ఫర్టిలైజర్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్
ధారూరు: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్టిలైజర్ షాపు దగ్ధమైంది. ఈ ఘటన స్థానిక బస్టాండు పక్కనే ఉన్న ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లోని శ్రీసాయి సీడ్స్ అండ్ పెస్టిసైడ్ దుకాణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తాండూరు–హైదరాబాద్ మార్గం పక్కనే ఉన్న ఫర్టిలైజర్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్‌కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో రాకపోవడంతో క్రిమి సంహారక ముందుల కాటన్లు, ఎరువులు బస్తాలు, వడ్లు, మొక్కజొన్న తదితర విత్తనాల బస్తాలు, ఖరీఫ్ సీజన్ నుంచి ఉన్న రికార్డులు ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దాదాపు రూ.25లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ధారూరు సీఐ రఘురామ్, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్లియర్ చేశారు. బాధిత వ్యాపారి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.25 లక్షల ఆస్తి నష్టం


