సర్పంచ్ బరిలో డాక్టర్
దోమ: ప్రజాసేవే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో నిలిచానని డాక్టర్ కొప్పుల వెంకట్‌శ్రీయారెడ్డి అన్నారు. దోమ మండలం దొంగఎన్కేపల్లికి చెందిన కొప్పుల వెంకట్‌రెడ్డి, శైలజ దంపతుల పెద్దకూతురైన ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెంకట్‌రెడ్డి కుటుంబం గత యాభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. ఆయన 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. అనంతరం పేదలకు అండగా ఉంటూ తనవంతు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం తన కూతురును సర్పంచ్ బరిలో నిలిపి, ప్రజల ఆశీర్వాదం కోసం చూస్తున్నారు. విద్యావంతురాలైన తన బిడ్డను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేలా చూస్తానని చెబుతున్నారు.


