పాలకులొస్తున్నారు..
నేటి నుంచి పల్లెల్లో కొలువుదీరనున్న గ్రామ ప్రథమ పౌరులు పంచాయతీ పీఠాలను అలంకరించనున్న తొలి విడత విజేతలు కొత్త సర్పంచులపై కోటి ఆశలు గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనలో జనం
కొడంగల్: తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో నేడు (గురువారం) తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ఆ వెంటనే గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. గురువారం రాత్రి లోపు కొత్త పాలకులు కొలువు తీరనున్నారు. గ్రామ ప్రథమ పౌరునిగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత బాధ్యతలు చేపడతారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల్, దౌల్తాబాద్, తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబా ద్ మండలాల్లోని 225 గ్రామ పంచాయతీలు, 1,9 12 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ప్రత్యేకాధిరులకు పాలకు తెర
రెండేళ్లుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాలనా వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామ పాలకులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, తాగునీరు, ఇతర అవసరాలకు డబ్బు లేకపోవడంతో కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వడ్డీలకు డబ్బు తెచ్చి జీపీలను నడిపించారు. కొడంగల్ మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీలు (రుద్రారం, అంగడిరాయిచూర్, రావులపల్లి, పెద్ద నందిగామ, హస్నాబాద్, పర్సాపూర్, కస్తూరుపల్లి, ఎరన్‌పల్లి, అన్నారం, టేకుల్‌కోడ్ పెద్ద గ్రామాలు ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలుపరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్‌లు వస్తే మంచి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.
రెండేళ్లుగా నిధులు లేవు
గ్రామ సర్పంచుల పదవీకా లం ముగిసి దాదాపు రెండే ళ్లు కావస్తోంది. నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఆగిపోయాయి. ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఏర్పడంది. సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నాం. కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిధులు వచ్చే అవకాశం ఉంది.
– బాల రంగాచారి,
సీనియర్ కార్యదర్శి, ఇందనూర్
పాలకులొస్తున్నారు..


