నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పరిగి: నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర అన్నారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ కమిటీ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్వహణ, సేఫ్టీ కిట్స్ వినియోగం, నిబంధనలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం డీఆర్‌డీఓ పీడీ మాట్లాడుతూ.. విచారణ కమిటీలో పోలీసు, వైద్యశాఖ, కార్మిక శాఖ, కాలుష్య నివారణ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ వివరాలతో కలెక్టర్‌కు నివేదికను అందిస్తామన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీపై చర్యలుంటాయని చెప్పారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర


