హకీంపేట ప్రజలకు రుణపడి ఉంటాం
కాంగ్రెస్ నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి
దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ మద్దతుదారులకు విజయాన్ని అందించాయని ఆ పార్టీ నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం అయన విలేకరులతో మాట్లాడుతూ.. హకీంపేట సర్పంచ్‌గా తన సతీమణి రవీంద్రను భారీ మెజార్టీతో ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. ఈవిజయం మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి చెంప పెట్టులాంటిదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హకీంపేట్‌లో యువకులను రెచ్చగొట్టి, వారిని జైలు పాలు చేశారని మండిపడ్డారు. పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులే కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించారని సంతోషం వ్యక్తంచేశారు. ఈప్రాంతం అభివృద్ధికి మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు.


