పంట మార్పిడి తప్పని సరి
మోమిన్‌పేట: వ్యవసాయంలో రైతులు తప్పని సరి గా పంట మార్పిడి పద్ధతి పాటించాలని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ సునీత సూచించారు. గురువారం మండలంలోని చక్రంపల్లిలో రబీ సాగులో సమగ్ర సస్యరక్షణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పంట మార్పిడి తప్పనిసరి అన్నారు. సాగులో పురుగు ఉధృతి తెలుసుకునేందుకు ఎర పంటలు, మిత్ర పురుగులు పెంపకం, విత్తన శుద్ధి చేయాలన్నారు. శత్రు పురుగులను గుర్తించి వెంటనే నాశనం చేస్తేనే పంట దిగుబడులో నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించకపోతే మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. లింగార్షక బుట్టలు వాడే విధానాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకట్‌రెడ్డి, ఉదయశంకర్, హొన్నప్పగౌడ, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బాలరాజుగౌడు తదితరులు పాల్గొన్నారు.


