గ్రామాభివృద్ధికి కృషి చేయండి
కాంగ్రెస్ కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
దౌల్తాబాద్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గ సభ్యులు పనిచేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండల కేంద్రానికి రావడంతో నూతన పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, వెంకట్‌రెడ్డి, వీరన్న, దస్తప్ప, రెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు.


