‘పది’పై శ్రద్ధ వహించాలి
కందుకూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రంగారెడ్డి డీఈఓ సుశీందర్‌రావు సూచించారు. మండల పరిధిలోని నేదునూరు జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, ఐఎఫ్‌పీ ప్యానెల్, పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి వసతి తదితర అంశాలను పరిశీలించారు. చదవడం, రాయడం సరిగ్గా రాని వెనకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, టీఎల్‌ఎం ద్వారా విద్యాబోధన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌శర్మ, ఉపాధ్యాయులు గ్లోరి, శాంతకుమారి, కరుణాకర్, శ్రీవాణి, గిరిజ, డాక్టర్ ఎండీ బషీర్, అబ్దుల్లా, హసనొద్దీన్ పాల్గొన్నారు.


