పోలింగ్‌కు సామగ్రి సిద్ధం
బషీరాబాద్: తొలివిడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాల్సిన స్టేషనరీ సామగ్రి కిట్లను, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఈ మేరకు మండలంలోని మోడల్ పాఠశాలలో అధికారులు పోలింగ్ స్టేషన్ వారీగా మూటలు కట్టి పెట్టారు.
పోలింగ్ కేంద్రాలకు జెట్ కాయిల్స్
పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి దోమల నుంచి రక్షణ కల్పించేందుకు జెట్ కాయిల్స్ అందజేస్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది వెళ్లనున్నారు.


