వనజీవి రామయ్య బయోపిక్
అనంతగిరి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసి కోటి మొక్కలు నాటిప వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. మంగళవారం చిత్ర యూ నిట్ వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో, పట్టణంలో పలు ప్రాంతాల్లో పలు సీన్ లు చిత్రీకరించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడ మే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ ఫిలిం బ్యా నర్ పై ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు డైరక్టర్ వేముగంటి తెలిపారు. వనజీవి రామయ్య పాత్రలో న టుడు బ్రహ్మాజీ నటించగా, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా బల్లె మోహన్, రైటర్ డాక్టర్ కళారంగా, కెమెరామెన్‌గా కేవీ రమణ, సహ నిర్మాత రవీందర్ నాథ్, నటులు జోగిని శ్యామల, ప్రభావతి, సిద్దిపేట తిరుపతి, వెంకట్, పైడిపల్లి, చైతన్య, వేణు గోపాల్, రవీంద్రనాథ్, దివాకర్ పాల్గొన్నారు.
వనజీవి రామయ్య బయోపిక్


