పాయా షేర్వా.. నోరూరించేలా! | special dish Old City hotels in Mutton Paya Recipe | Sakshi
Sakshi News home page

Hyderabad: పాయా షేర్వా.. నోరూరించేలా!

Dec 29 2025 7:41 AM | Updated on Dec 29 2025 7:41 AM

special dish Old City hotels in Mutton Paya Recipe

 హైదరాబాద్‌: ఎముకలు కొరికే చలిలో పాయా షేర్వాకు భలే గిరాకి ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారు జాము నుంచే పాయా షేర్వా కోసం సీనియర్‌ సిటిజన్స్‌ ఇరానీ హాటళ్ల వద్ద క్యూ కడుతున్నారు. చలిలో వేడివేడి పాయా షేర్వా తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో పాతబస్తీలోని హోటళ్ల వద్ద గిరాకీ అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఎలాంటి మసాలా దినుసులు, నూనే వాడని నాన్‌కీరోటీ తోడైతే..ఆ మజానే వేరుగా ఉంటుందని పాయా షేర్వా ఇష్టపడే వారు చెబుతున్నారు. దీంతో ఈ వంటకానికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ ఉంది. ప్రస్తుతం హోటళ్ల వద్ద ఈ వంటకాన్ని ఖరీదు చేయడానికి క్యూ కడుతున్నారు. 

ఎముకలకు బలాన్నిచ్చే పాయా షేర్వా.. 
ఎముకలకు బలాన్నిచ్చే పోషక విలువలు అధికంగా ఉన్న పాయా షేర్వాను సాధారణ రోజుల్లో కన్నా చలికాలంలో పాతబస్తీ ప్రజలు ఇష్టంగా తింటారు. ఇక్కడి ప్రముఖ హోటళ్లలో తెల్లవారు జామున 4 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. తిరిగి సాయంత్రం ఆయా ప్రాంతాల్లోని హోటళ్లలో పాయా షేర్వాను విక్రయిస్తున్నారు. నాన్‌కీరోటీతో పాటు పాయా (మేక కాలు) షేర్వా (మసాలా పులుసు), జెబ్డా (దవడ), జబాన్‌ (నాలుక) భలే రుచిగా ఉంటాయని భోజన ప్రియులు చెబుతున్నారు.  

400 ఏళ్ల క్రితం.. 
పర్షియా భాషలో రోటీని ‘నాన్‌’అంటారు. 400 ఏళ్ల క్రితమే ఈ పాయా షేర్వా, నాన్‌కీ రోటీ మనకు అలవాటయ్యింది. ఇరాన్, టర్కీ (టర్కిస్తాన్‌) దేశాలకు చెందిన ‘డిష్‌’ఇది. మిడిల్‌ ఈస్ట్‌ (అరబ్బు దేశాలు) నుంచి ఈ ఫుడ్‌ కల్చర్‌ మన దేశానికి వ్యాపించింది. పాతబస్తీలోని డబీర్‌పురా, చంచల్‌గూడ, యాకుత్‌పురా, ఆజంపురా, బడేబజార్, పురానీహవేళీ, దారుషిఫా, చార్మినార్, మదీనా, ఖిల్వత్, బార్కాస్, బహదూర్‌పురాలతో పాటు నగరంలోని సికింద్రాబాద్, మల్లేపల్లి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో 200కు పైగా పాయా షేర్వా, నాన్‌కీ రోటీ తయారీ కేంద్రాలున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement