కిడ్నాప్ కలకలం!
● మైల్వార్‌లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భర్త అపహరణ
● ఇరువర్గాలపై కేసు
హత్యకు కుట్ర
రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థి సిఖిందర్‌ఖాన్ కిడ్నాప్ చేయించాడు. సర్పంచ్ ఎన్నికల్లో సిఖిందర్‌ఖాన్ కొడుకు ఓడిపోతాడని తెలిసి తనను హత్య చేయడానికి కుట్ర చేశాడు. సిఖిందర్‌ఖాన్ తన అన్న కొడుకు అంజద్, రఘునందన్ కిడ్నాప్ చేసి దాడి చేశారు.
– అబ్దుల్ ఖాలీద్
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికలు ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తున్నాయి. సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి భర్తను ప్రత్యర్థి వర్గం వారు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మంగళవారం తీవ్ర కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలీద్ భార్య సీమాసుల్తానా మైల్వార్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ మద్దతుతో సైఫ్‌ఖాన్ బరిలో నిలిచారు. ఇరు కుటుంబాలకు కొన్నేళ్లుగా రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో సోమ వారం రాత్రి అబ్దుల్ ఖాలీద్ గుల్బర్గా నుంచి తన ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి వస్తున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు రఘునందన్‌రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి సైఫ్‌ఖాన్ సో దరుడు అంజత్‌ఖాన్, దానం రాములు, నరేశ్, వి క్కి కర్ణాటక సరిహద్దులోని ఆడికి గ్రామం వద్ద అడ్డుకున్నారు. ఉన్నా డ్రైవర్ గౌస్, అనుచరుడు బ లరామ్, న్యాయవాది విశ్వనాథంను బెదిరించి కా రులోంచి దించేశారు. అదే కారులో అబ్దుల్ ఖా లీ ద్‌ను కిలోమీటర్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి మ రోవాహనంలో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
రాత్రంతా హైడ్రామా
అబ్ధుల్ ఖాలీద్‌ను బీఆర్‌ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని డ్రైవర్ గౌస్ వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన భార్య సీమా సుల్తాన తాండూరు, బీషీరాబాద్, కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్‌ఐ తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. తాండూరులోని రఘునందన్ ఇంట్లోనే నిర్బంధించినట్లు తెలుసుకుని అబ్దుల్ ఖాలీద్‌ను కరణ్‌కోట్ ఠాణాకు తరలించారు.
కిడ్నాపర్లపై దాడి
ఖాలీద్ సోదరుడు ఖలీల్ అతడి అనుచరులు ఆసిఫ్, ముఖీద్, శెహబాద్, నవాజ్ వెంటనే కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మైల్వార్ తిరిగి వస్తున్న అంజద్‌ను గుర్తించి తన సోదరుడిని ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పాలంటూ దాడి చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా, యాద్గీర్, గుర్‌మిట్కల్ ప్రాంతాల్లో ఉన్నాడంటూ రాత్రంతా తిప్పాడు. చివరకు ఆచూకీ తెలియడంతో పోలీసుల సూచనమేరకు గుర్‌మిట్కల్ పీఎస్ దగ్గర అంజద్‌ను వదిలేశారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు.
కిడ్నాప్ కలకలం!


