అభివృద్ధికి నిధులు కేటాయిస్తా
యాలాల: మండలంలోని ముద్దాయిపేట పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన రాజప్ప రుద్రమణి, ఉపసర్పంచ్ గొల్ల శివ, వార్డు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీల్లో ఒకటైన ముద్దాయిపేట అభివృద్ధి బాధ్యత తీసుకుంటానన్నారు. తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు రావాల్సిందిగా సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు దేవగారి రాములు, నాయకులు వాసిద్‌ఖాన్, ఆరిఫ్ హుస్సేన్, బస్వరాజ్, రమేష్, భాస్కర్‌గౌడ్, వెంకటమ్మ, రమేష్‌గౌడ్, పంతుల శేఖర్, ఫక్రుద్దీన్, రాజు, వెంకటయ్యగౌడ్, గొల్ల రమేష్, మల్లేష్, విజయ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, నర్సింహులు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


