. మెరుగైన అలవాట్లతో నెలలు, సంవత్సరాలు వేచిచూస్తేనే చెంతకొస్తుంది. ‘సాక్షి’ వెల్త్‌తో కలిసి ఇప్పటినుంచైనా కొత్త ప్రయాణం మొదలు పెడదాం..! ఎందులో, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చుఈక్విటీలు (30–45 శాతం కేటాయింపు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోను, ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్‌ను నిరంతరం ఫాలో అయ్యే అవకాశం లేనివారు, మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే నెలవారీగా ఇంత మొత్తం (ఇప్పుడు వారంవారీ, రోజువారీవి కూడా వచ్చాయి) చొప్పున పెట్టుబడి పెట్టేలా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) తరహా ఇన్వెస్టింగ్ విధానాన్ని అనుసరించవచ్చు. అంతేతప్ప డే ట్రేడింగ్, టిప్స్ మాయలో పడొద్దు. తక్షణ లాభాలొస్తాయంటూ వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేయొద్దు. ఈక్విటీల్లో పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉండాలి. రిటైర్మెంట్ తరువాతి జీవనానికి, పిల్లల చదువుకు ఉపయోగపడతాయి.డెట్, ఫిక్స్డ్ ఇన్‌కం (25–35 % కేటాయింపు)భారీ రిటర్నుల కన్నా పోర్ట్‌ఫోలియోని స్థిరంగా ఉంచేందుకు ఈ సాధనం ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), డెట్ మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్లు వంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇతరత్రా సాధనాలతో పోలిస్తే ఈ తరహా సాధనాలపై రాబడులు ఒక మోస్తరుగానే దక్కే అవకాశం ఉన్నప్పటికీ.. మన పెట్టుబడి మొత్తానికి పెద్దగా రిస్కు ఉండదు. భద్రత అధికం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీ సాధనాల్లాంటి స్థిరాదాయాన్ని అందించే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం నిధులను సమీకరించుకునేందుకు జారీ చేసే వాటిని కార్పొరేట్ బాండ్లుగా వ్యవహరిస్తారు. ఎఫ్డీలతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువ రాబడినిచ్చే విధంగా ఉంటాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రిపుల్ ఏ రేటెడ్ సాధనాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.రియల్ ఎస్టేట్ (20–30 శాతం) ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో ఓ 20–30 శాతాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వయంగా నివసించేందుకు కొనుక్కోవడం కావచ్చు... అద్దె రూపంలో రాబడులిచ్చే రెంటల్ ప్రాపరీ్టపై లేదా ఫ్రాక్షనల్ కమర్షియల్ ప్లాపరీ్టలో కావచ్చు. ఆర్థికంగా వెసులుబాటను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, స్పెక్యులేషన్‌కి తావివ్వకుండా క్యాష్ ఫ్లోపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.బంగారం, వెండి (10–15 శాతం)సాధారణంగా బంగారం, వెండి లాంటి మెటల్స్‌కు, ఈక్విటీలకు నెగటివ్ కో–రిలేషన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఈ మెటల్స్ ధరలు నిదానించడం, పసిడి ధర పెరిగినప్పుడు షేర్లు తగ్గడంలాంటిది జరుగుతుంది. కానీ 2025లో పరిస్థితి అలా లేదు. సూపర్‌గా పరుగులు తీసిన సాధనంగా బంగారం నిల్చింది. అంతటి పరుగును కూడా వెండి దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం 74%, వెండి 160% మేర పెరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరుగు కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. పేపర్ కరెన్సీలాగా కాలక్రమేణా మారకం విలువను కోల్పోకుండా, పెరిగే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడే సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. తన విలువను కాపాడుకుంటూ, ఈక్విటీలు తగ్గినా సంక్షోభ సమయాల్లో ఆదుకునే పసిడి, వెండిలో ఓ పది నుంచి పదిహేను శాతం ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియోకి శ్రీరామరక్షగా ఉంటుంది. క్యాష్, లిక్విడ్ ఫండ్స్ (5 శాతం) అత్యవసర పరిస్థితులేవైనా తలెత్తితే చేతిలో ఎంతో కొంత నగదు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి సంపద వృద్ధి కోసం ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీలో ఆదుకునేందుకు కనీసం ఆరు నెలల ఆర్థిక అవసరాలకైనా సరిపడే ఫండ్ అనేది ఒకటుండాలి. దీన్ని సేవింగ్స్ ఖాతాలోనైనా ఉంచుకోవచ్చు. లేదా దానికన్నా కాస్త ఎక్కువ రాబడినిచ్చే అవకాశాలున్న లిక్విడ్ ఫండ్స్‌లోనైనా సుమారు 5 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు.కొన్ని తప్పిదాలకు దూరం.. కొత్త సంవత్సరంలోనైనా కొన్ని తప్పిదాలకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫికేషన్ సూత్రం అంటూ ఒకటుంటుంది. అంటే, ఎప్పుడూ చేతిలో ఉన్నదంతా తీసుకెళ్లి ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏ సాధనానికైనా కొన్ని సాధకబాధకాలుంటాయి. ఒకోసారి పెరుగుతుంది. ఒకోసారి తగ్గుతుంది. పెరిగితే ఫర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ తగ్గినప్పుడే సమస్య. మొత్తం అంతా అందులోనే ఉంచేయడం వల్ల సవాళ్లు తప్పవు. మళ్లీ అది కోలుకునేంత వరకు ఓపిగ్గా కూర్చువడమో లేదా నష్టానికి అమ్ముకుని బైటపడటమో చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బంతా ఒకే దానిలో ఇన్వెస్ట్ చేయకుండా వివిధ సాధనాల్లో కొంత చొప్పున డైవర్సిఫై చేస్తే మంచిది. ఇక పోయినేడాది రాబడి బాగా వచి్చంది.. ఈసారి కూడా అదే స్థాయిలోనో లేదా దానికి మించిన స్థాయిలోనో రాబట్టాలి అని పంతం పట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి పరిస్థితులను బట్టి రాబడులను సహేతుకంగా అంచనా వేసుకుని, తగిన నిర్ణయం తీసుకోవాలి. బీమాను, పెట్టుబడిని కలిపి చూడొద్దు. బీమా అనేది అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఆర్థికంగా ఆదుకోగలిగే సాధనం. పెట్టుబడి అనేది సంపదను సృష్టించుకునేందుకు, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రతను సాధించుకునేందుకు ఉపయోగపడే సాధనం. బీమా, పెట్టుబడి ప్రయోజనాలను కలిపి అందించే సాధనాలు మార్కెట్లో ఉన్నప్పటికీ వివేకవంతంగా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని ఇచ్చే బీమా పాలసీని ఎంచుకుని, విడిగా పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరం. – ఎడిటర్
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్‌కి అసలైన పరిష్కారం ఏది?
కోల్‌కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్‌గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్‌ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్‌లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్‌కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్‌గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’
నీకు బీర్ కావాలా? అదిరిపోయే సమాధానమిచ్చిన ఇంగ్లండ్ స్టార్
ఆఫీస్ మార్పు నచ్చలేదా? విధుల్లో చేరని డీసీ సస్పెండ్
26 వేల మార్కు వద్దే నిఫ్టీ
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
ఎవరి తోలు ఎవరు తీస్తారో?..
పోర్ట్‌ఫోలియోకి దన్నుగా హైబ్రిడ్ ఫండ్స్
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్ను మూత
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
PPP అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వమని ఎవరన్నారయ్యా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగయోగం
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
సాక్షి కార్టూన్ 27-12-2025
సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్‌లోనే?
‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’
నీకు బీర్ కావాలా? అదిరిపోయే సమాధానమిచ్చిన ఇంగ్లండ్ స్టార్
ఆఫీస్ మార్పు నచ్చలేదా? విధుల్లో చేరని డీసీ సస్పెండ్
26 వేల మార్కు వద్దే నిఫ్టీ
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
ఎవరి తోలు ఎవరు తీస్తారో?..
పోర్ట్‌ఫోలియోకి దన్నుగా హైబ్రిడ్ ఫండ్స్
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్ను మూత
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
PPP అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వమని ఎవరన్నారయ్యా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగయోగం
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
సాక్షి కార్టూన్ 27-12-2025
సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్‌లోనే?
ఫొటోలు
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)
బుక్‌ఫెయిర్ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్ ప్రపంచ రికార్డు (ఫొటోలు)
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)
బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సినిమా
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025
కొత్త సినిమాలు.. కొత్తరకం ప్రమోషన్స్
ఒకప్పుడు సినిమా గురించి ఓ మాదిరిగా ప్రచారం చేసినా సరే థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేవాడు. యావరేజ్‌గా ఉన్నా గానీ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా ప్రమోషన్స్ చేసినా సరే థియేటర్‌కి వచ్చేందుకు ప్రేక్షకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. కన్నడలో ఇది ఎక్కువగా ఉండగా.. తెలుగులోనూ కొన్ని మూవీస్ ఈ తరహా ప్రయత్నాలు చేసి హిట్ కొట్టాయనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం?చిన్న సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడం చాలా కష్టం. తమ సినిమాలో కంటెంట్ ఉందని, కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తామని చెబితే సరిపోదు. ఆ విషయాన్ని తాము చెప్పకుండా.. వేరే ప్రేక్షకులతోనే చెప్పిస్తున్నారు. అదే 'ఫ్రీ' పబ్లిసిటీ. అంటే రిలీజ్‌కి కొన్నిరోజుల ముందే కొందరు ఆడియెన్స్ కోసం ఉచితంగా షోలు వేస్తున్నారు. అలా సినిమా చూసిన వాళ్లు ఏదైతే చెబుతారో ఆ విషయాలతో మూవీ టీమ్ ప్రమోషన్ చేసుకుంటోంది. రీసెంట్ టైంలో కన్నడ చిత్రం '45'కి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో 'చార్లీ 777'కి కూడా ఇలానే చేసి హిట్ కొట్టారనే విషయం మర్చిపోవద్దు.ఈ ఏడాది తెలుగులోనూ రిలీజైన లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు కూడా ఉచితంగా షోలు వేయలేదు గానీ విడుదలకు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటిలో అద్భుతమైన కంటెంట్ ఉండేసరికి రిలీజ్ రోజు ఉదయానికి మౌత్ టాక్ బలంగా వినిపించింది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. చిన్న సినిమాలు అయినా సరే వీటిని థియేటర్లకు వెళ్లి చూశారు. ఆదరించారు. వీటికి మంచి లాభాలు కూడా వచ్చాయి.అయితే ప్రీమియర్లు అన్ని సినిమాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' లాంటి మూవీకి ప్రీమియర్స్ అనేవి నెగిటివ్ కావడానికి చాలా కారణమయ్యాయి. ఎందుకంటే కంటెంట్‌పై చాలా నమ్మకం ఉండి ప్రీమియర్స్ వేస్తే.. తెల్లారేసరికి అది మౌత్ టాక్ రూపంలో ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం మొత్తానికే నెగిటివ్ కావడం గ్యారంటీ. దీనికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ 'హరిహర వీరమల్లు'.రీసెంట్గా క్రిస్మస్కి రిలీజైన 'ఛాంపియన్'కి తప్పితే దాదాపు మిగతా తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ వేశారు. ఉచితంగా టికెట్ గివ్ అవేలు కూడా ఇచ్చారు. అయినా సరే కంటెంట్ ఉన్న 'శంబాల' మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కేది కాదు. రీసెంట్ టైంలో మాత్రం ఫ్రీగా స్క్రీనింగ్, ప్రీమియర్స్‌తో వస్తున్న మౌత్ టాక్ కలిసొస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.
హారర్... థ్రిల్
శివ కంఠంనేని, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ నటించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వం వహించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించారు.ఈ సినిమా కొత్తపోస్టర్, గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. జీవీకే మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కించిన మా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. శివ కంఠంనేని మాట్లాడుతూ–‘‘ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
ఎలిజబెత్
‘‘నాకు ఎలిజబెత్ లాంటి మంచి బహుమతి ఇచ్చినందుకు నీకు (గీతు మోహన్‌దాస్‌ని ఉద్దేశించి) ధన్యవాదాలు. ‘టాక్సిక్’లో ఎవరూ ఊహించని అంశాన్ని వెండితెరపై చూపించాలన్న నీ ఆలోచనకు ఆశ్చర్యపోయాను’’ అని హూమా ఖురేషి పేర్కొన్నారు. యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎలిజబెత్పాత్రలో నటిస్తున్నారు హూమా ఖురేషి.ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ – ‘‘ఎలిజబెత్పాత్రకు ఓ డిఫరెంట్ లుక్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. అలాగే నటనా సామర్థ్యం కూడా మెండుగా ఉండాలి. హూమా ఖురేషి అయితే కరెక్ట్ అనిపించి, ఆమెను తీసుకున్నాం. హూమా ఓ టాలెంటెడ్ పవర్ హౌస్’’ అని పేర్కొన్నారు. యశ్, గీతు మోహన్ దాస్ కలిసి ఈ ‘టాక్సిక్’ కథ రాశారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. కన్నడంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా మరికొన్ని భాషల్లో అనువదించి, రిలీజ్ చేయనున్నారు.
క్రీడలు
క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!
మెల్బోర్న్: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్ సిరీస్ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఎంసీజీ పిచ్‌పై దుమారం ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్ మాథ్యూ పేజ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ హెడ్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్‌కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు.
పావని డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ పావని సరయు రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ (బ్యాక్‌స్ట్రోక్+బ్రెస్ట్ స్ట్రోక్+బటర్‌ఫ్లయ్+ఫ్రీస్టయిల్) విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న పావని సరయు... 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలోనూ ‘టాప్’లో నిలిచింది. బాలికల అండర్ 15–17 వయో విభాగం 200 మీటర్ల మెడ్లీ రేసును పావని 2 నిమిషాల 36.86 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే పోటీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అవిఘ్న చింతల 2 నిమిషాల 37.69 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం దక్కించుకుంది. కర్ణాటక స్విమ్మర్ హితశ్రీ (2 నిమిషాల 41.81 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది. బాలికల అండర్ 15–17 వయోవిభాగం 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో పావని 5 నిమిషాల 39.90 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం నెగ్గింది. కర్ణాటక స్విమ్మర్లు హితశ్రీ (5 నిమిషాల 45.81 సెకన్లు), ప్రతీక్ష గౌడ (5 నిమిషాల 46.32 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. విజేతలకు భారత స్విమ్మింగ్ సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు ఎం.సతీశ్ కుమార్, తెలంగాణ స్విమ్మింగ్ సంఘం (టీఎస్ఏ) అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ఏ సెక్రటరీ జి.ఉమేశ్, ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ సంఘం (ఏపీఎస్ఏ) సెక్రటరీ ఎ.మోహన్, తెలంగాణ ట్రయాథ్లాన్ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్, జీహెచ్ఎంసీ ఏడీఎస్ కె.శ్రీనివాస్ గౌడ్, టీఎస్ఏ సంయుక్త కార్యదర్శి ఎస్.గిరిధర్ రావు పతకాలను అందజేశారు. శివాని జోరు ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండు పసిడి పతకాలు నెగ్గిన తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా తాజాగా మరో రెండు పతకాలు గెలిచింది. బాలికల అండర్ 13–14 వయో విభాగంలో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో శివాని 2 నిమిషాల 39.99 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం గెలుచుకుంది. అలకనంద రాజు (2 నిమిషాల 39.79 సెకన్లు; కేరళ), మాన్య వాధ్వా (2 నిమిషాల 42.94 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. » బాలికల అండర్ 13–14 వియో విభాగం 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని 33.19 సెకన్ల టైమింగ్‌తో రజతం నెగ్గింది. శ్రేయ బినిల్ (32.66 సెకన్లు; కేరళ) పసిడి గెలుచుకోగా... తెలంగాణకే చెందిన నందిగామ శివకుమారి (33.76 సెకన్లు) కాంస్య పతకం సాధించింది. » బాలుర అండర్ 13–14 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో తెలంగాణకు చెందిన సచిన్ సాత్విక్ 2 నిమిషాల 27.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. కర్ణాటక స్విమ్మర్ ఆరవ్ 2 నిమిషాల 24.38 సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకోగా... కర్ణాటకకే చెందిన సాతి్వక్ సింగ్ 2 నిమిషాల 2.84 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం గెలుచుకున్నాడు. » బాలుర అండర్ 13–14 వయో విభాగం 400 మీటర్ల పోటీలో సచిన్ సాతి్వక్ 5 నిమిషాల 21.77 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం నెగ్గాడు. కర్ణాటక స్విమ్మర్లు ఆరవ్ (5 నిమిషాల 6.52 సెకన్లు), వైభవ్ (5 నిమిషాల 17.98 సెకన్లు) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. » బాలికల అండర్ 15–17... 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ అద్దంకి మోక్షిత పసిడి నెగ్గింది. మోక్షిత 1 నిమిషం 9.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇషాని (1 నిమిషం 11 సెకన్లు; కేరళ), హితశ్రీ (1 నిమిషం 11.90 సెకన్లు; కర్ణాటక) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. » బాలుర అండర్ 11–12 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ అర్జున్ సందీప్ కాస్వాన్ 2 నిమిషాల 38.68 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. లోహితాశ్వ నగేశ్ (2 నిమిషాల 34.63 సెకన్లు; కర్ణాటక), రోహిత్ (2 నిమిషాల 37.96 సెకన్లు; తమిళనాడు) వరుసగా పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. » బాలికల అండర్ 13–14 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ వేములపల్లి దిత్యా చౌదరీ 1 నిమిషం 18.75 సెకన్లలో పోటీని ముగించి మూడో స్థానంతో కాంస్యం గెలుచుకుంది. మాన్య వాధ్వా (1 నిమిషం 9.65 సెకన్లు; కర్ణాటక), ఆద్య భరద్వాజ్ (1 నిమిషం 10.58 సెకన్లు; కర్ణాటక) వరుసగా స్వర్ణ, రజతాలు హస్తగతం చేసుకున్నారు. » బాలికల అండర్ 11–12 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ పోటీల్లో తెలంగాణకు చెందిన కోపల్లి హవీష 1 నిమిషం 22.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. నయన (1 నిమిషం 14.72 సెకన్లు; కర్ణాటక), ధ్రుతి (1 నిమిషం 17.52 సెకన్లు; కర్ణాటక) వరుసగా పసిడి, రజత పతకాలు నెగ్గారు. »బాలికల అండర్ 15–17 వయో విభాగం 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ లిఖిత మెరుపుల 2 నిమిషాల 48.63 సెకన్లలో పోటీని ముగించి రజత పతకం గెలుచుకుంది. కర్ణాటక స్విమ్మర్లు వైష్ణవి (2 నిమిషాల 45.81 సెకన్లు), బీఎస్ జన్య (2 నిమిషాల 52.12 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు. » బాలుర అండర్ 15–17 వయో విభాగం 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కర్ణాటకకు చెందిన రేణుకాచార్య హోడ్మణి విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 9 నిమిషాల 4.66 సెకన్లలో లక్ష్యాన్ని చేని బంగారు పతకం కైవసం చేసుకోగా ... అక్షజ్ పరిగి (9 నిమిషాల 19.57 సెకన్లు; కర్ణాటక), నల్లూరి సాయి స్మరణ్ (9 నిమిషాల 54.27 సెకన్లు; తమిళనాడు) వరుసగా రజత, కాంస్యాలు నెగ్గారు.
అదే జోరు... అదే ఫలితం
తిరువనంతపురం: బౌలింగ్ ప్రతాపం... ‘హ్యాట్రిక్’ విజయాలతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ అస్వస్థత కారణంగా హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్‌లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్‌ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్ 150 మార్క్ దాటింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్‌పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్ భారీ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్‌ప్రీత్ (16 నాటౌట్) అబేధ్యమైన మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్ టి20 ఫార్మాట్లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. ఈసారి పోరాడి... గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది. స్కోరు వివరాలు భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్ బి) నిమషా 79; రిచా ఘోష్ (నాటౌట్) 40; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) హర్మన్ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్) 29; హర్షిత (స్టంప్డ్) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్‌జోత్ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1. 1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా మహిళల క్రికెట్లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్‌గా చమరి గుర్తింపు పొందింది.80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.4 తొలి వికెట్‌కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై సాధించిన 217/4 స్కోరును భారత్ అధిగమించింది. టి20ల్లో భారత్ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అతిపెద్ద భాగస్వామ్యం.4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్లో చేరిన నాలుగో బ్యాటర్ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు.
విజేత సూర్య చరిష్మా
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండు విభాగాల్లో తెలుగు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా... మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ కనపురం సాత్విక్ రెడ్డి విజేతలుగా నిలిచారు. 58 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ తుది పోరులో విజయవాడకు చెందిన 19 ఏళ్ల సూర్య చరిష్మా 17–21, 21–12, 21–14తో తన్వీ పత్రి (ఒడిశా)పై విజయం సాధించింది. 2013లో పీవీ సింధు తర్వాత జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్‌గా సూర్య చరిష్మా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఆమెకు రూ. 3 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) ద్వయం 21–9, 21–15తో అశిత్ సూర్య–అమృత (కర్ణాటక) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ సంజీవి (తమిళనాడు) 21–16, 22–20తో భరత్ రాఘవ్ (హరియాణా)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో హరిహరన్–రూబన్ (తమిళనాడు) 21– 17, 21–12తో మిథిలేశ్–ప్రెజన్ (పుదుచ్చేరి)లపై ... మహిళల డబుల్స్ ఫైనల్లో శిఖా–అశి్వని (కర్ణాటక) 21–14, 21–18తో ప్రియాదేవి (మణిపూర్)–శ్రుతి (ఉత్తరప్రదేశ్)లపై గెలిచారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
బిజినెస్
బ్యాలెన్స్ లేకుంటే పడతారు..!
కేలండర్ మారుతోంది. కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? 2025 ధోరణే కొనసాగిద్దామా? లేక కొంతయినా మారుద్దామా? అందరిదీ ఇదే సందేహం. స్టాక్ మార్కెట్ల వైపు చూస్తే... ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాలకు దగ్గర్లో ఉన్నాయి. అంతకుముందు రెండేళ్లు అసాధారణంగా ర్యాలీ చేసిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. ఏడాదిలో సెన్సెక్స్ 10 శాతం పెరిగినా.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 7 శాతం తగ్గింది మరి. పోనీ రిసు్క లేకుండా ఓ మోస్తరు రాబడులిస్తాయనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాస్తా తగ్గి కూర్చున్నాయి. పెట్టుబడి పెట్టేలోపే బంగారం, వెండి అనూహ్యంగా పరుగులు పెడుతున్నాయి. మరి ఈ పరుగులెంతకాలం? ఎల్లకాలమూ ర్యాలీ చేస్తూనే ఉండవు కదా? ఇక రియల్ ఎస్టేట్ మొదట్లో కూలబడి... ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇలాచూస్తే ఇపుడు సరైన ఇన్వెస్ట్మెంట్ ఇదీ... అని చెప్పలేని పరిస్థితి. మరేం చేద్దాం? మన పోర్టుఫోలియో ఎలా ఉండాలి? ద్రవ్యోల్బణాన్ని మించి 4– 6 శాతం మేర వాస్తవిక రాబడులను ఎలా దక్కించుకోవాలి? ఎందులో.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... ఇపుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ పోర్టు ఫోలియో తప్పనిసరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఈక్విటీల్లో 30–45 శాతం, డెట్– ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాలకు 25–35 శాతం, రియల్ ఎస్టేట్‌కి 20– 30 శాతం, పసిడి, వెండికి 10–15 శాతం మేర కేటాయించవచ్చు. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే కొన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. మిగిలినవి రాణించే చాన్సుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులొస్తాయి. ఒక్కో సాధనాన్నీ విడివిడిగా చూద్దాం...2026 కొంత కొత్తగా... తేదీ మారినంత మాత్రాన జీవితమేమీ మారిపోదు. సంవత్సరం మారినంతమాత్రాన సంపదేమీ వచ్చి ఒళ్లో వాలదు. భారతీయ మధ్య తరగతి ఇప్పుడు ఆర్థిక కూడలిలో అయోమయంగానే నిలుచుంది. ఎందుకంటే జీతాలు బాగా పెరుగుతున్నాయి. కానీ చదువు, ఆరోగ్యం, ఇల్లు, డిజిటల్ లైఫ్కయ్యే ఖర్చు అంతకు మించి పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణకు పాత సూత్రాలు పనికిరావిప్పుడు. కొత్తగా చెయ్యాలి. కొంతయినా!!. నెల జీతం... ఫిక్స్డ్ డిపాజిట్లు.. బంగారం. దశాబ్దాలుగా భారతీయుల పొదుపు సూత్రమిదే. మరిప్పుడో..? ఉద్యోగాలకు రక్షణ లేదు. మారిన జీవనశైలి పొదుపును మింగేస్తోంది. ఆసుపత్రికెళితే బిల్లును అంచనా వెయ్యలేం. ఎల్కేజీ నుంచే ఫీజులకు జీతాలు సరిపోవట్లేదు. మరేం చెయ్యాలి? ధనంతో అనుబంధాన్ని... అంటే ధనబంధాన్ని మార్చుకోవాలి. తక్షణ లాభాలు, సోషల్ మీడియా టిప్‌లకు దూరంగా ఉందాం. లగ్జరీ వస్తువులు కొనేముందు... అత్యవసర నిధికి ప్రాధాన్యమిద్దాం. మొహమాటం కోసం కొనే పాలసీలకన్నా... నిజంగా రక్షణనిచ్చే బీమా కావాలి. ఆద్భుతాలు చేసే పథకాలకన్నా... స్థిరంగా పెరిగే పెట్టుబడులు చూడాలి. సంపద రాత్రికిరాత్రే రాదు. మెరుగైన అలవాట్లతో నెలలు, సంవత్సరాలు వేచిచూస్తేనే చెంతకొస్తుంది. ‘సాక్షి’ వెల్త్‌తో కలిసి ఇప్పటినుంచైనా కొత్త ప్రయాణం మొదలు పెడదాం..! ఎందులో, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చుఈక్విటీలు (30–45 శాతం కేటాయింపు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోను, ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్‌ను నిరంతరం ఫాలో అయ్యే అవకాశం లేనివారు, మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే నెలవారీగా ఇంత మొత్తం (ఇప్పుడు వారంవారీ, రోజువారీవి కూడా వచ్చాయి) చొప్పున పెట్టుబడి పెట్టేలా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) తరహా ఇన్వెస్టింగ్ విధానాన్ని అనుసరించవచ్చు. అంతేతప్ప డే ట్రేడింగ్, టిప్స్ మాయలో పడొద్దు. తక్షణ లాభాలొస్తాయంటూ వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేయొద్దు. ఈక్విటీల్లో పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉండాలి. రిటైర్మెంట్ తరువాతి జీవనానికి, పిల్లల చదువుకు ఉపయోగపడతాయి.డెట్, ఫిక్స్డ్ ఇన్‌కం (25–35 % కేటాయింపు)భారీ రిటర్నుల కన్నా పోర్ట్‌ఫోలియోని స్థిరంగా ఉంచేందుకు ఈ సాధనం ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), డెట్ మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్లు వంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇతరత్రా సాధనాలతో పోలిస్తే ఈ తరహా సాధనాలపై రాబడులు ఒక మోస్తరుగానే దక్కే అవకాశం ఉన్నప్పటికీ.. మన పెట్టుబడి మొత్తానికి పెద్దగా రిస్కు ఉండదు. భద్రత అధికం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీ సాధనాల్లాంటి స్థిరాదాయాన్ని అందించే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం నిధులను సమీకరించుకునేందుకు జారీ చేసే వాటిని కార్పొరేట్ బాండ్లుగా వ్యవహరిస్తారు. ఎఫ్డీలతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువ రాబడినిచ్చే విధంగా ఉంటాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రిపుల్ ఏ రేటెడ్ సాధనాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.రియల్ ఎస్టేట్ (20–30 శాతం) ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో ఓ 20–30 శాతాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వయంగా నివసించేందుకు కొనుక్కోవడం కావచ్చు... అద్దె రూపంలో రాబడులిచ్చే రెంటల్ ప్రాపరీ్టపై లేదా ఫ్రాక్షనల్ కమర్షియల్ ప్లాపరీ్టలో కావచ్చు. ఆర్థికంగా వెసులుబాటను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, స్పెక్యులేషన్‌కి తావివ్వకుండా క్యాష్ ఫ్లోపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.బంగారం, వెండి (10–15 శాతం)సాధారణంగా బంగారం, వెండి లాంటి మెటల్స్‌కు, ఈక్విటీలకు నెగటివ్ కో–రిలేషన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఈ మెటల్స్ ధరలు నిదానించడం, పసిడి ధర పెరిగినప్పుడు షేర్లు తగ్గడంలాంటిది జరుగుతుంది. కానీ 2025లో పరిస్థితి అలా లేదు. సూపర్‌గా పరుగులు తీసిన సాధనంగా బంగారం నిల్చింది. అంతటి పరుగును కూడా వెండి దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం 74%, వెండి 160% మేర పెరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరుగు కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. పేపర్ కరెన్సీలాగా కాలక్రమేణా మారకం విలువను కోల్పోకుండా, పెరిగే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడే సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. తన విలువను కాపాడుకుంటూ, ఈక్విటీలు తగ్గినా సంక్షోభ సమయాల్లో ఆదుకునే పసిడి, వెండిలో ఓ పది నుంచి పదిహేను శాతం ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియోకి శ్రీరామరక్షగా ఉంటుంది. క్యాష్, లిక్విడ్ ఫండ్స్ (5 శాతం) అత్యవసర పరిస్థితులేవైనా తలెత్తితే చేతిలో ఎంతో కొంత నగదు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి సంపద వృద్ధి కోసం ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీలో ఆదుకునేందుకు కనీసం ఆరు నెలల ఆర్థిక అవసరాలకైనా సరిపడే ఫండ్ అనేది ఒకటుండాలి. దీన్ని సేవింగ్స్ ఖాతాలోనైనా ఉంచుకోవచ్చు. లేదా దానికన్నా కాస్త ఎక్కువ రాబడినిచ్చే అవకాశాలున్న లిక్విడ్ ఫండ్స్‌లోనైనా సుమారు 5 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు.కొన్ని తప్పిదాలకు దూరం.. కొత్త సంవత్సరంలోనైనా కొన్ని తప్పిదాలకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫికేషన్ సూత్రం అంటూ ఒకటుంటుంది. అంటే, ఎప్పుడూ చేతిలో ఉన్నదంతా తీసుకెళ్లి ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏ సాధనానికైనా కొన్ని సాధకబాధకాలుంటాయి. ఒకోసారి పెరుగుతుంది. ఒకోసారి తగ్గుతుంది. పెరిగితే ఫర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ తగ్గినప్పుడే సమస్య. మొత్తం అంతా అందులోనే ఉంచేయడం వల్ల సవాళ్లు తప్పవు. మళ్లీ అది కోలుకునేంత వరకు ఓపిగ్గా కూర్చువడమో లేదా నష్టానికి అమ్ముకుని బైటపడటమో చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బంతా ఒకే దానిలో ఇన్వెస్ట్ చేయకుండా వివిధ సాధనాల్లో కొంత చొప్పున డైవర్సిఫై చేస్తే మంచిది. ఇక పోయినేడాది రాబడి బాగా వచి్చంది.. ఈసారి కూడా అదే స్థాయిలోనో లేదా దానికి మించిన స్థాయిలోనో రాబట్టాలి అని పంతం పట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి పరిస్థితులను బట్టి రాబడులను సహేతుకంగా అంచనా వేసుకుని, తగిన నిర్ణయం తీసుకోవాలి. బీమాను, పెట్టుబడిని కలిపి చూడొద్దు. బీమా అనేది అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఆర్థికంగా ఆదుకోగలిగే సాధనం. పెట్టుబడి అనేది సంపదను సృష్టించుకునేందుకు, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రతను సాధించుకునేందుకు ఉపయోగపడే సాధనం. బీమా, పెట్టుబడి ప్రయోజనాలను కలిపి అందించే సాధనాలు మార్కెట్లో ఉన్నప్పటికీ వివేకవంతంగా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని ఇచ్చే బీమా పాలసీని ఎంచుకుని, విడిగా పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరం. – ఎడిటర్
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుందిఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.
బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఛానళ్లు అకౌంట్ ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుంది?, ఖాతాలోని డబ్బును మళ్లీ విత్‌డ్రా చేసుకోవచ్చాయా?, అనే విషయాలు బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు.బ్యాంక్ అకౌంట్‌ను రెండేళ్లు ఉపయోగించకుండా (ఎలాంటి లావాదేవీలు చేయకుండా) ఉంటే.. ఇనాక్టివ్ లేదా డోర్మాంట్ అవుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు ఏడాది మాత్రమే. అంటే.. గడువు లోపల చిన్న చిన్న లావాదేవీలైన తప్పకుండా చేసి ఉండాలి. లేకుంటే.. డెబిట్ కార్డు పనిచేయకపోవచ్చు, ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఖాతాలోని బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది.మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పటికీ.. అకౌంట్లో ఉన్న ఎక్కడికీ పోదు. కానీ ఎక్కువ కాలం ఎవరు క్లెయిమ్ చేయకపోతే.. ఖాతాలోని మొత్తం డబ్బు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్' (DEAF)కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు.. కావలసిన కేవైసీ పూర్తి చేసి మళ్లీ మీ ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు.కేవైసీ అప్డేట్ చేయాలంటే..కేవైసీ అప్డేట్ చేసి.. మళ్లీ మీ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ వంటివాటితో కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఫ్యామిలీ
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్‌లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్‌స్క్రీన్ బటన్‌ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్‌కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్‌లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్‌వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్‌తో అలర్ట్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్‌ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్‌ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్‌ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్‌ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్‌లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్‌బటన్‌ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్‌లైన్, లాక్డ్ స్క్రీన్‌లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్‌లో ఎమర్జెన్సీ కాంటాక్స్‌ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్‌వోఎస్ మెసేజ్‌లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్‌ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్‌కు పంపిస్తుంది. హాట్‌లైన్‌కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్‌ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్‌ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్‌వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్‌లలో...మై సేఫ్పిన్, నూన్‌లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్‌లతో పాటు మై ఎస్‌వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్‌లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్‌కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్‌ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్‌లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి.
ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
2025వ సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్నెస్ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్ ఏమిటో తెలుసుకుందాం..ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్ చేసుకుందాం.మొబైల్ ఫిట్నెస్ యాప్స్ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్నెస్ను (Fitness) ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్నెస్ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.మితంగా తినే మినిమల్ ఈటింగ్ హ్యాబిట్ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్లో మంచి మార్పులు చేసుకున్నారు.ఔట్‌డోర్ యోగా2025లో అధిక సంఖ్యాకులు ఫిట్నెస్ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్నెస్ రొటీన్లో భాగమయ్యాయి.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?మార్నింగ్ వర్కవుట్స్సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.కలిసి మెలిసి..2025లో వైరల్ అయిన వాటిలో గ్రూప్ ట్రైనింగ్ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడంలో మునిగిపోయారు.
తడ్కా స్ప్రౌట్స్, ఎగ్ రోల్.. నిమిషాల్లో రెడీ
ఈ యేడాది క్విక్‌గా, హెల్తీగా ఉండే వంటకాలపై చాలా మంది దృష్టి పెట్టారు. ఆరోగ్యకరమైన భోజనంతో పాటు సమయాన్ని ఆదా చేయడం కూడా దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం. క్విక్ అండ్ హెల్తీ, టేస్టీగా ఉండే వంటకాల తయారీ గురించి చెఫ్ గోవర్ధన్ ఇచ్చిన రెసిపీస్‌తో వంటిల్లు (Vantillu).చాలామందిలో ఆరోగ్య స్పృహతో పాటు ఫిట్‌గా ఉండాలనే ఆలోచన కూడా పెరిగింది. వారాంతాల్లో, ప్రత్యేకమైన రోజుల్లోనూ వంటకాల వైపు దృష్టి పెడుతున్నారు. వాటిలో... అధిక ప్రోటీన్ ఉండేవి, మొక్కల ద్వారా లభించే పదార్థాలు... కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు... మొదలైనవాటిని కుండ లేదా పాన్ పైన నిమిషాల్లో తయారుచేసుకొని తినడం అనేది ట్రెండ్‌గా నడిచింది. ఇది మాంసాహార వంటకాలకూ వర్తించింది. సులభంగా తయారు చేయగల వంటకాలలో కొన్ని...తడ్కా స్ప్రౌట్స్ (Tadka sprouts)కావలసినవి: మొలకలు (పెసలు లేదా శనగలు) – కప్పు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది); పచ్చిమిర్చి – 2–3 (సన్నగా తరిగినవి); ఆవాలు – 1/2 టీస్పూన్; జీలకర్ర – 1/2 టీస్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడా.తయారీ: మొలకలను కొద్దిగా ఉప్పు వేసి కాస్త పలుకుగా ఉండేలా ఉడికించాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తాలింపులో ఉడికించిన మొలకలు, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ వంటకాన్ని సలాడ్ రూపంలో తినచ్చు. లేదా కొంచెం మసాలా వేసి, వడ లేదా రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఎగ్ రోల్ (Egg roll)కావలసినవి: చపాతీ/పరాఠా – 2–3; గుడ్లు – 2 లేదా 3; ఉల్లిపాయ – సన్నగా తరిగినది; పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి); అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్; క్యారెట్ తురుము – తగినంత; పసుపు – చిటికెడు; కారం – అర టీ స్పూన్; కొత్తిమీర – కొద్దిగా; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా; టొమాటో కెచప్, మయోనైజ్ – తగినంత.తయారీ: ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము వేసి, వేయించాలి. పసుపు, కారం, కొత్తిమీర వేసి కలపండి. ఈ మిశ్రమంలో గుడ్డు మిశ్రమాన్ని పోసి, స్పూన్‌తో వెడల్పుగా అని, ఆమ్లెట్‌లాగా సిద్ధం చేసుకోవాలి. వేడి చపాతీని ఒక ప్లేట్ లో పెట్టి, దానిపై టొమాటో కెచప్, మయోనైజ్ రాయాలి. తయారుచేసుకున్న ఆమ్లెట్ ను చపాతీ మధ్యలో పెట్టి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లాలి. చపాతీని గట్టిగా రోల్ చేసి సర్వ్ చేయాలి.
ఫ్యాషన్ ఫార్వర్డ్.. జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ..
టైమ్‌లెస్ ఇండియన్ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్ ఇస్తోంది. ప్రీ–డ్రేప్డ్ శారీస్, డెనిమ్–ఇన్ఫ్యూజ్డ్ ఫ్యాబ్రిక్స్, బాంబర్ జాకెట్లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్ ఇది.సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్ కోర్సెట్ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్ల వరకు... ఈ ట్రెండ్ మోడ్రన్ ఇండియన్ ఫ్యాషన్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.‘హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ మోడ్రన్ సిల్హవుటీ’ ట్రెండ్ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్లాంటి చేనేత వస్త్రాలను జంప్సూట్లు, వోవర్సైజ్డ్ కోట్స్, కో–ఆర్డర్ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.సంప్రదాయ జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ న్యూట్రల్–కలర్డ్ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్–ఎక్స్ప్రెషన్స్కు అవకాశం ఇస్తున్నాయి.చదవండి: లేత రంగుల లేటెస్ట్ చీరల ట్రెండ్ఇంజినీరింగ్ వైపు మ్యూజిక్ స్టూడెంట్స్ మొగ్గువిద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్ స్టూడెంట్స్ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్ డైరెక్టర్ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ మ్యూజిక్’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు.
అంతర్జాతీయం
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఇంధన వనరులు, సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా శనివారం వేకువజాము నుంచి మరోమారు భారీ దాడులకు తెరతీసింది. కింఝాల్ హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించింది. బాంబు మోతలతో కీవ్ కొన్ని గంటలపాటు ప్రతిధ్వనించింది. వివిధ ఘటనల్లో కనీసం ఒకరు చనిపోయారు. 32 మంది గాయపడ్డారు.కాగా, ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా, రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు.BREAKING: Russia launched a massive attack on Kyiv and across Ukraine, firing roughly 500 drones and 40 missiles, hitting residential areas and knocking out power and heat in parts of the capital, ahead of President Zelenskyy’s meeting with Donald Trump in Florida on Sunday. pic.twitter.com/N1aSuRxJO9— Republicans against Trump (@RpsAgainstTrump) December 27, 2025ఇక, రష్యా మాత్రం.. భూమి, వాయు, సముద్ర మార్గాల్లో కీవ్‌పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేపట్టినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. మొత్తం 519 డ్రోన్లు, 40 వరకు క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. దాడుల ఫలితంగా కీవ్‌లోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు వెల్లడించింది. దాడుల్లో పది వరకు బహుళ అంతస్తుల నివాస భవనాలు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని వివరించింది. మరోవైపు.. తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకిది ప్రతీకారమని తెలిపింది.500 drones & 40 missiles were used by russia this night and morning. Most of them targeted Kyiv.Energy, critical civilian infrastructure & residential areas were under attack.Many households in Kyiv & the region are left without power & heat.It's subzero temperature in Ukraine pic.twitter.com/51V2uqUn3V— Ania_In_UA (@Ania_In_UA) December 27, 2025
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలిపోయాయని.. 73 కి.మీ (45 మైళ్ళు) లోతున భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ యంత్రాంగం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. తైవాన్ ఈశాన్య తీర నగరమైన యిలాన్‌కు సుమారు 32 కి.మీ దూరంలో శనివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా రాజధాని తైపేలో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. బుధవారం 6.0 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల అనంతరం ఈ వారంలో ఆ ద్వీపాన్ని తాకిన రెండో భారీ భూకంపం ఇది.🚨⚡⚡Video documents the moment the earthquake struck Taiwan today #earthquake #Taiwan pic.twitter.com/3wASXHGKvv— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) December 27, 2025 కాగా, తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనాలు కంపిస్తుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,000 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం మరణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. 🚨 MAJOR EARTHQUAKE UPDATE: A powerful magnitude 7.0 quake just struck off Taiwan's east coast at 11:05 PM! Epicenter located 32.3km east of Yilan County at 72.8km depth. Tremors felt across Taiwan AND southern Japan's islands. pic.twitter.com/n20g8M1eBy— TVBS World Taiwan (@tvbsworldtaiwan) December 27, 2025Before the magnitude 7.6 earthquake struck Taiwan, people captured unusual phenomena on Hehuan Mountain in Taiwan. pic.twitter.com/BqAIcnhpUT— Real Taiwan news (@RealTaiwannews) December 27, 2025
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్‌గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్‌లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్‌తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్‌ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు.
‘వాణిజ్యం’లో మధ్యవర్తిగా కింగ్ ఛార్లెస్!
లండన్: అమెరికా, బ్రిటన్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో స్వయంగా బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 మధ్యవర్తిత్వం వహించనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. తండ్రి ఛార్లెస్‌తోపాట బ్రిటన్ యువరాజు విలియం సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయి బ్రిటన్ తరఫున మంతనాలు జరిపే అవకాశముంది. బ్రిటన్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారే లక్ష్యంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఛార్లెస్ అమెరికాలో పర్యటించనున్నారు. అదే నిజమైతే గత 20 ఏళ్లలో అమెరికాలో అడుగుపెడుతున్న తొలి బ్రిటన్ రాజపాలకుడిగా చార్లెస్ రికార్డ్‌సృష్టించనున్నారు. వాణిజ్య చర్చల్లో ఛార్లెస్, విలియం ప్రమేయాన్ని ఉటంకిస్తూ ‘ది టైమ్స్’ ఒక కథనం ప్రచురించింది. వచ్చే ఏడాది జులైలో కెనడా, మెక్సికోలతో సంయుక్తంగా అమెరికా ప్రపంచ ఫుట్‌బాల్ కప్ మ్యాచ్‌లను నిర్వహించనుంది. వాటిని తిలకించేందుకు విలియం అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఛార్లెస్, విలియం పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చేందకు జరిగే కీలక చర్చల్లో తండ్రీకొడుకులు భాగస్వాములుగా మారతారని సమాచారం. అయితే విలియం, ఛార్లెస్‌లకు ఇంకా అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ఆహ్వానాలు అందలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో ట్రంప్ పర్యటించినప్పుడే బ్రిటన్‌లోకి 31 బిలియన్ పౌండ్ల పెట్టుబడిపై ఆశలు చిగురించాయి. కానీ బ్రిటన్‌లో కఠినతర ఆన్లైన్ భద్రతా నిబంధనలు, డిజిటల్ సేవా పన్ను, ఆహార భద్రతలో కఠిన నిబంధనలతో బ్రిటన్ సాంకేతిక రంగంలో ప్రతిపాదిత బిలియన్ డాలర్ల పెట్టుబడులపై ఈ నెలలోనే అమెరికా ప్రభుత్వం మోకాలడ్డింది. మా రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని బ్రిటన్ చెబుతుండగా అమెరికా రైతులకూ అవకాశం ఇవ్వాలని ట్రంప్ సర్కార్ అభ్యర్థిస్తోంది.
జాతీయం
హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం
కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అక్టోబర్ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు?
జమ్మూ కశ్మీర్లోకి అక్రమంగా దాదాపు 30 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో సైన్యం నిఘాను పెంచింది. 'చిల్లై కలాన్'( అత్యంత చలిఉండే కాలం)ను సైతం లెక్కచేయకుండా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో భద్రత సంస్థలు నిరంతరం నిఘాను పెంచుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలోనే ఎముకలు గడ్డకట్టే చలి ఉండే ఆ ప్రాంతంలో ఇక చలికాలం ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకూ మధ్య కాలాన్ని (చిల్లైకలాన్) అత్యంత కఠినమైన చలి ఉండే కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు, గడ్డకట్డి పోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటాయి.ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడం కోసం కఠినమైన ఆపరేషన్ చేపడుతుంది. జమ్మూ రీజియన్‌లో ముష్కరులకు ఎటువంటి సహాయం అందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. సున్నిత ప్రాంతాలలో సైనికుల మోహరింపును పెంచింది. కొండలు, అడవులు, మారుమూల లోయ గ్రామాలను జల్లెడ పడుతోంది. గుల్మార్ల్, సోనాలేక్, థాల్ సరస్సు వంటి సమస్యత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచింది.అంతేకాకుండా ఉగ్రవాదులు సహాయం పొందే అవకాశాలున్న ప్రాంతాల్లో భద్రత పెంచింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గితే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్ రీజన్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2025లో దక్షిణ మధ్య రైల్వే విజయాలివే..!
దక్షిణ మధ్య రైల్వే 2025 క్యాలెండర్ సంవత్సరంలో, అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ఈ కాలంలో, ఈ జోన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన రైళ్ల ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, సిబ్బంది సంక్షేమం, లోడింగ్, రాబడి సృష్టి మరియు భద్రతను పెంపొందించడం మొదలైన విషయాలలో నూతన శిఖరాలను అధిరోహించి, అనేక మైలురాళ్లను దాటినట్లు పేర్కొంది.2025 క్యాలెండర్ సంవత్సరంలో రైల్వే సాధించిన విజయాలు. తెలంగాణ రాజధాని నగర ప్రాంతంలోని (హైదరాబాద్) మూడు ప్రధాన టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి ప్రయాణికులకు సులభమైన, ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించడానికి, చర్లపల్లిలో ఒక నూతన శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేసి ప్రధానమంత్రి చే జనవరి 2025లోప్రారంభించబడింది. జోన్ లోని వైద్య విభాగం ఫిబ్రవరి 2025లో రైల్వే అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టుల మొదటి వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. మార్చి-2025లో రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో 64 స్లైసెస్ సిటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ మరియు వరంగల్ అనే మూడు ముఖ్యమైన రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసింది. వీటిని ప్రధానమంత్రి మే 2025లో వర్చువల్‌గా ప్రారంభించారు.ఇండో-సార్సెనిక్/ ఇండో-గోతిక్ వాస్తుశిలిలో నిర్మించబడిన కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వాన్ని సరైన కాంతివిధానంతో చాటి చెప్పడానికి రూ. 2.2 కోట్ల వ్యయంతో కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌కు వాస్తుశిల్ప సుందరీకరణతో విద్యుత్ దీపాలంకరణ పూర్తిచేసింది.కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి జూన్ 2025లో దీనిని దేశానికి అంకితం చేశారు. జూన్ 2025లో, రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో అంతర్గత కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుగౌరవ రైల్వే కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జూలై 2025లో కాచిగూడ ,భగత్ కీ కోటి మధ్య రోజువారీ రైలును ప్రవేశపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. మార్గమధ్యంలో రైలు ఆలస్యాలను తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి జూలై, 2025లో పెద్దపల్లి జంక్షన్ వద్ద ఒక కీలకమైన బైపాస్ లైన్ ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు, 2025లో సి.ఎస్.టి.ఎం మరియు జాల్న మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించి, జెండా ఊపి ప్రారంభించారు.రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న డిసెంబర్, 2025లో తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య నూతన వీక్లీ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు.డిసెంబర్, 2025లో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ ల గౌరవ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు.2025 సంవత్సరంలో జోన్ చేపట్టిన పైన పేర్కొన్న విజయవంతమైన కార్యక్రమాలతో పాటు, ఈ క్రింది తెలియజేయబడిన ప్రధాన మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపుదల ప్రాజెక్టులు, రాబడి సృష్టి మరియు ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి :దక్షిణ మధ్య రైల్వే జనవరి నుండి నవంబర్, 2025 వరకు ఈ క్రింది విజయాలు సాధించిందిసరుకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులు (జనవరి - నవంబర్ 24లో 128.4 మిలియన్ టన్నులతో పోలిస్తే).సరుకు రవాణా ఆదాయం లో రూ. 12841 కోట్లు(జనవరి - నవంబర్ 24లో రూ. 12597 కోట్లతో పోలిస్తే)ప్రయాణీకుల ఆదాయంలో రూ. 5525 కోట్లు ( సరుకు రవాణా ఆదాయం జనవరి - నవంబర్ 24లో రూ. 5261 కోట్లతో పోలిస్తే)రూ. 19314 కోట్ల స్థూల మొత్తం ఆదాయం (జనవరి - నవంబర్ 24లో రూ. 18831 కోట్లతో పోలిస్తే)దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరంలో 52 స్టేషన్లు/సేవా భవనాలకు అత్యధిక శూన్య/శూన్య ప్లస్ లేబులింగ్‌ను సాధించింది .ఈ స్టేషన్లు/సేవా భవనాలలో నికర ఇంధన దిగుమతికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నికర ఇంధన ఎగుమతిని సాధించినందుకు భారతీయ రైల్వేలలో ఇది అత్యధికం.2025 సంవత్సరంలో మూడు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభించబడ్డాయి.గుంతకల్లు డివిజన్లోని సంజమల వద్ద మెస్సర్స్ రామ్‌కో సిమెంట్స్గుంతకల్లు డివిజన్లోని యెర్పేడు వద్ద మెస్సర్స్ జగదీష్ , ఇతరులుగుంటూరు డివిజన్లోని జనపహాడ్ వద్ద మెస్సర్స్ డెక్కన్ సిమెంట్స్68 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు.22 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మరియు 60 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి.దక్షిణమధ్య రైల్వే ద్వారా 2025 లో 199 కి.మీ.ల ట్రాక్ జోడింపు (15 కి.మీ. కొత్త లైన్లు, 40 కి.మీ. డబుల్ లైన్ మరియు 144 కి.మీ. మూడవ లైన్)వాడి వద్ద 24 కి.మీ. పొడవునా విద్యుదీకరణతో పాటు (12 కి.మీ. డబుల్ లైన్) బైపాస్ లైన్‌ను ప్రారంభించారు. దీని వలన వాడి జంక్షన్‌కు వెళ్లకుండా రైళ్లను సజావుగా నడపడానికి సహాయపడుతుంది.దక్షిణ మధ్య రైల్వే 2025లో 184 ట్రాక్ కి.మీ. విద్యుదీకరించింది (డబ్లింగ్‌లో భాగంగా 40 కి.మీ. మరియు మూడవ లైన్లో భాగంగా 144 కి.మీ.). అదనంగా, హైదరాబాద్ డివిజన్లోని అక్కన పేట్ - మెదక్ సెక్షన్ మధ్య 17 రూట్ కి.మీ మరియు కలబురగి - ఖానాపూర్ సెక్షన్ మధ్య 97 రూట్ కి.మీ కూడా విద్యుదీకరించబడ్డాయి. దీనితో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లో 100 శాతం విద్యుదీకరణను సూచిస్తుంది. వివిధ విభాగాలలో 529 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను విజయవంతంగా ప్రారంభించారు తద్వారా లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఎక్కువ సంఖ్యలో రైళ్ల నిర్వహణకు సహాయపడింది.జోన్ సెక్షన్ సామర్థ్యాన్ని మరియు రైళ్ల సజావుగా నిర్వహణను పెంచడానికి వివిధ విభాగాలలో తొమ్మిది ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రారంభించింది.దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరానికి గాను నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను గెలుచుకుంది - గుంతకల్లు లోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం ఉత్తమ పనితీరు గల యూనిట్ అవార్డును పొందగా, రాయచూర్, కాచిగూడ మరియు లింగంపల్లి మొదలైన 3 రైల్వే స్టేషన్లు మెరిట్ సర్టిఫికేట్‌ను పొందాయి.
శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఈ ఒక్కరోజే సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు. కాగా, శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం అనంతరం గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకోనుంది.(చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు)
ఎన్ఆర్ఐ
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బ్రిటన్, కువైట్‌లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్‌లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
క్రైమ్
నేరాలపై ఉక్కుపాదం: కోరుట్ల పోలీసుల ఏడాది రికార్డు
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది. జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.381 దొంగతనాలు381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది. మాదక ద్రవ్యాలపై 86 కేసులుమాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులుతరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎన్నికల్లో 21 కేసులుఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలుహన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కొత్త పెళ్లి జోష్.. పార్టీ మత్తు… నదిలో దూకుడు
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై దగ్గరలోని మెదుగుమ్మల్ ప్రాంతానికి చెందిన ఇవాంజెరీ (28), లాయర్ అయిన ఇతనిపై పలు కొట్లాట కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల క్రితం సాహినియా (25) అనే లాయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొత్త వరుడు ఇవాంజెరీ, ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 24వ తేదీన స్నేహితులతో కుళిత్తురైలోని ఓ ప్రైవేట్ మద్యం బార్‌కు వెళ్లి మద్యం విందులో పాల్గొన్నారు. అక్కడ అందరూ ఉత్సాహంగా మద్యం తాగారు. దీంతో మత్తులో ఉన్న ఇవాంజెరి మద్యం బార్ వెనుకకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతను అకస్మాత్తుగా తామ్రపరణి నదిలోకి దూకాడు. తర్వాత నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్నేహితులు ఈ విషయాన్ని అగి్నమాపక కేంద్రానికి తెలియజేశారు. స్థానిక అగి్నమాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఓ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.
నిన్న భార్య.. నేడు భర్త.. రెండు నెలలకే విషాదాంతం
యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అట్టహాసంగా పెళ్లయితే.. గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది. నాగపూర్‌కు వెళ్లిపోయి.. గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.గానవి తల్లి ఏమన్నారు? సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం
జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!
మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ
అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?
యూరియాతో పాల తయారీ
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ప్రమాదం ఎలా జరిగిందంటే
20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?
అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!
మంత్రి నారాయణ ఆడియో లీక్.. రౌడీషీటర్లకు డిసెంబర్ 31st ఆఫర్

