కాంగ్రెస్‌తోనేపేదల సంక్షేమం
మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి
బషీరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని శా సనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అ న్నారు.సోమవారం మండలంలోని నీళ్లపల్లిలో పర్యటించిన ఆయన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డిని గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ కుటుంబం నుంచి సర్పంచ్‌గా ఉన్నారని అప్పుడు అనేక అభివృద్ధి పను లు జరిగాయని గుర్తు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచినఅభ్యర్థు లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఆంజనేయస్వామి జాతర
దుద్యాల్: మండలంలోని చిలుముల మైల్వార్ గ్రామ ఆటవీ ప్రాంతంలో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయ స్వామి జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 10న స్వామివారి రథోత్సవం, 11న పెద్ద జాతర ఉంటుంది. మధ్యాహ్నం స్వామివారికి పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి రాఘవేందర్‌చారీ, ధర్మకర్తలు రామారావు దేశ్‌పాండే, పురుషోత్తం దేశ్‌పాండే తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ప్రజావాణికి 12 దరఖాస్తులు
అనంతగిరి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 12 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలన్నారు.కార్యక్ర మంలో ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ మంగీలాల్, డీఆర్‌డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు
మోమిన్‌పేట: మండలంలోని మేకవనంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి ఎం.ధనలక్ష్మి, బాలుర విభాగం నుంచి జె.శ్రీకాంత్ ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌరిశంకర్, ఉపాధ్యాయుడు రమేశ్ అభినందించారు.
జీపీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గోపాల్
దుద్యాల్: ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన జీపీవో(గ్రామ పాలన అధికారి)ల జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండలంలోని హస్నాబాద్ జీపీవోగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గోపాల్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రమేశ్, కార్యదర్శిగా నర్పింలు, సభ్యుడిగా పక్కీరప్ప ఎంపికయ్యారు. వీరిని తహసీల్దార్ కిషన్ సన్మానించారు. కార్యక్రమంలో డీటీ శివకుమార్, ఆర్‌ఐ నవీన్ కుమార్, సిబ్బంది ఊషప్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనేపేదల సంక్షేమం
కాంగ్రెస్‌తోనేపేదల సంక్షేమం
కాంగ్రెస్‌తోనేపేదల సంక్షేమం


