పోలింగ్‌కు బందోబస్తు
అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. మంగళవారం ఆమె పోలీసుల సన్నద్ధతపై సమీక్షించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసులు అధికారులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో, వాటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాల పంపిణీ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీ ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నిరోధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ బి.రాములు నాయక్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్‌బీ సీఐ డీవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తత అవసరం
ఎన్నికల బందోబస్తు విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. గురువారం మొదటి దశ పోలింగ్ సందర్భంగా మంగళవారం ఎస్సీ కార్యాలయంలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. విధు ల నిర్వహణలో ఇబ్బందులు లేదా సమస్యలు ఎ దురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా లని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా, క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించినా అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణించి చర్య లు తీసుకుంటామన్నారు. అదనపు ఎస్పీ బి.రాము లు నాయక్, ఆర్‌ఐ డేవిడ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్రా


