ఉల్లంఘిస్తే చర్యలు
అనంతగిరి: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో రెండవ విడత బంట్వారం, మోమిన్‌పేట్, మర్పల్లి, వికారాబాద్, ధారూరు, కోట్‌పల్లి, నవాబుపేట్ మండలాల్లో ఎన్నికలుంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దని సూచించారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా సంగీత, నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 సెక్షన్ 214(2) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పిదాలకు తావివ్వొద్దు
రెండో విడత పోలింగ్ జరగనున్న మండలాల అధికారులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎటువంటి తప్పిదాలకు తావివ్వొద్దని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తర్వాత పోలింగ్ మెటీరియల్ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. పోలింగ్ సిబ్బంది సమయ పాలనను పాటిస్తూ.. నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు. చెక్ లిస్టుకు సామగ్రి తీసుకున్నది లేనిది సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో లైట్లు, సీటింగ్ అరేంజ్‌మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత వంద శాతం అమలు జరిగేలా చూడాలన్నారు. గుర్తింపు లేని వ్యక్తులను సెంటర్‌లోకి అనుమతించొద్దన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా పూర్తయ్యేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ వాసు చంద్ర, డీపీఓ జయసుధ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్


