పారిశ్రామిక వాడలో హస్తం పాగా
దుద్యాల్: సరిగా ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. ఏడాదిలోపే ఆ మూడు గ్రామాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలుపొందడం సంచలనం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని 20 గ్రామాలకు రెండు ఏకగ్రీవమవగా మిగిలిని 18 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా 13 కాంగ్రెస్, నలుగురు బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. గత ఏడాది నవంబర్ 11న అధికారులపై రైతులు దాడి చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ మూడు గ్రామాలు హస్తగతమయ్యాయి. పోలేపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారుడు జింకల చంద్రయ్య, హకీంపేట్‌లో కాంగ్రెస్ బలపరిచిన రవీంద్ర నర్సింహా రెడ్డి, లగచర్లలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వెంకట్రాములు గౌడ్‌లు విజయం సాధించారు. పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులు కాంగ్రెస్‌కు బలపరిచన అభ్యర్థులకు మద్దతు పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. హకీంపేట్‌లో కాంగ్రెస్ మద్దతుప్రకటించిన రవీంద్ర నర్సింహారెడ్డి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఐశ్వర్య సాయికుమార్‌పై 421మెజార్టీతో గెలుపొందాడు. లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు వెంకట్రాములుగౌడ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గుండెమోని బసప్పపై 15 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించాడు. పోలేపల్లిలో కాంగ్రెస్ మద్దతు దారుడు జింకల చంద్రయ్య బీఆర్‌ఎస్ అభ్యర్థి పుర్ర రాఘవేందర్‌పై 35 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
పారిశ్రామిక వాడలో హస్తం పాగా
పారిశ్రామిక వాడలో హస్తం పాగా


