నాన్న గెలుపులో మీరు.. మీకోసం నేను
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కూతురు అనన్య పాలుపంచుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రవల్లిలో సర్పంచ్ బరిలో నిలిచిన అడ్వకేట్ రబ్బానీకి మద్దతుగా ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్న గెలుపులో మీరు.. మీ విజయానికి నేను పాటుపడుతున్నానని చెప్పారు. ఈ ప్రచారంలో ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, నాయకులు తులసీదాస్, రంగారెడ్డి, పెంటయ్య, మాణిక్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి, అశోక్, దయాకర్, శ్రీశైలం, సురేశ్, సంజీవరావు, గఫార్, చంద్రం, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. – అనంతగిరి
నాన్న గెలుపులో మీరు.. మీకోసం నేను


