గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి
కొడంగల్: నూతన సర్పంచ్‌లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్, మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో మొదటి విడతలో కొత్త సర్పంచ్‌లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. మండలంలో 25 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని అన్నారు. కొడంగల్‌కు రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందన్నారు. హుస్సేన్‌పూర్ సమీపంలో 300 ఎకరాల భూమి సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పాయిపల్లిలో వ్యవసాయ వర్సిటీ, లగచర్ల పరిసరాల్లో 6 వేల ఎకరాల భూమిని సేకరించి ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మెడికల్ కళాశాల, అనుబంధంగా 450 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీమ్, సంజీవరెడ్డి, ఆసిఫ్‌ఖాన్, మహేశ్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, అరిగె ఓం, సర్పంచ్‌లు దత్తాత్రేయరావు, చెన్ బస్‌కుమార్, అంజయ్య, నర్సప్ప, గడ్డం నర్సమ్మ, బెన్నూరు లక్ష్మమ్మ, సునీత, యాసర్ తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్


