ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
● ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
● పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలెల్లో సంబురాలు అలుగుపారుతున్నాయి. ఓ వైపు పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఓట్ల వేటలో ఉండగా.. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలకే జై కొడుతున్నాయి.
పరిగి: మండలంలో రెండు పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. మల్కయాపేటతండా సర్పంచ్‌గా గోపాల్, రూప్‌సింగ్‌తండా సర్పంచ్‌గా రమణిబాయితో పాటు పాలకవర్గాన్ని ఎకగ్రీవమయింది.
కుల్కచర్లలో పది..
కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో పది పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. తిర్మలాపూర్ సర్పంచ్‌గా మాధవి, బోట్యానాయక్ తండాకు సంతోష్ నాయక్, దాస్యనాయక్ తండాకు కవిత, ఎత్తుకాల్వతండాకు సీతరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాల్యనాయక్ తండాకు నరసింహ నాయక్, కొత్తపల్లిలో రజిత, కిష్టంపల్లిలో రాధిక, నీర్‌సాబ్ తండాలో నారాయణ, లింగన్నపల్లిలో కిష్టమ్మ, మక్తవెంకటాపూర్‌లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఐదు జీపీలు ఏకగ్రీవం
దోమ: మండలంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఐదు జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 36 గ్రామ పంచాయతీలు, 308 వార్డులు ఉండగా, 31 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. కిష్టాపూర్, గొట్లచెల్కతండా, లింగన్‌పల్లి, పెద్దతండా, దోర్నాల్‌పల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియామాక పత్రాలు అందజేశారు.
ఎర్రోళ్ల గోపాల్,
లింగన్‌పల్లి
పాత్లావత్ కవిత,గోట్లచెల్కతండా
నేనావత్ సురేఖ,
పెద్దతండా
సత్యనారాయణరెడ్డి,దోర్నాల్‌పల్లి
సంతోష్ నాయక్, బోట్యానాయక్ తండా
సీతరాం, ఎత్తుకాల్వ తండా
నేనావత్ కవిత, దాస్యనాయక్ తాండ
నరసింహ నాయక్, వాల్యనాయక్ తండా
గోపాల్, మల్కయాపేటతండా
వార్ల వాధవి, తిర్మలాపూర్
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు


