మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన
యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకులపై దాడి
బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్‌కోట్‌తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు.
విద్యార్థులకు
స్కాలర్‌షిప్ పంపిణీ
మీర్‌పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్‌పేట సర్కిల్‌లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్‌రెడ్డి, చల్లా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
పరిగి: బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్‌ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన
మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన


