మా పాలనకు ‘ఏకగ్రీవాలే’ నిదర్శనం
పరిగి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు.. కాంగ్రెస్ మద్దతుదారులను ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నుకుంటున్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గ చరిత్రలో తొలిసారి 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ జీపీకి రూ.20 లక్షల నిధులను మంజూరు చేయిస్తామని స్పష్టంచేశారు. ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ బలపరిచి అభ్యర్థులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అధికార పక్షంతోనే అభివృద్ధి సాధ్యమని సూచించారు.
ప్రజాసేవకు చక్కటి అవకాశం
దోమ: మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కిష్టాపూర్, లింగన్‌పల్లి ఏకగ్రీవ సర్పంచులు ఏర్రోళ్ల గోపాల్, మెరుగ వరలక్ష్మి, ఆయా గ్రామాల వార్డు సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే చక్కటి అవకాశం కొత్త సర్పంచులకు వచ్చిందన్నారు. గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామా ల మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, నేతలు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
పూడూరు: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పంచాయ తీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బుధవారం మండలంలోని కడుమూరు, మిట్టకంక ల్, మేడిపల్లికలాన్, అంగడిచిట్టంపల్లి, చింతలపల్లి, కంకల్, తుర్క ఎన్కేపల్లి తదితర గ్రామా ల్లో సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీష్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి షకీల్ పాల్గొన్నారు.
ఏకగ్రీవ సర్పంచ్‌కు సన్నానం
కుల్కచర్ల: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వాల్యనాయక్ తండా సర్పంచ్‌గా నరసింహ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అభినందించారు.


