ఆధ్యాత్మిక చింతన ఉండాలి
స్పీకర్ ప్రసాద్ కుమార్
అనంతగిరి: ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఉండాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరిన ప్రేమ ప్రవాహిని రథం బుధవారం వికారాబాద్ పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యసాయి జ్ఞాన కేంద్రానికి చేరుకుంది. స్పీకర్ సాయిబాబాకు హారతి ఇచ్చి రథ యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను బాబా భక్తుడని తెలిపారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఐక్యత బాబా తెలిపిన సందేశాలను వ్యాప్తి చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మంజుల, మాజీ చైర్మన్ సత్యనారాయణ, సత్యసాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ సింగ్, ఆధ్యాత్మిక విభాగం కోఆర్డినేటర బంధప్ప గౌడ్, కన్వీనర్ సత్యనారాయణ గౌడ్, యూత్ కోఆర్డినేటర్ బసవేశ్వర్, మహిళా కార్యకర్తలు అనురాధ, వర్దిని తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండల విద్యార్థి
యాలాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) క్రీడల్లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు మండల విద్యార్థి ఎంపికయ్యాడు. మండలంలోని గౌతమి పాఠశాలకు చెందిన శివప్రసాద్‌గౌడ్ అండర్ –14 విభాగంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కొండారెడ్డి, పీఈటీ మహేందర్ తెలిపారు. బుధవారం శివప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
పోలింగ్ సిబ్బందికి
అందని భోజనం
బషీరాబాద్: పోలింగ్ సిబ్బందికి భోజనాలు అందక ఇబ్బంది పడ్డారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి జోనల్, స్టేజ్ 2 అధికారులు, పీఓలు, ఓపీఓలు వచ్చా రు. మధ్యాహ్నం ఒంటి గంటకు వీరు భోజనం చేసేందుకు వెళ్లగా మొత్తం అయిపోయింది. దీంతో వారు ఎంపీడీఓ సంపత్‌కుమార్‌ను నిలదీశారు. అర్ధాకలితో ఎలా పనిచేయాలి అని ప్రశ్నించారు. కొందరు అధికారులు హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నారు. అనంతరం వంటలు తయారు చేయించారు. అప్పటికే సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్లిపోయారు.
ఆధ్యాత్మిక చింతన ఉండాలి
ఆధ్యాత్మిక చింతన ఉండాలి


