రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● ధాన్య సేకరణలో వేగం పెంచాలి
● డీసీఎస్‌ఓ సుదర్శన్
దుద్యాల్: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంను నిల్వ ఉంచరాదని, సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్వహకులు, రైస్ మిల్లర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్ సూచించారు. దుద్యాల్ రైతు వేదికలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. మాట్లాడారు. నిర్లక్ష్యం చేయకుండా రైతులు తెచ్చిన వరిని ఎప్పటికప్పుడు విక్రయించి మిల్లర్లు తరలించాలని సూచించారు. బిల్లులు సకాలంలో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లతో ఫోన్‌లో మాట్లడుతూ.. వాహనాల్లో వచ్చిన ధాన్యంను వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.
నిల్వ ధాన్యం తరలింపు
హస్నాబాద్ గ్రామంలో పది రోజులుగా కొనుగులు ప్రక్రియ నిలిచిపోవడంతో బుధవారం రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ‘దయుంచి.. స్పందించి’ ధాన్యం కొనండి శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. కొనుగోలు కేంద్రం వద్ద ట్రాక్టర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొడంగల్, గౌరారంలోని రైస్ మిల్లర్లకు పంపించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, కొనుగోలు కేంద్రం నిర్వహకుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.


