బీజేపీ కుట్రలు సాగవు
అనంతగిరి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేర కు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ముందుగా క్యాంపు కార్యాలయం నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దేశ స్వాతంత్య్రోద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే మా పార్టీ అధినేతలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.బీజేపీ పెట్టిన అక్రమ కేసులను నేషనల్ హెరాల్డ్ వ్యవహారా నికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ స్వీకరించలేమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసిందన్నారు. అక్రమ కేసులతో పీడించాలనుకుంటే చూస్తు ఊరుకోబోమన్నా రు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప పెట్టులాంటిదన్నారు. ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు పెట్టి అణచివేయాలనుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి,రత్నారెడ్డి, మల్లేశం, పెండ్యాల అనంతయ్య, గుడిసె లక్ష్మణ్, శ్రీనివాస్, లక్ష్మ ణ్, రెడ్యానాయక్, దీపు, వెంకట్‌రెడ్డి, అబ్దుల్ ఖాలెద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


