స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
నటి, యాంకర్ అనసూయ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో శివాజీతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అనంతరం శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను’ అని శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో అనసూయ మరోసారి శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ శివాజీకి చివాట్లు పెట్టింది. దీంతో అటు శివాజీ, ఇటు అనసూయ..ఇద్దరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ. ఐస్‌ల్యాండ్‌లో స్వీమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో ట్రిప్‌కి ప్లాన్ చేయాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివాజీపై కోపంతోనే ఆ వీడియో షేర్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్‌కి అసలైన పరిష్కారం ఏది?
కోల్‌కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్‌గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్‌ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్‌లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్‌కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్‌గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్‌క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఆపరేషన్ సిందూర్.. బాలుడి గొప్పమనసు
ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు. ఏది మంచో.. ఏది చెడో తెలిసే వయసూ కాదు. అయితే ఆ చిరుప్రాయంలోనే ..ఆ పిల్లాడు తన దేశభక్తిని చాటుకున్నాడు. పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో తన దేశాన్ని రక్షించేవారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.ఎంతో ప్రమాదకర సమయంలోనూ ఎటువంటి భయం లేకుండా సైనికుల వద్దకు వెళ్లి వారి దాహర్తిని తీర్చేలా నీరు, బట్టర్ మిల్క్ అందించాడు. దీంతో అతని సేవలకు మెచ్చిన ప్రభుత్వం ఆయనను రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది.ఆపరేషన్ సిందూర్ భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మిషన్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ప్రపంచం మెుత్తానికి భారత్‌ని రెచ్చగొడితే సమాధానం ఎలా వస్తుందనే విషయం అర్థమైంది. అయితే ఆపరేషన్ సమయంలో ఒక స్ఫూర్తిదాయక దేశభక్తి ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలతో పోరాడుతూ తమ గ్రామంలోకి వచ్చిన సైనికులకు శ్రావణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు సహాయం చేశారు. తమ దేశం కోసం పోరాడుతున్న జవానులకు పాలు, మజ్జిగ, నీరు, ఐస్ అందించి వారికి కొంత చేదోడుగా ఉండి బాల్యంలోనే తనకున్న అపార దేశభక్తిని చాటుకున్నాడు.దీంతో ఆ బాలుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆ పిల్లాడిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రావణ్ సింగ్‌కు స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ సింగ్ మాట్లాడుతూ' ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో మాగ్రామానికి సైనికులు వచ్చారు. ఆ సమయంలో వారికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నా, వారికి పాలు,నీరు,మజ్జిగ,ఐస్ అందించా. ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు' అని అన్నారు.శ్రావణ్ సింగ్ చాక్ తరన్ వాలి గ్రామంలో నివాసం ఉంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటుంది. రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ఏటా కేంద్ర ప్రభుత్వం బహుకరిస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్, పర్యావరణం, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, తదితర అంశాలతో పాటు సామాజిక సేవ తదితర అంశాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
శ్రీలీల గ్లామర్ టచ్.. కాజల్ కిస్సీ ఫేస్
శబరిమలకు పోటెత్తిన భక్తులు
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
శ్రీలీల గ్లామర్ టచ్.. కాజల్ కిస్సీ ఫేస్
శబరిమలకు పోటెత్తిన భక్తులు
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
ఫొటోలు
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
సినిమా
కెమికల్ వాటర్‌లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్ అయిందిఅప్పటినుంచే విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు.
మీనా కూతురు ఇప్పుడెలా ఉందంటే? ఫొటో వైరల్
హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ తదితర హీరోలతో వరస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ లీడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. ఈమె కూతురు కూడా ఐదేళ్లకే బాలనటిగా చేసింది. ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే మీనా కూతురి లేటేస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. మీనా కూతురు నైనిక కూడా తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం నైనిక వయసు 14 ఏళ్లు. ఐదేళ్ల వయసున్నప్పుడు దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో పోలీసోడు) మూవీలో బాలనటిగా చేసింది. తర్వాత మరేం మూవీస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మీనా విషయానికొస్తే.. 1982లో 'నెంజంగళ్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దిగ్గజ హీరో శివాజీ గణేశన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది. 1990లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చంటి, అల్లరిపిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం తదితర మూవీస్‌తో ఫేమ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేశ్‌తో చాలా సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Nainika Pilla (@nainika_ted)
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
నటి, యాంకర్ అనసూయ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో శివాజీతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అనంతరం శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను’ అని శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో అనసూయ మరోసారి శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ శివాజీకి చివాట్లు పెట్టింది. దీంతో అటు శివాజీ, ఇటు అనసూయ..ఇద్దరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ. ఐస్‌ల్యాండ్‌లో స్వీమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో ట్రిప్‌కి ప్లాన్ చేయాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివాజీపై కోపంతోనే ఆ వీడియో షేర్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చిరంజీవి సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే 'పేట' సినిమా తర్వాత తనకు సైడ్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయని కొందరు అన్నారంటోంది.అదేం అక్కర్లేదుఈ విషయం గురించి తాజాగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని నేను అనుకునేదాన్ని. ఉదాహరణకు దీపికా పదుకొణె ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు.ఏదైనా ప్రేక్షకుల చేతిలోనే..కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల మూవీ అయినా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. బియాండ్ ద క్లౌడ్స్ మూవీ చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ పేట మూవీలో ఆఫర్ ఇచ్చాడు.ఆ తర్వాత మొదలైందిఅది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్‌తో నటించే అదృష్టాన్ని వదిలేసుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేశాక నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకమీదట సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయని కొందరు నిర్మాతలు అన్నారు. యాక్టర్స్‌ను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. ధైర్యంగా ముందుకు సాగాలిఅంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనాలు మన మైండ్‌లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో హీరోయిన్గా మాళవిక మళ్లీ ఫేమ్‌లోకి వచ్చింది. తంగలాన్, హృదయపూర్వం సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'తో పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2' చేస్తోంది.చదవండి: మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక
క్రీడలు
డోపింగ్ టెస్టుల్లో ఇండియా అథ్లెట్స్ ముందంజ..!
భారతదేశంలో డోపింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బహుమతులు అందుకునే దేశాల జాబితాలో ముందుండాల్సిన మన దేశం ఇప్పుడు డోపింగ్ కు పాల్పడుతూ దొరికిపోయిన దేశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఎవరో తెలుసా..? ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) The World Anti-Doping Agency.. అవును ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2023 పరీక్ష డేటాలో, 5వేలకుపైగా నమూనాలను విశ్లేషించిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం మనకు అవమానకరమే. అయితే, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ చేసిన అభ్యంతరాలను గుర్తించి వెంటనే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని, దీని కోసం సవరించిన డోపింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. నిషేధిత పదార్థాలకు సంబంధించి భారతదేశ సానుకూల రేటు 3.8 శాతం ఉంది. 5,606 నమూనాల్లో 214 ప్రతికూల ఫలితాలు కనుగొన్నారు. 2022లో 3,865 పరీక్షలు నిర్వహించగా 3.2 శాతం ప్రతికూల ఫలితాలు నమోదయ్యాయి.సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి..2024లో భారత దేశంలోని అథ్లెట్లు డోపింగ్ సంబంధిత కార్యకలాపాలలో రికార్డు స్థాయిలో 260 మంది పాల్గొన్నారని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అంటే World Anti-Doping Agency (వాడా) వెబ్సైట్లో ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో భారత అథ్లెట్లు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. డోపింగ్ ఉల్లంఘనలలో భాగంగా తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన డోపింగ్ అఫెండర్ లిస్ట్ లో చేరింది.2030లో కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ కోసం దూకుడుగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. జూలైలో స్విస్ నగరం లౌసాన్‌లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం ఒలింపిక్ అండ్ పారాలింపిక్ క్రీడలను నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇంటర్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ డోపింగ్ వ్యవహారం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది ఇలా ఉండగా ఢిల్లీ ప్రధాన కార్యాలయం కలిగిన నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ గత సంవత్సరం 7,113 పరీక్షలను నిర్వహించింది, ఇందులో 6,576 మూత్ర నమూనాలు, 537 రక్త నమూనాలు ఉన్నాయి. వీటిలో, 253 మూత్ర నమూనాల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు, అయితే ఏడు రక్త నమూనాలు డోప్ పరీక్షలో విఫలమయ్యాయి.2023లో సేకరించిన 5,606 నమూనాల్లో మొత్తం 213 కేసులు డోప్ పాజిటివ్‌గా వచ్చాయి, తాజా గణాంకాలు యాంటీ డోపింగ్ వాచ్డాగ్ మరింత దూకుడు పరీక్షా విధానాన్ని ప్రతిబింబిస్తాయని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నొక్కి చెప్పింది. అయితే, అనేక ప్రముఖ క్రీడా దేశాలు మరింత విస్తృతమైన పరీక్షలు చేసినప్పటికీ తక్కువ శాతం డోపింగ్ కు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్ 11,744 నమూనాలను పరీక్షించగా, 91 డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలింది. ఇది 0.8 శాతం పాజిటివిటీ రేటు. 2021 వరకు ప్రపంచ డోపింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రష్యా, 10,514 నమూనాల్లో 76 నమూనాలతో 0.7 శాతం రేటును నమోదు చేసింది. చైనా కేవలం 43 డోపింగ్ వైఫల్యాలతో, 24,214 నమూనాల నుంచి అతి తక్కువగా 0.2 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది. అమెరికా డోపింగ్ నిరోధక సంస్థ భారతదేశం కంటే తక్కువ సంఖ్యలో, మొత్తం 6592 పరీక్షలు నిర్వహించి, 1.1 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది.డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో..?ఈ నివేదిక భారత క్రీడా సంస్కృతిలో డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో వెల్లడిస్తోంది. అంతేకాదు మన దేశంలో పటిష్టమైన శాస్త్రీయ, పరిశోధన వ్యవస్థ ఉండవలసిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పింది. వివిధ క్రీడా విభాగాల జట్లతో అనుబంధం ఉన్న భారతీయ కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు పనితీరును మెరుగుపరిచే సప్లిమెంట్లు, మందుల వాడకంపై ప్రాథమిక జ్ఞానం లేదని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితి ఆందోళన కలిగించేదిగా కనిపిస్తున్నప్పటికీ, డోపింగ్ ప్రాబల్యం పెరిగిందనే భావన సరైనది కాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ స్పష్టం చేసింది. బలమైన పరీక్షా విధానాలు, కఠినమైన గుర్తింపు యంత్రాంగాలను మరింత పటిష్టం చేయడం వల్లే ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయని నాడా ఒక ప్రకటనలో పేర్కొంది. అధిక పాజిటివిటీ రేటు కొనసాగడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ.2025లో ఇప్పటివరకు నాడా మొత్తం 7,068 డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 110 మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో పాజిటివిటీ రేటు 1.5 శాతంగా నమోదైందని తెలిపింది. డోపింగ్ ముప్పును ఎదుర్కొనే దిశగా భారత ఒలింపిక్ సంఘం తాజాగా కొత్త డోపింగ్ నిరోధక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో క్రీడల్లో అత్యున్నత స్థాయి సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ డోపింగ్ నిరోధక బిల్లును కూడా ఆమోదించడం గమనార్హం. కల్తీ సప్లిమెంట్ల సమస్యను పరిష్కరించడానికి, నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికైనా తగిన పరిష్కారాల ద్వారా ఇండియా అథ్లెట్స్ మరొకసారి నిషిద్ధ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని మన దేశ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -పసుపులేటి.వెంకటేశ్వరరావు.
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను తలపించే స్వింగ్ బౌలింగ్‌తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.బెంగాల్‌పై అదుర్స్..దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్‌పై 5 వికెట్ల హాల్‌తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ రాజ్ లింబాని?20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజరాత్‌లోని కచ్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్‌లోనూ భారత అండర్-19 జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా కప్‌లో నేపాల్‌పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.తన స్వింగ్ బౌలింగ్‌తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎవరైనా గాయపడితే అతడిని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవకాశముంది. ఐపీఎల్-2025లో లింబాని గుజరాత్ టైటాన్స్ నెట్‌బౌలర్‌గా తన సేవలు అందించాడు. అతడు ఇప్పటివరకు డొమాస్టిక్ క్రికెట్లో 25 మ్యాచ్‌లు 39 వికెట్లు పడగొట్టాడు.చదవండి: VHT 2025-26: సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్‌క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రైల్వేస్‌తో ఇవాళ (డిసెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఫలితంగా అతని జట్టు ఆంధ్రప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అలూర్ వేదికగా ఆంధ్ర, రైల్వేస్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు ప్రత్యర్ధిని 266 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. సత్యనారాయణ రాజు (10-1-41-3), కేఎస్ నరసింహ రాజు (10-0-68-3), హేమంత్ రెడ్డి (6-0-34-2), నితీశ్ కుమార్ రెడ్డి (10-0-34-1) అద్బుతంగా బౌలింగ్ చేసి రైల్వేస్‌కు భారీ స్కోర్ చేయనివ్వలేదు. అయినా ఆన్ష్ యాదవ్ (59), రవి సింగ్ (76) అర్ద సెంచరీలతో పోరాడటంతో రైల్వేస్ ఓ మోస్తరుకు మించిన స్కోర్ అయితే చేయగలిగింది. ఆ జట్టు తరఫున జుబైర్ అలీ (48), రాజ్ చౌదరి (22 నాటౌట్) కూడా పోరాడారు. మిగతా బ్యాటర్లలలో సూరజ్ అహూజా 7, ప్రథమ్ సింగ్ 6, ఉపేంద్ర యాదవ్ 7, అశుతోష్ శర్మ 8, కర్ణ్ శర్మ 7, రాహుల్ శర్మ 12 పరుగులు చేశారు.అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. బంతితో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హేమంత్ రెడ్డి బ్యాట్‌తో కూడా సత్తా చాటారు. నితీశ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేయగా.. హేమంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 41 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరికి ముందు రికీ భుయ్ (76) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు పునాది వేశాడు. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (30), శ్రీకర్ భరత్ (25), వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (40) పర్వాలేదనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరు తలో చేయి వేయడంతో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
బిజినెస్
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్‌కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025
రూ.26 లక్షల ఆఫర్.. మేనేజర్ వల్ల బంగారంలాంటి ఛాన్స్ మిస్!
ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు.. మరో జాబ్ ఆఫర్, మంచి శాలరీ ప్యాకేజీతో వస్తే ఎవరైనా వదులుకుంటారా? దాదాపు వదులుకోరు కదా!. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తన మేనేజర్ మాటలు నమ్మి.. చివరకు మోసపోయాడు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''తన విద్యార్థులలో ఒకరు, తన స్వస్థలానికి సమీపంలోని ఒక కంపెనీలో ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాడు. అతనికి వేరే చోట సంవత్సరానికి రూ. 26 లక్షల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. ఈ జాబ్ కోసం.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు మేనేజర్‌కు తెలిపారు. రాజీనామా విషయం చెప్పగానే.. ఇక్కడే ఉండండి, వచ్చే నెలలోనే మీకు.. మీరు పొందిన ఆఫర్‌కు తగిన హైక్ ఇస్తామని చెప్పారు. మేనేజర్ మాట విన్న ఉద్యోగి.. వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన మానుకున్నాడు. సరిగ్గా నెల రోజుల తరువాత.. మీటింగ్ జరిగింది. అప్పుడు జీతం పెంచము, రూ.15 లక్షల ప్యాకేజీనే కొనసాగుతుందని మేనేజర్ చెప్పినట్లు'' అమిత్ శేఖర్ అనే ఎక్స్ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.జరిగిన విషయాన్ని చెబుతూనే.. మాటలపై నమ్మకం ఉండదు. ఏదైనా డాక్యుమెంట్ రూపంలో ఉంటేనే మంచిదని అన్నారు. అయితే తాను తన.. విద్యార్థికి వచ్చిన ఆఫర్ మిస్ చేసుకోవద్దని చెప్పాను. అయితే ఉన్న కంపెనీ తన స్వస్థలానికి దగ్గరగా ఉందని, మేనేజర్ మాట ఇచ్చారని చెప్పారు.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. ఉన్న కంపెనీలోనే ఉండిపోదాం అనుకుంటే, మీ విలువ తగ్గిపోతుందని కొందరు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన, ఇలా ఎవరికీ జరగకూడదని ఇంకొందరు అన్నారు.A real story. A hard lesson. One of my students was working at a company near his native place with a CTC of 15 LPA.He interviewed elsewhere and cracked an offer of 26 LPA.When he informed his manager about resigning, the manager said: “If you really want to work here, stay.…— Amit Shekhar (@amitiitbhu) December 25, 2025
ముంబయిలో రెండో ఎయిర్పోర్ట్.. కార్యకలాపాలు షురూ!
భారత పౌర విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వాణిజ్య కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మొదటి ప్యాసింజర్ విమానం విజయవంతంగా టేకాఫ్, ల్యాండ్ అయింది.ఘన స్వాగతం.. తొలి విమానం ఇదే!బెంగళూరు నుంచి ప్రారంభమైన ఎయిర్‌క్రాఫ్ట్ విమానాశ్రయంలో మొదటి సర్వీసుగా నిలిచింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం (6E460) రన్‌వేపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా విమానానికి సంప్రదాయ పద్ధతిలో ‘వాటర్ సెల్యూట్’తో స్వాగతం పలికారు.అనంతరం ఉదయం 8:40 గంటలకు ఇక్కడి నుంచి మొదటి విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇండిగో విమానం (6E882) టేకాఫ్ అయింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.#WATCH | Maharashtra: Navi Mumbai International Airport commenced its airside operations today with the arrival of its first commercial flight. The aircraft was accorded a ceremonial water cannon salute on arrival. The inaugural arrival, IndiGo flight 6E460 from Bengaluru,… pic.twitter.com/SWoKSexdW4— ANI (@ANI) December 25, 2025మొదటి విమానాశ్రయంపై తగ్గనున్న ఒత్తిడిప్రస్తుతం అందుబాటులో ఉన్న ముంబై విమానాశ్రయంపై ఉన్న విపరీతమైన రద్దీని తగ్గించడంలో ఈ కొత్త విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. గంటకు 10 విమానాల కదలికలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. 2018లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ కొవిడ్-19 వంటి వివిధ కారణాల వల్ల దాదాపు ఎనిమిదేళ్లు ఆలస్యమైంది. ఈ విమానాశ్రయం అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పర్యవేక్షణలో ఉంది.ఆకృతిలో ప్రత్యేకతలువిమానాశ్రయ రూపకల్పన భారత జాతీయ పుష్పం కమలం ఆకారంలో ఉంటుంది. దీని మొదటి దశ నిర్మాణానికి సుమారు రూ.19,650 కోట్లు** ఖర్చు చేశారు. ఇది 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయం ప్రస్తుతం ఏడాదికి 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది ప్రయాణికులను నిర్వహించగలదు. భవిష్యత్తులో మొత్తం ఐదు దశలు పూర్తయిన తర్వాత ఇది ఏటా 90 మిలియన్ల(9 కోట్లు) మంది ప్రయాణికులకు సేవలందించనుంది.
పదేళ్లలో భారీగా పుంజుకున్న ఆవిష్కరణల సూచీ
గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ ఆవిష్కరణల సూచీ (Global Innovation Index)లో ఎంతో ప్రగతి సాధించింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 39వ స్థానానికి చేరుకోవడం హర్షణీయం. ఇది దేశంలో మారుతున్న ఆర్థిక, సాంకేతిక ముఖచిత్రానికి నిదర్శనం. డబ్ల్యూఐపీవో (WIPO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారత్ తన స్థానాన్ని స్థిరంగా మెరుగుపరుచుకుంటూ ఆవిష్కరణల కేంద్రంగా అవతరిస్తోంది.గత పదేళ్లలో భారత్ సాధించిన ర్యాంకులు దేశంలో వచ్చిన గుణాత్మక మార్పులను సూచిస్తున్నాయి.సంవత్సరంజీఐఐ ర్యాంక్201476201581202048202439 ఈ వృద్ధికి ప్రధాన కారణాలుబలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. 2014లో కేవలం కొన్ని వందల స్టార్టప్‌లు ఉండగా, నేడు ఆ సంఖ్య 1.40 లక్షలు దాటింది. 110కి పైగా యూనికార్న్ కంపెనీలు దేశంలో ఆవిష్కరణల జోరును పెంచాయి.ప్రభుత్వ విధానాలు, డిజిటల్ విప్లవం.. యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించాయి. ఇది ఆర్థిక లావాదేవీలనే కాక, కొత్త రకమైన ఫిన్‌టెక్ ఆవిష్కరణలకు దారితీసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి.పరిశోధన, అభివృద్ధిపై దృష్టి.. ప్రభుత్వం ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’(ANRF) వంటి సంస్థల ద్వారా పరిశోధనలకు భారీ నిధులను కేటాయిస్తోంది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఒకటిగా ఉండటం గమనార్హం.మేధో సంపత్తి హక్కుల బలోపేతం.. పేటెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేయడం వల్ల భారత్ నుంచి స్వదేశీ పేటెంట్ల నమోదు పెరిగింది. 2015తో పోలిస్తే ప్రస్తుతం పేటెంట్ల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది.భారత్ అందిపుచ్చుకున్న అవకాశాలుఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) పరంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ పరిశోధనా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మన దేశం గ్లోబల్ టెక్ హబ్‌గా మారింది.స్పేస్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఫలితాలను సాధించడంలో భారత్ తనదైన ముద్ర వేసింది.భారత్ 39వ స్థానానికి చేరుకున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను మరింత పెంచాల్సి ఉంది. విద్యావ్యవస్థ, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచితే భారత్ టాప్-25 దేశాల జాబితాలోకి చేరడం ఏమాత్రం కష్టం కాదు.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఫ్యామిలీ
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్‌ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్‌తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?)
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్‌లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్‌లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. లీప్ ఇయర్‌ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్‌నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్‌ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్‌ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్‌ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?)
క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు, చాలా దేశాల్లో ఆ రోజున సెలవుదినoగా పరిగణిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క రోజో నాలుగైదు రోజులో కాదు... నెలల తరబడి క్రిస్మస్ వేడుకలు జరిగే దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఫిలిప్పీన్స్, అక్కడ క్రిస్మస్ అంటే ఒక సెలవుదినం కంటే కూడా చాలా ఎక్కువ. దాదాపు సగం సంవత్సరం పాటు విస్తరించింది. తద్వారా ఫిలిప్పీన్స్ సుదీర్ఘ పండుగ అసాధారణమైన వేడుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.స్థానికంగా కపాస్కుహాన్ అని పిలువబడే పండుగ సీజన్ సెప్టెంబర్ ప్రారంభంలోనే రేడియో పెరోల్స్లో క్రిస్మస్ సంగీతం ప్లే చేయడంతో ప్రారంభమవుతుంది అప్పటి నుంచే అక్కడ ఇళ్లను ప్రకాశవంతమైన రంగుల నక్షత్ర ఆకారపు లాంతర్లతో అలంకరిస్తారు. ‘బెర్ నెలలు‘ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు)గా పేర్కొనే ఇవి సెలవుదినం వరకూ కొనసాగుతాయి. నిదానంగా ప్రారంభమై డిసెంబర్ నాటికి, మతపరమైన సేవలు, కుటుంబ సమావేశాలు అర్ధరాత్రి విందులు జరిగినప్పుడు ఉత్సవాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.అయితే ఈ వేడుకలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబరు 25న కూడా ముగియకపోవడం గమనార్హం. నూతన సంవత్సరం తర్వాత కూడా, తరచుగా జనవరి మూడవ ఆదివారం శాంటో నినో విందులతో వేడుకలు కొనసాగుతాయి. ఇంకా, కొంతమంది కాథలిక్కులకు, ఈ సీజన్ ఫిబ్రవరి 2, కాండెలేరియా విందు వరకు కొనసాగుతుంది, చివరకు ఆ సమయంలో అలంకరణలు తొలగించడం మొదలవుతుంది.ఫిలిప్పీనో క్రిస్మస్ మూలాలు శతాబ్దాల క్రితం ఉన్నాయి. 16వ శతాబ్దంలో క్రై స్తవ మతం రాకముందు, స్థానిక కమ్యూనిటీలు మొక్కలు నాటడం, అలాగే వ్యవసాయ పంటలతో ముడిపడి ఉన్న ఆచారాలను నిర్వహించేవారు, విందులు, సంగీతం, ఆత్మలు, దేవతలకు అర్పణలు వీటిలో భాగంగా ఉండేవి. స్పానిష్ వలసరాజ్యం ఈ పద్ధతులను క్రమంగా ఆవాహన చేసుకుంటూ కాథలిక్ సంప్రదాయాలను తీసుకువచ్చింది విశ్వాసం పండుగ ల ప్రత్యేకమైన మిశ్రమాన్ని సృస్టించింది. రికార్డుల ప్రకారం, ఫిలిప్పీన్స్ లో మొట్టమొదటి క్రిస్మస్ వేడుక డిసెంబర్ 1565లో సెబులోని ఫోర్ట్ శాన్ పెడ్రోలో జరిగింది, కాలక్రమేణా, ఊరేగింపులు వంటి కాథలిక్ ఆచారాలు స్థానిక ఆచారాలతో విలీనం అయ్యాయి, ఇది నేటికీ పాటిస్తున్న సంప్రదాయాలకు దారితీసింది.అలాగే, శాశ్వతమైన ఫిలిప్పీన్స్ వేడుకలలో సింబాంగ్ గబీ ఒకటి, ఇది డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరిగే తొమ్మిది తెల్లవారుజామున ప్రార్థనల శ్రేణి. మొదట 1668లో నమోదు చేయబడిన ఈ ఆచారాన్ని మిషనరీలు ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం నాటికి, సేవలు తెల్లవారుజామునకు మారాయి, ఇది రైతులు పొలాల్లో పని చేయడానికి ముందు హాజరు కావడానికి వీలు కల్పించింది. దీనిని మిసా డి గాల్లో (‘కోడి ప్రార్థన‘) అని పిలుస్తారు. ప్రార్థన తర్వాత, ఆరాధకులు బిబింకా (బియ్యం కేక్) పుటో బంబాంగ్ (ఊదా రంగులో ఉడికించిన బియ్యం) వంటి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తొమ్మిది ప్రార్థనలను పూర్తి చేయడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లేదా శుభాకాంక్షలు లభిస్తాయని నమ్మకం.
అంతర్జాతీయం
కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్‌లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్‌గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
సంచలనం.. పుతిన్ చావును కోరుకున్న జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ క్రిస్మస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును ప్రస్తావించకుండానే ‘అతను అంతమవ్వాలి’ అని పరోక్షంగా చావు కోరుతూ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత వేడి జోడించినట్లుగా భావిస్తున్నారు.మంగళవారం ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా విధ్వంసకర మిసైల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ క్రిస్మస్ పర్వదినాన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఉక్రెయిన్ పురాణాన్ని ప్రస్తావిస్తూ ‘పురాతన కాలం నుండి, ఉక్రేనియన్లు క్రిస్మస్ రాత్రి స్వర్గం తెరుచుకుంటుందని నమ్ముతారు. మీరు మీ కలను వారికి చెబితే, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు, మనమందరం ఒకే కలను పంచుకుంటాము. అదే అతను అంతమవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.క్రిస్మస్ రోజున రష్యా 131 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. అప్రమత్తమైన ఉక్రెయిన్ సైన్యం వాటిని నిర్వీర్యం చేసినప్పటికీ, ఒక ప్రాంతంలో మొహరించిన 22 డ్రోన్లలో 15 డ్రోన్లు ప్రతికూల ప్రభావం చూపినట్లు ఏబీసీ న్యూస్ నివేదించింది. పండుగ సమయంలో రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు.జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రిస్మస్ సందర్భంగా, రష్యన్లు మరోసారి తాము నిజంగా ఎవరో చూపించారు. భారీ షెల్లింగ్, వందలాది ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, కింజాల్ దాడులు జరిపారు’ అని మండిపడ్డారు. ఆయన రష్యా శాంతి ప్రయత్నాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, పండుగ సమయంలోనే ఇలాంటి దాడులు జరపడం వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని అన్నారు.Merry Christmas! pic.twitter.com/okj9Yr1bFe— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 24, 2025
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్సింగ్లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు. మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ
బ్యాంకాక్: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్‌హో లోడర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇది కూడా చదవండి: టీచర్‌పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం
జాతీయం
మోదీ మాటలకు చేతలకు పొంతనేలేదు
న్యూఢిల్లీ: పర్యావరణ సంబంధ అంశాల్లో మోదీ ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతనే లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆరావళి శ్రేణికి సంబంధించి పర్వ తాలపై కేంద్రం తాజాగా తీసుకువచ్చిన నిబంధనలతో 90% పర్వత ప్రాంతాలకు ఎటువంటి రక్షణ ఉండదని, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర కార్యకలాపాలతో వాటి మనుగడే ప్రమాదంలో పడుతుంద ని తెలిపింది. ఆరావళికి సంబంధించి మో దీ ప్రభుత్వం ఇచ్చిన తాజా నిర్వచనం నిపుణుల సూచనలకు విరుద్ధం, ప్రమాద కరమని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం ఎక్స్‌లో ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ రక్షణ చట్టాలను బలహీనం చేయడం, కాలుష్య నిబంధనలను సడలించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంతో ప్రయత్నిస్తోందని ఆరో పించారు. మరోవైపు, తప్పుడు సమా చారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్‌లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు. మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్‌ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు.
అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయ్!
ప్రజల కష్టాలు అధికారులకు తెలియాలంటే, వాళ్లు కూడా అదే కష్టాన్ని అనుభవించాలి.. ఇదే సూత్రాన్ని నమ్మారు ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జతి. తన నియోజకవర్గంలో గంటల తరబడి విధిస్తున్న విద్యుత్ కోతలపై ఆయన విసిగిపోయారు. దీంతో ఆయన, ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి అధికారుల ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించి సంచలనం సృష్టించారు. నిచ్చెన, కటింగ్ ప్లేయర్లతో బయల్దేరి.. మంగళవారం హరిద్వార్ జిల్లా రూరీ్కలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నిచ్చెన, కటింగ్ ప్లేయర్లు పట్టుకుని నేరుగా విద్యుత్ శాఖ అధికారుల నివాసాలకు చేరుకున్నారు. మొదట సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్‌పుత్ ఇంటి బయట ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత ఏకంగా చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండేల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మీకు గంట.. మాకు 8 గంటలా? ‘మా ప్రాంతంలో రోజుకు ఐదు నుండి ఎనిమిది గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు, వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. పది రోజులుగా మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేవలం గంటసేపు విద్యుత్ లేకపోతేనే అధికారులకు చెమటలు పడుతున్నాయి.. మరి గంటల తరబడి విద్యుత్ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?’.. అని వీరేంద్ర జతి ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై విద్యుత్ శాఖ ఫిర్యాదు ఎమ్మెల్యే చర్యపై విద్యుత్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు ’షట్‌డౌన్’ తీసుకోకుండా విద్యుత్ తీగలు కట్ చేయ డం వల్ల పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇది ప్రభుత్వ పనిలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపిస్తూ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధి స్వయంగా విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు ఏసీ గదుల నుంచి బయటికొచ్చి ప్రజల కష్టాలను చూడాలని నెటిజన్లు ఎమ్మెల్యే చర్యను సమర్థిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
విదేశాలకు మన ‘మేధ’.. వేల కోట్ల సంపద ఆవిరి
న్యూఢిల్లీ: మన దేశ యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోటెత్తుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. 2012లో విదేశాలకు వెళ్లిన వారు కొద్ది మందే ఉండగా.. 2024 నాటికి ఈ సంఖ్య ఏకంగా 13.3 లక్షలకు చేరింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతుండడంతో.. మన ’మేధ’తో పాటు వేల కోట్ల రూపాయల సంపద కూడా విదేశాల పాలవుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితులకు చెక్ పెట్టి, భారత్‌ను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్ ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు, కీలక విషయాలు ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా, విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నివేదిక సూచించింది. 2025 నాటికి భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే ఖర్చు దాదాపు 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు) దాటుతుందని అంచనా. ఇది మన దేశ విద్యాబడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.విదేశీ విద్యలో ఏపీదే అగ్రస్థానందశాబ్దాలుగా విదేశీ విద్యకు చిరునామాగా ఉన్న పంజాబ్, ఆర్థికంగా బలీయమైన మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాధారణంగా కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లడంలో పంజాబ్ విద్యార్థులు ముందుంటారని ప్రచారం ఉంది. కానీ నీతి ఆయోగ్ లెక్కలు ఆ అపోహను తొలగించాయి. 2018 గణాంకాల ప్రకారం.. ఏపీ (62,771) మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ (60,331), మహారాష్ట్ర (58,850) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2016లో దేశవ్యాప్తంగా విదేశాలకు వెళ్లిన వారిలో ఏపీ నుంచి 46,818 మంది విద్యార్థులు ఉండగా.. అప్పటికే ఏపీ అగ్రస్థానంలో ఉంది. 2018లో ఈ సంఖ్య ఏకంగా 62,771కి చేరింది. ఇది దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్. 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా, ఆ ఏడాది కూడా 35,614 మంది విద్యార్థులతో ఏపీ తన హవా కొనసాగించింది. కేవలం ఉత్తరాది రా>ష్ట్రాలే కాకుండా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందంజలో ఉంది. 2016లో ఏపీ నుంచి 46,818 మంది వెళ్లగా.. తమిళనాడు (27,518), కేరళ (18,428), కర్ణాటక (17,719) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మన చదువులకు విదేశీయులు ‘అంతంతే’మనం లక్షల మందిని విదేశీ విద్య కోసం పంపిస్తుంటే.. మన దేశానికి చదువుకోవడానికి వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 46,878 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలి స్తే ఇది చాలా తక్కువ. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ‘ఇంటర్నేషనలైజేషన్ ఎట్ హోమ్’ అనే వ్యూ హాన్ని నీతి ఆయోగ్ తెరపైకి తెచ్చింది. 2047 నాటికి భారతీయ విద్యాసంస్థల్లో 5 లక్షల మంది విదేశీ విద్యార్థులను చేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరోవైపు 2012–13లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు ఉండగా 2021–22 నాటికి ఆ సంఖ్య 3,106కు పెరిగింది. దీంతో విదేశీ విద్యా ర్థులను ఆకర్షించే టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ 7వ స్థానానికి ఎగబాకింది. 2012–13లో విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో తెలంగాణ (2,700 మందితో 4వ స్థానం) ఏపీ కంటే చాలా ముందు ఉండేది. కానీ 2021–22 నాటికి టాప్– 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం కోల్పో గా, ఆంధ్రప్రదేశ్ మాత్రం 3,106 మంది విద్యా ర్థులతో 7వ స్థానానికి ఎగబాకడం గమనార్హం.
ఎన్ఆర్ఐ
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి)
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
క్రైమ్
రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు
ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది.
రాజోలులో విషాదం.. ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశ్రుతి
సాక్షి, రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు.వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు.
మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుస ఎన్కౌంటర్లు..లొంగుబాట్లతో వెనక్కి తగ్గిన మావోయిస్టుల సాయుధ పోరాటానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే (69) మరణించారు. నల్లగొండ జిల్లాచండూరు మండలం పుల్లెంల ఆయన స్వగ్రామం. ఎస్ఓజీ ఆపరేషన్‌లో..: ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల సాయుధ పోరాటంపై నిర్బంధం పెరిగింది. దీంతో పదిమంది లోపు సభ్యులతోనే దళాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం–కందమాల్ జిల్లాల సరిహద్దులో చకపాద పోలీస్‌స్టేషన్ పరిధిలో రంభా అడవుల్లో కీలక మావోయిస్టు నేత ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపట్టే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన 23 మంది సభ్యుల జాయింట్ టాస్‌్కఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. అర్ధగంట పాటు పలుమార్లు కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏకే 47, రెండు ఇన్సాస్లు, 303 తుపాకీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు రోజుల ఉత్కంఠ ఒడిశా కేడర్‌కు చెందిన 22 మంది మావోయిస్టులు ఈ నెల 23న మల్కన్‌గిరిలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆ మరుసటి రోజు కందమాల్ జిల్లాలో గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు రాకేశ్, అమృత్ చనిపోయారు. వీరిలో ఒకరు పార్టీ సరఫరా వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో లభించిన వివరాల ఆధారంగా సమీప అడవుల్లో గురువారం గాలింపు చర్యలు చేపట్టగా, మరో నలుగురు మావోలు మృత్యువాత పడ్డారు. అందులో ఒక మహిళా మావోయిస్టుతోపాటు గణేశ్ ఉయికే కూడా ఉన్నారు.44 ఏళ్ల పాటుఅజ్ఞాత జీవితం రాజేశ్ తివారీ, చమ్రుదాదా, రూపా అనే ఇతర పేర్లతోనూ అజ్ఞాతంలో గణేశ్ పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.1.20 కోట్ల రివార్డు ఆయనపై ఉంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఆయుధం పట్టిన గణేశ్ దాదాపు 44 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ఒడిశాతోపాటు కేకేటీ (కేరళ, కర్ణాటక, తమిళనాడు), ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), దండకారణ్యం జోన్లలో ఆ పార్టీ విస్తరణకు ఆయన కృషి చేశారు.జగదల్పూర్లో మొట్టమొదట ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1990లో సౌత్ బస్తర్ జిల్లా కమిటీ సభ్యునిగా ఫీల్డ్ వర్క్ చేశారు. ఆ తర్వాత వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా (డీసీఎస్) 2003 వరకు పనిచేశారు. ఆపై పార్టీ ఆయన్ను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి (ఎస్జెడ్సీ) తీసుకుంది. తర్వాత సౌత్ జోన్ బ్యూరోకు (రీజినల్ కమిటీ) ఇన్చార్జ్ అయ్యారు. 2017లో కేంద్ర కమిటీలోకి వచ్చారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గోండు భాషలో(దేవనగరి లిపి) ఆయన పలు పత్రికలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గిరిజనులకు అర్థమయ్యేలా జిల్లా స్థాయి, ప్రాంతీయ స్థాయిలో ఆ పత్రికలను నిర్వహించారు. తద్వారా గిరిజనులను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా దండకారణ్యం కేంద్రంగానే కొనసాగింది.పార్టీలోనే ఆయన హుస్నాబాద్‌కు చెందిన శారదను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పార్టీని వీడి 2007లో బయటకు వచ్చారు. ఆ తరువాత హన్మంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఒడిశాలో పార్టీ ఖతం? కరోనా తర్వాత మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒడిశాలోని ఏవోబీతోపాటు కందమాల్, కలహంది, కోరాపూట్, గంజాం జిల్లాల్లో మావోయిస్టులకు పట్టుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ బాధ్యతలు చూస్తున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితోపాటు మరో కీలక నేత చైతో మరణించారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశా బాధ్యతలు చూస్తున్న గణేశ్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ‘గణేశ్ మరణంతో ఒడిశాలో మావోయిస్టు పార్టీ వెన్ను విరిగింది. ఇక్కడితో మా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయినట్టే’అని ఆ రాష్ట్ర డీజీపీ యోగేశ్ బహదూర్ ఖురానీయా గురువారం మీడియాతో అన్నారు. ‘మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారేందుకు అడుగు దూరంలో ఒడిశా నిలిచింది. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆర్ఎస్యూ నుంచి.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్‌ది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. 1961లో జని్మంచిన హన్మంతు 7వ తరగతి వరకు స్వగ్రామమైన పుల్లెంలలో చదువుకున్నాడు. చండూరులో పదో తరగతి వరకు, ఇంటర్ నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీలో చేరారు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే హన్మంతు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో (ఆర్ఎస్యూ) పనిచేశారు. డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేని అజ్ఞాతంలోకి వెళ్లారు. నల్లగొండ ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులోనూ హన్మంతు నిందితుడిగా ఉన్నాడు. డిగ్రీ చదివే సమయంలో ఆర్ఎస్యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన హన్మంతు మావోయిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు... విద్యార్థి దశ నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హన్మంతు ఆ తర్వాత ఇంటికి వచ్చింది లేదు. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఒక్కసారి కూడా రాలేదని గ్రామస్తులు చెప్పారు. నాలుగేళ్ల కిందట ఆయన తండ్రి చంద్రయ్య, రెండేళ్ల కిందట తల్లి ఎట్టెమ్మ మృతి చెందారు. అయినా హన్మంతు వారిని చివరిసారిగా చూసేందుకు కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు హన్మంతు ఎక్కడ ఉన్నది తెలియదు. హన్మంతు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. వారు శుక్రవారం ఒడిశాకు బయలుదేరే అవకాశముంది. మా అన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు మా అన్న నా చిన్నతనంలోనే ఉద్యమంలోకి పోయాడు. చిన్నప్పుడు చూశాం. ఆ తర్వాత ఎక్కడకు పోయిండు. ఎక్కడ ఉంటుండు అనేది మా కుటుంబానికి తెలియదు. మా అన్న వస్తాడని అమ్మానాన్న ఎంతో కాలం ఎదురు చూశారు. కానీ, వారు చనిపోయినప్పుడు కూడా రాలేదు. పోలీసుల ఎన్కౌంటర్లో హన్మంతు మృతి చెందాడనే విషయం నాకు తెలియదు. – హన్మంతు పెద్ద తమ్ముడు అశోక్మావోయిస్టు కేంద్ర కమిటీ ఖాళీ !ఆ సభ్యులే లక్ష్యంగాకగార్ ఆపరేషన్లు ఈ ఏడాది 11 మంది ఎన్కౌంటర్, ఐదుగురు సరెండర్ ప్రస్తుతం నామ్ కే వాస్తేగా మారిన కేంద్ర కమిటీ ? సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ విప్లవ పోరాట పంథాను అనుసరించే పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలు విలీనమై 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పాటైంది. ఆరంభంలో ఆ పార్టీ థింక్‌ట్యాంక్, పెద్దతలగా పేర్కొనే సెంట్రల్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 42గా ఉండేది. అయితే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఆ పార్టీ థింక్ ట్యాంక్ ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురైంది. యాక్టివ్‌గా ఉంది నలుగురే.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ పార్టీ కేంద్ర కమిటీలో కేవలం ఆరుగురే మిగిలి ఉన్నారు. అందులో ముప్పాళ్ల లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీరే కాకుండా పసునూరి నరహరి, మల్లా రాజిరెడ్డి వంటి తెలంగాణ నేతలతోపాటు జార్ఖండ్‌కు చెందిన తుపాన్దా అలియాస్ అనల్‌దా సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఇందులోనూ ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లా రాజిరెడ్డి వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. వీరిద్దరినీ మినహాయిస్తే కేంద్ర కమిటీలో నలుగురు నేతలే ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో ఇద్దరు పొలిట్‌బ్యూరోలో, మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. లొంగుబాట్లు.. పోతుల సుజాత అలియాస్ కల్పన, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పార్టీకి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇలా కాకుండా ఆయుధాలు, తమ వెంట ఉన్న కేడర్‌తో లొంగిపోయిన మావోయిస్టుల్లో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోపాటు రామ్‌ధేర్ ఉన్నారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుల్లో రావుల శ్రీనివాస్, హరిభూషణ్æ, అక్కిరాజు హరగోపాల్, కటకం సుదర్శన్ ఉన్నారు. కగార్తో నష్టాలు.. ఆపరేషన్ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో 2024 ఆగస్టులో చివరిసారిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. ఇందులో మడ్వి ఇడుమా (హిడ్మా)తో పాటు తక్కళ్లపల్లి వాసుదేవరావును కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాడుల ఉధృతి పెరిగింది. సెపె్టంబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు వరకు ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్. ఇందులో ఇడుమా (హిడ్మా) స్థాయి కలిగిన ఆదివాసీ మహిళా మావోయిస్టు నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కావడం వీలు కాలేదు. 2025 ఏప్రిల్‌లో శాంతి చర్చల ప్రతిపాదన దశలోనూ కేంద్ర కమిటీ సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేసినా కేంద్రం అంగీకరించలేదు. విస్తరణ కష్టమే..: ఆ పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్ర కమిటీల్లో కీలక నేతలు ఉన్నారు. అయితే, తీవ్ర నిర్బంధం మధ్య కొత్త వారిని కేంద్ర కమిటీలోకి ప్రమోట్ చేయడానికి కనీసం మావోయిస్టులు సమావేశమై, చర్చించు కునే పరిస్థితులు లేవు. దీంతో కేంద్ర కమిటీని విస్తరించడమనేది ఆ పార్టీకి కలగా మారింది. చివరకు ఆ పార్టీ చీఫ్‌గా తిప్పిరి తిరుపతిని ఎన్నుకున్నామని కొందరు చెప్పగా.. అలాంటిదేమీ లేదని మరికొందరు మావోయిస్టులు అంటున్నారు.
పురుగుల మందు తాగించి, గొంతు నులిమి..
సైదాపూర్: ఓ పెళ్లయిన యువకుడు తమ కూతురు వెంటపడుతున్నాడని... ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగుబంధాన్ని తుంచుకున్నారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, చావకపోవడంతో గొంతు నులిమి చంపేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది. గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు(16) మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) కొంతకాలంగా ప్రేమపేరిట వేధిస్తున్నాడు. అనిల్‌కు అప్పటికే వివాహమైందని, అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ, బాలికతో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు. చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువుపోతోందని భావించారు.ఈ క్రమంలోనే కూతురును చంపాలని నిర్ణయించుకున్నారు. విష పురుగు కుట్టిందని.. ఆత్మహత్య చేసుకుందని..నవంబర్ 14న రాత్రి కుటుంబసభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు. మరునాడు ఉదయం 4గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని, నోట్లోంచి నురగలు వచ్చాయని, ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోదించాడు. తన కూతురు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతోందని, పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ 15న పోలీసుస్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమపేరుతో వేధించాడని, ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజు, లావణ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పెళ్లయిన వ్యక్తికి తమ కూతురు దగ్గరైతే.. తమ పరువు పోతుందని భావించి, తామే తమ కూతురును చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని, ఆడ పిల్లలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు.
వీడియోలు
కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు
పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..
మాచర్లలో చీలిన టీడీపీ
అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు
అనంతలో గన్ కల్చర్
శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!
నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై
భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

