ఓటేద్దాం రారండోయ్
225 జీపీలు 1,912 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ 2 గంటల నుంచి కౌంటింగ్, వెంటనే ఫలితాల వెల్లడి ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక ఓటు హక్కు వినియోగించుకోనున్న 29,3,555 మంది ఓటర్లు
తెల్లారింది లేవండోయ్
దాదాపు రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూసిన పంచాయతీ ఎన్నికలు రానేవచ్చాయి. మరికొన్ని గంటల్లో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు పదవుల కోసం నిరీక్షిస్తున్న వారి కలలు సాకారం కానున్నాయి.. నేటి నుంచే గ్రామ పాలన అందుబాటులోకి రానుంది. ప్రజలు సైతం ‘కొత్త’ పాలకుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వికారాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు బుధవారం బయలుదేరి వెళ్లారు. పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులు, పత్రాలను తీసుకెళ్లారు. మొదటి విడతలో 262 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 37 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 225 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. నేటి(గురువారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాల వెల్లడి ఉపసర్పంచ్ ఎన్నిక చేపడతారు.
1,912 పోలింగ్ కేంద్రాలు
తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాండూ రు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2,93,555 మందికి ఓటరు స్లిప్పులను పంపిణీచేశారు.పోలింగ్ అధికా రులు,సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. 8మండలాల్లో 1,912 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను సిద్ధం చేశారు. 2,351 మంది పీఓలు, 2,743 మంది ఓపీఓలు, ఇద్దరు సభ్యులతో కూడిన 1,607టీంలు, ముగ్గురు సభ్యులతో కూడిన 288టీంలు, నాలుగురు సభ్యులతో కూడిన 17 టీంలు ఎన్నికల విధుల్లో ఉంటాయి.
కట్టుదిట్టమైన భద్రత
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఓటు హక్కు విని యోగించుకునేందుకు అవసరమై న అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ కు కొన్ని గంటల సమయం మా త్రమే ఉండటంతో ఒటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటర్లకు ఇబ్బంది కలగొద్దు
బొంరాస్‌పేట: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌ను బుధవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్సులు, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ వెంకన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మండలాల వారీగా పంచాయతీలు, ఓటరు..
మండలం మొత్తం యునానిమస్ పోలింగ్ మొత్తం
జీపీలు అయిన జీపీలు జరగనున్నవి ఓటర్లు
తాండూరు 33 06 27 46,646
బషీరాబాద్ 39 05 34 40,990
యాలాల 39 10 29 38,710
పెద్దేముల్ 38 05 33 40,828
కొడంగల్ 25 01 24 32,205
దౌల్తాబాద్ 33 03 30 40,977
బొంరాస్‌పేట్ 35 07 28 32,121
దుద్యాల్ 20 02 18 21,078
నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్


