నేడే ఫైనల్
మూడో విడతలో 139 పంచాయతీలు, 1,198 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవం
వికారాబాద్/పరిగి: మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది మండల కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు మంగళవారమే చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. మొత్తం 157 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 స్థానాలకు గాను 289 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,336 వార్డులకుగాను 138 వార్డులు ఏకగ్రీవం కాగా 1,198 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. బుధవారం ఉగయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు పోలింగ్ ఉంటుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.
ఐదు మండలాలకు 1,202 టీంలు
ఎన్నికలు నిర్వహించనున్న పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. రెండు దఫాలుగా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో పాటుగా పీఓలు, ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికలకు గాను 1,470 మంది పీఓలు, 1,726 మంది ఓపీఓలు, ఇద్దరు సభ్యులుండే టీంలు 988, ముగ్గురు సభ్యులుండే టీంలు 214 కలుపుకొని మొత్తం 1,202 టీంలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయి. 2,718 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధ ఇతర జిల్లా అఽధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణకు 45 రూట్లు
ఎన్నికల నిర్వహణకుగాను 45 రూట్లుగా విభజించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి గాను 800 మంది పోలీసుసిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నా రు. స్థానిక పోలీసు సిబ్బందితో బటయ నుంచి వచ్చిన (సుమారు 150 మంది) స్పెషల్ పోలీసు లు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మూడు విడతల ఎన్నికలకు గాను ఎప్పటికప్పుడు శాంతిభద్రతల సమస్యలను తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. మండలానికి ఒకరు చొప్పున డీఎస్పీ, సీఐలను నియమించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
స్వేచ్ఛగా ఓటేసేలా..
కలెక్టర్ ప్రతీక్‌జైన్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులకు ఓటు వేసే సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్ చైర్‌లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రలోభాల పర్వంలో మునిగిపోయారు. ఓటర్‌ను పోలింగ్ బూత్‌కు తరలించేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నారు.
ఏకగ్రీవమైన పంచాయతీలు
మూడో విడతలో ఐదు మండలాల్లో 157 పంచాయతీలకు గాను 18 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 మంది ఉండగా కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండా నుంచి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కవిత సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.
తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే..
గ్రామం సర్పంచ్
పూడూరు
కొత్తపల్లి దీపికారెడ్డి
పరిగి మండలం
మల్కచెర్వుతండా గోపాల్
రూప్‌సింగ్ తండా రమణిబాయి
దోమ
లింగన్‌పల్లి గోపాల్
కిష్టాపూర్ వరలక్ష్మి
దోర్నాల్‌పల్లి సత్యానారాయణరెడ్డి
పెద్దతండా సురేఖ
చెట్లగొల్కతండా కవిత
కుల్కచర్ల
తిర్మలాపూర్ మాధవి
బోట్యానాయక్ తండా సంతోశ్
ఎత్తక్వాతండా సీతారామ్
దాస్యనాయక్ తండా కవిత
చౌడాపూర్
కిష్టంపల్లి రాధిక
వాల్యానాయక్ తండా నర్సింహ నాయక్
కొత్తపల్లి రజిత
నీర్‌సాబ్ తండా నారాయణ
మక్తవెంకటాపూర్ కవిత
లింగన్నపల్లి కిష్టమ్మ
నేడే ఫైనల్
నేడే ఫైనల్


