పోలింగ్ సామగ్రిని సరిచూసుకోండి
అనంతగిరి: ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించి, పోలింగ్ సజావుగా జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్ సూచించారు. సోమవారం మండలానికి చెందిన పీఓల రెండో దశ శిక్షణ కార్యక్రమం అంబేడ్కర్ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఏమైన సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, మాస్టర్ ట్రైనర్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


