breaking news
Vikarabad
-
నీటి వెతలు బోలెడు.. చేతి పంపే చేదోడు
తాండూరు రూరల్: సరైన నీటి సౌకర్యం లేక మండల పరిధిలోని ఓగిపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 49 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో ఒక హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. తాగునీటికి సంబంధించి ఎలాంటి నల్లా కనెక్షన్ లేదని విద్యార్థులు వాపోతున్నారు. తాగడానికి ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. అలాగే పాఠశాలలో టాయిలెట్లకు నీటి సరఫరా లేదు. ట్యాంక్ ఉన్నా నిరుపయోగంగా ఉంది. పాఠశాల ఆవరణలో ఉన్న చేతి పంపు నుంచి నీటిని తీసుకొని అవసరాలకు వాడుకుంటున్నామని చిన్నారులు తెలుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత చేతిపంపు కొట్టి విద్యార్థులు ప్లేట్లు కడుక్కుంటుండగా ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
ఆ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి
మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుని తక్షణమే సస్పెండ్ చేయలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విద్యార్థి సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతకు వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. పాఠశాలలో 825 మంది విద్యార్థులకుగాను ప్రభుత్వం స్కావెంజర్ల జీతాల కోసం 2024 ఆగస్టు నుంచి రూ.20వేల చొప్పున విడుదల చేస్తోందని ఇద్దరు స్కావెంజర్లు నియమించి రూ.10వేల చొప్పున జీతం ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.7 వేల చొప్పున ఇచ్చి రూ.6 వేలు పక్కదారి పట్టించారని వివరించారు. సమయపాలన పాటించడం లేదన్నారు. మధ్యాహ్న భోజనంలోనూ రిజిస్ట్రర్‌లో పేర్లు రాసి నిధులు దోచుకుంటున్నారన్నారు. స్కావెంజర్ల జీతాల గోల్మాల్, మధ్యాహ్న భోజన బిల్లుల అవకతవకల్లో పాఠశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణ లు సైతం ఉన్నాయని విద్యాశాఖ అధికారులు స మగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కో రారు. లేదంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పె ద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇందుకు అధికారులు సానకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తరంగ్, జిల్లా కమిటీ సభ్యులు సిద్దు, తరుణ్, రాహుల్, కిరణ్, భరత్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. స్కావెంజర్ల జీతాల గోల్మాల్, మధ్యాహ్న భోజన బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలి ప్రజావాణిలో అధికారులను కోరిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ -
రేషన్ బియ్యం పట్టివేత
యాచారం: అక్రమంగా తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మాల్ కేంద్రంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కడ్తాల్ మండల పరిధిలోని పల్లెచల్కతండాకు చెందిన మోతీలాల్ టాటాసుమో వాహనంలో ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. బియ్యం గురించి ఆయన్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వాహనాన్ని టాటాసుమోలో ఉన్న రేషన్ బియ్యంపై విచారించగా సరైన వివరాలు తెలియజేయలేదు. దీంతో వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి మోతీలాల్‌ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం కొత్తూరు: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై సోమవారం స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్ మృతదేహం పడిన తీరును పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వయస్సు 30–35 ఏళ్లు, ఉంటుందని తెల్లటి బనియన్ ధరించాడని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించామన్నారు, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ వినీత్‌కుమార్ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ‘సింబయాసిస్’లో కార్మికుడి మృతి నందిగామ: వర్సిటీలో వా టర్ ట్యాంక్ శు భ్రం చేసేందుకు వెళ్లిన కార్మికుడు ప్రమాదవశాత్తు ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మొదళ్లగూడ శివారు సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమ వారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మ హారాష్ట్రలోని సాతర జిల్లా కున్నీ గ్రామానికి చెందిన అమిత్‌కుమార్ కై మొడే(32) కొంత కాలంగా వర్సిటీలో హిప్రో వాష్ క్లీనింగ్ స ర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల భవనంపై ఉన్న ట్యాంక్ శుభ్రంచేస్తున్న క్ర మంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన వర్సిటీ నిర్వాహకులు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసు లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మట్టి తరలిస్తున్న లారీ సీజ్ హయత్‌నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఓ లారీని పోలీస్‌లు సీజ్ చేశా రు. సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొ హెడాలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న లారీని నిలిపి తనిఖీలు చేపట్టగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవు. దీంతో స్థానిక తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సమాచా రం ఇచ్చారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ దయాకర్‌రెడ్డిపై కేసు నమో దు చేసి లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఎనిమిది మంది అరెస్ట్ శంకర్పల్లి: పేకాట స్థావరంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ, శంకర్పల్లి పోలీసులు సంయుక్తంగా సోమవారం దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ శివారులోని అల్ట్రాటెక్ కంపెనీలో పని చేస్తున్న డ్రైవర్లు, కంపెనీలోని వెయిటింగ్ రూంలో పేకాడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ, శంకర్పల్లి పోలీసులు దాడులు చేయగా ఎనిమిది మంది పేకాడుతూ చిక్కారు. వారి వద్ద నుంచి రూ.10,970 నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రోడ్డెక్కిన అంగన్వాడీలు
తాండూరు టౌన్: ప్రీ ప్రైమరీ స్కూళ్లను, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సంబంధిత శాఖా మంత్రి ఇళ్ల ముట్టడితో పాటు కొడంగల్‌లో సైతం నిరశన వ్యక్తం చేయాలని అనుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ స్కూళ్లను, పీఎంశ్రీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సిన చిన్నారులు ప్రీ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లే అంగన్వాడీ సెంటర్లు ఖాళీ అవుతాయన్నారు. కేంద్రాలను మూసేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటివి తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రంలోనే ఏర్పాటు చేసి, దానికి అదనంగా వేతనాన్ని టీచర్లకు ఇవ్వాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.18వేలు, పీఎఫ్ చెల్లించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గతంలో చేసిన 24 రోజుల సమ్మెకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
న్యాయం కోరితే అరెస్టులా?
బషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తే పోలీసులు ఆడవాళ్లని చూడకుండా ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారని తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు బాలమణి మండిపడ్డారు. సోమవారం కొడంగల్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి ఆందోళన చేసిన వారిలో 65 మంది అంగన్వాడీ టీచర్లను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు పీఎస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మగ పోలీసులు ఆడవారిపట్ల దురుసుగా ప్రవర్తించారని, రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మికి తీవ్రగాయాలు అయ్యాయని మండిపడ్డారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పోలీసులు విడిచిపెట్టారు. కార్యక్రమంలో నారాయణపేట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరామ్, ఐసీడీఎస్ వికారాబాద్ ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయలక్ష్మీ, నారాయణపేట అధ్యక్షురాలు శశికళతో పాటు 65 మంది టీచర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు బంట్వారం: చలో కొడంగల్ నినాదంతో ధర్నాకు బయులుదేరిన పలువురు అంగన్వాడీ టీచర్లను కోట్‌పల్లి ఎస్ఐ శైలజ సోమవారం ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ నిర్బంధాలు తమ ఉద్యమాన్ని ఆపలేవని, అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వంపై అంగన్వాడీల ధ్వజం -
యూరియా కోసం ఆందోళన వద్దు
తాండూరు రూరల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందరాదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం అన్నారు. సోమవారం పెద్దేముల్, తాండూరు మండలాల్లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెద్దేముల్లో రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 5,47,970 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 22,981 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. నేడు(మంగళవారం) జిల్లాకు 120 మెట్రిక్ టన్నులు వస్తుందని వివరించారు. కావున రైతులు ఆందోళన చెందరాదని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎక్కువ యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 620 లీటర్ల నానో యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరం ఉన్న వారు తీసుకెళ్లాలని సూచించారు. ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తాండూరు ఏడీఏ కొమురయ్య, పెద్దేముల్ ఏవో పవన్ ప్రీతం పాల్గొన్నారు. నానో యూరియా వాడండి బంట్వారం: నానో యూరియా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని డీఏఓ రాజారత్నం అన్నారు. సోమవారం కోట్‌పల్లిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. నానో యూరియా కొనుగోలు చేస్తే ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని తెలిపారు. అవసరం మేర యూరియా వాడాలని సూచించారు. అతిగా వాడితే అనర్థమని పేర్కొన్నారు. మూడు రోజుల్లో కోట్‌పల్లి మండలానికి 20 టన్నుల యూరియా వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ కరుణాకర్‌రెడ్డి ఏఈఓ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలు తగ్గుముఖం
ధారూరు: ఇటీవల కాలంలో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ధారూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. అంతకుముందు పీఎస్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ధారూరులో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారిని అక్కడి వ్యాపారులు మోసం చేసినట్లు స్థానిక విలేకరులు ఎస్పీ దృష్టికి తేగా ఎంతమంది.. ఎన్ని కోట్ల రూపాయలు మోసపోయారని అడిగారు. దీపక్ వైష్ణవ్ రూ.6 కోట్లు, సుబ్బారావు రూ.3 కోట్లు మోసం చేసి ఉడాయించారని ఎస్పీకి వివరించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. నిందితుల నుంచి డబ్బు రాబట్టడం ఆలస్యమువుతుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రఘురాం, ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి సహకారంతో ఏఐ సదస్సు విజయవంతం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిర్వహించిన జాతీయ సదస్సు అందరి సహకారంతోనే విజయవంతమయిందని ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే అన్నారు. పట్టణ సమీపంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకుకృషి చేస్తున్నామని అన్నారు. యాంత్రిక యుగంలో టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా బోధనలోనూ మార్పులు తీసుకువస్తోందన్నారు. ఇందులో భాగంగా షాద్‌నగర్ పట్టణంలో ఏఐ పై జాతీయ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, గిరిజన గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి సహకారం ఎనలేనిదని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరు విద్యార్థుల్లో సంతోషాన్ని నింపిందని అన్నారు. జాతీయ స్థాయి సదస్సు విద్యార్ధుల్లో ఎంతో ప్రేరణకలిగించిందని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కుల్కచర్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో స్థానిక ఎన్నికలపై సన్నాహాక సమావే శం నిర్వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జక్లపల్లి కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, నాయకులు చంద్రలింగం, కృష్ణయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా రోడ్డు విస్తరణ పనులు
బషీరాబాద్: రూ.80 కోట్ల నిధులతో చేపట్టిన అగ్గనూర్–బషీరాబాద్ రోడ్డు విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్నా ఎవెన్యూ ప్లాంటేషన్ చెట్లు తొలగించడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వడంతో పనులు జోరందుకున్నాయి. సోమవారం కాశీంపూర్ సమీపంలో సుమారు 200 చెట్లను తొలగించారు. దీంతో అగ్గనూర్– బషీరాబాద్ వరకు 16.8 కి.మీ రోడ్డును 13 మీటర్లు(43ఫీట్లు) వెడల్పుతో బీటీ వేయనున్నారు. రోడ్డుకు ఇరువైపుల షోల్డర్స్ 1.5మీటర్ల చొప్పున 3 మీటర్లు విస్తరణ చేస్తున్నట్లు ఆర్అండ్బీ ఏఈ రిషీవరుణ్ వివరించారు. అలాగే బషీరాబాద్– మైల్వార్ వరకు 11.6కి.మీ దూరం 7 మీటర్లు(23ఫీట్లు) వెడల్పుతో బీటీ రోడ్డు, షోల్డర్స్ మరో 3 మీటర్లు ఉండేలా విస్తరణ పనులు సాగుతున్నాయన్నారు. అగ్గనూర్ నుంచి విస్తరణ పనులు గొట్టిగఖుర్ధు సమీపం వరకు చేరుకున్నాయి. గడువులోపు పనులు పూర్తి చేయడానికి గుత్తేదారుకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. చెట్ల తొలగింపునకు తొలగిన అడ్డంకులు -
గర్భిణికి కుళ్లిన కోడిగుడ్లు
బంట్వారం: మండల పరిధిలోని యాచారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ గర్భిణికి రెండు రోజుల కిందట ఇంటికి తీసుకు వెళ్లేందుకు కోడి గుడ్లు ఇచ్చారు. ఆమె సోమవారం ఆమ్లెట్ వేసుకునేందుకు కోడి గుడ్లను పగుల గొట్టగా కుళ్లిపోయి నల్లటి బూజులా బయటికి వచ్చింది. కుళ్లిన గుడ్లు ఇవ్వడంపై ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మిని సంప్రదించగా.. యాచారం సెంటర్లో ఓల్డ్ స్టాక్ పంపిణీ చేసినట్లు తెలిసిందన్నారు. తాను ఎప్పటికప్పుడు గుడ్లతో పాటు ఇతర సరుకులు చెక్ చేస్తూ ఉంటానన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యాచారం అంగన్వాడీ కేంద్రంలో వెలుగు చూసిన ఘటన -
ఒక్కో రైతుకు రెండు బస్తాలు
తాండూరు రూరల్: మండలంలోని ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం రైతులకు యూరియా సరఫరా చేశారు. స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్నారు. సొసైటీ సీఈఓ శ్రీనివాస్, అదనపు సీఈఓ చంద్రారెడ్డిలతో పాటు కార్యాలయ సిబ్బంది క్యూలో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తా ల యూరియా టోకెన్లు రాసి ఇచ్చారు. ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయంకు 450 బస్తాల యూరియా వచ్చిందని క్యూలో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ కొమురయ్య తెలిపారు. ఒక్క బస్తా ధర రూ.270కి పంపిణీ చేశామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ -
తాగునీటి సమస్య పరిష్కరించండి
యాలాల: వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పలు గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందిగా మారిందని, వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెట్లి కృష్ణ, నర్సింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
సన్నద్ధంగా ఉండాలి
ఎస్ఐఆర్ నిర్వహణకుఅనంతగిరి: స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం ఎస్ఐఆర్ – 2002పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి నగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 2002 ఓటరు జాబితాను 2025 జాబితాతో సరి చూసుకొని త్వరగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈఆర్ఓ అలీకి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్ఓ మంగ్లీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను జాప్యం లేకుండా తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 103 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగ్లీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా 15 రోజుల నుంచి సెలవులో ఉన్న కలెక్టర్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు. -
హస్తంలో లుకలుకలు
కాంగ్రెస్‌లో తలనొప్పిగా మారిన గ్రూపు రాజకీయాలువికారాబాద్: జిల్లాలో అధికార పార్టీ సంప్రదాయా నికి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు కనిపిస్తాయి. కానీ కాంగ్రెస్ నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరుతుండటం హస్తం ముఖ్య నేతలను కలవర పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇలాంటి ఘటనలు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రూపు తగాదాలు.. ముఖ్య నేతలతో ఇమడలేక పలువురు పార్టీ వీడు తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బీఆర్ఎస్ అనుకూలంగా మలు చుకుంటోంది. అధికార పార్టీ పాలనలో విఫలమైందని.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్ర చారం చేస్తోంది. ఈ కారణంగానే బీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకులు చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల తోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో గ్రూపు రాజకీయాల కారణంగా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రూపులతో సతమతం తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలతో పాటు నవాబుపేట మండలంలో అధికార కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిగి, కొడంగల్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక ప్రాంతంలో ముఖ్య నేతలే గ్రూపులకు కారణం కాగా.. మరో చోట ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నెలకొన్న పోటీ కారణమవుతోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సొంత మండలం నవాబుపేటలో గ్రూపు విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి. యాదయ్య వర్గంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన భీంభరత్ వర్గం మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరికి వారు బలం నిరూపించుకునే పనిలో ఉన్నారు. దీంతో రెండుగా విడిపోయారు. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి వారిద్దరి మధ్య పొసగడం లేదు. ఆదిపత్య పోరు గ్రూపులకు ఆజ్యం పోసినట్లయ్యింది. తాండూరులో.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి.. మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య దూరం పెరిగింది. ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే. వీరిద్దరికీ బలమైన గ్రూపులు ఉండటంతో ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇక వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఒక్కరే ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన నేతలతో కాంగ్రెస్ నాయకులకు పడటం లేదు. తరచూ తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు తోసుకునే వరకు వచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే దాకా దారి తీసింది. నాయకుల తీరు స్పీకర్‌కు తలనొప్పిగా మారింది. సొంత పార్టీ వీడి.. రెండు మూడు నెలలుగా కొంతమంది హస్తం పార్టీ నేతలు సొంత పార్టీలో ఇమడలేక ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నవాబుపేట మండల మాజీ వైస్ ఎంపీపీ వర్గపోరు భరించలేక తన అనుచరులతో కలిసి కారు పార్టీలో చేరారు. ఇటీవల వికారాబాద్ నియోజకవర్గంలో సైతం పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ముఖ్యనేతలు ఇబ్బంది పడుతున్నారు. నాయకుల తీరు అధికారులకూ తననొప్పి తెచ్చిపెడుతోంది. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మండలి చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి తోపాటు వారి వర్గాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంతో పాటు నవాబుపేట మండలంలోనూ ఓ వర్గం నేతలో మాట్లాడితే మరో వర్గం నేతలు సదరు అఽధికారులపై కక్షగడుతున్నారు. సాధారణంగా మాట్లాడినా పలానా వర్గానికి అనుకూలమంటూ ముద్ర వేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలపై ఈ ప్రభా వం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సైతం వర్గపోరు కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన
అనంతగిరి: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్లు శిక్షణలో భాగంగా జిల్లాలో ఈనెల 19 వరకు పర్యటించనున్నారని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని పులుమద్ది(ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు), నవాబ్‌పేట మండలం లింగంపల్లి గ్రామంలో మధ్యాహ్నం 2 నుంచి పర్యటిస్తారన్నారు. అక్కడ పలువిషయాలపై చర్చించి, పరిశీలిస్తారని తెలిపారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి మండల పరిధిలోని దుబ్బతండా సమీపంలోని కాకరవేణి నది నుంచి రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. గమనించిన పోలీసులు వాహనాలు ఆపి తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమతులు లేవు. దీంతో వాహనాలను సీజ్ చేసి ఠాణాకు తరలించారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైనేజీ గుంతలో పడిన కారు తాండూరు టౌన్: అదుపు తప్పిన ఓ కారు సరాసరి నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సోమ వారం తెల్లవారుజామున కొడంగల్ వైపు నుంచి పట్టణంలోని ఇందిరాచౌక్ వైపునకు వచ్చిన కారు డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన గుంతలో అదుపు తప్పి పడిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్ల ఈఘటన జరిగినట్లు తెలిసింది. అతను స్వల్ప గాయాలతో బయటపడగా, అనంతరం కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. యఽథేచ్ఛగా మట్టి దందా! దోమ: అనుమతులు లేకుండానే పట్టపగలే యఽథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. సోమ వారం దోమ మండల పరిధిలోని మల్లేపల్లి తండా సమీపంలోని ఓ ప్రభుత్వ భూమిలో మట్టి దందాను కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. జేసీబీల సహాయంతో ట్రాక్టర్లలో నింపి అమ్ముకుంటున్నారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులకు విషయం తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా ఆమె స్పందించ లేదు. ధరల బోర్డు ఏర్పాటు బషీరాబాద్: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల ఎదుట ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేశారు. యూరియా మొదలుకొని డీఏపీ, ఇతర ఎరువులు ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం రావడంతో సోమవారం పట్టిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందులో యూరియా బస్తా ధర మొన్నటి వరకు రూ.320 నుంచి రూ.350కి విక్రయించగా ప్రస్తుతం దాని ధర రూ.266గా, డీఏపీ 1,450 నుంచి 1,350కి దిగి వచ్చాయి. అలాగే (20–20) కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు దిగివచ్చాయి. ఇన్నాళ్లు తమ దగ్గర ఎరువుల షాపుల యజమానులు ఒక్కో బస్తా ఎరువుకు రూ.80 నుంచి రూ.100 వరకు అధనంగా వసూలు చేశారని రైతులు తెలిపారు. మరోవైపు అధిక ధరలకు అమ్మిన ఓ షాపు యజమానికి రేపటి వరకు సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
అనంతగిరి: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ సోమవారం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు వడ్ల నందు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విధిగా చెల్లిస్తేనే ప్రైవేట్ కళాశాలలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని విద్యార్థులకు, యాజమాన్యాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, భూమయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
మా భూముల్లో ట్రిపుల్ ఆర్ వద్దు
అనంతగిరి: రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోతారని పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్‌లోని ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ వాసుచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా భూముల్లో ట్రిపుల్ ఆర్ వద్దన్నారు. కొంతమంది బడా నాయకులు వారి భూములను కాపాడుకునేందుకు పాత అలైన్మెంట్ మార్పించారని ఆరోపించారు. బడా వెంచర్లను తప్పించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మమ్మల్ని రోడ్డుపాలు చేసేందుకే కొత్త అలైన్మెంట్ తెచ్చారని వాపోయారు. రైతులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకుడు వడ్ల నందు మాట్లాడుతూ.. సొంత లాభం కోసం కొంత మంది రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద, చించల్పేట్, దాదాపూర్, యావాపూర్, పూడూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని వినతి పూడూరు: రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా భూములు కోల్పోతున్న రైతులు సోమవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసి తమకు న్యా యం చేయాలని కోరారు. మండలంలోని రాకంచర్ల, పూడూరు, మంచన్‌పల్లి, గొంగుపల్లి, ఎన్కే పల్లి, సిరిగాయపల్లి, కెరవెళ్లి, మన్నెగూడ, తుర్కఎన్కేపల్లి తదితర గ్రామాల రైతులు ఎంపీని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. భూములు పోతే రోడ్డుపాలవుతామని ఆదుకోవాలని కోరారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయాలని విన్నవించారు. ఎంపీని కలిసిన వారిలో సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అనీల్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, తాజొద్దీన్, శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
పింఛన్ వెంటనే పెంచాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున దోమ: ఎన్నికల సమయంలో ప్రభుత్వం ది వ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమ లు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీటీ నర్సింహులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా దివ్యాంగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండేళ్లు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బందేయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు చుక్కయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి లక్ష్మణ్, శ్రీ సంతోషిమాత విభిన్న ప్రతిభావంతుల సంఘం మండల మీడియా కన్వీనర్ కుర్వ ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులు సోమవారం ఆలయ ఆవరణలో సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని, ఏ విషయం చెప్పడం లేదని ఆరోపించారు. జాతర స్థలంలో ఇంటి స్థలం ఇస్తామని అధికారులు చెబుతున్నారని అక్కడ బాగా లేదని తెలిపారు. ఆలయ విస్తరణలో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేటు స్థలాన్ని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఆలయం చుట్టూ ఉన్న 96 మంది నుంచి 8,736 గజాల స్థలం సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారని అన్నారు. రాష్ట్రస్థాయి పికిల్ బాల్ టోర్నీ విజేత జయశ్రీ తాండూరు టౌన్: తెలంగాణ స్టేట్ ఓపెన్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో తాండూరు వాసి పటేల్ జయశ్రీ విజేతగా నిలిచి గోల్డ్‌మెడల్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో, 35 సంవత్సరాల వయసు విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ.. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆటల పోటీల్లో పాల్గొనాలన్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయిలో సైతం గోల్డ్ మెడల్ సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. జయశ్రీని తాండూరు వాసులు అభినందించారు. ప్రతి శిశువుకూ పోలియో చుక్కలు వేయించాలి ఇబ్రహీంపట్నం రూరల్: పుట్టిన ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి పల్స్ పోలియో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల లోపు 4.90 లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్టోబర్ 12న పోలియో బూత్‌ల్లో, 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. -
యూరియా పంపిణీ చేయండి
తాండూరు రూరల్: చేతికి వచ్చిన పంటలు పాడవుతున్నాయని, ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ మండలం బాయిమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు స్థానికంగా మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి తట్టెపల్లి పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా కోసం వెళ్తున్నామన్నారు. అక్కడ మాత్రం స్థానికులకే యూరియా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరుకు, పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తట్టెపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ చంద్రమౌళిలు స్పందించి తమకు యూరియా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులు మన్యనాయక్, చందర్‌నాయక్, జ్ఞానేశ్వర్, శంకర్‌నాయక్, శంకర్చౌహన్, సందీప్‌కుమార్, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బాయిమీది తండా రైతుల ఆందోళన -
హనీట్రాప్ కలకలం
యోగాశ్రమం నిర్వాహకుడికి ఇద్దరు మహిళల వలపువల● రహస్య వీడియోలతో బెదిరింపులు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ● పక్కా ప్లాన్‌తో అరెస్టు ● స్థానికంగా చర్చనీయాంశంచేవెళ్ల: హనీట్రాప్ వ్యవహారం చేవెళ్లలో కలకలం రేపింది. నగరంలోని గోల్కొండ పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పరిధిలోని దామరగిద్దకు చెందిన మిట్ట వెంకటరంగారెడ్డి గతంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంత కాలంగా ఆయన దామరగిద్దలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే సీక్రెట్ ఆఫ్ నేచర్ అనే యోగాశ్రమం నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడే ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇద్దరు మహిళలు 20 రోజుల కిత్రం ఆశ్రమానికి వచ్చారు. అక్కడే ఉంటూ వెంకటరంగారెడ్డికి వలపు వల వేశారు. సీక్రెట్‌గా వీడియోలు తీసి బయటకు వెళ్లిన వారు ముఠా సభ్యుల్లో ఒకరైన అమర్ అనే వ్యక్తితో కలిసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. భయపడిన వెంకటరంగారెడ్డి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రూ.25లక్షల చొప్పున రెండు చెక్కులు ముందు డేట్ వేసి ఇచ్చారు. వారు మరో రూ.2 కోట్లు లేదా రెండెకరాల భూమి ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో పెడతామని.. చంపుతామని బెదిరింపులకు దిగారు. దీంతో ఆయన ఈనెల 4న హైదరాబాద్‌లో తనకు తెలిసిన పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా శనివారం గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి హోటల్ వద్దకు రావాలని, రూ.2 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచారు. అక్కడికి రాగానే ప్లాన్ ప్రకారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటరంగారెడ్డి వద్ద డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌తోనే ముఠాసభ్యులు హనీట్రాప్‌నకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
పెసరకు కలిసిరాని కాలం
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడులు ● ధర లేక నష్టపోతున్న రైతన్న తాండూరు: ఖరీఫ్ సీజన్ పెసర రైతులకు నిరాశే మిగిల్చింది. స్వల్పకాలిక పంటగా దీన్ని సాగు చేస్తారు. పప్పు ధాన్యాల సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏటా సాగు విస్తీర్ణం పడిపోతూ వస్తోంది. జిల్లాలో 13వేల ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. భారీ వర్షాలకు సగానికి పైగా దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి దిగుబడులు వచ్చినా మార్కెట్లో మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసిన నాటి నుంచి భారీ వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. ఏటా జిల్లాలోని మార్కెట్ యార్డులు పెసర పంట ఉత్పత్తులతో కళకళలాడేవి. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం క్వింటాలు పెసర్లకు రూ.8,768 మద్దతు ధర ప్రకటించింది. అయితే తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు కనిష్ట ధర రూ.3,501, గరిష్ట ధర రూ.6,786, సగటు ధర రూ.3,853 చొప్పున పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. -
స్థాయి పెంచి.. సేవలు పంచి
● కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని వైద్య పరీక్షలు ● 24 గంటలు అందుబాటులో సిబ్బంది కొడంగల్: స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో రోగులకు 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బయో కెమిస్ట్రీలో 56, పాథలాజీలో 37, మైక్రో బయోలజీలో 41 రకాల పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ డయోగ్నొస్టిక్స్ పేరుతో నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిత్యం రక్త, మూత్ర, ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. పేద రోగులకు ఉచిత వైద్యంతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రభుత్వాసుపత్రి స్థాయిని పెంచి 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రిగా మార్చారు. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మిస్తున్నారు. త్వరలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తేనున్నారు. -
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు కీలకం
మీర్‌పేట: ప్రతిఒక్కరూ తమ వీధిలో, ఇంటి ఎదుట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మీర్‌పేట ఇన్స్పెక్టర్ శంకర్‌నాయక్ సూచించారు. మీర్‌పేట డీఎల్ఆర్ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కీసర హరినాథ్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సభ్యులు లక్ష్మణాచారి, నరసింహులు, భిక్షపతిరెడ్డి, అంజయ్య, మాణిక్ ప్రభు, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వాసుపత్రికి రావాలి. వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, జలుబు ఇతర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ చంద్రప్రియ, సూపరింటెండెంట్ ● -
పైపులైన్‌కు మరమ్మతులు
ధారూరు: ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘పల్లెల్లో తాగునీటి ఎద్దడి’ అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో పచురితమైన వార్తకు మండలంలోని మున్నూరుసోమారం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. స్థానిక మాజీ ఎంపీటీసీ రవీందర్ సహకారంతో కార్యదర్శి కిషన్‌నాయక్‌లు తాగునీటిని సరఫరా చేయించారు. పగిలిపోయిన పైపులైన్లకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. వ్యక్తి అదృశ్యం బొంరాస్‌పేట: మండల కేంద్రానికి చెందిన పుట్టి నర్సింలు ఈనెల 24న కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు తిరిగిరాకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆయన భార్య వెంకటమ్మ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు. కోట్‌పల్లి.. అందాల కడలిధారూరు: మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. చుట్టూ పచ్చని చెట్లతో విస్తరించిన అడవిలో సంచరిస్తూ అక్కడే వనభోజనాలు చేశారు. తర్వాత ప్రాజెక్టు అలుగుపై చేరి కేరింతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. యువతీ, యువకులు జేకేఎంఆర్ ద్వారా ఏర్పాటు చేసిన కాయకింగ్ బోటింగ్ చేశారు. జింఖానా క్లబ్ చైర్మన్‌గా శివరామకృష్ణ బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన క్లబ్ ఎన్నికల్లో నాగ కిషోర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ, వైస్ చైర్మన్‌గా ఎస్.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీగా ఎన్.నాగ కిషోర్, జాయింట్ సెక్రటరీగా వెన్నం అనిల్‌రెడ్డి, ట్రెజరర్‌గా గడ్డిపాటి హరీష్, డైరెక్టర్లుగా కనుమూరి నారాయణరాజు, రఘురామ్, కంజర్ల సదాశివయాదవ్, కంటిపూడి శ్రీనివాస్‌చౌదరి, అత్తలూరి సుధీర్‌కుమార్, రవికుమార్ వడ్లమూడి విజయం సాధించారు. -
కూరగాయలు కొనేందుకు వెళ్తూ..
చేవెళ్ల: కూరగాయలు కొనేందుకని బైక్‌పై వెళ్లిన ఓ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్(32) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి కూరగాయలు కొనేందుకు తన బైక్‌పై చేవెళ్లకు వస్తున్నారు. మార్గమధ్యలో కందవాడ లింక్ రోడ్డు సమీపంలో లారీ ఢీకొట్టింది. దీంతో మల్లేశ్ లారీ చక్రాల కింది పడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సరిత, ముగ్గురు పిల్లలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఢీకొట్టడంతో ఒకరి దుర్మరణం -
నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి
పట్టించుకోని పంచాయతీ అధికారులు తాండూరు రూరల్: మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గత మూడు రోజుల నుంచి పైపులైన్ సరఫరా చేసే బోరు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో గ్రామంలో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న నీటి తొట్టె వద్దకు బిందెలతో తరలివచ్చి నీటిని పట్టుకుంటున్నారు. దీనిపై పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. నిధులు లేకపోవడంతో బోరు మోటార్లకు మరమ్మతులు చేయించలేదని చెప్పారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇనుప సామగ్రి చోరీపై ఫిర్యాదు కొడంగల్: పట్టణంలోని బాలాజీ కేజీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 13వ తేదీన రాత్రి దొంగతనం జరిగిందని పాఠశాల కార్యదర్శి జయతీర్థాచారీ, ప్రధానోపాధ్యాయుడు వెంకటప్పలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు తాళం వేసిన గేటును, రోడ్డు వెడల్పు కోసం తీసిన గేటును ఇతర ఇనుప సామగ్రిని చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సామగ్రిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పెద్ద గేటు, చిన్న గేటు, రెండు క్వింటాళ్ల ఐరన్ విలువ సుమారు రూ.లక్షన్నర ఉంటుందని వివరించారు. వైద్యం అందక లేగదూడ మృతి బంట్వారం: సరైన వైద్యం అందక ఓ లేగదూడ మృత్యువాత పడింది. ఈ సంఘటన ఆదివారం కోట్‌పల్లి మండలంలోని బీరోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రైతు బాల్‌రాజ్‌కు చెందిన మూడేళ్ల వయసున్న లేగదూడకు 15 రోజుల కిందట వైరస్ వ్యాధి సోకింది. ప్రభుత్వ పశువైద్యం అందకపోవడంతో బాధితుడు ప్రైవేట్‌గా డబ్బులు చెల్లించి చికిత్స చేయిస్తున్నాడు. అయినప్పటికీ సరైన వైద్యం అందకపోవడంతో లేగదూడ చనిపోయింది. రూ.30 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. గ్రామంలో పశువైద్య ఉపకేంద్రం ఉన్నప్పటికీ సిబ్బంది లేక ఎప్పుడూ మూతపడే ఉంటుందని పేర్కొన్నారు. హాస్టల్‌కి వెళ్లిన బాలుడి అదృశ్యం కుల్కచర్ల: ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన నాగచైతన్య(14) తుంకులగడ్డ గురుకుల పాఠశాల(పరిగి)లో 9వ తరగతి చదువుతున్నాడు. కాగ వినాయకచవితికి ఇంటికి వచ్చిన అతడు తిరిగి ఈ నెల 8వ తేదీన హాస్టల్‌కి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. కుటుంబసభ్యులు ఆ రోజు సాయంత్రం హాస్టల్‌కి ఫోన్ చేసి సమాచారం అడగ్గా నాగచైతన్య రాలేదని సిబ్బంది పేర్కొంది. దీంతో తెలిసినవారి దగ్గర వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు ఆదివారం స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కుక్కల దాడిలో గొర్రె మృతి తాండూరు రూరల్: కుక్కల దాడిలో ఓ గొర్రె మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం రచ్చకట్టతండాలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తండాకు చెందిన గోబ్రనాయక్ గొర్రెలను మేపుతూ జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో తన మందపై కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఓ గొర్రె మృతి చెందింది. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బాధితుడు కోరాడు. -
నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా
పూడూరు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి రైతులను ఇబ్బందులపాలు చేయడం సరికాదని పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రయోజనం కోసం పాత అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం భూ నిర్వాసితులతో కలిసి మండలంలోని మన్నెగుడలో చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రాకంచర్ల, పూడూరు, మంచన్‌పల్లి, తుర్క ఎన్కేపల్లి, గొంగుపల్లి, ఎన్కేపల్లి తదతర గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు. కొడంగల్: కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తాండూరులోని వైద్య కళాశాల భవనంలో కొడంగల్ మెడికల్ కళాశాలను తాత్కాలికంగా నిర్వహించనున్నారు. అక్కడ అన్ని వసతులతో భవనాన్ని సిద్ధం చేశారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఈ నెల 16నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ర్యాంకర్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ నారాయణరావ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధం చేస్తోంది. ధారూరు: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం హిందీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల తాండూరు కళావేదిక ఫౌండర్, అధ్యక్షుడు కేవీఎం వెంకట్, హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షుడు మురారినాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందీ భాషను బాల్యం నుంచే నేర్చుకోవాలని సూచించారు. హిందీ దేశ ఐక్యతకు ప్రతీక అన్నారు. మన సంస్కృతి, సాహిత్య సంపదకు అద్దం పటే సాధనం హిందీ అని వారు పేర్కొన్నారు. హిందీ కవితా పఠనంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్పీ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సినీనటుడు శ్రవణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, నిర్వాహకులు పాల్గొన్నారు. -
పొగ వెలువడి.. శ్వాస కొరవడి
పహాడీషరీఫ్: అక్రమంగా కొనసాగుతున్న సీసం బట్టీలతో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉంది. జల్పల్లి పార్ధివాడ, శ్రీరాం కాలనీలలో ఎలాంటి అనుమతులు లేకుండా సీసం బట్టీలు (పాత బ్యాటరీల నుంచి సీసం కరిగించడం) యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నగరంలోని బ్యాటరీ, స్క్రాప్ దుకాణాల నుంచి పాడైన బ్యాటరీలు తీసుకొచ్చి ఇక్కడ వాటిని ధ్వంసం చేసి అందులోని సీసంను కరగపోస్తూ పెద్ద ఎత్తున కాలుష్యానికి పాల్పడుతున్నారు. ఈ సమయంలో వెలువడుతున్న దట్టమైన పొగలు స్థానిక ప్రజలను శ్వాస తీసుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రజలు మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. జల్పల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఒకట్రెండు పర్యాయాలు అధికారులు దాడులు చేసి సీసం బట్టీలు ధ్వంసం చేశారు. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న నిర్వాహకులు మళ్లీ తమ అక్రమాలను మొదలెట్టారు. తాజాగా మున్సిపల్ కార్యాలయం వెనుకాల కూతవేటు దూరంలో మరో బట్టీ ప్రారంభమయింది. భూమిలో కలుస్తున్న వ్యర్థాలు జల్పల్లి, శ్రీరాం కాలనీలలో కొనసాగుతున్న సీసం బట్టీలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కాలం చెల్లిన బ్యాటరీలను ధ్వంసం చేసి.. అందులో నుంచి సీసాన్ని వేడి చేసి బట్టీల ద్వారా కరగదీసి ద్రవంగా మార్చే క్రమంలో పెద్ద ఎత్తున రసాయన వ్యర్థాలను భూమిలోకి వదులుతున్నారు. ఈ కారణంగా శ్రీరాం కాలనీలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి బోర్లలో మొదటి 10–15 నిమిషాల పాటు నీరు రంగు మారి వస్తుండడం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో పాటు సీసంను కరిగించే సమయంలో క్యాడ్మియం, లెడ్ కరిగి దాని వ్యర్థాలు కూడా దుమ్ము రూపంలో పొగలో కలిసి కాలనీలో పడిపోతుంది. శ్వాసకోశ వ్యాధులు పగలు, రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న ఈ సీసం బట్టీలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దట్టమైన పొగల కారణంగా శ్వాస పీల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్య కారణంగా చిన్నారులు, వృద్ధులు, టీబీ, క్యాన్సర్, చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఈ సీసం బట్టీలు కొనసాగుతున్నా అటు మున్సిపాలిటీ గాని.. ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానాశ్రయాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అధికారులు పొగను పైకి విడుస్తూ సిగ్నల్‌ను ఇస్తారు. దాని ఆధారంగా విమానాల ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాని ఇక్కడ విమానాశ్రయానికి ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి అక్రమ కంపెనీల ద్వారా వెలువడుతున్న పొగతో పెను ప్రమాదమే పొంచి ఉంది. జల్పల్లిలో ప్రజారోగ్యానికి కుంపటిలా సీసం బట్టీలు కలుషితమవుతున్న భూగర్భ జలాలు విమానాలకు పొంచి ఉన్న సిగ్నల్ సమస్య -
150 కిలోల నల్లబెల్లం పట్టివేత
ఆమనగల్లు: నాటుసారా తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికలను స్వాధీనం చేసుకుని ఒక మహిళను ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లం, పటికలను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ బృందం, ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం ఆమనగల్లు బస్టాండ్‌లో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన మహిళ వద్ద ఉన్న బస్తాలను తనిఖీ చేయగా 150 కిలోల నల్లబెల్లం, 15 కిలోల పటిక లభ్యమైంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని, నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కు చెందిన ఎల్లమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు, సిబ్బంది సురేశ్, శ్రీను, శ్రీజ తదితరులు ఉన్నారు. తరలిస్తే కఠిన చర్యలు నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ముడి పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బద్యానాద్‌చౌహాన్ హెచ్చరించారు. దసరా పండుగ నేపథ్యంలో సారా తయారీ కోసం హైదరాబాద్ నుంచి నల్లబెల్లం, విప్పపువ్వు, ఇతర విడి పదార్థాలు తరలిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.ఆమనగల్లు బస్టాండ్‌లో ఎకై ్సజ్ పోలీసుల సోదాలు -
27వేల కేసులు పరిష్కారం
అనంతగిరి: లోక్ అదాలత్‌కు వచ్చే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ కోర్టుల పరిధిలో మొత్తం 27వేల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ, ఈ – పిట్టీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాంకులు, చిన్న చిన్న తగాదాలు తదితర కేసులు ఉన్నాయన్నారు. ఇరువర్గాలు విశాల దృక్ఫథంతో ఆలోచిస్తే లోక్ అదాలత్ ద్వారా కేసుల నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవ సెక్రటరీ, సీనియర్ సివిల జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, ఎస్పీ నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజు, సీనియర్ న్యాయవాదులు మాధవరెడ్డి, నాగరాజు, వెంకటేష్, శ్రీనివాస్, పీపీలు మేరాజ్బేగం, అన్వేష్‌సింగ్, సమీనాబేగం, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు భీంకుమార్, వెంకట్, రఘురాం, పలువురు అధికారులు, సీని యర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సత్వర పరిష్కారం కోసమే.. కొడంగల్ రూరల్: కేసుల సత్వర పరిష్కారం కోసమే మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు కొడంగల్ మున్సిఫ్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బి.శ్రీరామ్ తెలిపారు. శనివారం పట్టణంలోని మున్షిఫ్ కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 152 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న తగాదాలను కక్షిదారులు సమన్వయంతో పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు బస్వరాజ్ అడ్వకేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు ఏవీ ఆనంద్, రవీందర్ నాయక్, బీ వెంకటయ్య, టీ రాములు, కృష్ణయ్య, రమేష్, భానుప్రసాద్, భాగ్యలత తదితరులు పాల్గొన్నారు. 70 కేసులకు పరిష్కారం తాండూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 70 కేసులకు పరిష్కారం లభించింది. శనివారం తాండూరు కోర్డులో మండల్ లీడల్ అథారిటీ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ శివలీల, అడిషనల్ జడ్జి అంబటి ప్రణయ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్ కేసులు 2, సీసీ క్యాలెండర్ కేసులు 21, చెక్ బౌన్స్ కేసులు 2, నేరం ఒప్పుకోలు 14, ప్రాథమిక విచారణలో గల కేసులు 15, ఎకై ్సజ్ శాఖకు చెందిన 16 కేసులకు పరిష్కారం కల్పించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్వేష్ సింగ్, లోక్ అదాలత్ సభ్యులు మనోహర్‌రావు,ఎం.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పరిగిలో 261 కేసులకు..పరిగి: జాతీయ లోక్ అదాలత్‌కు మంచి స్పందన వచ్చిందని పరిగి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజీస్ట్రేట్ నాగులశిల్ప తెలిపారు. శనివారం పరిగి కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 261 కేసులు పరిష్కరించినట్లు తెలి పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందం, లోక్ అదాలత్ సభ్యు లు బి.లింగం, శివారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇబ్రహీంఖాన్, సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గౌడ్, వెంకట్ రాములు, నర్సింహారెడ్డి, గౌస్‌పాషా, శ్రీనివాస్ యాదవ్, గోపాల్, వెంకటేశ్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
సీఎంను కోరిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ నాయక్ బొంరాస్‌పేట: మండలంలోని బాపల్లి తండాలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సంతోష్ నాయక్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం ముఖ్యమంత్రిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. తండాలోని పలువురు రైతులు ఏళ్ల తరబడి భూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తేగా భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బోర్డు విధి విధానాలను వివరించండి అనంతగిరి: సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ దోర్నాల సత్యం మాట్లాడుతూ.. బోర్డు విధి విధానాలను ప్రతినిధులకు వివరించారు. సామాజిక న్యాయం కోసం చేయాల్సిన కృషిని, మహిళల సంక్షేమం కోసం చేపట్లాల్సిన కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు వేమారెడ్డి, శశిధర్, శ్రీధర్, వీరస్వామి, పాండుగౌడ్, రాములు, రాజేందర్‌గౌడ్, మహేష్, నర్సింలు, శ్రీనివాస్, అరుణ్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వికారాబాద్ యూనిట్ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ కమిటీ 2025 – 28 వరకు కొనసాగనుంది. అధ్యక్షుడిగా ఎం మాణిక్యప్రభు, కార్యదర్శిగా బుచ్చ య్య, ఫైనాన్స్ కార్యదర్శిగా సతీష్‌చంద్ర, అసో సియేటేడ్ అధ్యక్షుడిగా బందెప్పగౌడ్, ఉపాధ్యక్షులుగా మొగులయ్య, జీవన్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా జాషువా, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నాగభూషణం, పబ్లిసిటీ కార్యదర్శిగా సా యన్న, జిల్లా కౌన్సిలర్లుగా జనార్దన్, కిష్టయ్య ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాణిక్య ప్రభు మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి పెంటయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సభ్యులు దివాకర్‌రెడ్డి, నాగయ్య బొన్నల బస్వరాజు తదితరులు పాల్గొన్నారు. రబీ సాగుకు సన్నద్ధం పొలాలను చదును చేస్తున్న రైతన్న దుద్యాల్: ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో సైతం నీళ్లు ఉన్నాయి. దీంతో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. పొలాలను చదును చేసి పంటలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుత సీజన్లో వేరుశెనగ, తెల్ల కుసుమ, మొక్కజొన్న, బొబ్బర్లు, శనగ వంటి పంటలు వేసే అవకాశం ఉంది. -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాల ఎస్టీ, మైనార్టీ విభాగం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముస్లింలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాలకు కేసీఆర్ సమాన్యాయం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు గయాజ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్, సీనియర్ నాయకులు పురుషోత్తంరెడ్డి, శివకుమార్, చాంద్‌పాషా, హైమద్ పాషా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా ‘బ్లాక్’!
పరిగి: యూరియా కోసం ఓ వైపు రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట అధిక ధరలకు అమ్ముతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ కేంద్రంలోని చిన్నారి ఆస్పత్రి పక్కన ఉన్న గోదాం నుంచి శనివారం రాత్రి దుకాణదారుడు యూరియాను ఆటోలో తరలిస్తుండగా ఓ రైతు వీడియో తీసి వాట్సప్‌లో వైరల్ చేశాడు. ఒక్క బస్తా కోసం పగలురాత్రి తేడాలేకుండా తాము లైన్లో నిలబడినా, స్టాక్ అయిపోందని వెనక్కి పంపిస్తూ.. ఇలా రాత్రి వేళ బ్లాక్ మార్కెట్‌కు తరలించడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వెంకన్న కోవెలకు రూ.110 కోట్లు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ.33 కోట్లు మంజూరు చేసింది. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా విస్తరణతో పాటు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలోపు పనులు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు శ్రీవారి ఆలయ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ పునరుద్ధణ పనుల్లో భాగంగా దేవాలయ నిర్మాణంతో పాటు వివిధ పనులకు స్తపతిలు రూపొందించిన నక్షలను ముఖ్యమంత్రి ఆమోదించారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించనున్నారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధం చేశారు. క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు, మాఢ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు. గుడి విస్తరణకు రెండు ఎకరాలు కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 87,36 గజాల స్థలం సేకరించి అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించనున్నారు. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. భూమి విలువ, భవనం విలువను ఆర్అండ్బీ అధికారులు లెక్క కట్టి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. అదనంగా రూ.5 లక్షల సాయం, ఒక ఏడాది కుటుంబ అవసరాల కోసం రూ.40 వేలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి అయ్యే ఖర్చు (ట్రాన్స్పోర్ట్)రూ.60 వేలు, పశువుల దొడ్డి నిర్వహణకు రూ.25 వేలు, చేతి వృత్తులు, కుల వత్తుల వారికి రూ.30 వేలు, ఇతర ఖర్చుల కోసం రూ. 60వేలు చెల్లిస్తారు. ఇంటి స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. -
వాస్తవాలు తెలుసుకోవాలి
తుర్కయంజాల్: మేధావులు మౌనంగా ఉంటే చరిత్రను వక్రీకరించే అవకాశం ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం తుర్కయంజాల్‌లోని అరుణ కన్వెన్షన్ హాల్లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం– వాస్తవాలు, వక్రీకరణ’ అంశంపై టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. 1946 సెప్టెంబర్ 11న ప్రారంభమైన సాయుధ పోరాట పిలుపు చారిత్రక మలుపుగా నిలిచిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. నిజాం ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ పోరాట ఫలితంగానే తెలంగాణలో నిజాం పాలన అంతం కావడం, ప్రజలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించడం, పేదలకు వ్యవసాయ భూమి దక్కాయని అన్నారు. బీజేపీ ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు తామే సాయుధ పోరాటాన్ని నడిపినట్లు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేటి తరం యువత వాస్తవాలను గ్రహించి, చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షుడు బింగి రాములయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుగంధ, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాస్ -
ఉన్నవి సరిపోవు..
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరతకొత్తవి కొనరుపన్నులు, అనుమతుల రూపంలో మున్సిపాలిటీలకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు పురపాలికలకు ఏటా రూ.10 కోట్ల పైనే ఆదాయం ఉంది. పరిగికి రూ.6 కోట్ల వరకు, కొడంగల్‌కు రూ.2 కోట్లు వరకు పన్నుల రూపంలో వస్తోంది. ఇంతటి ఆదాయం ఉన్నా చెత్త సేకరణకు వాహనాల కొనుగోలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవి సరిపోక కొత్తవి రాకపోవడం, మరికొన్ని పాదవడంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మున్సిపాలిటీల్లో చెత్త వాహనాల కొరతపై ‘సాక్షి ’ ప్రత్యేక కథనం మరో 14 అవసరంకొడంగల్: మున్సిపల్ పరిధిలో కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, బూల్కాపూర్, ఐనన్‌పల్లి, కొండారెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12 వార్డులు, 18వేల జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో చెత్త సేకరణకు నాలుగు ఆటోలు, రెండు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఒక్కో ఆటో రెండు గ్రామాల్లో చెత్త సేకరించి కొడంగల్ సమీపంలోని డంప్ యార్డుకు తరలిస్తున్నారు. రెండు ట్రాక్టర్లు కొడంగల్ పట్టణంలో తిరిగి చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నాయి. గతంలో కొనుగోలు చేసిన నాలుగు ఎలక్ట్రికల్ వాహనాలు (ఆటోలు) ప్రస్తుతం పనిచేయడం లేదు. వాటిని వాటర్ ట్యాంకు దగ్గర ఉంచారు. మున్సిపల్ పరిధిలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొడంగల్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాలు సరిపోవడం లేదు. కొడంగల్‌కు 8 ఆటోలు, గ్రామాల్లో చెత్త సేకరణకు మరో 6 ఆటోలు అవసరం ఉన్నట్లు తెలిసింది. పారిశుద్ధ్య కార్మికులకు సోపులు, ఇతర వస్తువుల కోసం డబ్బులు చెల్లిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.నిరుపయోగంగా.. చెత్త బండ్లుపరిగి: పరిగి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు సరిపడా వాహనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణ పరిధిలో 18 వార్డులు.. 40వేలకు పైగా జనాభా ఉంది. 48 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. 10 ఆటోలు, 3 ట్రాక్టర్లతో రోజుకు 8 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. మూడు ఆటోలు చెడిపోయాయి. వాటికి మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా మరో 3 ఆటోలు కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. -
పేరుకే పెద్ద మున్సిపాలిటీ..
తాండూరు: జిల్లాలోనే తాండూరు అతి పెద్ద మున్సిపాలిటీ.. 36 వార్డులు.. 19 వేల గృహాలు, 95 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో చెత్త సేకరణకు 280 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం. ప్రస్తుతం 49 మంది రెగ్యులర్, 171 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 50మంది మున్సిపల్ కార్యాలయంలోని ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డుల నుంచి రోజూ 40 టన్నుల చెత్త వస్తోంది. ఇందుకోసం 36 ఆటోలు, 16 ట్రాక్టర్లు అవసరం కాగా కేవలం 24 ఆటోలు, 9 ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 10 ఆటోలు, రెండు ట్రాక్టర్లు పని చేయడం లేదు. దీంతో చెత్త సేకరణ సిబ్బందికి భారంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు కూడా అందడం లేదు. రెండు నెలల క్రితం కిట్ల కొనుగోలుకు రూ.50 లక్షలు కేటాయించారు. అందులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ వాహనాల కొనుగోలుపై, సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
వాగులో కలుస్తున్న ప్రాణాలు!
తాండూరు రూరల్: మండలంలోని తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో ఉన్న సంగెంకలాన్ గ్రామ దుస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వానాకాలం వచ్చిందంటే దినమొక గండంగా గడపాల్సిందేనని వాపోతున్నారు. వర్షం కురిస్తే చాలు ఊరి చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లుతాయని చెబుతున్నారు. వరద ఉధృతిని అంచనా వేయలేక గ్రామానికి చెందిన పలువురు వరదలో కొట్టుకుపోయి చనిపోయారని చెబుతున్నారు. గత గురువారం దిడ్డివాగులో కొట్టుకుపోయిన మొగులప్ప శుక్రవారం శవమై తేలిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం డిపో వాగులో పడి భక్తుంపల్లి పెంటప్ప మృతిచెందాడు. ప్రమాదానికి గురైన మరికొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కర్ణాటక సరిహద్దులో ఉన్న తమ గ్రామం శివారులోంచి పారుతున్న వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు. సంగెంకలాన్ చుట్టూ పారుతున్న దిడ్డివాగు, డీపో వాగు గ్రామంలోకి వెళ్లాలంటే వీటిని దాటాల్సిందే వర్షాకాలంలో తరచూ ప్రమాదాలు వంతెనలు నిర్మించాలని ప్రజల అభ్యర్థన -
కత్తులు దూసిన కుటుంబ కలహాలు
● వ్యక్తికి తీవ్ర గాయాలు ● పోలీసుల అదుపులో నిందితులు షాద్‌నగర్ రూరల్: కుటుంబ కలహా ల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన శనివారం ఉదయం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఆశాకాలనీకి చెందిన కాంట్రాక్టర్ గంతల ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమా రుడు పృథ్వీరాజ్ తన కొడుకుతో కలిసి శనివారం ఉదయం బైక్‌పై పట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాంకు వెళ్లి, పాలు తీసుకొని ఇంటికి వస్తున్నాడు. కేశంపేట రైల్వే గేటు మ లుపు వద్ద మాటువేసిన ప్రభు రెండో భార్య కుమారులు నందీశ్వర్, భరత్ అతనిపై కత్తులతో దాడి చేసి, పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం అందించారు. రక్త గాయా లతో కింద పడిన పృథ్వీరాజ్‌ను చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభు త్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ గొడవలే దాడికి కారణమని బాధితుడు తెలిపా డు ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
పురుగు మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే మోతిలాల్(40) డ్రైవర్ పని చేసుకుంటూ జీవించేవాడు. కుటుంబ కలహాలతో ఈ నెల 8వ తేదీన పురుగు మందు తాగాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. బతుకుపోరాటంలో ఆగిన గుండె కందుకూరు: బతుకు పోరాటంలోనే ఓ గుండె ఆగిపోయింది. మండల పరిధిలోని కటికపల్లికి చెందిన ఎంట్ల అశోక్(35) టిప్పర్‌పై డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద డస్ట్ లోడ్ నింపుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో వాహనాన్ని పక్కకు నిలిపేసి, డ్రైవింగ్ సీట్లోనే ప్రాణం వదిలాడు. మృతుడిడి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అశోక్ మృతితో వీరంతా దిక్కులేని పక్షులయ్యారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
యూరియా ఇవేం వెతలయా!
ఎండా, వానలకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమించి సిరులు పండించే అన్నదాతలకు యూరియా వెతలు వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం సైతం సరిపడా యూరియా బస్తాలు దొరకక ఫర్టిలైజర్ దుకాణాలు, ఆగ్రో సెంటర్ల ఎదుట బారులు తీరారు. పలుచోట్ల భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ సామరస్యంగా జరిగింది. ధారూరు: మండల పరిధిలోని మోమిన్‌ఖుర్దు గ్రామంలో రైతులు యూరియా కోసం ఆగ్రో సెంటర్ వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. టోకెన్లు ఇష్టారాజ్యంగా ఇవ్వడం, అసలైన వారికి దొరక్కపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో రైతులు రాగా ఏఓ పత్తా లేకపోవడం, ఏఈఓ ఒక్కడే ఇష్టానుసారంగా టోకెన్లు జారీ చేయడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. శనివారానికి 251, సోమవారానికి 200 టోకెన్లు ముందుగానే జారీచేశారు. క్యూలైన్లో చెప్పులు పెట్టి మరీ రైతులు వేచి ఉన్నారు. తప్పని యూరియా కష్టాలు! దోమ: చాలీచాలని యూరియా సరఫరాతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజులకు ఓ లారీలో ఆగ్రోస్ కేంద్రాలకు కొంతమేర యూరియాను సరఫరా చేస్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. శనివారం మండల పరిధిలోని మోత్కూర్ ఆగ్రోస్ కేంద్రంతో పాటు దిర్సంపల్లిలోని ఆగ్రోస్ కేంద్రానికి 30 టన్నుల యూరియాను అధికారులు సరఫరా చేశారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో రైతులు బారులు తీరి పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి వెచి ఉన్నారు. అందులో కొంత మందికి మాత్రమే యూరియా అందడంతో మిగతా వారు అధికారులపై మండి పడ్డారు. రాష్ట్రంలో రైతులను విస్మరించి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే సరిపడా యూరియాను అందించేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. దోమ: మోత్కూర్ ఆగ్రోస్ కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు ధారూరు: మోమిన్ఖుర్దులో యూరియా కోసం క్యూలైన్లో రైతులు ఇష్టానుసారంగా టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహం పలుచోట్ల ఆందోళన చేపట్టిన రైతులు దుకాణాల ఎదుట కర్షకుల పడిగాపులు క్యూ లైన్లలో చెప్పులు ఉంచి నిరీక్షణ -
యూరియా దందాపై షోకాజ్
బషీరాబాద్: అధిక ధరలకు యూరియా విక్రయించిన సాయిధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపు యజమానిపై చర్యలకు వ్యవసాయ అధికారులు సిద్ధమయ్యారు. శనివారం ‘యూరియా దందా.. రైతు బెంగ’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి బషీరాబాద్ వ్యవసాయ అధికారిణి అనిత స్పందించారు. ఈ మేరకు షాపు యజమాని రాఘవేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులో మూడు అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఐదు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్(ఎఫ్సీఓ) 1985 చట్టం ప్రకారం యూరియా బస్తా ధర రూ.266.50గా నిర్ణయిస్తే రైతులకు అంతకంటే ఎక్కువ ధరకు ఎందుకు విక్రయించారని, ఫర్టిలైజర్ షాపు ముందు ధరల పట్టిక ఎందుకు ఏర్పాటు చేయలేదని, అలాగే రైతులకు రసీదులు ఎందుకు ఇవ్వలేదో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. రైతులను మోసం చేస్తే లైసెన్సు రద్దు ఎందుకు చేయరాదని హెచ్చరించారు. సాయిధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపులో డీఏపీ బస్తాకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350కు బదులు రూ.1,450 విక్రయిస్తున్నారు. ఇదే విషయమై వ్యవసాయ అధికారులకు రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఫర్టిలైజర్ షాప్ యజమానికి నోటీసులు -
ధారూరులో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
ధారూరు: మండల కేంద్రంలో శనివారం ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జామ మసీదు నుంచి కమాన్, బస్టాండు మీదుగా లతీఫున్నీసా మసీదు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలోని దారుస్సలాం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలోని మోమిన్‌కలాన్, నాగారం, దోర్నాల్, స్టేషన్‌ధారూరు, కుక్కింద, కేరెళ్లి, ధారూరు, ఎబ్బనూర్ తదితర గ్రామాల నుంచి ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు హాజరైనట్లు వివరించారు. దారుస్సలాంలో రాత్రంతా జాగారం, ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ధారూరు ఎంఐఎం అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారుస్సలాంకు తరలిన ముస్లింలు -
బాల్య వివాహాలను నిరోధించాలి
తాండూరు టౌన్: బాల్య వివాహాల అడ్డుకట్టకు పురోహితులు సహకరించాలని సాధన ఎన్జీఓ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం, శ్రీకాళికాదేవి ఆలయంలో పురోహితులచే బాల్యవివాహాల నిర్మూలనకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలకు 18ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి జరిపించాలన్నారు. బాలికలకు బాల్య వివాహం చేయడంతో వారి మానసిక స్థితి, జీవన విధానంలో పెను మార్పులు సంభవించే ప్రమాదం ఉందన్నారు. సహజ సిద్ధమైన జీవనం కొనసాగించడంలో ఇబ్బందులకు గురవుతారన్నారు. కావున పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు బాల్య వివాహాలకు సహకరించ రాదన్నారు. సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహం జరిగే క్రమంలో వెంటనే 1098 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ ప్రతినిధులు నర్సిములు, రమేశ్, రోజా, శ్రీనివాస్‌రెడ్డి, పురోహితులు కిరణ్, తిరుమలరావు, జగదీశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. సమాచారం ఇవ్వాలి తాండూరు రూరల్: సమాజంలో బాల్య వివాహాలను రూపుమాపాలని సాధన సచ్ఛంద సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ సూచించారు. శనివారం మండలంలోని భూకై లాస్ దేవస్థానంలో బాల్య వివాహాలను అరికట్టాలని పూజారులతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్‌లైన్ 1098, పోలీస్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సాధన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సాధన సచ్ఛంద సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ -
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కావెంజర్లకు 11 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు విన్నవించినా పరిష్కారం కావడం లేదన్నారు. వెంటనే స్కావెంజర్ల సమస్యలు తీర్చాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వెంకటప్ప, కార్యదర్శిగా సయ్యద్ అలీ, ఉపాధ్యక్షుడిగా నర్సిములు, సహాయకార్యదర్శిగా బుగ్గప్పలతో పాటు కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య -
వర్షాలకు కూలిన ఇల్లు
పరిగి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలింది. పట్టణ కేంద్రంలోని వల్లభనగర్ కాలనీలో షమీభేగంకు చెందిన ఇల్లు వర్షానికి శుక్రవారం రాత్రి కూలిపోయింది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో నలుగురు పిల్లలలో ఉన్న చిన్నపాటి ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇల్లు కూలడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వచ్చిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై శ్రద్ధ అవసరం కొడంగల్ రూరల్: విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల సహాయ అభివృద్ధి తాండూరు డివిజన్ అధికారి వి.పాండు సూచించారు. శనివారం పట్టణంలోని ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న వసతులను వివరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నట్లు, వసతి గృహం నుంచి విద్యార్థులకు అందించే వస్తువులు, స్పెషల్ తరగతులు తదితర విషయాలను వివరించారు. చదువులో వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులతో బోధనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారులు హన్మంత్‌రెడ్డి, వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు బొంరాస్‌పేట: మండల కేంద్రం శివారులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోస్గి మండలం తొగాపూర్కు చెందిన బొప్పలి వెంకటేశ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో బొంరాస్‌పేట చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్ కాళ్లు, చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. క్షతగాత్రుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు. వరద ఉధృతితో రాకపోకలకు అవస్థలు ధారూరు: మండల కేంద్రంలో శనివారం జరిగిన కూరగాయల సంతకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు వాగు ఉధృతితో తిరిగి వెళ్లలేకపోయారు. భారీ వర్షానికి చింతకుంట– హరిదాస్‌పల్లి రోడ్డు మీదుగా ప్రవహించిన వాగు వద్దే ఆగిపోయారు. రాత్రి 7 గంటలైనా వరద తీవ్రత తగ్గకపోవడంతో అక్కడే కూర్చుండిపోయారు. పాలకులు స్పందించి, వాగులపై కల్వర్టులు నిర్మించాలని కోరారు. -
ఆధునికత వైపు అడుగులు
కొడంగల్: మున్సిపాలిటీల్లో కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఇంటికి ఆన్లైన్లో డిజిటల్ నంబర్ కేటాయిస్తున్నారు. ఆస్తి హక్కుపై ప్రజలకు భరోసా కల్పించడానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో పారదర్శకత.. జవాబుదారీతనం ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం అధికారులు తప్పు చేసినా.. ఇంటి యజమాని తప్పు చేసినా.. ఎవరు తప్పు చేసినా ఇంటి యజమానిదే బాధ్యత. ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్ చట్టాన్ని అతిక్రమిస్తే పాతిక రేట్లు జరిమానా విధించనున్నారు. ఆచరణలోకి డిజిటలైజేషన్ కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి ఇల్లు ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో లేని ఇంటికి జరిమానాలు విధించే అధికారం మున్సిపల్ సిబ్బందికి ఉంది. ప్రతి ఇంటికి డిజిటల్ నంబర్ ఉండాలి. నంబర్‌తో ఆస్తులకు భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో ఆన్లైన్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఇళ్లకు నూతన డిజిటలైజేషన్ విధానం ఆచరణలోకి వచ్చింది. ప్రతి ఇంటికి డిజిటల్ నంబర్లు కేటాయించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. దీని ద్వారా యజమాని ఇంటి వివరాలతో పాటు పన్ను చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే విషయాలు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. వార్డుల ఆధారంగా మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు వార్డుల ఆధారంగా ఇంటి నంబర్లు ఉన్నాయి. మొదటి అంకెతో మొదలై మధ్యలో అడ్డగీత తర్వాత ఇంటి నంబర్లు ఉన్నాయి. బై నంబర్లు పెరగడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇళ్ల చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. పెరిగిన నివాస గృహాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ నంబర్లను ఇళ్లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లోకేషన్‌తో సమాచారం తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారు. డిజిటల్ నంబర్లు నూతన విధానంలో ఇకపై మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇళ్లకు డిజిటల్ నంబర్ ప్లేట్ ఇవ్వనున్నారు. పిన్‌కోడ్ తరహాలో రాష్ట్ర, జిల్లా, పురపాలిక, వార్డులను తెలిపేలా కోడ్ ఉంటుంది. డిజిటల్ ఇంటి నంబర్‌ను ఇంటర్నెట్లో నమోదు చేయడం ద్వారా గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటి అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంటి నంబర్‌తో పాటు బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే పన్నుల చెల్లింపు, బకాయిల వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా ఇండ్లు కట్టుకునే వారు ఇంటి ప్లాన్ ప్రకారమే కట్టాలి. ఇంటి ప్లాన్లు ఇచ్చే ప్లానర్ తప్పు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధిలో ఇంటి నిర్మాణాలు చేయాలంటే నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.ప్రతి ఇల్లూ ఆన్లైన్లో నమోదు ఆస్తి హక్కుపై పూర్తి భద్రత మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం చర్యలు చేపట్టిన పుర అధికారులు -
బీసీ నేతకు శుభాకాంక్షల వెల్లువ
తాండూరు టౌన్: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకొన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని 25వ వార్డు చిన్నారులకు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి కృష్ణయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం తాండూరు అధ్యక్షురాలు అనిత, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, నాయకులు షుకూర్, సాయప్ప, వెంకటేశ్, బస్వరాజ్, నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మి, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. తరలివెళ్లిన నాయకులు.. అనంతగిరి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య జన్మదినాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన బీసీ నేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్.కృష్ణ, జిల్లా కార్యదర్శి అనంతయ్య, మల్లేశం, పాండు, పెంటయ్య తదితరులు ఉన్నారు. ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు -
రోడ్డెక్కిన విద్యార్థులు
తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు బీజేపీ, ఏబీవీపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించడం మరిచి పోయిందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థుల బాధలు పట్టడం లేదని ఆరోపించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పూర్తిగా ఫీజు రీయిబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి చదువుతున్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడిగా బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలలు మూసి వేసే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, నాయకులు భద్రేశ్వర్, సాహు శ్రీలత, మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కొండాకు వినతి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయించాలని తాండూరు ప్రైవే టు డిగ్రీ కళాశాలల యాజమాన్యం, బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తాండూరులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి చెల్లించక పోవడంతో కళాశాలలు మూత పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇది పరోక్షంగా ఉన్నత చదువులు చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరయ్యేలా చూడాలని ఎంపీని కోరారు. -
కూటమి ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం
దోమ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అప్రజాస్వామికమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పీర్ మహమ్మద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, మీడియాపై దాడులకు తెగబడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఆ దిశగా సాక్షి ముందుకు సాగడంలో తప్పేముందని ఏపీ సర్కారును ప్రశ్నించారు. కథనాలు, వార్తల్లో ఏవైనా అవాస్తవాలు, లోటుపాట్లు ఉంటే వివరణ, సంజాయిషీ కోరవచ్చని తెలిపారు. కానీ కేవలం కక్ష సాధింపు ధోరణితో కేసులు బనాయించడం పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికై నా ఇలాంటి చర్యలను ఆపకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహమ్మద్ -
హేయమైన చర్య
ప్రజాస్వామ్యంపై దాడి ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. రైతాంగ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను వెలుగులోకి తేవ డం తప్పా..?. ప్రభుత్వం పత్రికలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అక్రమ కేసులు పెడుతోంది. ఏపీలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. –బుగ్గప్ప, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు దాడులు సరికాదు ఏపీ ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కాలని చూస్తోంది. ఇలాంటి వాటిని ఎవరూ హర్షించరు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య. ప్రజల కోసం.. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే మీడియా ఎంతో కీలకం. అలాంటి దాన్ని కట్టడి చేయాలని చూడటం సరికాదు. – ఎండీ ఫరీద్, న్యాయవాది, తాండూరు పత్రికా స్వేచ్ఛను హరించడమే సాక్షి దినపత్రిక, ఎడిటర్, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం తప్పా..?. ఇవి ముమ్మాటికీ తప్పుడు కేసులే. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడటం సరికాదు. – ముకుంద నాగేష్, టీజేఏసీ చైర్మన్, వికారాబాద్ విలువలు కాలరాయడమే సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై దాడు లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ తప్పుపట్టాల్సిందే. అక్రమ అరెస్టులు, బెదిరింపులు మంచివికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ చాలా ప్రధానమైనది. దీన్ని హరించడం మంచి పద్ధతి కాదు. ఆధారాలు లేకుండా కేసులు పెడితే ప్రజల ముందు నిలబడవు. – ఆర్.మైపాల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సమాజం హర్షించదు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మీడియా స్వేచ్ఛ ను కాలరాస్తోంది. జ ర్నలిస్టుల గొంతు నొక్కడమంటే ప్రజా హక్కులను హరించడమే. నిర్బంధాలు, దాడులతో వాస్తవాలను దాచలేరు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఏపీ కూటమి ప్రభుత్వ చర్యలను సమాజం హర్షించదు. – వై.గీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి -
మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ
కుల్కచర్ల: ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పించనున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి జిల్లా సంచాలకులు మహ్మద్‌అలీ ఖాన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని మహిళలందరికీ ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పిస్తామని, ఆసక్తి ఉన్న మహిళలు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీ దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన నాయికోటి శ్రీకాంత్, కుదురుమల్ల గ్రామానికి చెందిన సున్నపు దస్తప్ప వేర్వేరు ప్రాంతాల్లో తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్నారు. వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఈఐఆర్ పోర్టల్ సహకారంతో మొబైల్స్ గుర్తించి కానిస్టేబుల్ శంకర్, శ్రీశైలం శుక్రవారం బాధితులకు అందజేశారు. యువతి పెళ్లికి కానుక రూ.1.11లక్షలు అందజేసిన కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ అన్సారీ బంట్వారం: కోట్‌పల్లి మండలం కరీంపూర్‌లో ఓ యువతి వివాహానికి కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ అన్సారీ రూ.1.11లక్షలు అందజేశారు. వివరాలలోకి వెళితే.. కరీంపూర్‌లో ఆడపిల్ల వివాహానికి రూ.1.11లక్షలు, యువకుడికి రూ.51,100 వివాహ కానుక ఇస్తానని ఇటీవల ప్రకటించారు. శుక్రవారం గ్రామంలో కావలి రాజు చైతన్యకుమారి దంపతుల కూతురు శ్రీవర్ధిని వివాహానికి రూ.1.11లక్షల నగదును యువతి తల్లిదండ్రులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రైతు ధారూరు: పశుగ్రాసం మేస్తున్న ఎద్దు విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని జీడిగడ్డతండా సమీప వ్యవసాయ పొలంలో చోటుచేసుకుంది. నేనావత్ రాములునాయక్‌కు చెందిన ఎద్దు మేతమేస్తూ రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. విద్యుదాఘాతంతో కొట్టుకుంటుండగా రైతు దగ్గరా వెళ్లేందుకు యత్నించాడు. గమనించిన సమీపరైతులు అడ్డుకోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎద్దు విలువ సుమారు రూ.70వేలు ఉంటుందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు కోరాడు. గణితఫోరం అధ్యక్షుడిగా శ్రీధర్‌రెడ్డి బషీరాబాద్: గణిత ఫోరం తాండూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా జీవన్గీ పాఠశాలకు చెందిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం తాండూరు నంబర్–1 పాఠశాలలో నియోజకవర్గ గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గణిత ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు గణిత ఫోరం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి క్విజ్లు, పోటీ పరీక్షల ద్వారా గణిత మెలకువలను నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్ వీరేశం, జిల్లా రీసోర్స్ పర్సన్లు, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలిక కిడ్నాప్ కేసులో..
బాలుడి తల్లిదండ్రులకు రిమాండ్ కుల్కచర్ల: ప్రేమ పేరిట బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాలికను.. అదే కాలనీకి చెందిన బాలుడు గత ఏప్రిల్ 10న అపహరించుకు వెళ్లాడు. ఇందుకు బాలుడి తల్లిదండ్రులు రాజమ్మ, సత్తయ్య సహకరించారని, బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించిన పోలీసులు శుక్రవారం బాలుడి తల్లిదండ్రులను రిమాండ్‌కు తరలించారు. మైనర్ల ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో సహకారం అందిస్తే పోక్సో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్తంభించిన రాకపోకలు ధారూరు: కాగ్నానదితో పాటు మండలంలోని వాగులన్నీ శుక్రవారం నిండుగా ప్రవహించాయి. గట్టెపల్లి గ్రామ అడవిలోని బాలోనికుంట నిండి పెద్ద చెరువులోకి వరద పారింది. ఈ నీరు తట్టెపల్లితండా రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో ధారూరు– గట్టెపల్లి, గట్టెపల్లితండాల మధ్య రాకపోకలు స్తంభించాయి. తప్పని పరిస్థితిలో కొంతమంది రుద్రారం మీదుగా వచ్చివెళ్లారు. కల్లాల్లోని పంట వరదపాలు! ధారూరు: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని పలువురు రైతులు సాగు చేసిన పంటలు పాడవుతున్నాయి. రాంపూర్‌తండా గిరిజనులు సాగుచేసిన వేరుశనగ పంట దెబ్బతింది. వరుస వర్షాలతో మూడు రోజులుగా పొలాలకు వెళ్లని రైతు శుక్రవారం పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు యాభై ఎకరాల్లో కోసిన వేరుశనగ పంట కల్లాలనుంచి కొట్టుకుపోయింది. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. స్కూటీ డిక్కీలోంచి నగదు చోరీశంకర్పల్లి: బ్యాంకులో నగదు డిపాజిట్ చే సేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని.. క్యూలైన్ కొంపముంచింది. ఈ ఘటన శుక్రవారం శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్‌కి చెందిన ప్రమోద్ గౌడ్(25) పట్టణంలో ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయన తల్లి డ్వాక్రా సంఘానికి సంబంధించిన రూ. 2.97లక్షల డబ్బులను యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పింది. మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లగా క్యూలైన్ ఎక్కువ ఉంది. దీంతో ల్యాబ్‌లో పనిచేసుకుని వద్దామని నగదును స్కూటీలో పెట్టుకుని వెళ్లాడు. 15నిమిషాల తర్వాత బయటకి వచ్చి చూడగా నగదు మాయమైంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
శిథిల భవనాలు
వికారాబాద్: జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యా లయాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతా తెలియని పరిస్థితి నెలకొంది. నూ తన భవనాలు, మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు చేయించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందేళ్ల నాటి భవనంలో ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ కాలపరిమితి ముగిసిందని పదేళ్ల క్రితమే అధికారులు నివేదిక ఇచ్చారు.. కానీ అందులోనే ఉద్యోగులు, సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం కుప్పకూలిన కూలిపోయిన నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని హైరానా పడుతున్నారు. ఒక్క జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయమే కాదు అనేక భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇందులో కొన్ని చిన్నపాటి వర్షాలకే ఉరుస్తున్నాయి. ఇంకొన్ని పెచ్చులూడి పడుతున్నాయి. దెబ్బతిన్న కార్యాలయాలు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్, పరిగి కార్యాలయాలు అధ్వానంగా మారాయి. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం, తాండూరు, బషీరాబాద్, వికారాబాద్, పరిగి తహసీల్దార్ కార్యాలయ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి కాలపరిమితి ముగిసిందని పదేళ్ల క్రితమే ఆర్అండ్బీ అధికారులు నివేదిక ఇచ్చారు. అయినా వాటిలోనే కార్యాలయాలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని మాత్రం ఇటీవల తాత్కాలిక భవనంలోకి మార్చారు. తాండూరు పశువైద్యశాల, పరిగి ఆర్అండ్బీ కార్యాలయ భవనం, మార్కెట్ కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కలెక్టరేట్లో లీకేజీలు కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం వికారాబాద్‌లో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. 2022లో అప్పటి సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. రూ.60.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం రెండేళ్లకే లీకేజీ అవుతోంది. పాల్ సీలింగ్ ఊడి పడుతోంది. పెచ్చులూడి పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పై అంతస్తు నుంచి నీళ్లు కారుతున్నాయి. మరమ్మతు పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భవన నిర్మాణ సమయంలో నాణ్యత పాటించకపోవటం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయా శాఖల అధికారులు అంటున్నారు. -
వాగులో గల్లంతై.. శవమై తేలాడు
తాండూరు రూరల్: దిడ్డి వాగు దాటుతూ గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. మండల పరిధిలోని సంగెంకలాన్కు చెందిన భుక్తంపల్లి మొగులప్ప(47) గురువారం చెట్టినాడు ఫ్యాక్టరీ–సంగెంకలాన్ మధ్యలో దిడ్డి వాగు దాటుతూ కొట్టుకుపోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వాగు ఉధృతంగా ప్రవహించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. తాండూరు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జలేంధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 16 మందితో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించి గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచ్ మేగనాథ్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రకృతి విపత్తు సాయం కింద రూ.5లక్షల విలువైన చెక్కును మృతుడి భార్య లలితమ్మకు అందజేశారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు భీంరెడ్డి, సతీశ్‌రెడ్డితో మాట్లాడి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుబీమా కింద రూ.5లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. దిడ్డివాగుపై తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం మృతదేహానికి తాండూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ సహాయక చర్యల్లో తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఐ గోపి, ఎంపీఓ వీరప్ప, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, ఎస్ఐ రాథోడ్ వినోద్ కానిస్టేబుళ్లు, నాయకులు శ్రీను, నాగప్ప, ధారాసింగ్, ఉత్తమ్‌చందు, రాజేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి ఉన్నారు. మృతదేహంతో బంధువుల ఆందోళన ప్రకృతి విపత్తు సాయం కింద రూ.5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ -
ప్రజలతో మమేకం కండి
బంట్వారం: ప్రజలతో మమేకం కావడంతోపాటు వారితో స్నేహపూర్వంగా మెలగాలని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల స్థితిగతులపై ధారూరు సీఐ రఘురాములు, స్థానిక ఎస్ఐ శైలజకు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. నేరం చేసిన వారు తప్పించుకోకుండా దర్యాప్తు చేయాలని తెలిపారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా మరింత చేరువ కావాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని అవసరం ఉన్న సమయంలో ఉపయోగించాలని అన్నారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. నిత్యం వాహనాలను తనిఖీ చేయా లని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, వ్యా పారులపై నిఘాను పటిష్టం చేయాలని తెలిపారు. సమస్యలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని సూచించారు. కమ్యూ నిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువకుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
ధారూరు: యువకుడిలో దాడిలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నీరటి అంజిలయ్య అలియాస్ ఆంజనేయులు(45), భారతమ్మ దంపతులు గ్రామంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించుకుంటూ జీనవం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 13న యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేశారు. ఆయిల్ తక్కువగా ఉందని నిర్వాహకులతో సదరు యువకులు గొడవకు దిగారు. మారణాయులతో దాడికి దిగారు. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన గ్రామానికి చెందిన అమర్నాథ్పై సైతం దాడి చేసి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడిలో అంజిలయ్య, భారతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. భారతమ్మ మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు బండరి కృష్ణ, అనంతయ్యపై కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. వీరి దాడిలో గాయపడిన అంజిలయ్య మంచాన పడి ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. తన భర్త మృతికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
జర్నలిజానికి సంకెళ్లు.. ప్రమాదకరం
తాండూరు: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులను రాజకీయ కక్షసాధింపులకు గురిచేయడం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేసే జర్నలిజానికి సంకెళ్లు వేయాలనుకునే ధోరణి ప్రమాదకరమని తెలిపారు. ప్రభుత్వాలు.. పత్రికలు నిర్మాణాత్మక దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత దక్కుతుందని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులను ఎవరూ అంగీరించడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్ -
ఘనంగా ‘గురువందనం’
తపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం తాండూరు టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను గురువందనం అనే కార్యక్రమం పేరుతో తాండూరులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, కోశాధికారి లక్ష్మీకాంతరావు తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగంలో నెలకొని సమస్యల పరిష్కారం కోసం తపస్ పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, దేశ హితం కోసం, విద్యార్థి బంగారు భవిష్యత్ కోసం నిరంతరం తపించే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, రాములు, ఆనందం, సుభాష్ రెడ్డి, బస్వరాజ్, మాణిక్ రావు, జనార్ధన్ రెడ్డి, నరహరి రెడ్డి, వీరేశం, సంతోష్, వినోద్, రవి, సిద్రామేశ్వర్, అనిల్, శ్రీనివాస్, సంతోష, శోభ తదితరులు పాల్గొన్నారు. 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొ. పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొడంగల్‌లో.. కొడంగల్ రూరల్: 2025 –26 విద్యా సంవత్సరానికి రాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీఏ ఇంగ్లిష్ మీడియంలో 30 సీట్లు, తెలుగు మీడియంలో 76 సీట్లు, బి.కాం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 23 సీట్లు, బీఎస్సీ బీజెడ్సీ, జీజెడ్సీ.ఎస్ ఇంగ్లిష్ మీడియంలో 31 సీట్లు, తెలుగు మీడియంలో 30 సీట్లు, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీ.ఎస్‌లో ఇంగ్లిష్ మీడియంలో 46సీట్లు, తెలుగు మీడియంలో 50 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో సంప్రదించాలన్నారు. రిజర్వేషన్లకు లోబడి అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. పరిగి డిగ్రీ కళాశాలలో.. పరిగి: పరిగి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పీట్ అడ్మిషన్‌న్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సునీతాపద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 15,16వ తేదీల్లో హాజరుకావాలని సూచించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కమిటీ ఏర్పాటు అనంతగిరి: స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కమిటీని శుక్రవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా భానూర్ మహేందర్‌రెడ్డి, మహిళా కన్వీనర్‌గా సుజాత, పర్యావరణ ప్రముఖ్‌గా ఎల్.మహేందర్‌రెడ్డి, ప్రచార ప్రముఖ్‌గా ప్రేంకుమార్, కోకన్వీనర్లుగా వెంకట్, ఆంజనేయులు, శివశంకర్, భానుప్రకాష్‌ను నియమించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పాలమూర్ విభాగ్ సహ కార్యవాహా కెరెళ్లి అనంత్‌రెడ్డి, స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర కో కన్వీనర్ ఈశ్వర్ జీ, పాలమూర్ విభాగ్ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, విభాగ్ కుటుంబ ప్రబోధక్ ఎలకంటి పురుషోత్తం, వికారాబాద్ కన్వీనర్ సురేష్‌గౌడ్, కృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్‌కుమార్‌కు బంగారు పతకం పరిగి: పరిగి సబ్ జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ బంగారు పతకం సాధించారు. నగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిసన్స్ డ్యూటీ మీట్ –2025లో ఫస్ట్ ఎయిడ్ విభాగంలో పాల్గొని బంగారు పతకం గెలుపొందాడు. తెలంగాణ జైళ్ల శాఖ వరుసగా 3వ సారి ఓవరల్ ఛాంపియన్ షీప్ సాధించింది. దేశంలోని 21 రాష్ట్రాలు పాల్గొనగా జాతీయ స్థాయిలో రాజ్‌కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. -
కొడంగల్.. జిగేల్
శరవేగంగా నియోజకవర్గ అభివృద్ధి కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.10 వేల కోట్లతో వివిధ పనులు చేపట్టారు. వీటిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్, మహిళా పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేందాన్ని మంజూరు చేశారు. కొడంగల్‌లో 220 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేశారు. కొడంగల్‌లో రూ.6.80 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు విడుదల చేశారు. సమీకృత గురుకుల విద్యా సంస్థలను (ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్స్) మంజూరు చేశారు. కొడంగల్, కోస్గిలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. ఆదర్శంగా తీర్చిదిద్దుతాం కొడంగల్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనుల కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుమారు రూ.10వేల కోట్లు మంజూరు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాల్లో త్వరలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాం. క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్సు కోచింగ్ సెంటర్, వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టం తదితర పనులు త్వరలో ప్రారంభమవుతాయి. – తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ -
యూరియా దందా.. రైతన్న బెంగ
బషీరాబాద్: రైతుల యూరియా ఇబ్బందులను ప్రైవేట్ ఎరువుల దుకాణాదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ బిల్లులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఒక్కో బస్తాకు రూ.80 చొప్పున వసూలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుజూసింది. లేబర్ లేకున్నా చార్జీలు వసూలు మండల పరిధిలోని నావంద్గీ సహకార సంఘం, సాయిధనలక్ష్మి ఎరువుల దుకాణం నుంచి రైతులకు యూరియా విక్రయిస్తున్నారు. సొసైటీలో ప్రభుత్వ ధరకు విక్రయించడంతో రైతులు పెద్ద ఎత్తున బారు లు తీరుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. మండల కేంద్రంలోని సాయిధనలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణానికి బుధవారం 22 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతు లు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వం 45 కేజీల యూరియా బస్తాకు రూ.266.50 ధరణ నిర్ణయించింది. ఇదే అదునుగా భావించిన సాయిధనలక్ష్మి ఎ రువుల దుకాణ యజమాని ఒక్కో బస్తాకు రూ.320–రూ.350 వరకు వసూలు చేశారు. రైతులు అడిగినా బిల్లులు ఇవ్వలేదు. యూరియా బస్తాలు రైతులే మోసుకుని ఆటోలు, జీపుల్లో వేసుకున్నా వారికి కూడా లేబర్ చార్జీల పేరిట బస్తాకు రూ.6 చొప్పున అదనంగా వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు రైతులు మండల వ్యవసాయాధికారిని అనితకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె శుక్రవారం దుకాణానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఓ రిజిస్టర్లో రైతుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు రాసుకున్నట్లు గుర్తించారు. ఒక్క రైతుకు బిల్లులు ఇవ్వలేదని వ్యవసాయ అధికారిణి ప్రాథమిక విచారణలో తేలింది. అన్నదాత అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న ఫెర్టిలైజర్ దుకాణం అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని ఒక్కో బస్తాకు అదనంగా రూ.80 వసూలు ఫిర్యాదు చేసిన రైతులు విచారణ చేపట్టిన వ్యవసాయాధికారులు -
పౌర సేవలపై ప్రత్యేక దృష్టి
● అభివృద్ధి పనుల్లో అలసత్వం వీడాలి ● కొత్తగా విధుల్లో చేరిన మున్సిపల్ ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలి ● తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు: మున్సిపల్ పరిధిలో అధికారులు పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్నపరిమళ్లతో కలిసి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు విరివిగా వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వార్డులలో ప్రతీ రోజు చెత్త సేకరణ, మురుగు కాల్వలు శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే బాగు చేయించాలన్నారు. వార్డుల వారీగా అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే టౌన్ ప్లానింగ్ సిబ్బంది మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాకాకుండా కాపాడాలన్నారు. అభివృద్ధి పనులు వేగిరం వర్షాల కారణంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తగ్గిన వెంటనే పనులు వేగిరం చేస్తామన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మరో రూ.50 కోట్లతో చిలుకవాగు ప్రక్షాళన పనులు పూర్తి చేస్తామన్నారు. లారీ పార్కింగ్ కోసం ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ నిర్వాహకులు ఒక్కొక్కరు దుకాణాల కోసం రూ.10 లక్షలు కడితే టీఎస్ఐఐసీ లారీ పార్కింగ్తో పాటు దుకాణ సముదాయాలు నిర్మించి ఇస్తారని చెప్పిన ముందుకు రావడం లేదన్నారు. నాపరాతి పాలిషింగ్ యూనిట్లను జిన్గుర్తి పారిశ్రామిక వాడకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు తదితరులున్నారు. ఆలయ కమిటీ తీర్మానమే ఫైనల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో ఆలయ కమిటీ తీర్మానమే ఫైనల్.. దుకాణదారులు నిర్మాణ పనులకు సహకరించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని భావిగి భద్రేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పాత దుకాణాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతన్నారు. పలువురు దుకాణదారులు ఖాళీ చేయకపోవడంతో పనులకు అంతరాయం కలుగుతోంది. ఈవిషయమై ఆలయ కమిటీ అధ్యక్షుడు పటేల్ కిరణ్‌తో పాటు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం కమిటీ సభ్యులతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ తీర్మాణం మేరకే నిర్మాణ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. దుకాణం ఎంత విస్తీర్ణంలో ఉంది. నిర్మాణ పనులు సైతం అంతే స్థలంలో జరుగుతాయన్నారు. ఏమైన అనుమానాలు ఉంటే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రైవేటు ఇంజినీర్లను పెట్టుకొని సర్వే చేయించుకోవాలని ఎమ్మెల్యే దుకాణదారులకు తెలిపారు. దుకాణం ఖాలీ చేసిన ప్రతి ఒక్కరికి దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
అనంతగిరి: మహిళలు ఆత్మ విశ్వాసంతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వీ హబ్ ఆధ్వర్యంలో జిల్లా స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఏటా బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు అందించడం జరుగుతోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. అనంతరం డీఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీ్త్రనిధి కింద ఏటా రూ.610 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ మాట్లాడుతూ.. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళలు వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఊహ, పరిశ్రమల శాఖ జీఎం మహేశ్వర్, వీ హబ్ ప్రాజెక్ట్ మేనేజర్ తాజ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయిరాం, అడిషనల్ డీఆర్డీఓ నర్సింలు, మెప్మా పీడీ రవికుమార్, డీపీఎం కొమరయ్య, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.అడిషనల్ కలెక్టర్ సుధీర్ -
బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
అనంతగిరి: సమాజంలో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు అన్ని మతాల పెద్దలు కృషి చేయాలని సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయం, జిల్లా కేంద్రంలోని పలువురు పురోహితులు, ఖాజీలతో బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. బాల్యవివాహాలతో ప్రసూతి, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నర్సింలు, జి.రమేశ్, రోజా, పురోహితులు, ఖాజీలు తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణకే షీటీం పరిగి: మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు షీటీం పనిచేస్తుందని షీటీం ఇన్చార్జి నర్సింలు అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని శ్రీ సాయి ఒకేషనల్ కళాశాలలో షీటీం నిర్వహనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై, మహిళలపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే షీటీం నంబర్ 181కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని తమ తల్లిదండ్రులకు ఆన్లైన్, బ్యాంకింగ్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీశైలం, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు. సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్ -
యూరియా.. లేదే దయ!
రైతులు పంట సాగుకు కంటే వాటికి ఎరువులు తీసుకువచ్చేందుకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా సరిపోక రోడ్లపై నిరసనలు, ఆఫీసుల ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. ఎండ, వాన లెక్క చేయకుండా గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఆయా సరఫరా కేంద్రాలకు చేరుకుని చెప్పులు, కర్రలు, రాళ్లు క్యూలైన్లలో ఉంచుతున్నారు. సరిపడా సరఫరా చేయండి మోమిన్‌పేట: యూరియా కోసం రైతు గోస పడుతూనే ఉన్నాడు. మోమిన్‌పేట, మేకవనంపల్లి పీఏసీఏస్లలో, వెల్చాల్ రైతు మిత్ర సంఘానికి అగ్రోస్ తదితర దుకాణాలకు యూరియా వస్తున్నా సరిపడా రావడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే ఆయా కేంద్రాలకు చేరుకుని రాళ్లు, చెప్పులు, కర్రలు క్యూలో ఉంచి పక్కన పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుకు అవసరమైన మేర యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూడూరు: యూరియా కోసం రైతులు గురువారం మండల పరిధిలోని మన్నెగూడ, చన్గోముల్ మన గ్రోమార్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. యూరియా బస్తాలు కోసం రైతులు ఎగబడటంతో సరఫరాలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులను క్యూలైన్లలో ఉంచి ఎరువులను పంపిణీ చేశారు. చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి తులసీరాం దగ్గరుండి ఎరువుల పంపిణీ చేశారు. ఆగని ఆందోళన ధారూరు: ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నుంచి పంపిణీ చేయాల్సిన యూరియాను గురువారం రైతు వేదిక వద్ద ప్రారంభించారు. ముందుగా టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా తీసుకెళుతుంటే తర్వాత వచ్చిన వారు మాకెందుకు ఇవ్వరంటూ ఆందోళనకు దిగారు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా రైతుల ఆందోళన ఆగలేదు. నాగసమందర్‌లో లొల్లి నాగసమందర్ రైతు వేదికలో యూరియా ఇస్తున్న విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజామునే క్యూ కట్టారు. మధ్యాహ్నం అయినా అధికారులు రాకపోవడంతో రైతులు సిబ్బందిపై మండిపడ్డారు. ధారూరు నుంచి నాగసమందర్‌కు రావడానికి మధ్యలో ఉన్న రోడ్డుపై నుంచి ప్రాజెక్టు నీరు ప్రవహిస్తుందని ఏఈఓ, ధారూరు పీఏసీఎస్ సిబ్బంది చెప్పినా గొడుగులు పట్టుకుని సాయంత్రం వరకు వేచిచూసి ఇళ్లకు వెళ్లిపోయారు. గోదాముల వద్ద రైతుల ఇక్కట్లు గంటల తరబడి వేచిచూసినా ఒక్క రైతుకు ఒకటే బస్తా సరిపడా సరఫరా చేయాలని ఆందోళనలు -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
● ఏపీ పోలీసుల కేసులను ముక్తకంఠంతో ఖండన ● ఎడిటర్, పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావంసాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుసాక్షి, వికారాబాద్: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనని అభిప్రాయపడ్డారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు పెట్టి ఆఫీసుకు వచ్చి నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. పత్రికలో వచ్చిన కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి గానీ ఏకంగా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వివరణ కోరాలి పత్రికలో వచ్చే ప్రతీ విమర్శపై కేసు పెట్టాలనుకోవడం సరికాదు. ఆ వార్త విషయంలో వివరణ కోరాలి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. అకారణంగా అరెస్టులు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ముఖ్యమైనది. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికం. – శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) దాడులు అప్రజాస్వామికం పత్రికలపై దాడులు అప్రజాస్వామికం. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు విస్తృత ప్రచారం చేసే మీడియా, ప్రజా సమస్యలపై అంతకంటే రెట్టింపు స్థాయిలో స్పందిస్తోంది. చట్టాలకు లోబడి కథనాలు రాస్తే దాడులు చేయడం శోచనీయం. ఎవరి పరువుకై నా భంగం వాటిల్లినట్లు భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. యూనియన్లు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది. – ఎస్.రవిశంకర్, సీనియర్ జర్నలిస్ట్, టీయూడబ్ల్యూజే అవమానించడమే కూటమి ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల హమీల అమలుపై, ప్రభుత్వ తప్పులను ప్రచురిస్తే కేసులు పెట్టడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వార్తలపై అభ్యంతరాలు ఉంటే నోటీసులు ఇవ్వాలి, ఖండించాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు, అధికారులు సైతం చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు. పత్రిక స్వేచ్ఛకు భగం కలిగించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. – వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సమాజం హర్షించదు ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ముఖ్యమైంది. ఒకరు చెప్పిన వార్తను ప్రచురించినందుకుగాను సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడం సమంజసం కాదు. మీడియా గొంతు నొక్కేయాలని చూడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. సమాజం కక్ష సాధింపు చర్యలను హర్షించదు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న ఈ ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. – రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమంజసం కాదు సమాజంలో ప్రజా సమస్యలను జర్నలిస్టులు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తారు. ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా ఉంటారు. సమాజం కోసం అహర్నిశలు పాటుపడే జర్నలిస్టులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేయడం సమంజసం కాదు. పత్రికల్లో పనికట్టుకుని వార్తలు రాస్తే తప్పు పట్టాలి. నాయకులు అన్న ప్రకటనలు రాస్తే కేసులు పట్టడం పత్రికా స్వేచ్ఛను హరించినట్లే. – బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు -
అయ్యా.. యూరియా
● ఎస్ఐ కాళ్లు మొక్కిన రైతు ● సోషల్ మీడియాలో వైరల్ కుల్కచర్ల: నెల రోజులుగా యూరియా అందక ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారే లేరని రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం మండల కేంద్రంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సంఘం, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు లు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా పీఎన్‌పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వ్యవసాయాధికారులతో మాట్లాడారు. వారు శుక్రవారం రెండు లారీల యూరియా తెప్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఒక రైతు ఎస్ఐ రమేశ్ కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘ఆహార భద్రత’ను అమలు చేయాలి
● ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిఅనంతగిరి: ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. ఆహార భద్రత చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ శాఖల నివేదికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హక్కుదారులకు ఎలాంటి భంగం కలగకుండా న్యాయం చేకూర్చేలా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం తూకంలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చౌక ధరల దుకాణాల వద్ద ఫిర్యాదుల పట్టిక, అధికారుల ఫోన్ నంబర్లను, పనిచేసే వేళలు ప్రదర్శించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీల్లో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, మెనూ పట్టిక ప్రదర్శించాలన్నారు. విద్యా, నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలని చైర్మన్ సూచించారు. అంగన్వాడీలలో మాతా శిశువులకు పౌష్టిక ఆహారం కచ్చితంగా అందించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసు చంద్ర, డీఆర్డీఏ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, డీఎంహెచ్ఓ లలితా దేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ రేణుకాదేవి, ఫుడ్ సెక్యూరిటీ అధికారి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాదా’కు సై!
భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 4,443 సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. భూ భారతి చట్టం ప్రకారం ఈ ప్రక్రియ పరిశీలన బాధ్యతలను ఆర్డీఓలకు అప్పగించారు. వికారాబాద్: సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10 తేదీ వరకు నెల రోజుల పాటు అప్పటి ప్రభుత్వం రైతులనుంచి అర్జీలు స్వీకరించింది. గతంలో ఇచ్చిన వారే భూ భారతి రెవెన్యూ సదస్సుల్లోనూ అర్జీలు సమర్పించారు. సాదాబైనామాలకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ ఉండటంతో క్లియరెన్స్‌కు నోచుకోలేదు. ఇటీవల కోర్టు వీటి పరిష్కారానికి అనుమతించడంతో పక్రియ ముందుకు సాగనుంది. ఆప్షన్‌లేక డీలా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ వస్తున్నప్పటికీ ఇంకా అనేకం మిగిలిపోయాయి. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. కోర్టు పరిధిలోని వివాదాలు, వ్యాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులన్నింటికీ ఆగ స్టు 14 వరకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం పేర్కొనగా వచ్చిన వాటిలో పది శాతం కూడా పరిష్కరించలేకపోయారు. ఎన్నో సమస్యలపై అధికారులకు ఆప్షన్ లేకపోవడం కసరత్తుకు అడ్డంకిగా మారింది. 11,718 అర్జీలు వచ్చినా ఇందులో చాలా వరకు డబుల్ ఉన్నాయి. గతంలో మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నవారే తిరిగి రెవెన్యూ సదస్సుల్లోనూ ఆఫ్‌లైన్‌లో సమర్పించారు. ఇందులో సాదాబైనామాలు పరిష్కరించేందుకు సైతం ఇన్నాళ్లు ఆప్షన్ లేక పెండింగ్‌లో పడిపోయాయి. 900 దరఖాస్తులకు పరిష్కారం పెండింగ్ దరఖాస్తుల్లో కోర్టు కేసులు, సర్వేతో ముడిపడిన అంశాలకు సంబంధించినవి, ప్రభుత్వ భూములకు సంబంధించినవే అధికంగానే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11,718 అర్జీలు పెండింగ్‌లో ఉండగా ఇందులో ఇప్పటికే 11,117 మంది రైతులకు అధికారులు నోటీసులు అందజేశారు. వచ్చిన వాటిలో గడిచిన రెండు నెలల్లో 900 దరఖాస్తులకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపారు. పెండింగ్‌లో ఉన్న 11 వేల పైచిలుకు దరఖాస్తులలో సాదాబైనామాకు సంబంధించినవే 4,443 ఉండడం గమనార్హం. సమస్యలు పరిష్కరిస్తాం అందరి సహకారంతో సదస్సులు విజయవంతంగా పూర్తి చేశాం. ఈ రెవెన్యూ సదస్సుల నుంచి పదివేలకు పైగా అర్జీలు వచ్చాయి. ఇప్పటికే మ్యాన్యువల్‌గా పరిశీలన పూర్తి చేశాం. డేటా ఎంట్రీ దాదాపు పూర్తయింది. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు కోర్టు ఆదేశాలమేరకు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సాదాబైనామా సమస్యలు పరిష్కరిస్తాం. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ సాదాబైనామా దరఖాస్తులకు లైన్ క్లియర్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నోటిఫికేషన్‌పై హర్షం జిల్లా వ్యాప్తంగా 11,718 అర్జీలుపెండింగ్ అర్జీల వివరాలు మండలం దరఖాస్తుల సంఖ్య మర్పల్లి 211 మోమిన్‌పేట్ 298 నవాబుపేట 136 వికారాబాద్ 405 పూడూరు 136 పరిగి 223 కుల్కచర్ల 505 దోమ 417 బొంరాస్‌పేట్ 315 ధారూరు 203 కోట్‌పల్లి 139 బంట్వారం 81 పెద్దేముల్ 315 తాండూరు 246 బషీరాబాద్ 181 యాలాల 166 కొడంగల్ 151 దౌల్తాబాద్ 315 మొత్తం 4.443 -
‘పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నాగేందర్‌గౌడ్’
అనంతగిరి: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ బరిలో ఉంటారని ఆయన కుమారుడు, రాష్ట్ర యువ నాయకుడు రాజేందర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్‌లోని అమరువీరుల స్తూపానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రతీ పట్టభద్రుడిని కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగేందర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాములు, వెంకటేశ్, వెంకటేశ్‌గౌడ్, చందు, మహేందర్, శ్రీశైలం యాదవ్, మల్లేశం, నర్సింలు యాదవ్, విజయ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: లైసెన్స్డ్ సర్వేయర్ల సప్లిమెంటరీ పరీక్షను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన కల్టెరేట్‌లోని తన చాంబర్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన థియరీ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు, ప్లాటింగ్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఇందులో థియరీకి 76 మంది, ప్లాటింగ్‌కు 92 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎటువంటి కాపీయింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్ర పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌కు సూచించారు. అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్ఓ లలితా దేవికి చెప్పారు. పరీక్ష కేంద్రం వద్దకు ఇతరులు ప్రవేశించకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామిరెడ్డి, డీహెచ్ఎస్ఓ సత్తార్, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.రాజు పాల్గొన్నారు. -
వర్షాలు కురిసి.. జలాలు పెరిగి
● నిండుకుండల్లా చెరువులు, కుంటలు ● పరిసరాల్లో వృద్ధి చెందిన భూగర్భ జలాలు ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు మొయినాబాద్‌రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల నిల్వలు పెరిగాయని నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు సమకూరాయని భావిస్తున్నారు. బోరు బావులు సైతం సమృద్ధిగా నీటిని పోస్తున్నాయి. ఎక్కడ బోరు వేసినా ౖపైపెనే నీరు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. రికార్డుస్థాయిలో వర్షాలు సగటు వర్షపాతం 400 మిల్లీమీటర్లు కాగా ఆగస్టు చివరి నాటికి 612 మి.మీ నమోదయింది. చేవెళ్ల నియోజకవర్గంలో వర్షపాతం నమోదు ఇలా ఉన్నది. చేవెళ్ల మండలంలో 63 శాతం, మొయినాబాద్‌లో 53 శాతం, షాబాద్‌లో 83, శంకర్‌పల్లిలో 48 శాతం అధిక వర్షం కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవలేదు. జూలై రెండోవారం వరకు అడపాదడపా మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. ఆగస్టు నెలలో సమృద్ధిగా వానలు పడడంతో అధిక వర్షపాతం నమోదైంది. రానున్న రబీ సీజన్‌కు నీటి కొరత ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ౖపైపెకి గంగమ్మ వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు పైకి వచ్చేశాయి. గతంలో పాతాళానికి పడిపోయిన నీరు ప్రస్తుతం ౖపైపెకి పాకుతుంది. ఆగస్టు నెలలోనే 4.31 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ వాటర్ వృద్ధి చెందాయి. వేసవితో పోలిస్తే చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాలలో మొయినాబాద్‌లో 5.06, చేవెళ్లలో 7.98, షాబాద్‌లో 6, శంకర్‌పల్లిలో 4.08 మీటర్ల నీటి మట్టం పెరిగాయి. సమృద్ధిగా జలాలు ఆగస్టు నెలలో అధిక వర్షాలు కురియడంతో సమీప వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు సమృద్ధిగా పోస్తున్నాయి. ఈ సంవత్సరం పంటలకు నీటి కొరత ఉండదు. –సైపాల్‌రెడ్డి, రైతు, అమ్డాపూర్ పెరిగిన సాగు విస్తీర్ణం సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. బోరు బావుల్లో జలాలు పెరిగాయి. వాగులు, వంకలు అలుగు పారుతున్నాయి. పత్తి, కంది ఇతర కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. – అనురాధ, ఏఓ, మొయినాబాద్ -
జంక్ ఫుడ్ తిని రోగాల బారిన పడొద్దు
పూడూరు: విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ మణికంఠరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని కంకల్ ప్రాథమిక పాఠశాలలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకుంటే మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మానవ శరీరానికి పోషకాహార ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మణ్, ఉపాధ్యాయులు ఈశ్వరరావు, మస్తాన్‌బాబు, శ్రీదేవి పాల్గొన్నారు. -
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్లో స్కావెంజర్ల జీతాల్లో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.10 వేల చొప్పున మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు(స్కావెంజర్ల) జీతాల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ప్రిన్సిపాల్ ఇద్దరి స్కావెంజర్లను నియమించి వారికి నెలకు రూ.10 వేల చొప్పున జీతం ఇవ్వకుండా, కేవలం రూ.7వేల ఇచ్చారని ఆరోపించారు. స్కావెంజర్ల జీతాలలో ప్రిన్సిపాల్ చేతివాతం ప్రదర్శించి అవినీతి చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధు, తరుణ్, రాహుల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దోమ: మండల పరిధిలోని బడెంపల్లికి చెందిన సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) ఏఎస్ఐ కావలి తిరుపతి(48) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన అంత్యక్రియలను గురువారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. 1997లో ఉద్యోగానికి ఎంపికై న తిరుపతి హకీంపేట సీఆర్పీఎఫ్లో తొలిసారి విధుల్లో చేరారు. అక్కడి నుంచి త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో పనిచేశారు. జమ్మూకాశ్మీర్ పనిచేస్తున్న ఆయన ఇటీవలే బదిలీపై హకీంపేటకు వచ్చారు. విధుల్లో భాగంగా వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి, ఈనెల 7న హైదరాబాద్ తిరిగొచ్చాడు. తొడ భాగంలో ఏర్పడిన గడ్డతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సోమవారం సిబ్బంది అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి చనిపోయారు. మృతుడికి భార్య కావలి సరోజ, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు రవికుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు వరుణ్ ఏంబీఏ చదువుతున్నాడు. తిరుపతి మృతి బాధాకరమని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బి.నాయక్ అన్నారు. సిబ్బందితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ తిరుపతి మృతి -
చేపపిల్లల పంపిణీపై నీలినీడలు
పరిగి: భారీ వర్షాలతో ప్రస్తుతం చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. జిల్లాలోని అన్ని జల వనరులు నిండుకుండలా దర్శనమిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయలేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన మత్స్యపథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి జూన్, జూలైలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ ఏడాది ఆ ఊసే లేదు. మత్స్యశాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఒకవేళ పథకాన్ని కొనసాగించి చేప పిల్లలను ఆలస్యంగా చెరువులు, రిజర్వాయర్లలో వదిలితే వాటి ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మదనపడుతున్నారు. మత్స్య పథకం 2017న ప్రారంభించి 2023 వరకు ఏడు విడతల్లో చేప పిల్లలు పంపిణీ చేశారు. నిధులు విడుదలైనా.. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కలిగిన చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు జులై మాసంలోనే ప్రణాళికను సిద్ధం చేసుకునేది. పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియపై రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపదకు నిధులను కేటాయించింది. కానీ ఇప్పటివరకు పంపిణీపై ఎలాంటి ముందగుడు పడలేదు. జిల్లా వ్యాప్తంగా 830 చెరువులు కుంటలు ఉండగా, 16 ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే 133 మత్స్యకార సంఘాలున్నాయి. చెరువులు, ప్రాజెక్టులకు కలిపి 1.29 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు లక్ష్యాన్ని అధికారులు ఎంచుకున్నారు. రహూ, బొచ్చ, బంగారు తీగ వంటి చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. 35 ఎంఎం నుంచి 45ఎంఎం 1.04 కోట్లు, 80ఎంఎం నుంచి 100ఎంఎం చేప పిల్లలను 25లక్షల మొత్తం 1.29 కోట్ల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో వదలాల్సి ఉంది. ఆలస్యంతో ఎదగని పిల్లలు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మత్స్యసంపదకు నిధులు కేటాయించారు. కానీ చేప పిల్లలను పంపిణీపై స్పష్టత లేదు. సకాలంలో పంపిణీ చేయకపోవడంతో చేపలు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం గతేడాది చేప పిల్లలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి చేయకపోవడంతో మత్స్యసంపదను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అంతేకాక ప్రైవేటులో ఇతర రాష్ట్రాల నుంచి చేప పిల్లలను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్నారు. చెరువుల్లో మేత కుళ్లితే చేపల ఎదుగుదల క్షీణిస్తుందని మత్స్యకారులు దిగులు చెందుతున్నారు. పంపిణీ చేయాలి గతేడాది చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రైవేటులో చేప పిల్లల కొనుగోలు కోసం రూ.లక్షలు వెచ్చించాం. ప్రభుత్వమే చేప పిల్లలను పంపిణీ చేస్తే మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలి. – రమేశ్, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు దాదాపూర్ టెండర్లు పూర్తి చేప పిల్లల పంపిణీకి టెండర్లను ఆహ్వానించాం. ప్రక్రియ పూర్తి కాగానే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రెండు రోజుల్లో మొత్తం టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. త్వరలోనే చేప పిల్లలను పంపిణీ చేస్తాం. అక్టోబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. – వెంకన్న, జిల్లా మత్స్యశాఖ అఽధికారి అదును దాటుతున్నా పడని ముందడుగు గతేడాది సైతం పంపిణీ చేయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు జిల్లాలో చేపపిల్లల పంపిణీ లక్ష్యం 1.29 కోట్లు చెరువులు, కుంటలు: 830 రిజర్వాయర్లు: 16 మత్స్యకార సంఘాలు: 133 -
ఏడీఏ లేక.. సేవలు సాగక
● పశువైద్యాధికారి పోస్టు ఖాళీ ● కొడంగల్ ఏడీఏకు తాండూరు ఇన్చార్జి బాధ్యతలు తాండూరు రూరల్: పశువైద్యాధికారి లేక మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పశువైద్యాధికారి కార్యాలయంలో ఏడీఏ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఏడీఏగా పని చేసిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొడంగల్ పశువైద్య కార్యాలయంలో పని చేస్తున్న ఏడీఏ డాక్టర్ నోవాకు తాండూరు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఇప్పటివరకు సదరు అధికారి కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది మాత్రమే తాత్కాలికంగా పశువులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇన్చార్జి ఏడీఏ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పశువుల కాపరులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సాయిపూర్, మల్రెడ్డిపల్లి, పాత తాండూరులో ఉన్న రైతులు పశువుల చికిత్స చేసుకోవడానికి వస్తుంటారు. కానీ డాక్టర్ లేకపోవడంతో సిబ్బందితో చికిత్సలు చేస్తున్నారు. డిప్యూటేషన్ల పర్వం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పశువైద్యాధికారి ఏడీఏ కార్యాలయంలో గొర్రెలు, మేకలు, ఎద్దులు, కుక్కలకు వైద్య సేవలు చేసేందుకు ధారూరు మండలం కుక్కింద పశువైద్యశాలలో పని చేస్తున్న ఫ్యారమేట్ సైదులును డిప్యూటేషన్‌పై తాండూరుకు వచ్చారు. ఆయన కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. వారానికి ఒకరోజు వచ్చి రిజిస్టార్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఏడీఏ కార్యాలయంను పర్యవేక్షించి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
నిల్వ ఉంచిన 34 సిలిండర్ల పట్టివేత
పహాడీషరీఫ్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో అ క్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని కావ్య ప్లాస్టిక్, స్టీల్ హౌస్‌లో పోలోడు గోవర్ధన్, మామిడిపల్లికి చెందిన రాజు, కాటేదాన్‌కు చెందిన అనిల్‌లు అక్రమంగా సిలిండర్లను నిల్వచేసి అవసరమైన వారికి రెట్టింపు ధరలో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి వివిధ పరిమాణాలకు సంబంధించిన 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. -
అడవుల పరిరక్షణే ధ్యేయం
● జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ ● అమరులకు ఘన నివాళి అనంతగిరి: అడవుల పరిరక్షణే ధ్యేయమని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వికారాబాద్‌లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నర్సరీల్లో మిగిలిన మొక్కల నిర్వహణ, సంరక్షణ గురించి చర్చించారు. వర్షాలు కురుస్తున్నందునా అవెన్యూ ప్లాంటేషన్‌కి అనువైన ప్రాంతాలను గుర్తించి ప్లాంటేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ రేంజ్ ఆఫీసర్ కే. శ్యాం కుమార్, రాజేందర్, శ్రీదేవి సరస్వతి, పరిగి రేంజ్ ప్రతిమ, కొడంగల్ రేంజ్ ఆఫీసర్ సవిత, తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ● జిల్లా పంచాయతీ అధికారి జయసుధ దుద్యాల్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పీ జయసుధ సూచించారు. బుధవారం మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, ఈర్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. పోలేపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలని హకీంపేట్, దుద్యాల్ వైద్యులు వందన, విద్యకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధులను పరిశీలించారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం ఉండటాన్ని చూసి వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు పంచాయతీ వాహనాల్లోనే చెత్త వేయాలన్నారు. అనంతరం గ్రామంలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. హకీంపేట్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈర్లపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్ కుమార్, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు మోహన్, ఆనంద్, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలన్నీ అమలు చేస్తున్నాం
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత ● ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంకుల్కచర్ల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకాలు పొందిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంఈఓ హబీబ్ అహ్మద్, చౌడాపూర్ ఎంఈఓ రాంచందర్, పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ రెడ్డి, బస్వరాజు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రమేష్, తపస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, టీజీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్యా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలి పరిగి: ముదిరాజ్‌లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగాపూర్ సమీపంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభ్యున్నతికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు హన్మంతు ముదిరాజ్, ఆంజనేయులు, రామస్వామి, సత్యనారాయణ, సురేందర్, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థానంలో నిలవాలి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిల వాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం పట్టణంలోని నంబర్ వన్ ఉన్నత పాఠశాలలో రూ.7 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని తెలిపారు. అనంతరం మండలంలోని పేటమాదారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాఽధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు.. ఆటలు ముఖ్యం
ఎన్ఐఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష కడ్తాల్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని, శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ (ఎన్ఐఎన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష అన్నారు. రోజు వారి ఆహారంలో పోషక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో.. కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ నిపుణులు విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం అరుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ మాట్లాడారు. జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశోధన బృందం వంశీకృష్ణ, సప్తదీపఘోష్, జాన్వీ, కుజిత, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తుది జాబితా విడుదల
దుద్యాల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ మహేశ్ కుమార్ బుధవారం స్థానిక రాజకీయ నాయకులతో కలిసి తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. మండల వ్యాప్తంగా 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి గాను 42 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 21,078 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 10,830 మంది మహిళలు, 10,248 మంది పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, మాజీ సర్పంచ్ ఖాజా, కాంగ్రెస్ దుద్యాల్ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మర్పల్లి: ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు విశ్రమించేది లేదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మధుకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. ప్రజలు గోస పడతారని నాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అనుకున్నట్లుగా నేడు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పార్టీ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ మధుకర్, టౌన్ ప్రెసిడెంట్ గఫార్, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, నాయకులు రమేష్, శ్రీకాంత్, గౌస్ పాల్గొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలనుఅవలంబిస్తున్న కాంగ్రెస్ యూరియా సమస్యను పట్టించుకోని సీఎం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ -
అకౌంటెంట్ తప్పిదం.. జీతాలు ఆలస్యం
● మరో ఖాతాలోకి మల్లిన నిధులు ● ఉద్యోగులకు తప్పని వేతన నిరీక్షణ తాండూరు: జూనియర్ అకౌంటెంట్ అధికారి నిర్లక్ష్యం వలన 10 రోజులుగా విద్యుత్ సబ్ డివిజన్ పరిధి ఓఎన్ఎం సిబ్బందికి జీతాలు అందలేదు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు సబ్ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ అధికారి(జేఏఓ)గా జనార్దన్ విధులు నిర్వహిస్తున్నారు. ఏఈల వేతనాలకు ఒక చెక్, ఓఎన్ఎం ఉద్యోగులకు మరో చెక్, ఆర్టీజెన్ వారికి ఇంకో చెక్ రూపంలో మూడు చెక్కులను వారి వేతనాల కోసం బ్యాంకుకు పంపారు. ఏఈలు, ఆర్టీజెన్లకు వేతనాలు అందాయి. అయితే ఓఎన్ఎం ఉద్యోగులైన లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, మరి కొంత మందికి అందాల్సిన వేతనాలు ఏఈల ఖాతాలలో జమయ్యాయి. దీంతో వికారాబాద్, పరిగి ప్రాంతాల్లోని ఓఎన్ఎం ఉద్యోగులకు జీతాలు అందాయని, తమకు ఎందుకు అందలేదని పలువురు ఉద్యోగులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై ఆరా తీయగా, అకౌంటెంట్ తప్పిదం వలనే మరో ఖాతాలోకి నిధులు వెళ్లాయని తేలింది. అయితే సదరు అకౌంటెంట్.. బ్యాంకు ఉద్యోగుల వలనే తప్పిదం జరిగిందని బుకాయించడం గమనార్హం. గురువారం సాయంత్రం వరకు ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తహసీల్ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు ధారూర్: స్థానిక తహసీల్ కార్యాలయంలో రైతులు, ప్రజలను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని దోర్నాల గ్రామానికి చెందిన మహిపాల్ బుధవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో పైసలు లేనిదే ఫైలు కదలటం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం కొర్రీలు పెడుతూ, డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ కార్డుల విషయంలో దళారులు దందా చేస్తున్నారని, వారి ద్వారానే రెవెన్యూ పనులు అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపులోమాదిగలకు అన్యాయం ధారూరు: మండల పరిధిలోని కేరెల్లికి చెందిన మాదిగలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అన్యాయం జరిగిందని పి.రాజు బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన అనర్హులైన చాలా మందికి ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. గ్రామంలో మాదిగలకు కేవలం రెండు ఇళ్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఇప్పటికైనా అర్హులైన దళితులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దంచి కొట్టిన వాన మత్తడి పోసిన చెరువులు బషీరాబాద్: మండలంలో బుధవారం 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో చెరువులు మత్తడి పోశాయి. మండలంలోని నవల్గా ఊర చెరువు అలుగ పారడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ.. అదుపుతప్పి కింద పడ్డాడు. తోటి ప్రయాణికులు అతడిని, బైక్‌ను ఒడ్డుకు చేర్చారు. మండల కేంద్రంలోని పంచాయతీ ఎదుట రోడ్డు విస్తరణ పనుల కోసం తీసిన గుంతలో నీరు చేరాయి. ఇది గమనించని ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పత్తి చేలల్లో వరద నీరు నలిచింది. నేటి నుంచి మండల యూనిట్ ఎన్నికలు అనంతగిరి: తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి ఆయా మండలాల యూనిట్ ఎన్నికలు నిర్వహించనున్నామని ఆ సంఘం జిల్లా ప్రధా కార్యదర్శినర్సింహ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 11న తాండూరు, పరిగి, 13న వికారాబాద్, కొడంగల్, 17న మోమిన్‌పేట, బిషీరాబాద్, 19న యాలాల, మర్పల్లి, 21న కుల్కచర్లలో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి ఇబ్రహీంపట్నం: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎలిమినేడు గ్రామ పరిధిలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు డాడులు చేశారు. జూదరులను పట్టుకొన్నారు. నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
దురలవాట్లకు బానిస కావద్దు
ఎకై ్సజ్ సీఐ సదాశివుడు మోమిన్‌పేట: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సర్కిల్ ఎకై ్సజ్ సీఐ సదాశివుడు అన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో గంజాయి, మత్తుపదార్థాల వినియోగం, కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురలవాట్లకు లోను కావొద్దని సూచించారు. మత్తుకు బానిసగా మారితే శారీరక, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. సమాజం నుంచి చీత్కరించబడతారని హెచ్చరించారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్ష తప్పదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. -
వంతెనపై నుంచి పడి కూలీ మృతి
తాండూరు రూరల్: రైల్వే విభాగంలో అడ్డాకూలీగా పని చేస్తున్న ఓ వ్యక్తి వంతెనపై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి నారాయణపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల సురేష్(30), కొంత కాలంగా ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం అతనితో పాటు నారాయణపూర్‌కు చెందిన అంజీలు వాగుపై ఉన్న వంతెన పక్కన ఇనుప నిచ్చెనకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిచ్చెన కింద పడింది. ఈ ఘటనలో సురేష్ తల.. బ్రిడ్జికింద పిల్లర్ల పక్కన ఉన్న రాళ్లలో ఇరుక్కొని ఊపరి ఆడక మృత్యువాత పడ్డాడు. మరో కూలి వాగులో పడి, స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సురేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారని, ప్రస్తుతం సురేష్ ఒక్కడే ఉంటున్నారని కొండాపూర్ గ్రామస్తులు తెలిపారు. -
రాజీతో కేసుల పరిష్కారం
మోమిన్‌పేట: రాజీతో ఎలాంటి కేసులకై నా సులువుగా పరిష్కారం మార్గం లభిస్తుందని సీఐ వెంకట్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్, మోటారు వాహనాల ప్రమాదాలు, కుటుంబ వివాదాలు, క్రిమినల్ కేసులు తదితర వాటిని పరస్పర అంగీకారంతో కోర్టు కేసులను అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని, సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. పూడూరులో.. పూడూరు: పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కక్షిదారులు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతగిరిలో.. అనంతగిరి: రాజీయే రాజమార్గమని సీఐ భీమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యంగా, సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు. యాలాలలో.. యాలాల: రాజీయే రాజమార్గమని యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని, పెండింగ్ కేసులు, పరస్పర ఒప్పందం ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తారని తెలిపారు. ● సీఐ వెంకట్ ● 13న జాతీయ లోక్ అదాలత్ -
సోషల్ మీడియా ఉచ్చులో యువత
● దురలవాట్లకు లోనవుతున్న వైనం ● బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు ● ఆందోళన కలిగిస్తున్న పోక్సో కేసులు ● డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి తాండూరు టౌన్: ‘సామాజిక మాధ్యమ ప్రభావంతో యువత దురలవాట్లకు లోనవుతోంది. బాలికలపై లైంగిక దాడులు పెరిగాయి. పోక్సోచట్టం కేసులు పెరుగుతున్నాయి. వారి జీవితం అంధకారం అవుతోంది. ఆ కేసుల నివారణకు కలిసి కట్టుగా కృషి చేద్దాం. వారి భవితకు బంగారు బాటలు వేద్దాం’ అని డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో మండల విద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పెడధోరణి, బాలికల అదృశ్యం, పోక్సో కేసుల గురించి చర్చించారు. నైతిక విలువలు నేర్పించాలి మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నడవడికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని డీఎస్పీ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలబాలికలు విద్యా సంస్థల్లోనే ఎక్కువగా ఉంటారని, వారికి విద్యా బుద్ధులతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఇతరులతో నడుచుకునే విధానం తదితర అంశాలను నేర్పించాలని సూచించారు. ఎవరైనా బాలికలు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిస్తే.. వారికి అండగా నిలిచి పోలీసుల సహాయంలో ఆకతాయిల ఆటకట్టించాలని చెప్పారు. పోక్సో చట్టం, దాని తీవ్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. -
అమ్మచెరువును అభివృద్ధి చేస్తాం
దౌల్తాబాద్: నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో కొడంగల్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలోని అమ్మ చెరువును పరిశీలించారు. ఈ చెరువును మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ 3 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని, రైతులు ఆర్థికంగా ఎదగుతారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. రానున్న మూడున్నర ఏళ్లలో పథకాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు శరణయ్య, మాధవరెడ్డి, వెంకట్రామరెడ్డి, సాయిలు, శ్యామరెడ్డి, వెంకట్రాములు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దుతాం నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతలతో సస్యశ్యామలం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి -
ఎవర్నీ వదలం.. అందరిపై కేసులు
● కరన్‌కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ ● చంద్రవంచ దాడి ఘటనపై అధికారులు సీరియస్‌గా ఉన్నారని వెల్లడి తాండూరు రూరల్: ఘర్షణకు కారకులైన వారిలో ఎవరినీ వదలమని, అందరిపై కేసులు నమోదు చేస్తామని కరన్‌కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. మండల పరిధి చంద్రవంచ గ్రామంలో వినాయక నిమజ్జనంలో చోటు చేసుకున్న గొడవ తీవ్రస్థాయికి చేరుకుందన్నారు. సోమవారం అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, కర్రలతో దాడులు చేసుకున్నారని, ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ బస్వరాజ్పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దాడుల నేపథ్యంలో ఓ వర్గం నుంచి 27 మంది, మరో వర్గం నుంచి 18 మందిని ఠాణాకు పిలిపించి విచారణ చేపడుతున్నామని వివరించారు. దాడిలో గాయపడిని కానిస్టేబుల్ కోలుకున్నారని, ఆయనపై దాడి చేసిన వారిపై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదే విషయమై డీఎస్పీ, ఎస్పీ సీరియస్‌గా ఉన్నారని, కానిస్టేబుల్ వద్ద ఉన్న వీడియో ఆధారంగా మరింత మందిపై కేసులు నమోదు చేయనున్నామని, అవి మూడు సెక్షన్ల కింద ఉంటాయని వివరించారు. పరస్పర దాడుల గురించి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇరు వర్గాల దాడి ఘటనలో.. ఓ వర్గంపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కానిస్టేబుల్‌పై దాడి.. రాజీకష్టం చంద్రవంచలో సోమవారం రాత్రి జరిగిన గొడవ విషయమై కేసులు కాకుండా, రాజీ కుదుర్చుకునేందుకు పలువురు అధికార పార్టీ నాయకుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇరు వర్గాల వారు రాజీ పడినా.. కానిస్టేబుల్‌పై దాడిమాత్రం రాజీ చేయడం కష్టమని ఆ నాయకుడు వారికి తేల్చి చెప్పినట్లు సమాచారం. -
కెనరా బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి నవాబుపేట: కెనరా బ్యాంక్ సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి సూచించారు. బుధవారం మండలంలోని పులుమామిడి గ్రామంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు . ప్రధాన మంత్రి స్కిల్ జీవన జ్యోతి బీమా యోజన ద్వారా వార్షిక ప్రీమియం రూ.436 చెల్లించి రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ పొందవచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా వారిక ప్రీమియం రూ.20తో రూ.2 లక్షల బీమా సదుపాయం అందుతుందని తెలిపారు. పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, పులిమామిడి బ్రాంచ్ మేనేజర్ పవన్, పంచాయతీ కార్యదర్శి నితిన్, సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కొడంగల్ రూరల్: వ్యాసరచన పోటీలతో విద్యార్థుల్లో వ్యక్తీకరణ, లేఖన నైపుణ్యాలు మెరుగుపడతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీసత్యసాయి సేవా సమితి సౌజన్యం, కళాశాల ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘వర్తమానంలో మన నడవడి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రచనకు బంగారు పథకం అందజేస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ టి.రాంబాబు, అధ్యాపకులు బంటు నర్సింలు, టి.రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆహార భద్రత మన బాధ్యత
బంట్వారం: విద్యార్థులు, చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించడం మన బాధ్యత అని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులతో కలిసి కోట్‌పల్లి జెడ్పీహెచ్ఎస్ తోపాటు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలు, విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ లలితాదేవికి సూచించారు. మాతాశిశు సంరక్షణ వివరాల నమోదును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రేషన్ నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని డీలర్‌కు సూచించారు. అధికారుల ఫోన్ నంబర్లు బోర్డుపై రాయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్, డీఈఓ రేణుకాదేవి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఎస్ఓ సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగన్నాథ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, మెడికల్ ఆఫీసర్ మేఘన, ఎంఈఓ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. స్టాక్ పాయింట్ పరిశీలన అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పౌరసరఫరాల శాఖ మండల స్టాక్ పాయింట్‌ను బుధవారం రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్ సందర్శించారు. ఆయన వెంట డీఆర్డిఏ శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, ఫుడ్ సెక్యూరిటీ అధికారి జగన్నాథ్ ఉన్నారు. ఉదయం పట్టణంలోని ఆర్అండ్బీ వసతి గృహానికి చేరుకున్న శ్రీనివాస్ రెడ్డికి అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బొకే అందజేసి స్వాగతం పలికారు. ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి -
యూరియా సరఫరాలో విఫలం
● బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ● రైతులకు పండ్లు పంపిణీ తాండూరు టౌన్: యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించారు. అక్కడ యూరియా పంపిణీని పరిశీలించారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న రైతులతో మాట్లాడారు. తన వంతు సాయంగా వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతన్న పస్తులతో ఒక్క యూరియా బస్తా కోసం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు భాను, అబిద్, సాయి, మల్లేశం, శ్రీధర్, మనోహర్ తదితరులు ఉన్నారు. -
విధి నిర్వహణలో అంకితభావం కీలకం
యాలాల: విధి నిర్వహణలో అంకితభావం ఎంతో కీలకమని ఎస్ఐ విఠల్‌రెడ్డి అన్నారు. యాలాల ఠాణాలో ఐదేళ్లుగా విధులు నిర్వహించి బుధవారం బదిలీపై వెళ్లిన కానిస్టేబుళ్లు వెంకటయ్య, అహ్మద్, నవీన్, నరేశ్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లుగా కానిస్టేబుళ్లు ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి, శాంతిభద్రతలు కాపాడారన్నారు. పోలీసు అధికారులు ఎక్కడున్నా.. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కానిస్టేబుళ్లతో పాటు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్ఐ– 2 సత్యనారాయణరాజు మరో పీఎస్‌కు బదిలీ కావడంతో ఆయనను సన్మానించారు. ఎస్ఐ విఠల్‌రెడ్డి -
చేయూత పింఛన్లు పెంచాలి
అనంతగిరి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల పింఛన్లను ప్రభుత్వం వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ప్రశాంత్ డిమాండ్ చేశారు. హామీ అమలు కోసం ఈ నెల 15న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఽమహాధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్‌లో సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఎంఎస్పీ, వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పింఛన్ దారుల హక్కుల పోరాట సమితి ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, కిష్టన్న, ఏసు, పుష్పరాణి, సునీత, పద్మమ్మ, సుశీల, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వీరనారి చాకలి ఐలమ్మ
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కలెక్టరేట్లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగ్లీలాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: ఓటరు, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈవో సుధీర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అభ్యంతరాలను పరిగనలోకి తీసుకొని మార్పులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 8న తాండూరులో జరిగిన మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మార్పులు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించవచ్చని తెలిపారు. యాలాల: మండలంలోని నాగసముందర్ గ్రామ పరిధిలో గల శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాకరవేణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా విశ్వనాథ్‌పూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న శివసాగర్ ప్రాజెక్టు కారణంగా వరద నీరు భారీగా నిలుస్తోంది. దీంతో నాగసముందర్ రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులను బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాన్ని పరిశీలించి, సమస్య పరిష్కారానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ కిష్టయ్య, పీఆర్ డీఈ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి కుల్కచర్ల: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పుట్టపహడ్‌లో గ్రామ కమిటీను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పుట్టపహాడ్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా సర్వర్ పాషా, యువజన విభాగం అధ్యక్షుడిగా రాఘవేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, నాయకులు వెంకట్రాములు, అంజిలయ్య, జలీల్, భరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో కొంత మంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్.. కొన్నిసార్లు తనను ఢిల్లీ పిలిచి వార్నింగ్ కూడా ఇప్పించారన్నారు. ‘‘బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచందర్ రావు వేశారా? కిషన్ రెడ్డి వేశారా?. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.‘‘బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని సర్వ నాశనం చేసేందుకు కమిటీ వేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచందర్ రావు మంచి మనిషి.. కానీ రబ్బర్ స్టాంప్’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.‘‘బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశోక్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ డబ్బులు వసూలు చేశారు. బీజేపీ కార్యకర్తలే నాలుగో సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నా కార్యకర్తల కోసం మాట్లాడుతున్నా. బీజేపీనీ పండబెట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజీనామా చేయను.. పీక్కొండి’’ అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పార్టీలో మర్యాద దక్కలేదు. కార్యకర్తల్లో పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ చేయలేదు. కార్యకర్తలకు అనుకూలంగా నేను మాట్లాడతా. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు 15 మందిని తీసుకువస్తే వాళ్లను దాచిపెట్టారు. వెనక ఉన్న వాళ్ళు బయటకు రండి. తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి రాదు’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. -
రోడ్డెక్కిన రైతన్న
పరిగి: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. మంగళవారం మండలంలోని రంగాపూర్ గేట్ వద్ద, సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. గంటపాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సాగుకు అర్ధరాత్రి కరెంటు సరఫరా చేస్తుండలంతో పంటలకు నీరు ఎలా పెట్టాలని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా సరఫరా చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటును నమ్ముకొనే ఎక్కువ పంటలు వేశామని కోత లు విధిస్తుండటంతో నష్టపోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేదని.. కాంగ్రెస్ వచ్చాక సక్రమంగా రావడం లేదని పలువురు ఆరోపించారు. సీఎం జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాల్లో ఎంత ఘో రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధి కారులు వచ్చి మా సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ మోహనకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. విద్యుత్ సమస్యను అధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు. దీంతో రైతులు సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
పూడూరు: వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి పంటలను కాపాడుకోవాలని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజేశ్వర్‌రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మేడికొండ గ్రామంలో పత్తి, బంతి, చేమంతి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏరువాక శాస్త్రవేత్తలు మధుకర్, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, ఏడీఏ లక్ష్మీకుమారి పంటల సాగుపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తులసీరాం, ఉద్యాన వన అధికారి సురేంద్రనాథ్, ఏఈఓ ఇలియాస్, రైతులు అనంత్‌రెడ్డి, యాదయ్య, రాంరెడ్డి, నర్సింలు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
తెగుతున్న బంధాలు
ఆందోళన కలిగిస్తున్న కుటుంబ హత్యలు భార్యను కడతేర్చి ముక్కలుగా నరికి.. 11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల కొట్లాటఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని దండుమైలారంలో 11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆగస్టు 31న చోటు చేసుకుంది. రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది.. మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి.. అనుమానాలు.. అక్రమ సంబంధాలు.. ఆస్తి తగాదాలతో అయినవారని కూడా చూడకుండా అంతమొందించడం ఆందోళన కలిగిస్తోంది. విలువలు అవసరం -
ఖోఖోలో సత్తాచాటిన విద్యార్థులు
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం 69వ ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించా రు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యా ల్ మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ –17 బాలుర విభాగం ఖోఖో పోటీల్లో ఎంజేపీ(మహాత్మా జ్యోతి బాపులే) గురుకుల పాఠశాల కొడంగల్ జట్టు విజేతగా నిలిచింది. సాంఘిక సంక్షే మ శాఖ గురుకుల పాఠశాలు జట్టు కొడంగల్ రన్న ర్గా నిలిచింది. అండర్ – 17 బాలికల విభాగంలో ఎంజేపీ గురుకు పాఠశాల బూరాన్పూర్ జట్టు విజేతగా, జెడ్పీహెచ్ఎస్ బాలంపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. అండర్ – 14 బాలికల విభాగంలో జెడ్పీహెచ్ఎస్ గోకఫస్లాబాద్ జట్టు విజేత గా..జెడ్పీహెచ్ఎస్ దుద్యాల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. అండర్–14 బాలుర విభాగంలో ఎంజేపీ గురు కుల పాఠశాల కొడంగల్ జట్టు విన్నర్‌గా, ఎంజేపీ దౌల్తాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచినట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజర్ అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా ఎంఈఓ రాంరెడ్డి,ఎస్ఐ జీవీ సత్య నారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పట్వారి జనార్దన్, ఆయా పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నయా చోరులు!
దుద్యాల్: శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా కొద్దీ కేటుగాళ్లు నేరాలు చేయడానికి నూతన సాధనాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తున్న తరుణంలో సైబర్ నేరస్తులు వినూత్న రీతిలో మోసాలకు తెగబడుతున్నారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి మృదువుగా మాట్లాడి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని అందిన కాడికి లూటీ చేస్తున్న ఘటనలున్నాయి. లేదంటే మీకు లాటరీ వచ్చిందని చెప్పి వివరాలు ఆరా తీసి బెదిరింపులకు పాల్పడుతున్న పోకడలు చూస్తున్నాం. ఇవే కాకుండా సైబర్ నేరస్తులు డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్, మొబైల్ హ్యాక్, వివిధ రూపాల్లో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దుద్యాల్ మండలంలో కొత్తరకం సైబర్ మోసం చోటు చేసుకుంది. కిరాణ దుకాణాలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం వేళలో కిరాణం, ఇతర వ్యాపారం చేసుకునే వారి దగ్గరకు వచ్చి కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన మొత్తం బిల్లును ఆన్లైన్ రూపంలో చెల్లించారు. అప్పటికప్పుడు నగదు ఖాతాలో జమ అయినట్లు చూపగా.. అనంతరం ఎక్స్ప్రైడ్, డికై ్లన్ అని వచ్చి అమౌంట్ మాయమవుతున్న ఉదంతం చోటు చేసుకుంది. హస్నాబాద్ గ్రామానికి చెందిన కిరాణ దుకాణం నిర్వాహకుడు కొడంగంటి వెంకటేశ్, కొడంగల్ మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామానికి చెందిన కిరాణ వ్యాపారి శివ కుమార్‌లకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. రెండు ఘటనలు ఒకరోజు గడిచాక ఖాతాలో నగదు చెక్ చేయగా బాధితులు కంగుతిన్నారు. కేవలం మెసేజ్ రూపంలో డబ్బులు జమ అయినట్లు చూపించి, అనంతరం దుండగులు మోసానికి పాల్పడ్డారు. దీంతో వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాపారి వెంకటేశ్ వద్ద రూ.1,200ల సరుకులు గత నెల 30న, శివకుమార్ వద్ద 15 రోజుల క్రితం రూ.1,680ల సరుకులు కొనుగోలు చేసి నగదు ఆన్లైన్ చేసినట్లు చూయించారు. అనంతరం ఖాతాలో నగదు జమకాకుండా మాయం చేశారని బాధితులు వాపోతున్నారు. నగదు ఖాతాలో జమ కావడం లేదని వ్యాపారుల గగ్గోలు దుద్యాల్‌లో వెలుగు చూసిన కొత్తరకం సైబర్ మోసం డిజిటల్ పేమెంట్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుంచి ఫోన్, వీడియో కాల్స్ వస్తే స్పందించొద్దు. వ్యాపారస్తులు కూడా ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కొంత మంది న్యూడ్ వీడియోకాల్స్ చేసి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిని వెంటనే తిరస్కరించాలి. – శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి -
కోడి పందేల స్థావరంపై దాడి
● ఇద్దరు పందెంరాయుళ్లు అరెస్ట్ ● మూడు పందెం కోళ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు పందెం రాయుళ్లను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్‌రాజ్ తెలిపిన ప్రకారం.. మన్నెగూడ అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తమ సిబ్బంది దాడి చేయగా తుర్కయంజాల్‌కు చెందిన తన్నీరు వేణుగోపాల్(32), కట్టంగూర్కు చెందిన దాచేపల్లి శేషగిరిరావు(40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల రాకను గుర్తించిన పులువురు అక్కడ నుంచి పరారయ్యారు. వారి వద్ద మూడు పందెం కోళ్లను, రెండు సెల్పోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. -
చంద్రవంచలో ఉద్రిక్తత!
తాండూరు రూరల్: వినాయక నిమజ్జన వేడుకలో మొదలైన చిన్న గొడవ చినికిచినికి గాలి వానలా మారింది. ఈ సంఘటన మండలంలోని చంద్రవంచలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈశ్వరుడి దేవాలయం వద్ద ఇరువర్గాలకు చెందిన విగ్రహాలు ఎదురుపడ్డాయి. ట్రాక్టర్‌ను పక్కకు తీస్తే ముందుకు వెళ్తామని ఓ వర్గం యువకులు కోరారు. ఈ విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. మరుసటిరోజు ఆదివారం పెద్ద మనుషులు సమక్షంలో పంచాయితీ పెట్టి సముదాయించారు. అంత సద్దుమణిగిందనుకున్న క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు చెందిన యువకులు ఇళ్లల్లోకి వెళ్లి మరీ దాడులు చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలకు చెందిన కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 100కు కాల్ చేయడంతో గ్రామానికి కానిస్టేబుల్ బస్వరాజ్, శేఖర్లు వెళ్లారు. గొడవ ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ బస్వరాజ్ తలకు బలమైన గాయమైంది. దీంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిలో గాయపడిన వారికి సైతం వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐ రాథోడ్ వినోద్ మంగళవారం చంద్రవంచ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం సాయంత్రం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సైతం గ్రామంలో పర్యటించి దాడి గల కారణాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ గాయపడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జన వేడుకలో మొదలైన గొడవ అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి ఇరువర్గాల దాడులు ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ తలకు గాయం కేసులు నమోదు చేశాం గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఇరువర్గాల ఘర్షణపై 15 నుంచి 20 మందిపై కేసులు నమోదు చేశాం. గొడవ జరిగిన సందర్భంలో కానిస్టేబుల్ తీసిన వీడియో ఆధారంగా మరికొంత మందిని గుర్తిస్తున్నాం. కొందరు గ్రామం వదిలి పారిపోయారు. వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎంతటి వారైనా శిక్షార్హులు. – నగేశ్, తాండూరు రూరల్ సీఐ -
ఎంఈఓ ఆఫీసులో ల్యాప్‌టాప్ చోరీ
తాండూరు రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వేణుకుమార్ కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన శ్రీశైలం ఎంఈఓ ఆఫీసులో ఆధార్ నమోదు సెంటర్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగా సోమవారం పని ముగించుకుని ల్యాప్‌టాప్‌ను అక్కడే పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా కార్యాలయంలో ల్యాప్‌టాప్ కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పెద్దేముల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కిటికీ సమీపంలో పెట్టడంతోనే ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంఈఓ కార్యాలయంతో పాటు పక్కనే ఉన్న తహసీల్దార్ ఆఫీసులో కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఎస్ఐ అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము
తాండూరు రూరల్: పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ అన్నారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో పని చేసి బదిలీపై వెళ్లిన కానిస్టేబుళ్లను ఆయన శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అన్ని ఉద్యోగాల కంటే పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నాదన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి రక్షణ కల్పించాలన్నారు. బదిలీపై వెళ్లిన కానిస్టేబుల్ మాసయ్య, రవి, సంతోష్, ధనరాజ్‌ల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, రఫీక్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొప్పు బాషా యాచారం: గ్రామానికి చెందిన కొప్పు బాషా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో కీలక పదవులు నిర్వర్తించారు. ఈ క్రమంలో తన సతీమణి సుకన్యను యాచారం ఎంపీపీగా పదవీలో కూర్చోబెట్టారు. అనంతరం బండి సంజయ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులాల్లోని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజీలేని పోరాటం చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పు బాషా మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. వ్యక్తి బలవన్మరణం షాద్‌నగర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ శివారులోని కీర్తి వెంచర్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌లోని వివేకానంద కాలనీకి చెందిన చాపల గోపాల్(39) ఓ పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు లేక పోవవడం, అవివాహితుడు కావడంతో తన అన్న శేఖర్వద్దే ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి కాకపోవడంతో మనస్థాపంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం కీర్తి వెంచర్ సమీపంలో రైలు కిందపడి ఆతహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు, ఏటీఎం కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైతు ఆత్మహత్య బషీరాబాద్: మతిస్థిమితం లేని ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బషీరాబాద్ మండలం మంతట్టిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నుమాన్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన తలారి హన్మప్ప(63) వ్యవసాయం చేసేవాడు. కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కొడుకు నర్సింలుతో కలిసి పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. నర్సింలు పంపులో నీళ్లు నింపేందుకు బోరుమోటారు వద్దకు వెళ్లగా.. హన్మప్ప పురుగుల మందు తాగాడు. కొడుకు వచ్చేసరికి నురగలు కక్కుతుండటంతో 108లో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య తుల్జమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఏఎంసీ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగా పెంటయ్యగౌడ్ చేవెళ్ల: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ జి.పెంటయ్యగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారని చెప్పారు. చైర్మన్‌గా టి.మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా కె.వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా జి.మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి.ఆంజనేయులు ఎన్నికయ్యారని చెప్పారు. నూతన కమిటీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిశామన్నారు. -
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ చిత్రపటాలకు నాయకులు, అధికారులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో కాళోజీ రచనలు స్ఫూర్తి నింపాయని వక్తలు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరల కృషి చేశారన్నారు. -
పీజీ ప్రవేశ పరీక్షలో విద్యార్థుల సత్తా
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటడం గర్వకారణంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల కృషి, పట్టుదలతో ఉన్నత విద్యలో ముందుకు సాగడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీ స్థాయిలో కె.అనిల్ ఫిజిక్స్‌లో 69వ ర్యాంకు, కె.జగదీష్ ఎంఏ తెలుగు 14వ ర్యాంకు, కె.రమేష్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో సీటు సాధించారన్నారు. అనిల్ మ్యాథమెటిక్స్‌లో, స్వాతి, అశ్విని, కుమారి, ప్రమీళ కెమిస్ట్రీలో మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. -
కళ్లకు గంతలతో గణిత అవధానం
ధారూరు: మండలంలోని నాగసమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అనంతప్పయాదవ్ కళ్లకు గంతలు కట్టుకొని గణిత అవధానం నిర్వహించారు. శతావధానంలో భాగంగా ఒకటి నుంచి 100 వరకు నంబర్లను విద్యార్థులు బోర్డుపై రాసిన వాటిని ఆయన కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా ఆరోహణ, అవరోహన క్రమంలో వివరించారు. మాయ కూడిక, మాయ చదరం, తేదీ చెబితే వారం చెప్పడం తదితర అంశాలను ఆయన విద్యార్థులకు నేర్పించారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుకోవడానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేశ్, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్క్ షాప్‌లో ఉత్తమ ప్రతిభ
మోమిన్‌పేట: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాపులో తెలంగాణ బృందం ఉత్తమ ప్రతిభ చాటిందని ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయుడు దండు రమేశ్ అన్నారు. విద్యలో తోలుబోమ్మలాట పాత్ర అనే అంశంపై పదిహేను రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించారన్నారు. 13రాష్ట్రాలకు చెందిన 90మంది ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములయ్యారని వివరించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఖనిజ సంపద, సహజ సౌందర్యం తదితర అంశాలను నృత్య సంగీతం ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. ప్రాథమిక తరగతి బోధనలో పప్పెట్రీ ద్వారా జాయ్‌ఫుల్ లెర్నింగ్ జరిగేలా ఉపాధ్యాయులను సంసిద్ధం చేయడం, జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించామని వివరించారు. మంగళవారం నిర్వహించిన కథ, కళలు, బుర్రకథ, హరికథలు, లంబాడీ నృత్యాలకు అందరి నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉషారాణి
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కొడంగల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి దంపతులు సోమవారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొడంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో మిఠాయి రాజు, డాక్టర్ సాకేత్, డాక్టర్ శ్రావణి తదితరులు ఉన్నారు. వసతి గృహాల పరిశీలన కొడంగల్: పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలు, ఎస్టీ బాలుర వసతి గృహాలను సోమవారం ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి సందర్శించారు. వాటిలో వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. భోజనం, మెనూ అమలు, నోటుపుస్తకాలు, యూనిఫాం తదితర వాటి గురించి ఆరా తీశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. స్టోర్ రూం, కిచెన్, హాస్టల్ పరిసరాలను తిరిగి చూశారు. విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సీడీఓ పాండు, వార్డెన్లు వరలక్ష్మీ, నిర్మల, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అనంతగిరి: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ (అతివ ఆరోగ్య మస్తు) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేద్దామని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని జిల్లా కార్యాలయం నుంచి అన్ని పీహెచ్‌సీల వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగు తుందన్నారు. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవిత్ర, డాక్టర్ బీబీ జానీ, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ గోపాల్, డిప్యూటీ డెమో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని దుకాణాదారులంతా తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ అధికారులు తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోని పలు దుకాణాలను సీజ్ చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు జవాన్లతో కలిసి దుకాణాలను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకుని మున్సిపల్ అభివృద్ధికి దోహదపడా లని వారు సూచించారు. కార్యక్రమంలో ఎన్వి రాల్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ జవాన్లు ఆశయ్య, వినోద్, బాబా, రాజు, శంకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సహకరించాలి
అనంతగిరి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ సుధీర్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో ఓటరు లీస్ట్, పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ బూత్‌లపై అభ్యంతరా లు ఉంటే తెలియజేయాలని సూచించారు. జి ల్లాలోని 594 గ్రామ పంచాయతీల్లో 5,058 పో లింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు వివరించారు. 6,98,478 ఓటర్లు ఉన్నారని, ఇందులో 3,43,672 మంది పురుషులు, 3,54,790 మంది మహిళలు, 16 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీపీఓ జయసుధ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ -
విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
అనంతగిరి: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కళాశాలలను కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారుకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, బోధన, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇంగ్లిష్, ఉర్దూ పాఠ్యపుస్తకాలు అందుబాటు లేవని, వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డైట్ కళాశాల విద్యార్థులు ఆకునూరి మురళిని కోరారు. ఇందుకు ఆయ న సానుకూలంగా స్పందించారు. వెంటనే పాఠ్యపుస్తకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. డైట్ కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, డీఈఓ రేణుకాదేవి, ప్రిన్సిపాళ్లు గీతా లక్ష్మీపట్నాయక్, రామాచారి తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ పెంచే వరకు వదలం
అనంతగిరి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే పెన్షన్లను పెంచాలని లేకుంటే వెంట పడుతూనే ఉంటామని ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద్, మల్లికార్జున్ అన్నారు. సోమవారం పింఛను మొత్తం పెంచాలని కోరుతూ వికారాబాద్‌లోని కలెక్టరేట్ ఎదుట వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు, ఆసరా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండెళ్లు కావస్తున్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రతిరోజూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా పెన్షన్‌ను మాత్రం పెంచడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, చేయూత పెన్షన్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మంజులారెడ్డి, ఎమ్మార్పిఎస్ జిల్లా ఇన్చార్జ్ రామకృష్ణ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాసు, నాయకులు సుభాష్, ప్రకాష్, నరసింహ, డప్పు మహేందర్, శివాజీ, రవీందర్, పుష్పరాణి, సునీత పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తీరని వ్యథ..!
యూరియా కోసం రైతన్నల పాట్లు తాండూరు రూరల్/పరిగి: యూరియా సమస్య ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా భారీ క్యూలే దర్శనమిస్తున్నాయి.. తాండూరు మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం పంటలకు యూరియా వేయాల్సి ఉండటంతో రైతులు ఫెర్టిలైజర్ దుకాణాలకు, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. తెల్లవారుజామునే వెళ్తున్నా బస్తా కూడా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మండలంలోని ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయానికి సోమవారం ఉదయం 6 గంటలకే రైతులు భారీగా చేరుకున్నారు. దాదాపు 300 మంది రావడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. నాలుగు గంటల పాటు నిరీక్షించిన రైతులకు ఒక బస్తా యూరియా టోకెన్ రాసిఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని ఒక్కొక్కరిని గేటు లోపలికి పంపారు. ఒక్కరికి ఒకే బస్తా ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నుంచి 5 బస్తాల అవసరం ఉందని స్పష్టం చేశారు. పలువురు ఏడీఏ కార్యాలయానికి వెళ్లి అధికారి కొమురయ్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 230 బస్తాల యూరియా అందుబాటులో ఉందని క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. మంగళవారం మరో 30 టన్నులు వస్తుందని ఎవరూ ఆందోళన చెందరాదని సూచించారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెద్దేముల్లో ఆందోళన యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతుసేవా సహకార సంఘానికి యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అన్నదాతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొ బస్తా పంపిణీ చేశారు. చాలా మందికి యూరియా దొరకలేదు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాధలు పట్టవా?యూరియా కోసం నియోజకవర్గ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం ఒక్క బస్తాకు మించి దొరకడం లేదు. సోమవారం పరిగి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదునుకు మందులు వేయక పోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు అధికారులు, ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వెంటనే సాగుకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒకే బస్తా ఇచ్చారు ఉదయం 6 గంటలకే ఎల్మకన్నె పీఏసీఎస్‌కు చేరుకున్నా. నాలుగు బస్తాల యూరియా అవసరం ఉండగా ఒకే బస్తా ఇచ్చారు. అధికారులు స్పందించి సాగుకు సరిపడా యూరియా పంపిణీ చేయాలి. – నేరేటి రవి, రైతు, బెల్కటూర్ గ్రామం -
గంగమ్మ పైపైకి..
వికారాబాద్: మునుపెన్నడూ లేని విధంగా ఏడాది వరుసబెట్టి కురిసిన వర్షాలకు పాతాళ గంగమ్మ పైపైకి వచ్చింది. అధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అత్యధిక వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వ్యవసాయ బోరుబావుల అవసరం లేకుండానే కాలువలు, నాలాల ద్వారా పంటచేలు తడుస్తున్నాయి. జిల్లాలో 20 మండలాలు ఉండగా ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 15 మండలాల్లో అధిక వర్షపాతం పడింది.గ్రౌండ్ వాటర్ పరిస్థితిజిల్లాలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయి. గత ఏడాది ఇదే సీజన్లో సగటున 8 మీటర్ల లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్ ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు 6.78 మీటర్లకు (1.22 మీటర్లపైకి) చేరింది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో రెండు, మూడు మీటర్ల ఎత్తు వరకు వాటర్ లెవెల్ చేరుకుంది. కొడంగల్‌లో 2.32 మీటర్ల అత్యల్ప ఎత్తులో నీరు ఉండగా ఇదే నియోజకవర్గం పరిధిలోని దుద్యాల్ మండలంలో సగటున 18.87 మీటర్ల లోతులో నీరుండటం గమనార్హం.సాధారణ వర్షపాతానికి మించి..ప్రస్తుత సీజన్లో కురిసన అధిక వర్షాలే భూగర్భ జలాలు పెరగడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితమే చెరువులన్నీ పొంగిపొర్లాయి. జూన్ మొదటి వారం నుంచి సాధారణ వర్షపాతం 485 మిల్లీమీటర్లు నమోదు కాగా ఇప్పటి వరకు 648 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు ఉండగా అన్నీ నిండాయి. 800 చెరువులు అలుగు పారుతున్నాయి. చాలా చోట్ల ఫీడర్ చానల్స్ సరిగ్గాలేకపోవడం, ఆక్రమణలకు గురికావడంతో కొన్ని చెరువులు అలుగు పారడంలేదు. ప్రధాన ప్రాజెక్టులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి, శివసాగర్, కాకరవాగు నిండుకుండలా మారాయి.గణనీయంగా పెరిగాయిగత ఏడాదితో పోలిస్తే ఈ సారి భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రెండేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. వర్షపు నీరు వృథాగా దిగువకు పోకుండా కాపాడుకోవాలి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం అందిరిపై ఉంది.– రవిశంకర్, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ -
వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్: వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ ఆర్డీఓ సరితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హా మీని నెరవేర్చాలని అన్నారు. రైతులకు కావాల్సి న యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డి మాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య, రమేష్ యాదవ్, దామోదర్‌రెడ్డి,వెంకటయ్య,షేక్ ఉస్మాన్, కిష్టయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. -
బైకుల దొంగల అరెస్టు
● నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ షాద్‌నగర్‌రూరల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను దొంగతనం చేస్తున్న ఇద్దరిని సోమవారం షాద్‌నగర్ పోలీసులు అరెస్టు, చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం దావుడ్గూడ తండాకు చెందిన శివ, కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామానికి చెందిన బ్యాగరి రాంచందర్‌లు స్నేహితులు. వీరు షాద్‌నగర్ ఠాఫా పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన బైకులను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనం జూలై నెలలో చోరికి గురైంది. ఇదే విషయమై సదరు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బైకు దొంగలను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన సీఐ విజయ్‌కుమార్, డీఎస్ఐ శివారెడ్డి, కానిస్టేబుళ్లు రవీందర్, సంతోష్, కరుణాకర్, జాకీర్‌లను ఏసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు. -
తాండూరు రోడ్లను అభివృద్ధి చేయండి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు:తాండూరు నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధు లు మంజూరు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని వివరించారు. స్పందించిన మంత్రి ఆర్అండ్బీ సీఈకి ఫోన్ చేసి తాండూరులో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు. -
ఆన్లైన్ పనులు అప్పగించొద్దు
బొంరాస్‌పేట: ఆన్లైన్ పనులు అదనపు భారంగా మరుతుందని ఏఎన్ఎంలను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కొంత కాలంగా ఎన్సీడీ ప్రోగ్రామ్‌లో ఏఎన్ఎంలతో స్క్రీనింగ్ టెస్టులతోపాటు ఆప్లైన్ రిపోర్టులు చేయిస్తున్నారు. తాజాగా ఆన్లైన్ కూడా చేయాలని ఒత్తిడి పెంచడం సమంజసం కాదన్నారు. పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక రుగ్మతలకు గురౌతున్నామని వాపోయారు. క్షేత్రస్థాయి పనులతోపాటు ఆన్లైన్ పనులు చేయలేమంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎన్సీడీ ప్రోగ్రామ్‌లో ఆన్లైన్ పనులకు ఏఎన్ఎంలను మినహాయించాలని కోరారు. ఇందులో తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు లీలావతి, హైమావతి, అంజలి, శ్రీలత, పుష్పలత, పద్మ, రాములమ్మ తదితరులు వైద్యాధికారి హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పీహెచ్సీ ఎదుట బైఠాయించిన ఏఎన్ఎంలు -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
● అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి ● డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్‌యాదవ్ దుద్యాల్: సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆనాగ్యో లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్‌యాదవ్ సూచించారు. మండల పరిధిలోని పోలేపల్లిలో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ క్యాంపును సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులను అజాగ్రత్త చేయొద్దని తెలిపారు. గ్రామంలో వ్యాధులు ప్రబలుతున్నాయనే సమాచారంతో మూడు రోజుల పాటు మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. సుమారు 200 మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డాక్టర్ వందన, విద్య పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్, ఆలేడ్ గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథఽ పైపులైన్ పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోంది. దీంతో ఐదు రోజుల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం పైప్‌లైన్ లీకేజీని సరిచేశారు. మిషన్ భగీరథ ఏఈఈ హర్షిత్‌రెడ్డి, సిబ్బందితో వచ్చి సమస్యను పరిష్కరించారు. దీంతో ఆయా జీపీలకు యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమైంది. టీహెచ్ కాలేజీపై చర్యలు తీసుకోండి తాండూరు టౌన్: పట్టణంలో ఎలాంటి అను మతి లేకుండా కొనసాగుతున్న టీహెచ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సంఘం నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్లు తీసు కుని విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా నోడల్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోదన్నారు. ఆయన వెంట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. భార్యను వేధించిన భర్తకు జైలు అనంతగిరి: భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ కొడంగల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీరాం తీర్పు వెల్లడించారని మహిళా పీఎస్ సీఐ బి.సరోజ తెలిపిన వివరాల ప్రకారం.. లగచర్ల గ్రామానికి చెందిన చౌదర్పల్లి సుజాత అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారని 2019 ఆగస్టు 10న భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. వీరికి పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన ఎస్ఐ శ్రీకాంత్, అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో పరిశీలించిన న్యాయమూర్తి పైతీర్పు వెల్లడించారు. నేరస్తునికి శిక్ష పడేలా చూసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ రామకృష్ణను సీఐ సరోజ అభినందించారు. మాజీ మంత్రి మాణిక్‌రావుకు నివాళి తాండూరు: తాండూరు ప్రాంత కీర్తి ప్రతిష్టల ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాజీ మంత్రి మాణిక్‌రావుకు దక్కుతోందని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేశ్ మహరాజ్ అన్నారు. సోమవారం పట్టణంలోని మల్లప్ప మడిగె వద్ద ఉన్న మాణిక్‌రావు విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు మాణిక్‌రావు సతీమణి శశిప్రభ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీసీ కమీషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ సైతం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుమానాస్పదంగా వ్యక్తి మృతి అనంతగిరి: మూడు రోజు ల క్రితం తప్పిపోయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బొంరాస్‌పేట మండలం మెట్లకుంటకు చెందిన ఎస్.మనోజ్(32)కు భార్య రమాదేవి, ఓ బాలుడి ఉన్నాడు. ఈ నెల 4న మనోజ్ వికారాబాద్ పట్టణంలో శుభకార్యానికి హాజరై బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో భార్య మరుసటి రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆదివారం రాత్రి ఆలంపల్లి సమీపంలోని రైలు పట్టాల పక్కన మనోజ్ మృతదేహం పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు వెల్లడిస్తున్న సీఐ సరోజు -
లంబాడాలపై అసత్య ప్రచారం
మోమిన్‌పేట: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావులను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారా, లంబాడీలు సింధు నాగరికత కాలం నుంచి గిరిజనులుగా గుర్తింపు పొందారన్నారు. బ్రిటిష్ పాలకులు సైతం 1871లోనే క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారని చెప్పారు. కుట్రపూరితంగా లంబాడీలను గిరిజన జాబితా నుంచి తొలగించాలని రిట్ పిటిషన్ దాఖలు చేఽశారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోర్‌సేన జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌నాయక్, నాయకులు రవీందర్, కాశిరాం, దీప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ -
రోడ్డు విస్తరణ అడ్డగింత
బషీరాబాద్: రహదారి విస్తరణ పనుల కోసం తమ దుకాణాలు, ఇళ్లు కూలగొట్టితే కుటుంబాలు రోడ్డున పడుతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.30 కోట్లతో బషీరాబాద్–జీవన్గీ రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రంలోని రైల్వేగేటు నుంచి గోసాయికాలనీ పోచమ్మ ఆలయం వరకు 1.2 కి.మీ మేర 43 ఫీట్లకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు మధ్యలో నుంచి రెండు వైపులా 27ఫీట్ల వరకు విస్తరణ జరుగుతుంది. దీంతో తమ దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్నామని బషీరాబాద్‌కు చెందిన బాధితులు ప్రదీప్, ఫయాజ్, జయంత్, హోటల్ రాములు, తుకారం, నర్సిములు, దీపక్, రాజన్న కులకర్ణి, రఘు, సునీల్, సురేష్, రామ్‌చందర్, తుల్జరామ్గౌడ్, పాష, పవాన్ ఠాకూర్, సాయిల్‌గౌడ్, ప్రమోద్, శ్రవణ్ సోమవారం రోడ్డు పనులను అడ్డుకున్నారు. వీరికి స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఉన్నతాధికారులతో చర్చించి.. విషయం తెలుసుకున్న ఆర్అండ్బీ ఏఈ రిషీవరుణ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. రోడ్డుకు మరో వైపు ప్రభుత్వ పాడుబడిన భవనాలు ఉన్నాయని అటు నుంచి రె ండు మీటర్లు కొలత తీసుకోవాలని కోరారు. తద్వారా తమ షాపులు, ఇళ్లకు నష్టం జరుగకుండా ఉంటుందని మొరపెట్టుకున్నారు. దీంతో ఆర్అండ్బీ అధికారులు మరోసారి రోడ్డు కొలతలు తీసుకున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏఈ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం రోడ్డు మధ్య భాగంలోనే తవ్వకాల పనులు ప్రారంభమయ్యాయి. దుకాణాలు, ఇళ్లు తొలగించొద్దు ప్రభుత్వ జాగలో నుంచి రహదారి వేయండి ఆర్అండ్బీ అధికారులకు బాధితుల విజ్ఞప్తి నష్టం జరగకుండా విస్తరణ ప్రజల ఇళ్లు, షాపుల నిర్మాణాలు కూల్చకుండానే రోడ్డు పనులు చేపడుతున్నాం. ఎవరు ఆందోళన చెందవద్దు. అయితే షాపులు, ఇళ్ల ముందు ఉన్న ర్యాంపులు, మెట్లు తొలగించబడుతాయి. బాధితుల ఆందోళనతో రోడ్డు విస్తరణను తాత్కాలికంగా నిలిపేశాం. ఉన్నతాధికారులతో చర్చించి ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా చూస్తాం. – రుషీవరుణ్, ఏఈ, ఆర్అండ్బీ -
ట్రాన్స్ఫార్మర్ కోసం ఆందోళన
● పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు ● విద్యుత్ కార్యాలయ గేటుకు ట్రాక్టర్ అడ్డం పెట్టి రైతుల నిరసన తాండూరు టౌన్: పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని ఇద్దరు రైతులు తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పది రోజుల క్రితం పాడైపోయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని పలుమార్లు విద్యుత్ ఏఈ, లైన్మెన్ను ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. సోమవారం పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్లో వేసుకుని తాండూరులోని విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరసనకు దిగారు. చివరికి అధికారులు ఈరోజు కుదరదు, మరో రోజు రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులిద్దరూ ట్రాక్టర్‌ను కార్యాలయ గేటుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. పది రోజులుగా ట్రాన్స్ఫార్మర్ లేకపోవడంతో పంట చేను ఎండి పోతోందని, విద్యుత్ అధికారులను బతిమిలాడినా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. రైతులకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది నచ్చజెప్పి, ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆ స్తంభాలను తొలగించండి
● లేదంటే ఆత్మహత్య చేసుకుంటా ● సబ్‌స్టేషన్ ఎదుట రైతు ఆందోళన మంచాల: తమ పొలంలో నాటిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఓ రైతు సోమవారం పెట్రోల్ డబ్బాతో సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి జాపాల గ్రామానికి చెందిన బక్కున మల్లప్పకు చెందిన వ్యవసాయ పొలం నుంచి శనివారం ప్రక్క రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ స్తంభాలను అమర్చారు. విషయం తెలుసుకున్న మల్లప్ప.. తమకు సమాచారం ఇవ్వకుండా పొలంలో స్తంభాలు ఎలా ఏర్పాటు చేశారని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏఈ బాజీసింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ పోల్స్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చాడు. రెండు రోజులు అయినా వాటిని తొలగించలేదని పేర్కొంటూ.. తాజాగా బాధిత రైతు నిరసన వ్యక్తం చేశారు. వాటిని తీయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. లేబర్ రాగానే మంగళవారం ఉదయం ఆ స్తంభాలను తొలగిస్తామని బాధిత రైతుకు హామీ ఇచ్చారు. అయినా సదరు వ్యక్తి వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
యూరియా కావాలంటే!
కావాల్సినంత యూరియా దొరకక తిప్పలు పడుతున్న అన్నదాతలకు ఫర్టిలైజర్ షాపుల యజమానుల షరతులు పెనుభారంగా మారుతున్నాయి. యూరియా కోసం తప్పనిసరిగా బయో, లాప గుళికలు కొనాలని ఒత్తిడి తేవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుద్యాల్: ఓ వైపు రైతుకు సరిపడా యూరియా అందక విలవిలలాడుతుంటే.. కొందరు వ్యాపారులు వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న పంటకు యూరియా, డీఏపీ ఎరువులు అందించాల్సి ఉంది. ఇదే అదనుగా భావించిన ఫర్టిలైజర్ షాపుల యజమానులు యూరియా కావాలంటే బయో ఉత్పత్తులు, లాప గుళికలు, క్రిమి సంహారక మందులు కొనాలని షరతులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఫర్జిలైజర్ షాప్‌లు, మన గ్రోమోర్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలల్లో ఎరువులు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంటున్నాయి. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు సైతం గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సరఫరా ఇలా.. ప్రభుత్వం ప్రైవేట్ ఫర్జిలైజర్, ప్రభుత్వ అనుసంధాన ఫర్జిలైజర్ దుకాణాలకు విరివిగా అందిస్తుంది. ప్రభుత్వం అనుసంధాన షాపులైన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు,(డీసీఎంఎస్, పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, హాకా) సోసైటీలకు 60 శాతం యూరియా సరఫరా కాగా మిగిలిన 40 శాతం ప్రైవేట్ షాపులకు సరఫరా చేస్తారు. బయో, లాప గుళికలు కొనాలని షరతు కొరతను ఆసరా చేసుకొని వ్యాపారుల ఆగడాలు రైతులపై అదనపు భారం మోపుతున్న వైనం లబోదిబోమంటున్న అన్నదాతలు పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా 324 దుకాణాలు జిల్లాలో దుకాణల వివరాలు ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలు 24 డీసీఎంఎస్ 26 పీఏసీఎస్ 14 ఎఫ్ఏసీఎస్ 01 హెచ్ఏసీఏ(హాకా) 01 మన గ్రోమోర్ 08 ప్రైవేట్ ఫర్జిలైజర్స్ 245 చర్యలు తీసుకుంటాం ఎరువులు, క్రిమిసంహారక మ ందులు అమ్ముతున్న ఏ యా జమాన్యమైన యూ రియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు బయో ఉత్పత్తులు, లాప గుళికలు తప్పనిసరిగా అంటగట్టొద్దు. తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. నిజమని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు కావాల్సిన ఎరువులను సరైన ధరకే అమ్మాలి. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి -
మొండి బకాయిలపై చర్యలు
● బంట్వారం పరిధిలో రూ.5.32 కోట్ల పెండింగ్ ● సహకార సంఘం జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావు బంట్వారం: దీర్ఘకాలిక రుణాలు చెల్లించని మొండి బకాయిదారులపై చర్యలకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాయింట్ రిజిస్ట్రార్ (ఓఎస్డీ) సూర్యచంద్రరావు అన్నారు. బంట్వారం సహకార సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘం పరిధిలో రూ.5.32 కోట్ల రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు జారీ అయిన సుమారు యాభై మంది రైతులను కలిశామని తెలిపారు. వీరిలో ఇద్దరు లోన్ క్లియర్ చేయగా, మిగిలినవారు పంటలు చేతికి వచ్చాక అప్పు చెల్లిస్తామని సమాధానం చెప్పారన్నారు. మరో 300 మంది రైతుల నుంచి ఓవర్‌డ్యూ ఉందన్నారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, రికవరీ చర్యలు చేపడుతామని స్పష్టంచేశారు. నోటీసులు అందుకున్న మొండిబకాయిదారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్టీ రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ పడుతుందని తెలిపారు. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లిస్తే నష్టం ఉండదన్నారు. పెండింగ్ లోన్లను సత్వరమే చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అక్షత్, మోమిన్‌పేట బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో చాలా మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మంగ్లీలాల్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 83మంది వివిధ సమస్యల పరిష్కా రం కోసం దరఖాస్తులు ఇచ్చారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని సూచించారు. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబల కుండా చూడాలన్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కిడికై నా వెళ్లాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఆర్ఓ మంగ్లీ లాల్, ఆర్డీఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
పీహెచ్సీలో సేవలు అంతంతే..!
దౌల్తాబాద్: గ్రామాలతో పాటు పలు మండల కేంద్రాల్లో కొనసాగుతున్న పీహెచ్‌సీల్లో వైద్య సేవలు పూర్తిగా అందడంలేదు. కొన్ని అప్‌గ్రేడ్ కాకపోవడంతో 8 గంటలే సేవలు అందిస్తున్నారు. దౌల్తాబాద్ పీహెచ్సీ ఏర్పాటై దాదాపు 25 ఏళ్లవుతున్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలను పరిమితం చేశారు. 24 గంటల ఆస్పత్రిగా చేయాలని పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంబంధిత అధికారులు, సిబ్బంది పని వేళలు పాటించాల్సి ఉండడంతో సాయంత్రం నాలుగింటికి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లి పోతున్నారు. దీంతో సాయంత్రం, రాత్రి సమయాల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురైనా, రోడ్డు ప్రమాదాలు సంభవించినా, కుక్క కాటుకు గురైనా సాయంత్రం, రాత్రి వేళల్లో కొడంగల్, తాండూరు, కోస్గి తదితర ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇదే విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలోని 34 గ్రామాలకు కలిపి దౌల్తాబాద్ పీహెచ్‌సీయే పెద్దది. ఇందులో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్టు, ల్యాబ్టెక్నీషన్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఉన్నారు. నిత్యం 80కిపైగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 24 గంటల ఆస్పత్రిగా మారుస్తే రోగులకు సౌకర్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. ప్రసవాలు లేవు.. పీహెచ్సీ కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరిగా జరగాలని జిల్లా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో సరైన సదుపాయలు లేకపోవడంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం రెండు పడకలే ఉండడంతో సేవలు అందడంలేదు. 24 గంటల ఆస్పత్రిగా మార్చి వైద్యసేవలు మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారిణి ప్రియదర్శిని వివరణ కోరగా 24గంటల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. 24 గంటలకు అప్‌గ్రేడ్ కాని దౌల్తాబాద్ ఆస్పత్రి సాయంత్రం, రాత్రిళ్లు అందని వైద్యం ఇబ్బందుల్లో మండలవాసులు పట్టించుకోని అధికారులు నా కూతురు చనిపోయింది.. నా కూతురుకు జ్వ రం వచ్చింది. అయితే రాత్రి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఉదయం గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే మూసి ఉంది. తెలియక ప్రైవేట్ వాహనంలో కోస్గికి తీసుకెల్తుంటే మార్గమధ్యలో చనిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిని 24 గంటల ఆస్పత్రి చేసి ఉంటే నా కూతురు బతికేది. – కిష్టప్ప, దౌల్తాబాద్, స్థానికుడు -
యూరియా వచ్చింది.. కలత తీరింది!
యాచారం: యూరియా కొరత కారణంగా నిన్నమొన్నటి వరకు కర్షకులు కలత చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సాగు పనులు వదిలి.. శాంతపొడవుగా పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, అధికారులు.. ‘యూరియా కోసం రైతు లు ఇబ్బంది పడొద్దు. అవసరం మేరకు స్టాక్ వస్తోంది. అందరికీ అందజేస్తాం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. తాజాగా సెలవు రోజైన ఆదివారం.. యా చారం మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ చేశా రు. 450 మందికి టోకెన్లు ఇచ్చి, పోలీసుల సమక్షంలో ఒకొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశా రు. సరఫరా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ త నాలుగైదు దఫాలుగా యూరియా కోసం వంద లాది మంది రైతులు ఆందోళన చెసిన విషయం విధితమే. -
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
దోమ: వీరభద్రేశ్వర ఆలయంలో ప్రదక్షిణ కుల్కచర్ల: గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు కుల్కచర్ల: పౌర్ణమి సందర్భంగా ఆదివారం పాంబండ రామలింగేశ్వరాలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు రుద్రహోమం నిర్వహించి అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, అర్చకులు పాండు శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీరభద్రేశ్వర స్వామికి రుద్రాభిషేకం దోమ: మండల పరిధిలోని గూడూరులో ఆదివారం గ్రామస్తులు వీరభద్రేశ్వర స్వామికి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు జంగం శివ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయం చూట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శేరి రాంరెడ్డి, శివకుమార్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సతీశ్ కుమార్, ఆనంద్ కుమార్, బుగ్గారెడ్డి, ప్రసాద్‌కుమార్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా
దుద్యాల్: మండల పరిధిలోని ఆలేడ్, హస్నాబాద్ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. హస్నాబాద్ గ్రామ సమీపంలో పైపులైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు ప్రైవేట్ బోర్లు, సమీప బావుల నుంచి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. కనీసం అధికారులు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పగిలినపైపులైన్ను మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఐదు రోజులుగా ఇబ్బందులు ప్రైవేట్ బోర్ల నుంచి తెచ్చుకుంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న హస్నాబాద్, ఆలేడ్ గ్రామస్తులు పట్టించుకోని అధికారులు -
లాభాల ‘బంతి’
షాబాద్: ఉద్యానపంటల సాగులో డ్రిప్ పద్ధతిని అవలంభిస్తే నీటిని పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పండుగలు, ఇంటి గుమ్మాల అలంకరణకు, ఆలయాల్లో నిర్వహించే పూజలకు అవసరమయ్యే బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీటి వనరులతో బంతిని సాగు చేస్తూ, సస్యరక్షణ చేపడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు అని చేవెళ్ల డివిజన్ ఉదాన్యవన శాఖ అధికారి కీర్తి తెలిపారు. అన్ని కాలాల్లో అనుకూలంగా సాగు చేసే బంతిపై సలహాలు, సూచనలు ఆమె మాటల్లోనే.. ఏపుగా పెరిగితే.. బంతిలో ఆఫ్రికన్, ఫ్రెంచ్ మేరీ గోల్డ్ ఉన్నాయి. నీటి వసతి కలిగిన అన్ని కాలాలు, సారవంతమైన గరప నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలలు బంతి సాగుకు అనుకూలం. ఎకరానికి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం. మడులను తయారు చేసి విత్తనాలను చల్లుకోవాలి. బంతి మొక్కలు ఏపుగా పెరిగితే, పూల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. సాగుకు విత్తనాల ద్వారా లేదా కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. కోతకు ముందు నీరుపడితే.. నెల వయసు కలిగిన బంతి మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటుకు వచ్చిన నారును సాయంత్రం వేళల్లో నాటుకోవాలి. నాటిన 60 రోజుల తర్వాత పూత దశ వచ్చేవరకు నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడితో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. పూలు బాగా విచ్చుకున్న తర్వాతనే కోయాలి. అదీ ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇచ్చినట్లయితే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఐదుటున్నుల దిగుబడి వస్తుంది. సస్యరక్షణ చర్యలు పేను.. పూల మొగ్గలను ఆశించి నష్ట పరుస్తాయి. వాటి నివారణకు లీటర్ నీటికి మోనోక్రొటోఫాస్ 1.5 మిలీను కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగులు.. ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొగ్గలు గోదుమ రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మిలీ.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గతొలిచే పురుగులు.. లార్వాలు పూల మొగ్గలను తొలిచేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిలీను.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు, నివారణ నారుకుళ్లు తెగుళ్లు: నీటి తడి ఎక్కువగా ఉండి, వేడిగా ఉన్న చోట ఈ తెగులు వ్యాపిస్తుంది. లేత మొక్కలు చనిపోతాయి. మడులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. నేలను లీటర్ నీటికి 2 గ్రాముల కాఫ్టాన్ మందుతో తడపాలి. ఆకు మచ్చ తెగులు: మొక్కల్లో బూడిద రంగు, లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. సిరులు కురిపిస్తున్న సాగు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి యాజమాన్య పద్ధితిని అవలంబిస్తే మేలు చేవెళ్ల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కీర్తి ఎరువుల వాడకం మడులను తయారు చేసే సమయంలో బాగా చివికిన పశువుల ఎరువు ఎకరానికి 20 టన్నులు వేసి కలియ దున్నుకోవాలి. దీంతో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్‌ను వేసుకోవాలి. నాటిన 37 రోజులకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని వేసి నీరు పట్టాలి. పాలిడాల్ పాడి చల్లడం వలన చీమలు, చెదను నివారించుకోవచ్చు. విత్తిన విత్తనాలు వారం రోజుల్లో మొతకెత్తుతాయి. ఉద్యాన పంటలతో లాభాల పంట పడుతుంది. నీటి వసతి కలిగిన ప్రాంతం.. బంతి సాగుకు అనుకూలమైనది. తక్కువ పెట్టుబడితో, యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
‘స్థానికం’గా సత్తా చాటుదాం
● ప్రతీ గ్రామం నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలి ● పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డిమర్పల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామం నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సిరిపురంలో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో లేరన్నారు. రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని పోటీకి ఆసక్తి ఉన్న ఆశావహుల వివరాలు సేకరించారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సమష్టిగా అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలు, బయోడేటా తీసుకున్నారు. ఈ వివరాలను పార్టీ అధిష్టానానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కోఆర్డినేటర్ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా మాజీ కార్యదర్శి బలరాంగౌడ్, నాగన్న, మండల కోఆర్డినేటర్ యాదవరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్‌కుమార్, నాయకులు జైపాల్, మహేశ్వరి, సునిల్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, సుభాశ్ తదితరులు ఉన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. -
నేడు కలెక్టరేట్లో జీపీఓలకు కౌన్సెలింగ్
● జిల్లాలో 236 రెవెన్యూ క్లస్టర్లు ● ప్రస్తుతం 163 క్లస్టర్లకు నియామకం వికారాబాద్: గ్రామ పాలనాధికారులు త్వరలో విధుల్లో చేరనున్నారు. వారు రెవెన్యూ గ్రామాల బాధ్యతలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో వీఆర్ఓలుగా, వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తూ వచ్చిన వీరు గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్తను రద్దు చేయటంతో ఆయా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్స్‌గా నియమితులైన విషయం విదితమే. ఎన్నికల హామీ మేకు వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గ్రామపాలనాధికారులుగా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు వీరికి పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా ఎంపిక చేసింది. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా గ్రామపాలనాధికారులు నియామక ప్రతాలు అందుకున్నారు. అనంతరం వారి స్థానికత ఆధారంగా కేటాయించిన జిల్లాలో చేరారు. జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న 139 మంది జీఓపీలుగా రిపోర్టు చేశారు. జిల్లాకు సరిపడా జీపీఓలు లేక పోవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి 24 మందిని కేటాయించారు. పొరుగు నియోజకవర్గాల్లో పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న జీపీఓలు వారికి కేటాయించిన జిల్లాలో విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల నిబంధనల ప్రకారం వారికి కౌన్సెలింగ్ నిర్వహిచి రెవెన్యూ క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరికి పొరుగు నియోజకవర్గాల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినా.. ఆరోగ్యం, స్పౌజ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. జీపీఓల నుంచి సైతం ఆప్షన్లు తీసుకునేలా ఫారంలు సిద్ధం చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ముగిసిన తర్వాత అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం రెవెన్యూ క్లస్టర్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 510 రెవెన్యూ గ్రామాలను 236 రెవెన్యూ క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ప్రస్తుతం 163 మంది జీపీఓలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ముందుగా 163 క్లస్టర్లకు జీపీఓలను కేటాయించి మిగతా క్లస్టర్లను అందుబాటులో ఉన్నవారికి అదనపు బాధ్యతలు ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పనులు వేగిరం జీపీఓల రాకతో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతానికి ఒక్కో జీపీఓకు మూడు నుంచి నాలుగు రెవెన్యూ గ్రామాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో పనిభారం పెరిగింది. ప్రస్తుతం ఒక్కరిద్దరు ఆర్ఐలు తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. పై అధికారులకు నివేదించే ప్రతీ ఫైల్‌ను వీరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్టు సిద్ధం చేయాల్సి ఉంటుంది. గతంలో వీరికి అసిస్టెంట్లుగా వీఆర్వోలు, వీఆర్ఏలు విధులు నిర్వహించే వారు. వీరిని తొలగించడంతో పనిభారమంతా ఆర్‌ఐలపైనే పడింది. దీంతో మూడేళ్లుగా ఆర్ఐలు సతమతమవుతూ వచ్చారు. ఈ ప్రభావం తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లపైనా పడింది. రేషన్ కార్డులు, కులం, ఆదాయం, నివాసం, లీగలేయర్ తదితర సర్టిఫికెట్ల జారీతో పాటు ఇతర రెవెన్యూ సమస్యలు ఏవైనా ఫీల్డ్ వేరిఫికేషన్ బాధ్యతలు ఆర్‌ఐలపైనే ఉండటంతో పనిభారం పెరిగి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో పురోగతి మందగించింది. ప్రస్తుతం జీపీఓల నియామకంతో మళ్లీ వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉందని పలువురు చర్చింకుంటున్నారు. -
మాజీ మంత్రుల ప్రత్యేక పూజలు
కందుకూరు: మండలంలోని లేమూరు పరిధి లోని శ్రీదేవి, భూదేవి సమేత స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మాజీ మంత్రులు కె.జానారెడ్డి, జి.చిన్నారెడ్డి, డీకే సమరసింహారెడ్డి దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం గురించి ట్రస్ట్ చైర్మన్ గూడూరు కొండారెడ్డి, దేవాలయ విశిష్టత గురించి స్థపతి శివనాగిరెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణేశ్, నాయకులు భాస్కర్‌రెడ్డి, పాండు, కె.జైపాల్‌రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల మూసివేత
అనంతగిరి: చంద్రగ్రహనం సందర్భంగా అర్చకులు వికారాబాద్‌లోని పలు ఆలయాలను ఆది వారం మధ్యాహ్నం మూసివేశారు. అనంతగిరిగుట్ట అనంత పద్మనాభ స్వామి ఆలయల తలపులను మధ్యా హ్నం 2గంటలకు మూసివేశారు. సోమవారం ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. పాంబండలో రామలింగేశ్వరాలయంకుల్కచర్ల: చంద్రగ్రహణం నేపథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో ఆలయాలను మూసివేశారు. బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయంలో ఉదయం 10గంటలకు ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు దశరథం ఆధ్వర్యంలో, మందిపల్‌లో ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్ ఆలయం గేట్లకు తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఆలయాలకు తాళంతాండూరు: తాండూరు నియోజవకర్గంలోని ఆలయాలను ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసి వేశారు. పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి ఆలయం, రసూల్‌పూర ఆంజనేయ స్వామి దేవాలయం, పాత తాండూరులోని కోటేశ్వర ఆలయం, సీతారాంపేట్ పాండురంగ దేవాలయం, నగరేశ్వర స్వామి దేవాలయం, చంద్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాల గేట్లు మూసి తాళం వేశారు. సోమవారం ఉదయం 10గంటల తర్వాత భక్తులకు దర్శనం ఉంటుందని చెప్పారు. -
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
శంకర్పల్లి: కరాటే నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని మోకిలలోని ఓ ప్రైవేట్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సక్సెస్ షోటోకాన్–2025 చాంపియన్ పోటీలను మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ప్రారంభించగా.. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. పోటీలను టి.కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా మోకిలకి చెందిన మన్నె వెంకటేశ్ స్పాన్సర్ చేశారు. పలు జిల్లాలకు చెందిన సుమారు 500 మంది 5 నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులు తమ ప్రతిభ చాటారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ టెక్నికల్ అడ్వజైర్ రవీందర్, ఫౌండర్ అనిల్ కుమార్, కోచ్‌లు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. -
ఎత్తే సవాలైంది!
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున ముగిసినా హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఉదయానికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి మండపాల సంఖ్యతోపాటు విగ్రహాల ఎత్తూ గణనీయంగా పెరిగిపోవడంతోనే నిమజ్జన ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ‘ఆఫ్‌లైన్’లో రెట్టింపు వరకు.. నగర కమిషనరేట్ పరిధిలో గణేశ్ మండపాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది మొత్తం 12,030 విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు తీసుకోకుండా మరో 40 వేల మండపాలు ఏర్పాటయ్యాయి. క్షేత్రస్థాయి అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా గణపతి విగ్రహాల ఎత్తు, నిమజ్జన ఊరేగింపు మార్గం తదితరాలను గుర్తిస్తూ అది నిమజ్జనం అయ్యే వరకు పర్యవేక్షించారు. దీనికోసం ప్రతి విగ్రహానికి ఓ క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఈ మండపాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతం వరకు ప్రతి మార్గాన్నీ పర్యవేక్షించిన అధికారులు అడ్డంకులు లేకుండా కృషి చేశారు. ‘లెక్కల్లో’లేని ఆ విగ్రహాలు నగరంలో ఏర్పాటైన కొన్ని విగ్రహాలతోపాటు పొరుగు కమిషనరేట్లు, జిల్లాల నుంచి వచ్చిన విగ్రహాల ఊరేగింపులతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వీటిలో కొన్ని ఏకంగా 40 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఫలితంగా ఆయా మార్గాల్లో ఉన్న కొన్ని కరెంట్ వైర్లు, చెట్లు, కేబుల్ తీగలు విగ్రహాలకు అడ్డంకు లుగా మారాయి. మోనప్ప ఐలాండ్–రాజ్‌భవన్ మార్గంలో శనివారం రాత్రి ఓ విగ్రహం చెట్టు కొమ్మలకు తగిలి వాహనంపైనే వెనక్కు ఒరిగిపోయింది. దీంతో పంజగుట్ట ప్రాంతంలో రిజర్వ్‌లో ఉంచిన క్రేన్‌ను తీసుకువచ్చి విగ్రహానికి ఎలాంటి నష్టం లేకుండా వాహనంపై నిలబెట్టారు. ఇలా మరికొన్ని చోట్లా జరగడంతో ఆయా మార్గాల్లో వాహనాలు ఆగిపోయి శోభాయాత్రకు అవాంత రాలు ఏర్పడ్డాయి. నెక్లెస్‌రోడ్‌లోకి చేరిన 900 విగ్రహాలు ఈ ఏడాది మూడోరోజు నుంచి పదకొండో రోజు వరకు దాదాపు 1.4 లక్షల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 1.2 లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనం కాగా.. మిగిలినవి హుస్సేన్‌సాగర్‌సహా ఇతర చెరువుల్లో జరిగాయి. ఐదడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న 4,700 విగ్రహాలు శనివారం ఉదయం నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి దాదాపు 900 విగ్రహాలతో ఉన్న లారీలు మిగిలిపోవడంతో వీటిని నెక్లెస్ రోడ్డులోకి మళ్లించారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్కు వద్ద ఉన్న కొన్ని క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు పాక్షికంగా ఎత్తేశారు. సోమవారం తెల్లవారుజాముకు ఈ క్రతువును సంపూర్ణం చేసి, ఆంక్షల్ని ఎత్తేయనున్నారు. విగ్రహాల ఎత్తు పెరగడమే దీనికి కారణం గత ఏడాదితో పోలిస్తే తగ్గిన ఉదంతాలు 40 గంటలు అవిశ్రాంతంగా విధులు : సీపీ ఆనంద్ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో బడా గణేశుడి నిమజ్జనం గతేడాది కంటే ముందుగా పూర్తయింది. మాకు సహకరించిన ఉత్సవ సమితితోపాటు మండపాల నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఊరేగింపుల్లో జరిగిన చిన్నచిన్న ఘర్షణలపై వివిధ ఠాణాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 170 మంది పోకిరీలతోపాటు జేబుదొంగల్ని పట్టుకున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇలాంటి నేరాల సంఖ్య తగ్గింది. సామూహిక నిమజ్జనం కోసం దాదాపు 40 గంటల నిర్విరా మంగా పని చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు. – సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
పాత అలైన్‌మెంట్‌నే పాటించండి
పూడూరు: ట్రిపుల్ ఆర్ పరిధిలో భూములు కోల్పోతున్న బాధితులు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడంతో మండల కేంద్రంలోని 60 మంది రైతులు భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని కోరారు. భూములు ఇచ్చేది లేదని.. ఎంతవరకై నా పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నూతన జేఏసీ ఏర్పాటు ట్రిపుల్ ఆర్ భూ బాధితుల జేఏసీ కన్వీనర్‌గా పి.వెంకట్‌రెడ్డి, కోకన్వీనర్లుగా నవీన్ జ్యోషి, మైబెల్లి, సభ్యులుగా సాయిరెడ్డి, శర్బలింగం, నవాజ్, గౌరేశం, అమర్నాథ్, జబ్బార్, మున్నీర్, సాధకాలిను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మెన్లు నరసింహారెడ్డి, రఘునాథ్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, మల్లేశం, శ్యాంసుందర్ రెడ్డి, సతీశ్ పంతులు, రామచంద్రయ్య హరీశ్వర్ రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి భూ నిర్వాసితుల నిరసన -
అలయ్ బలయ్‌కు ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్పీకర్ నివాసానికి వెళ్లి అక్టోబర్ 3న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రిక అందజేశారు. కోట్‌పల్లి ఏఓ కరుణాకర్‌రెడ్డి బంట్వారం: ఎస్ఎంఏఎం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు కోట్‌పల్లి ఏఓ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం మిగిలిన వారికి 40 సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ పథకంలో కోట్‌పల్లి మండలానికి 250 బ్యాటరీ స్ప్రేయర్లు , 21 పవర్ ఆపరేటర్ స్ప్రేయర్లు, పది రోటావేటర్లు, కల్టివేటర్లు, డిస్క్హరోలు, రెండు సీడ్ ఫెర్టిలైజర్ డ్రిల్, ఒక పవర్ టిల్లర్ కేటాయించారని చెప్పారు. అర్హులై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలు జతపరిచి రైతు వేదికల్లో అందజేయాలని సూచించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అనంతగిరి: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెన్షన్లను పెంచాలని కోరుతూ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ హామీని మెనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. ఉదయం 11గంటలకు నిర్వహించనున్న ఈ ధర్నాలో పెన్షన్‌దారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గిరిగేట్‌పల్లిలో మద్యపాన నిషేధం అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లిలో మద్యపాన నిషేదం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని చర్చించారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.. అందుకే మద్యపాన నిషేధం అమలుకు నిర్ణయించామని మహిళలు, యువకులు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ ఆదివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు హైదరాబాద్‌లోని మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని రిటైల్, ఈ–కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. వివరాలకు 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చేవెళ్ల: ట్రాఫిక్ పోలీసు కేసుల పరిష్కారానికి సోమవారం నుంచి ఈనెల 13వ తేదీవరకు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మద్యం తాగి వాహనాలు నడిపించిన కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్ కేసులు తక్కువ జరిమానాతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆధార్‌కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లతో రావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 99632 95757, 94906 17461 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మా ఊరి కోడళ్లు.. మాంసం ముట్టరు!
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో అనాదిగా కొనసాగుతున్న ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గ్రామానికి కోడలిగా వచ్చే వారిని సాక్షాత్తూ గిరిజన దేవత సీతమ్మగా భావిస్తారు. కొత్త కోడలిగా తండాలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె మాంసం, కల్లు, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటుంది. ఇలా తాతల కాలం నుంచి ఈరోజు వరకు తండాకు వచి్చన సుమారు 200 మందికిపైగా ఈ సంప్రదాయాన్ని సంతోషంగా పాటిస్తుండటం గమనార్హం. దుద్యాల్: గిరిజనులు, లంబాడాలు ఇష్టంగా తినేది మాంసాహారమే. అటవీ ప్రాంతంలో ఉండే వీరికి జంతువులు, పక్షులు, చేపలను వేటాడటం, కోళ్లు, మేకలు, గొర్రెలను పెంచడం వంటివి చిన్నతనం నుంచే అబ్బుతాయి. ఈక్రమంలో మహిళలు, పురుషులు, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వారంలో కనీసం మూడుసార్లయినా మాంసం తింటారు. నీసు(మాసం) లేనిదే ముద్దతిగదని చాలా మంది బహిరంగంగానే చెబుతుంటారు. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి ఒక్కసారిగా మాంసానికి దూరంగా ఉండమంటే కష్టమే. కానీ వాల్యానాయక్‌తండాకు కోడలిగా వచ్చేవారు ఎవరైనా మాంసం, మద్యానికి దూరంగా ఉండాల్సిందే. సుమారు రెండు శతాబ్దాలకు పైగా ఈ ఆచారం కొనసాగుతోంది. వివాహం చేసుకునే వరుడు తాళికట్టి, కుంకుమ»ొట్టు పెడితే చాలు కట్టుబాటును పాటించాల్సిందే. అయితే ఇప్పటి వరకూ మహిళలెవరూ దీన్ని కట్టుబాటుగా భావించకపోవడం విశేషం. ఇది ఎక్కడికెళ్లినా తమకు అత్యంత గౌరవాన్ని తెచ్చి పెడుతుందని తండా కోడళ్లు చెబుతున్నారు. ఇతర గ్రామాలు, బంధువుల శుభకార్యాలకు వెళితే తమకు ప్రత్యేక భోజనం వండి పెడుతారని పేర్కొంటున్నారు. పెళ్లి రోజే ప్రతిజ్ఞ వాల్యానాయక్‌తండాలో 700 మంది జనాభా ఉంటుంది. ఇంటికి వచ్చే కోడలే తమ వంశాన్ని వృద్ధి చేస్తుందని, ఇంటిల్లిపాదిని తల్లిలా లాలిస్తూ కుటుంబ అభివృద్ధి, అభ్యున్నతికి పాటుపడుతుందని తండావాసుల విశ్వాసం. ఇంటి తీరు వాకిలి చెబుతుందనే విధంగా ఇంట్లోని కోడలు తాతి్వక, సత్వ గుణాలను కలిగి ఉంటే.. భర్త, అత్తామాలను బాగా చూసుకుంటుందని, పిల్లలు సైతం ఆమెను అనుకరిస్తారనేది వీరి నమ్మకం. అందుకే వివాహ నిశ్చయానికి ముందే గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు కొత్త కోడలికి అన్ని విషయాలు చెబుతారు. ఇందుకు ఆమె మనస్పూర్తిగా అంగీకరించిన తర్వాతే పెళ్లి పక్కా చేస్తారు. పెళ్లి కూతురును ముస్తాబు చేసిన తర్వాత.. మాసం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని ఆమెతో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆచారం వచ్చిందిలా.. సుమారు నూటాయాభై ఏళ్ల క్రితం వాల్యానాయక్‌తండాలో అంటు వ్యాధులు(గత్తర) సోకి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసమయంలో తమను కాపాడమంటూ గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన సీతమ్మను పూజించారు. తాము గత్తర నుంచి బయటపడితే తండాలోని కోడళ్లను మాసం, కల్లు వంటివి మాని్పస్తామని మొక్కుకున్నారు. ఆనాటి నుంచి తండాలో రోగాలు తగ్గి, పంటలు పండాయని, ఆహారం సమృద్ధిగా దొరికిందని వృద్ధులు చెబుతున్నారు. కరోనా కాలంలోనూ.. ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలోనూ తండా కోడళ్లు మటన్, చికెన్, గుడ్డు వంటివి ముట్టుకోలేదు. వైరస్ బారిన పడిన వారికి పోషకాహారం తీసుకోవాలని ఇందులో భాగంగా గుడ్లు, మాంసం తినాలని వైద్యులు సూచించినా ఎవరూ వాటి జోలికి వెళ్లలేదు. తమను అమ్మవారే కాపాడిందని, కాపాడుతుందని చెప్పడం విశేషం. ప్రాణాలుపోయినా పరవాలేదు కానీ ఆచారాన్ని మంటగలిపే పని చేయలేదన్న వీరికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.అందరికీ ఆదర్శంగా.. తాతలు, తండ్రుల కాలంలో మదుమాంసాలకు దూరంగా ఉన్న అనేక కుటుంబాల్లోని వారు ప్రస్తుతం వీటిని అలవాటు చేసుకున్నారు. పార్టీలు, దావత్ల పేరుతో మద్యం, మాంసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మేమెందుకు తినకూడదు అని.. ఎదురు ప్రశ్నిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి తరుణంలో గిరిజన కుటుంబాల్లోని కోడళ్లు వీటిని త్యజించడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 45 ఏళ్లుగా మాంసానికి దూరం మా తల్లిదండ్రుల గ్రామం రోటిబండతండా. నా చిన్నతనంలో మాంసం ఇష్టంగా తినేదాన్ని. నాపెళ్లయి 45 ఏళ్లు దాటింది. ఆరోజు నుంచి ఇప్పటి వరకు మాంసం జోలికి వెళ్లలేదు. మా అత్త కూడా మాంసం తినలేదు. – అస్లీబాయి తరతరాలుగా వస్తున్న ఆచారం తండా కోడళ్లు మాంసం తినకూడదనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. మాకన్నా పెద్దవాళ్లు పాటించారు.. మేమూ కొనసాగిస్తున్నాం.. ఇప్పటి పిల్లలు కూడా మాతోవలోనే నడవడం సంతోషం కలిగిస్తోంది. – ప్రమీళాబాయి అదృష్టంగా భావిస్తున్నా.. నేను పీజీ చదివా.. స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో మాంసాహారం బాగా తినేదాన్ని. నాకు ఇటీవలే పెళ్లయింది. తండా ఆచారాన్ని చెప్పినప్పుడు వింతగా అనిపించినా.. ఇక్కడికి వచ్చాక ఇది ఎంతో అదృష్టమని తెలుసుకున్నా. – పద్మ వండుతాం.. కానీ తినం నేను కూడా మొదట్లో ఇదేం ఆచారం అని విచారపడ్డా. కానీ మాంసం వదిలేసిన కోడళ్లకు ఇక్కడ లభిస్తున్న గౌరవం చూసి ఆ ఆలోచన మారిపోయింది. ఇంట్లో మగవాళ్లు, వచ్చే బంధువులకు వండుతా కానీ నేను తినను. – శ్రీలత, అంగన్వాడీ టీచర్ -
లక్నాపూర్ ప్రాజెక్టు పరిశీలన
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్ట్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను శనివారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వినాయక నిమజ్జనానికి భక్తులు వస్తుంటారని అధికారులు తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా బందోబస్త్ నిర్వహించాలని పోలీసులకు సూచిం చారు. నిమజ్జనానికి వచ్చే వారు పోలీసుల, అధికారులకు సలహా, సూచన మేరకు నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
నాణ్యమైన భోజనం అందించాలి
ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి పూడూరు: మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అంగన్వాడీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రశాంతి, సూపర్ వైజర్ కళావతి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: ముదిరాజ్‌ల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక చొరవ తీసుకుని మండలంలోని రంగాపూర్ సమీపంలో ఎకర భూమిని ముదిరాజ్ భనవ నిర్మాణానికి కేటాయిస్తూ కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్ మంజూరు చేయించారు. దీంతో శనివారం ఆయన్ను నియోజకవర్గంలోని ముదిరాజ్‌లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజ్‌లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. ముదిరాజ్ భనవ నిర్మాణానికి సైతం నిధులు కేటాయింపునకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొందుర్గులో క్షుద్ర పూజల కలకలం కొందుర్గు: మండల కేంద్రంలో క్షుద్ర పూ జలు కలకలం రేపాయి. పెండ్యాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పరిసర పొలాల రైతులు అక్కడికి వెళ్లిచూడగా పసుపు, కుంకుమలతో అలంకరించి, అగర్బత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజచేయడంతోపాటు కోడిని బలిచ్చినట్లు బయటపడింది. ఈ విషయమై ఎస్ఐ రవీందర్ నాయక్‌ను వివరణ కోరగా తమ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
కొడంగల్ రూరల్: పట్టణ శివారులోని సిద్దనొంపు పడమటి ఆంజనేయస్వామికి శనివారం హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 102వ శనివారాన్ని పురష్కరించుకొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రదర్శన అనంతగిరి: జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం వికారాబాద్ జెడ్పీ కార్యాలయంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీఓలు వారివారి మండలాల్లో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించారు. సరళారెడ్డికి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు యాలాల: మండలంలోని జక్కేపల్లి సమీపంలో గల ఆర్బీఓఎల్(రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్) ఎండీ బుయ్యని సరళారెడ్డి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్ అవార్డ్స్ – 2025 కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రాంచందర్ నాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాపార రంగంలో విశిష్ట కృషి, నూతన ఆవిష్కరణలు, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందిస్తుంటారు. సరళారెడ్డికి అవా ర్డు రావడంపై తాండూరు ప్రాంత నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. అంబేడ్కర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి మల్కయ్య యాలాల: మండల కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో రూ.50లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణానికి శిలాఫలకం వేసిందన్నారు. భవన నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ భూమిని సైతం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా నిధులు ఉన్నప్పటికీ భవన నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే దృష్టిసారించి భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బెన్నూరు మాజీ ఎంపీపీ లక్ష్మప్ప, నర్సింలు, శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.